Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 106
- యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
- యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
- న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
- యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు
- నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
- మా పితరులవలెనే మేము పాపము చేసితివిు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివిు
- ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి.
- అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
- ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.
- వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
- నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
- అప్పుడు వారు ఆయన మాటలు నమి్మరి ఆయన కీర్తి గానము చేసిరి.
- అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
- అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి
- వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.
- వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.
- భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
- వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
- హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
- తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.
- ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
- ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
- అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
- వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి
- యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి.
- అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును
- అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకునుఆయన వారిమీద చెయ్యి యెత్తెను.
- మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.
- వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను.
- ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను.
- నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.
- మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
- ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
- యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
- అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.
- వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
- మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.
- నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను
- తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
- కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
- ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి.
- వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.
- అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.
- అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
- వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
- వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
- యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.
- ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.
- Praise the LORD! Oh give thanks to the LORD, for he is good, for his steadfast love endures forever!
- Who can utter the mighty deeds of the LORD, or declare all his praise?
- Blessed are they who observe justice, who do righteousness at all times!
- Remember me, O LORD, when you show favor to your people; help me when you save them,
- that I may look upon the prosperity of your chosen ones, that I may rejoice in the gladness of your nation, that I may glory with your inheritance.
- Both we and our fathers have sinned; we have committed iniquity; we have done wickedness.
- Our fathers, when they were in Egypt, did not consider your wondrous works; they did not remember the abundance of your steadfast love, but rebelled by the Sea, at the Red Sea.
- Yet he saved them for his name's sake, that he might make known his mighty power.
- He rebuked the Red Sea, and it became dry, and he led them through the deep as through a desert.
- So he saved them from the hand of the foe and redeemed them from the power of the enemy.
- And the waters covered their adliaries; not one of them was left.
- Then they believed his words; they sang his praise.
- But they soon forgot his works; they did not wait for his counsel.
- But they had a wanton craving in the wilderness, and put God to the test in the desert;
- he gave them what they asked, but sent a wasting disease among them.
- When men in the camp were jealous of Moses and Aaron, the holy one of the LORD,
- the earth opened and swallowed up Dathan, and covered the company of Abiram.
- Fire also broke out in their company; the flame burned up the wicked.
- They made a calf in Horeb and worshiped a metal image.
- They exchanged the glory of God for the image of an ox that eats grass.
- They forgot God, their Savior, who had done great things in Egypt,
- wondrous works in the land of Ham, and awesome deeds by the Red Sea.
- Therefore he said he would destroy them- had not Moses, his chosen one, stood in the breach before him, to turn away his wrath from destroying them.
- Then they despised the pleasant land, having no faith in his promise.
- They murmured in their tents, and did not obey the voice of the LORD.
- Therefore he raised his hand and swore to them that he would make them fall in the wilderness,
- and would make their offspring fall among the nations, scattering them among the lands.
- Then they yoked themselves to the Baal of Peor, and ate sacrifices offered to the dead;
- they provoked the LORD to anger with their deeds, and a plague broke out among them.
- Then Phinehas stood up and intervened, and the plague was stayed.
- And that was counted to him as righteousness from generation to generation forever.
- They angered him at the waters of Meribah, and it went ill with Moses on their account,
- for they made his spirit bitter, and he spoke rashly with his lips.
- They did not destroy the peoples, as the LORD commanded them,
- but they mixed with the nations and learned to do as they did.
- They served their idols, which became a snare to them.
- They sacrificed their sons and their daughters to the demons;
- they poured out innocent blood, the blood of their sons and daughters, whom they sacrificed to the idols of Canaan, and the land was polluted with blood.
- Thus they became unclean by their acts, and played the whore in their deeds.
- Then the anger of the LORD was kindled against his people, and he abhorred his heritage;
- he gave them into the hand of the nations, so that those who hated them ruled over them.
- Their enemies oppressed them, and they were brought into subjection under their power.
- Many times he delivered them, but they were rebellious in their purposes and were brought low through their iniquity.
- Nevertheless, he looked upon their distress, when he heard their cry.
- For their sake he remembered his covenant, and relented according to the abundance of his steadfast love.
- He caused them to be pitied by all those who held them captive.
- Save us, O LORD our God, and gather us from among the nations, that we may give thanks to your holy name and glory in your praise.
- Blessed be the LORD, the God of Israel, from everlasting to everlasting! And let all the people say, "Amen!" Praise the LORD!
- याह की स्तुति करो! यहोवा का धन्यवाद करो, क्योंकि वह भला है; और उसकी करूणा सदा की है!
- यहोवा के पराक्रम के कामों का वर्णन कौन कर सकता है, न उसका पूरा गुणानुवाद कौन सुना सकता?
- क्या ही धन्य हैं वे जो न्याय पर चलते, और हर समय धर्म के काम करते हैं!
- हे यहोवा, अपनी प्रजा पर की प्रसन्नता के अनुसार मुझे स्मरण कर, मेरे उद्धार के लिये मेरी सुधि ले,
- कि मैं तेरे चुने हुओं का कल्याण देखूं, और तेरी प्रजा के आनन्द में आनन्दित हो जाऊं; और तेरे निज भाग के संग बड़ाई करने पाऊं।।
- हम ने तो अपने पुरखाओं की नाईं पाप किया है; हम ने कुटिलता की, हम ने दुष्टता की है!
