సన్నిధి వాగ్ధాన వచనములు
సంగ్రహ వివరము
- 1. ఈ చార్టు, సన్నిధి చార్టులో ఉదహరింపబడిన బైబిలు వాక్యములును, వాటియొక్క వివరములును కలిసి ఒక గొప్ప బోధగా ఏర్పడినది. ఇది బోధ పత్రిక. ఇది వ్రాసినప్పుడు, విన్నప్పుడు మీమనస్సు ఎట్లుండునో గుర్తించండి.
- 2. మీరు ఒక రోజున ఈ చార్టులోనిదంతయు బాగుగా మనస్సు ఇచ్చి చదువుకొని వెంటనే సన్నిధిగదిలోనికి వెళ్ళి, యేదో ఒక అంశముమీద, మిక్కిలి అసాధ్యమైన సంగతినిగూర్చి ప్రార్థించేటప్పుడు మీ మనస్సు ఎట్లుండునో గుర్తించండి (లూకా 6:5).
- 3. సన్నిధి గదిలోనుండి బయటికి వచ్చిన తరువాత మీ ప్రార్థన నెరవేర్పు ఎట్లుండునో గుర్తించండి. అప్పుడు దేవునివాక్యము ఎంత సత్యమైనదో అనుభవరీతిగా తెలుసుకొనగలరు. దేవునిని మహిమపరుపగలరు.
- 4. ఇదంతయు ఎవరికైనా బోధించేటప్పుడు మీ మనస్సు, వారి మనస్సు ఎట్లుండునో గుర్తించండి.
షరా:- నీవు పైవాక్యములన్ని జ్ఞాపకము చేసికొనుచు మహా ధైర్యముతో ఒక కఠినాత్ముని గురించి ప్రార్థించేటందుకు వెళ్ళేటప్పుడు ప్రార్ధన గదికి వెళ్ళే మధ్యస్థలమున అనేక ప్రశ్నలు మిడుతల దండువలె రయగమ్మును.
ఆ ప్రశ్నలేవనగా ఇతడు చాలాకాలమునుండి కఠినాత్ముడు. మారునా? దేవుడు మార్చగల్గునా? మార్చగలిగితే సౌలు, ఇస్కరియోతు యూదా, కయీనులను మార్చగల్గెనా? నా ప్రార్ధన, నా విశ్వాసము సరిపోవునా? ఒకరు ఒకరిని గురించి ప్రార్ధించిన తరువాత అతడు మరింత చెడిపోయినాడట. కొంతమంది విశ్వాసులు తన్ను గురించి ప్రార్థించుచున్నారని విని ఒకరు మరింత చెలరేగినాడట. చెలరేగి చెలరేగి అతడు రాత్రి మంచముమీద పరుండి నేను ఏమంత చెడ్డవాడనని ప్రార్ధనలు పెట్టుకున్నారు? ఫలాన ఫలానా వారికంటే చెడ్డవాడనా అని అనుకుంటే చెంతనున్నవారు విని, ఇతడు ఇంకేమి మారును? మరియొక సంగతి. మరియొకరిని గురించి ప్రార్ధన పెట్టుకొని మరుసటి దినమున వారియొద్దకు వెళ్ళి సన్నిధిచార్టు వినిపించి అయ్యో! మీకొరకు నిన్న ప్రార్ధించినాము అనిచెప్పి, ఇదంత చదివి వినిపించలేక ఒక కాగితము చేతికిచ్చి మీరే ప్రార్ధించుకొనండనిచెప్పితే ఇంకేమి ప్రార్ధన చేస్తాడు? ఇట్టి ప్రశ్నలు మనస్సులోనికిరాగా సన్నిధికి వెళ్ళుట ఆగిపోవును లేదా ప్రార్ధనవాలు ఆగిపోవును. గనుక జాగ్రత్తగా నుండుడి.
షరా:- సన్నిధి గదిలోనుండి బయటకు వచ్చేటప్పుడు 1సమూ. 1:17 జ్ఞాపకము చేసికొనుము. అదేదనగా
-
నీవు క్షేమముగా వెళ్ళుము ఇశ్రాయేలు దేవునితో నీవుచేసికొన్న మనవిని ఆయన దయచేయును. అపో॥కార్య॥
10:4. నీ ప్రార్థనలు
దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి. ఇదికూడా బైటకు వచ్చేటప్పుడు జ్ఞాపకము
తెచ్చుకొనండి.
షరా:- జవాబులేని నెరవేర్పులుకూడ బైబిలులో ఉన్నవి. - లోతును రక్షిస్తానని అబ్రాహాముతో దేవుడు పలకలేదు గాని నెరవేర్పు కలిగినది (ఆది 18:19).
- ఏలియాకు వర్షము వచ్చునని తండ్రి చెప్పలేదుగాని నెరవేర్చు మేఘము చెప్పినదట.
- యెరూషలేము సంఘముయొక్క ప్రార్ధన సమయమున పేతురును విడిపిస్తానని పలుకలేదుగాని పేతురు తలుపుకొట్టుట ద్వారా నెరవేర్పు (అపో॥కార్య॥ 12:15).