దేవుని ఎరుగుట
"దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము" - రోమా 8:28.
ఈ వాక్యములో
యెరుగుదుమనే మాట యున్నందున ఈ వాక్యానుభవము కలిగియున్న ఒకరు వ్రాసినట్లు స్పష్టమగు
చున్నది. వినే అనుభవముకంటే,
చదివే
అనుభవముకంటే, ఊహించే అనుభవముకంటే స్వయముగా ఎరిగియుండే అనుభవము గొప్పదైయున్నది. వినేటప్పుడు
సంతోషము, చదివేటప్పుడు
మరియొక సంతోషము, ఊహించేటప్పుడు ఇంకొక సంతోషము, స్వయముగా ఎరిగియుండేటప్పుడు అన్నిటికంటే గొప్ప
సంతోషము,
ఇదే క్రైస్తవులందరు
అనుభవించెదరు. నేటి క్రైస్తవులకును, క్రైస్తవ బోధకులకును, అపోస్తలులకును, బోధలో గొప్ప భేదము
గలదు. మేము చూచినది
ప్రకటించుచున్నామని అపోస్తలులు అన్నారు. నేటి క్రైస్తవులు అది అనలేరు. ఎందుకనగా వీరు క్రీస్తును
చూడలేదు.
అయితే కొంతమంది
క్రైస్తవులు క్రీస్తుయొక్క సన్నిధి అనుభవము పొందుచున్నారు వారు సాక్ష్యమియ్యగలరు. యెరూషలేము
వీధులలో యేసుప్రభువును
చూచినవారు
అనగా అవిశ్వాసులు ఎప్పటికైనాచూచి అపోస్తలులతో సమానము కాగలరా!
సాధు సుందరసింగుగారు తన స్వంత
అనుభవముతో ఇట్లు
చెప్పుచున్నారు.
ఎలాగనగా "మొదటివారు ప్రార్ధనలో యేసుప్రభువు నా హృదయములో దిగుట నేను బాగుగా యెరుగుదును, ఆయన
నాలోయుండి ఈ నాడు ఏ
నిమిషమందైనను బయటికి వెళ్ళిపోలేదు. మహా గొప్ప శ్రమ కాలమందు సైతము ఆయన నా హృదయములో నిజముగా
నున్నట్లు బాగుగా
తెలియును. ఊహకాదు విశ్వాసము కాదుగాని అనుభవమే. నేను పాడునూతిలో అసహ్యించుకొనేటప్పుడు, చీకటిలో
ఉన్నప్పుడును,
బాధపడు చున్నప్పుడును, మరల నూతిపైకి వెళ్ళుదునను నిరీక్షణ లేనప్పుడును, గాలిలేనప్పుడు అనగా
ఊపిరి అందనప్పుడును సహితము
ఆయన నాలో ఉన్నట్లు నాకు తెలియును. నాదేవా! నన్నెందుకు చేయివిడిచినావని కేకవేయు చున్నాను.
అప్పుడును ఆయన
నా హృదయములోనే
యున్నాడు".
ప్రియులారా! ఇది ఎంత గొప్ప అనుభవము. ఇది
మనకందరకు
కలుగవలసిన అనుభవమైయున్నది. దేవుని ప్రేమించువారు అనగా ఎవరు? ఎవరు దేవుని ప్రేమించుదురో వారును
మరియు దైవాజ్ఞలు
అనుసరించేవారును, తాను సృష్టించిన అందరిని దేవుడు ప్రేమించుచున్నాడు అనే సంగతివేరు,
తాను సృష్టించిన అందరిని
దేవుడు
ప్రేమించుచున్నాడు అనే సంగతివేరు, ఆజ్ఞానుసారవర్తుల సంగతివేరు. వీరు ప్రత్యేకమైన కృపను
పొందుటకు సిద్ధపడినవారు
అట్టివారు
దేవుడను గ్రహించు ఉపకారమును అందుకొనగలరు. అనుభవించగలరు. తక్కినవారట్లు చేయలేరు. దేవుడు
ప్రేమించువారు
ఏర్పర్చబడినవారైయున్నారు. వారు దేవునిని, దేవుడు వారిని ప్రేమించుకొనుటకు వీలగును అనీ చెప్పుట
స్పష్టముగా నున్నది.
