Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 28
- యెహోవా, నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము నీవు మౌనముగా నుండినయెడల నేను సమాధిలోనికి దిగువారివలె అగుదును.
- నేను నీకు మొఱ్ఱపెట్టునప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము.
- భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయు నట్టు నన్ను లాగి వేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగువారితో సమాధానముగా మాటలాడు దురు
- వారి క్రియలనుబట్టి వారి దుష్టక్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయుము. వారు చేసిన పనినిబట్టి వారికి ప్రతికారము చేయుము వారికి తగిన ప్రతిఫలమిమ్ము.
- యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్యపెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును.
- యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక.
- యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమి్మకయుంచెన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
- యెహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషిక్తునికి రక్షణదుర్గము.
- నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వ దింపుము వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము.
- OF DAVID.To you, O LORD, I call; my rock, be not deaf to me, lest, if you be silent to me, I become like those who go down to the pit.
- Hear the voice of my pleas for mercy, when I cry to you for help, when I lift up my hands toward your most holy sanctuary.
- Do not drag me off with the wicked, with the workers of evil, who speak peace with their neighbors while evil is in their hearts.
- Give to them according to their work and according to the evil of their deeds; give to them according to the work of their hands; render them their due reward.
- Because they do not regard the works of the LORD or the work of his hands, he will tear them down and build them up no more.
- Blessed be the LORD! for he has heard the voice of my pleas for mercy.
- The LORD is my strength and my shield; in him my heart trusts, and I am helped; my heart exults, and with my song I give thanks to him.
- The LORD is the strength of his people; he is the saving refuge of his anointed.
- Oh, save your people and bless your heritage! Be their shepherd and carry them forever.
- हे यहोवा, मैं तुझी को पुकारूंगा; हे मेरी चट्टान, मेरी सुनी अनसुनी न कर, ऐसा न हो कि तेरे चुप रहने से मैं कब्र में पड़े हुओं के समान हो जाऊं जो पाताल में चले जाते हैं।
- जब मैं तेरी दोहाई दूं, और तेरे पवित्रास्थान की भीतरी कोठरी की ओर अपने हाथ उठाऊं, तब मेरी गिड़गिड़ाहट की बात सुन ले।
- उन दुष्टों और अनर्थकारियों के संग मुझे न घसीट; जो अपने पड़ोसियों से बातें तो मेल की बोलते हैं परन्तु हृदय में बुराई रखते हैं।
- उनके कामों के और उनकी करनी की बुराई के अनुसार उन से बर्ताव कर, उनके हाथों के काम के अनुसार उन्हें बदला दे; उनके कामों का पलटा उन्हें दे।
- वे यहोवा के कामों पर और उसके हाथों के कामों पर ध्यान नहीं करते, इसलिये वह उन्हें पछाड़ेगा और फिर न उठाएगा।।
- यहोवा धन्य है; क्योंकि उस ने मेरी गिड़गिड़ाहट को सुना है।
- यहोवा मेरा बल और मेरी ढ़ाल है; उस पर भरोसा रखने से मेरे मन को सहायता मिली है; इसलिये मेरा हृदय प्रफुल्लित है; और मैं गीत गाकर उसका धन्यवाद करूंगा।
- यहोवा उनका बल है, वह अपने अभिषिक्त के लिये उद्धार का दृढ़ गढ़ है।
- हे यहोवा अपनी प्रजा का उद्धार कर, और अपने निज भाग के लोगों को आशीष दे; और उनकी चरवाही कर और सदैव उन्हें सम्भाले रह।।