- मि में हमारे पुरखाओं ने तेरे आश्चर्यकर्मों पर मन नहीं लगाया, न तेरी अपार करूणा को स्मरण रखा; उन्हों ने समुद्र के तीर पर, अर्थात् लाल समुद्र के तीर पर बलवा किया।
- तौभी उस ने अपने नाम के निमित्त उनका उद्धार किया, जिस से वह अपने पराक्रम को प्रगट करे।
- तब उस ने लाल समुद्र को घुड़का और वह सूख गया; और वह उन्हें गहिरे जल के बीच से मानों जंगल में से निकाल ले गया।
- उस ने उन्हें बैरी के हाथ से उबारा, और शत्रु के हाथ से छुड़ा लिया।
- और उनके द्रोही जल में डूब गए; उन में से एक भी न बचा।
- तब उनहों ने उसके वचनों का विश्वास किया; और उसकी स्तुति गाने लगे।।
- परन्तु वे झट उसके कामों को भूल गए; और उसकी युक्ति के लिये न ठहरे।
- उन्हों ने जंगल में अति लालसा की और निर्जल स्थान में ईश्वर की परीक्षा की।
- तब उस ने उन्हें मुंह मांगा वर तो दिया, परन्तु उनके प्राण को सुखा दिया।।
- उन्हों ने छावनी में मूसा के, और यहोवा के पवित्रा जन हारून के विषय में डाह की,
- भूमि फट कर दातान को निगल गई, और अबीराम के झुण्ड को ग्रस लिया।
- और उनके झुण्ड में आग भड़क उठी; और दुष्ट लोग लौ से भस्म हो गए।।
- उन्हों ने होरब में बछड़ा बनाया, और ढली हुई मूत्ति को दण्डवत् की।
- यों उन्हों ने अपनी महिमा अर्थात् ईश्वर को घास खानेवाले बैल की प्रतिमा से बदल डाला।
- वे अपने उद्धारकर्ता ईश्वर को भूल गए, जिस ने मि में बड़े बड़े काम किए थे।
- उस ने तो हाम के देश में आश्चर्यकर्म और लाल समुद्र के तीर पर भयंकर काम किए थे।
- इसलिये उस ने कहा, कि मैं इन्हें सत्यानाश कर डालता यदि मेरा चुना हुआ मूसा जोखिम के स्थान में उनके लिये खड़ा न होता ताकि मेरी जलजलाहट को ठण्डा करे कहीं ऐसा न हो कि मैं उन्हें नाश कर डालूं।।
- उन्हों ने मनभावने देश को निकम्मा जाना, और उसके वचन की प्रतीति न की।
- वे अपने तम्बुओं में कुड़कुड़ाए, और यहोवा का कहा न माना।
- तब उस ने उनके विषय में शपथ खाई कि मैं इनको जंगल में नाश करूंगा,
- और इनके वंश को अन्यजातियों के सम्मुख गिरा दूंगा, और देश देश में तितर बितर करूंगा।।
- वे पोरवाले बाल देवता को पूजने लगे और मुर्दों को चढ़ाए हुए पशुओं का मांस खाने लगे।
- यों उन्हों ने अपने कामों से उसको क्रोध दिलाया और मरी उन में फूट पड़ी।
- तब पीहास ने उठकर न्यायदण्ड दिया, जिस से मरी थम गई।
- और यह उसके लेखे पीढ़ी से पीढ़ी तक सर्वदा के लिये धर्म गिना गया।।
- उन्हों ने मरीबा के सोते के पास भी यहोवा का क्रोध भड़काया, और उनके कारण मूसा की हानि हुई;
- क्योंकि उन्हों ने उसकी आत्मा से बलवा किया, तब मूसा बिन सोचे बोल उठा।
- जिन लोगों के विषय यहोवा ने उन्हें आज्ञा दी थी, उनको उन्हों ने सत्यानाश न किया,
- वरन उन्हीं जातियों से हिलमिल गए और उनके व्यवहारों को सीख लिया;
- और उनकी मूत्तियों की पूजा करने लगे, और वे उनके लिये फन्दा बन गई।
- वरन उन्हों ने अपने बेटे- बेटियों को पिशाचों के लिये बलिदान किया;
- और अपने निर्दोष बेटे- बेटियों का लोहू बहाया जिन्हें उन्हों ने कनान की मूत्तियों पर बलि किया, इसलिये देश खून से अपवित्रा हो गया।
- और वे आप अपने कामों के द्वारा अशुद्ध हो गए, और अपने कार्यों के द्वारा व्यभिचारी भी बन गए।।
- तब यहोवा का क्रोध अपनी प्रजा पर भड़का, और उसको अपने निज भाग से घृणा आई;
- तब उस ने उनको अन्यजातियों के वश में कर दिया, और उनके बैरियो ने उन पर प्रभुता की।
- उनके शत्रुओं ने उन पर अन्धेर किया, और वे उनके हाथ तले दब गए।
- बारम्बार उस ने उन्हें छुड़ाया, परन्तु वे उसके विरूद्ध युक्ति करते गए, और अपने अधर्म के कारण दबते गए।
- तौभी जब जब उनका चिल्लाना उसके कान में पड़ा, तब तब उस ने उनके संकट पर दृष्टि की!
- और उनके हित अपनी वाचा को स्मरण करके अपनी अपार करूणा के अनुसार तरस खाया,
- औश्र जो उन्हें बन्धुए करके ले गए थे उन सब से उन पर दया कराई।।
- हे हमारे परमेश्वर यहोवा, हमारा उद्धार कर, और हमें अन्यजातियों में से इकट्ठा कर ले, कि हम तेरे पवित्रा नाम का धन्यवाद करें, और तेरी स्तुति करते हुए तेरे विषय में बड़ाई करें।।
- इस्राएल का परमेश्वर यहोवा अनादिकाल से अनन्तकाल तक धन्य है! और सारी प्रजा कहे आमीन! याह की स्तुति करो।।