దేవునిని ప్రేమించుచున్నానని చెప్పువాడు దేవుని చిత్తమును నెరవేర్చనప్పుడు అబద్ధికుడగును. ప్రభువా!
ప్రభువా!యని చెప్పువారుకాదు. నా తండ్రి చిత్తము చేయువారేయని యేసుప్రభువు చెప్పెను. ఇది గొప్ప
సత్యమైయున్నది.
-
దైవసంకల్పన
అనగానేమి?
- 1) మేలు కలిగించుట
- 2) సమస్తము నెరవేర్చుట.
ఈ రెండు విషయములుగలదే దైవసంకల్పన. సమస్తమును
సమకూడవలెను. ఆ
సమకూడుట
మేలైయుండవలెను.
షరా:- సన్నిధిలోనికి వెళ్ళినప్పుడిది తెలియబడును. ఏలాగనగా ఇష్టములేని ఒక
కార్యము
జరిగినప్పుడు విశ్వాసి
అడుగును అప్పుడు జవాబు ఇట్లుండును. ప్రస్తుతమిది నీకు కీడుగా కనిపించును గాని ముందుగా
మేలే.
దృష్టాంతము:- యోసేపు
అన్నదమ్ములు కీడు ఉద్దేశించిరి కాని దేవుడది మేలుగా మార్చినాడు. యోసేపు ఐగుప్తుకు
వెళ్ళకపోతే సోదరులకు
అన్నమెక్కడిది?
ఈ వాక్యములో గొప్ప ఆదరణగల మాటలు గల
- 1) మేలు
- 2) సమస్తము కీడులేదు.
అది ఒకటి సమస్తమనగా
'ప్రార్ధనలయన్నియు నెరవేరును'.
సన్నిధిలోనికి వెళ్ళువారికి
ఇదే గొప్ప
ఊతకర్ర.
మేలు కలుగనప్పుడును సమస్తము నెరవేరనప్పుడును సన్నిధికి వెళ్ళిన ప్రయోజనమేమి? పనియనే ఆటంకపు
బండ వచ్చినా
నిద్రావస్తవచ్చినా,
అలక్ష్యపు మనస్సువచ్చినా సన్నిధి మానవద్దు. అదిగోమేలు, ఇదిగో సమస్తము. ఆమేన్.
1. షరా:-
పిలువబడినవారు ఎవరు?
అందరిని
దేవుడు పిలుచునా? నీ పనిలోనికి వస్తాను, అనిచెప్పి రావిచెట్టు క్రిందకు 10మంది వస్తే
నలుగురినే ఎవరిని పిలుచునో
వారినే
పనికి ఏర్పరచును, వారికి పనులు ఏర్పరచును. ఎవరిని పనిలో పెట్టుకొనునో వారిమాట ప్రకారమే చేయును,
వారి ప్రార్థనలు
ఆలకించును. ఆలకించకపోతే పిలిచినా లాభమేమి? ఏర్పాటు చేసినా లాభమేమి? ఓ సువార్తికుడా నిన్ను
ప్రభువు ఏపనికి పిలచెనో
ఆపనికి
రావలసినది. అడిగినప్పుడు ఇచ్చితీరవలెను. గనుక వెళ్ళుము సన్నిధికి. ఆమేన్ .
2. షరా:-
ఒకవేళ కలుగకపోతేనో?
సమకూడకపోతేనో? జరుగక పోతేనో?
3. జీవితకాలమంతయు ఇదే వేదము. మేలు! మేలే!!
మేలు!!!
జవాబు:- జరిగి
తీరవలెను చిక్కు ఒక్కటి
ఉన్నది, దేవుడు ప్రేమించుటలేదు మరియు ఆయన పిలువలేదు.
4. షరా:- జరుగకపోవుట అనేది ఈ
వాక్యములో
లేదు. కీడనేది లేదు. సమకూడక
పోవుటనేది లేదు. కీడును చూచి మేలు కలుగవచ్చునని యనుకొనుట లేదు. కేవలము మేలేయని ఉన్నది. ఇదే గొప్ప
ధన్యత.