అత్యధిక శక్తి
"మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తిగల దేవునికి..." - ఎఫెసీ 3:20.
రెండు సంగతులు గుర్తించవలెను.
1. అడుగునవి.
2. ఊహించునవి.
అడగండి అని ప్రభువు మనకు చెప్పిన యెడల ఏమైనను అడుగుదుము.
అడుగుటకు అంతముండదు. అన్నియు
నరునికి కావలసియున్నవి.
ఎన్ని అడిగినను ఇస్తానని మాత్రముకాక ఇవ్వగలడనికూడ ఈ వాక్యములో
ఉన్నది. ఇష్టమున్న
ఆయన అన్నియు
ఇచ్చుట నాకిష్టమే అని పలికి, అన్నియు ఇవ్వలేనని చెప్పునా? ఇవ్వకపోతే ఆయనకు ఇష్టమైతే ఉన్నదిగాని
శక్తి
లేదనుకొందుము. అయితే
ఇక్కడ ఇచ్చేవాడు నరుడుకాడు. పుచ్చుకొనేవాడు నరుడే. ఇచ్చేవాడు దేవుడు గనుక ఇచ్చుటకు ఇష్టమును,
శక్తినిగలదని ఉన్నది.
అడుగుటనుగూర్చి ఇదివరకున్న వివరములలోగలదు. మరియొక విషయము మాకు ఫలానిది కావలెనని అడుగకపోవచ్చును.
గాని కావలసినవి
మనస్సులో
ఉండవచ్చును. ఊహలోనున్నదికూడ ఇవ్వబడునని ఈ వాక్యములో ఉదహరింపబడినది. విశ్వాసికి ఈ వాక్యములో
ఉదహరింపబడినది.
విశ్వాసికి ఈ
గొప్ప విషయము ఆశ్రయాస్పదమై ఉన్నది. అనగా నేను అడుగుటలేదు, ప్రార్ధింపలేదు బ్రతిమలాడలేదు, నాకు
అడిగిపెట్టండని ఎవరిని
కోరలేదు గాని, నా మనస్సులో నున్నది దేవునికి తెలుసును గనుక నెరవేర్చినాడని
విశ్వాసి సంతోషించును.
ఈ ఊహకు అడిగే
రూపము
రాకముందే, అది ప్రార్థనలోనికి తేకముందే, నెరవేర్పు కలుగును అని యనుట విశ్వాసికి ఎంతో సంతోషము.
ఊహించేది మాత్రమేకాదు,
ఊహించేదానికంటే ఎక్కువ ఆయన ఇవ్వగలడు. "కంటే, ఎక్కువ" అను ఈ రెండు మాటలనుబట్టి విశ్వాసి తన
స్థితిని అనగా దుస్థితిని,
పనియొక్క స్థితిని పరీక్షించి యెంత సిగ్గుపడవలసివచ్చును. మన విషయము
ఆలోచించవలసినదేమనగా ఏమడుగవలెనో, ఎంత అడుగవలెనో తెలియదు గనుక మనకు కావలసినవన్నియు
అడిగిన వెనుక,
ఇకలేవని అనుకొందుము.
ఇంకా మనకు ఏమి అవసరమో ప్రభువునకు తెలుసును. మనమైతే అక్కరకురానివి అడిగితే
ఏమనుకొనునోనని సంశయింతుము. ఈ వాక్యములో
అన్ని
సంశయములు తీరుచున్నవి. దేవా! నాకు కావలసినవి జ్ఞాపకము వచ్చినవి అడిగినాను. అడుగవలసినవి
ఉన్నయెడల అవికూడ
అడుగకపోయినను ఇమ్ము. నాకు దయచేసిన స్వాతంత్ర్యము నిమిత్తమై నీకు వందనములని ప్రార్థించుట మంచిది. ప్రతి
ప్రార్థన యొక్క ముగింపులో
ఈ తలంపుగల వాక్యముండుట మంచిది.
ఎఫెసి పత్రిక పరలోక పెండ్లికుమార్తెను జ్ఞాపకము చేసే పత్రికయై
ఉన్నది.
ఈ పత్రికారంభమందు
అనాదికాలము కనబడుచున్నది. అప్పుడే క్రీస్తుయేసులో మనలను దేవుడేర్పర్చుకొన్నట్లు వివరింపబడినది.
అన్ని ఆశీర్వాదములు
ఇచ్చివేసిన ధ్వని వినబడుచున్నది. మనలను తనయొద్ద కూర్చుండబెట్టిన సంగతి జ్ఞాపకము వచ్చినది.
