Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 116
- యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
- ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
- మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
- అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
- యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.
- యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
- నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
- మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
- సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
- నేను ఆలాగు మాటలాడి నమి్మక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
- నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
- యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
- రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
- యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
- యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
- యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
- ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను
- యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
- I love the LORD, because he has heard my voice and my pleas for mercy.
- Because he inclined his ear to me, therefore I will call on him as long as I live.
- The snares of death encompassed me; the pangs of Sheol laid hold on me; I suffered distress and anguish.
- Then I called on the name of the LORD: "O LORD, I pray, deliver my soul!"
- Gracious is the LORD, and righteous; our God is merciful.
- The LORD preserves the simple; when I was brought low, he saved me.
- Return, O my soul, to your rest; for the LORD has dealt bountifully with you.
- For you have delivered my soul from death, my eyes from tears, my feet from stumbling;
- I will walk before the LORD in the land of the living.
- I believed, even when I spoke, "I am greatly afflicted";
- I said in my alarm, "All mankind are liars."
- What shall I render to the LORD for all his benefits to me?
- I will lift up the cup of salvation and call on the name of the LORD,
- I will pay my vows to the LORD in the presence of all his people.
- Precious in the sight of the LORD is the death of his saints.
- O LORD, I am your servant; I am your servant, the son of your maidservant. You have loosed my bonds.
- I will offer to you the sacrifice of thanksgiving and call on the name of the LORD.
- I will pay my vows to the LORD in the presence of all his people,
- in the courts of the house of the LORD, in your midst, O Jerusalem. Praise the LORD!
- मैं प्रेम रखता हूं, इसलिये कि यहोवा ने मेरे गिड़गिड़ाने को सुना है।
- उस ने जो मेरी ओर कान लगाया है, इसलिये मैं जीवन भर उसको पुकारा करूंगा।
- मृत्यु की रस्सियां मेरे चारों ओर थीं; मैं अधोलोक की सकेती में पड़ा था; मुझे संकट और शोक भोगना पड़ा।
- तब मैं ने यहोवा से प्रार्थना की, कि हे यहोवा बिनती सुनकर मेरे प्राण को बचा ले!
- यहोवा अनुग्रहकारी और धर्मी है; और हमारा परमेश्वर दया करनेवाला है।
- यहोवा भोलों की रक्षा करता है; जब मैं बलहीन हो गया था, उस ने मेरा उद्धार किया।
- हे मेरे प्राण तू अपने विश्रामस्थान में लौट आ; क्योंकि यहोवा ने तेरा उपकार किया है।।
- तू ने तो मेरे प्राण को मृत्यु से, मेरी आंख को आंसू बहाने से, और मेरे पांव को ठोकर खाने से बचाया है।
- मैं जीवित रहते हुए, अपने को यहोवा के साम्हने जानकर नित चलता रहूंगा।
- मैं ने जो ऐसा कहा है, इसे विश्वास की कसौटी पर कस कर कहा है, कि मैं तो बहुत की दु:खित हुआ;
- मैं ने उतावली से कहा, कि सब मनुष्य झूठें हैं।।
- यहोवा ने मेरे जितने उपकार किए हैं, उनका बदला मैं उसको क्या दूं?
- मैं उद्धार का कटोरा उठाकर, यहोवा से प्रार्थना करूंगा,
- मैं यहोवा के लिये अपनी मन्नतें सभों की दृष्टि में प्रगट रूप में उसकी सारी प्रजा के साम्हने पूरी करूंगा।
- यहोवा के भक्तों की मृत्यु, उसकी दृष्टि में अनमोल है।
- हे यहोवा, सुन, मैं तो तेरा दास हूं; मैं तेरा दास, और तेरी दासी का पुत्रा हूं। तू ने मेरे बन्धन खोल दिए हैं।
- मैं तुझ को धन्यवादबलि चढ़ाऊंगा, और यहोवा से प्रार्थना करूंगा।
- मैं यहोवा के लिये अपनी मन्नतें, प्रगट में उसकी सारी प्रजा के साम्हने
- यहोवा के भवन के आंगनों में, हे यरूशलेम, तेरे भीतर पूरी करूंगा। याह की स्तुति करो!