ఏర్పర్చుకొనుటయు, దీవించుటయు
కూర్చుండబెట్టుకొనుటయు. ఇవి భావికాల విషయములుకావు. గతకాల విషయములే గనుక ఆ ఏర్పాటు ఆధారము
చేసుకొని మన మనవులు
సిద్ధపరచుకొనవలెను. ఇదివరలో చెప్పబడినట్లు అంత గొప్ప స్వాతంత్ర్య విశ్వాసముకలిగి
ఉండుట సుళువుకాదు. ఎందుచేత,
మనలోని
బలహీనతలన్నియు విసర్జించి ప్రభువు ఈ వాక్యములో ఇచ్చిన చనువును జ్ఞాపకముచేసికొని అడిగిన యెడల
సంపదగలవారమగుదుము. ఈ
వాక్యములో
బహువచనము వాడబడియున్నది. మనలో మనము ఈ రెండు బహువచనములే గనుక వీటిలో సంఘముగలదని తెలియుచున్నది.
సంఘమంతయు కలిసి
అడిగితే
దేవుడు ఇవ్వనని చెప్పడు. దేవునికి పరలోకములో తనయొద్ద నిత్యము కావలసినది సంఘమే కాని ఒక్కడేకాదు.
ప్రస్తుతము మనకు
ఎరిగినంతమట్టుకు సంఘమంతయు ఇటువంటి ప్రార్ధన చేయుట దుర్లభము.
ఎందుకనగా
ఇంకను
ఏకసంఘముగా మిషను శాఖలన్నియు, విశ్వాసులందరు, క్రీస్తు నామధారులందరు ఏర్పడలేదు. జాగ్రత్తగా
కనిపెట్టిన యెడల కారణములు
కనబడుచున్నవి. ఏకత్వములేదు, అందరికి వాక్య విషయములో ఒకే అర్ధములేదు. విశ్వాస విషయములోకూడ
బేధములున్నవి.
పత్రికలలో వ్రాయబడినట్లు, అనగా సంఘమును క్రీస్తు సంపూర్ణముగా ప్రేమించునట్లు సంఘము క్రీస్తును
ప్రేమించుట లేదు. గాని
అన్ని మిషనులవారు ఏకత్వమునే కోరుచున్నట్లు ప్రయత్నములు కనబడుచున్నవి గాని నెరవేరుట లేదు.
కాబట్టి సంఘము
యావత్తు పైకి
చేతులెత్తి దేవునిని వేడుకొనుటకు వీలులేదు.
దేవునికి మహిమ:- అనగా దేవునికి కీర్తి కలుగును,
ఈ మాట క్రిస్మస్
పాటలో
కలదు. దూతపాటలో దేవునికి మహిమ అని ఉన్నది. క్రీస్తుప్రభువు భూలోకమునకు వచ్చిన వ్యక్తి.
దేవుడు పరలోకములో ఉన్న
వ్యక్తి.
మానవులను రక్షించుటకు పరలోకమునుండి క్రీస్తుప్రభువు వచ్చెను. సంఘము ఏ మంచి కార్యముచేసిన అది
క్రీస్తునుబట్టియే
ఉండును.
క్రీస్తుప్రభువు ఏమియు చేయనియెడల సంఘము ఏమియుచేయలేదు. “మూలముగా” అనుమాట గుర్తించండి. సంఘము
నిమిత్తము ప్రభువు
చేసినపని యావత్తును ఇక్కడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సంఘమును, యేసుప్రభువును ఏకమై
ఉన్నప్పుడు ఈ వాక్యము
సరిపోవును. సంఘము విడిపోవునపుడు మహిమ రాదు. సంఘము సంఘములోనుండి విడిపోవుట ఒకటి. సంఘము
క్రీస్తులోనుండి విడిపోవుట
ఇంకొకటి. ఈ రెండింటిలో దేనివల్లను దేవునికి మహిమరాదు. మరియు తరతరములు అను మాటయు,
సదాకాలము అను మాటయు గుర్తింపవలసినది,
తరతరము
అనగా మానవులు భూమిమీద జీవించునంతకాలము, సదాకాలమనగా జీవాంతము తరువాత వచ్చునట్టి కాలము.
రక్షితులైన సంఘస్తులు
భూమిమీద మాత్రమే గాక పరలోకమునందును నిత్యము
జీవించుచుందురు. వారు
నిత్యము
దేవునిని మహిమపరచుచునే ఉందురు. మనలో కార్యసాధకమైన తన శక్తిచొప్పున నేటివరకు మనలో
పనిచేయుచున్న తన శక్తినిబట్టియని
యర్థము.
దేవునిశక్తి మనలో పనిచేయును, గాని మనము చేయనిచ్చునంత మాత్రమే చేయును. అత్యధికముగా అనగా నేమి?
ఎంతో ఎక్కువగా, అనగా
కావలసినంతకంటే ఎక్కువగా అనుగ్రహించును, అనగా కొదువలేకుండా చేయును.