Old
New
కీర్తనల గ్రంథము Psalms भजन संहिता - 119
- (ఆలెఫ్) యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు
- ఆయన శాసనములను గైకొనుచు పూర్ణహృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు.
- వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాప మును చేయరు
- నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించియున్నావు.
- ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు.
- నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు.
- నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చెదను.
- నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము.
- (బేత్) ¸°వనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?
- నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.
- నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.
- యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము.
- నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును.
- సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను.
- నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
- నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
- (గీమెల్) నీ సేవకుడనైన నేను బ్రదుకునట్లు నాయెడల నీ దయారసము చూపుము నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును.
- నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము.
- నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
- నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది.
- గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు.
- నేను నీ శాసనముల ననుసరించుచున్నాను. నామీదికి రాకుండ నిందను తిరస్కారమును తొల గింపుము.
- అధికారులు నాకు విరోధముగా సభతీర్చి మాటలాడు కొందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును.
- నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.
- (దాలెత్) నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యముచేత నన్ను బ్రదికింపుము.
- నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపుము
- నీ ఉపదేశమార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను.
- వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.
- కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము
- సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయవిధులను నేను నాయెదుట పెట్టుకొని యున్నాను
- యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని యున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము.
- నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞలమార్గమున పరుగెత్తెదను.
- (హే) యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును.
- నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయ చేయుము అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకా రము నడుచుకొందును.
- నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దానియందు నన్ను నడువజేయుము.
- లోభముతట్టు కాక నీ శాసనములతట్టు నా హృద యము త్రిప్పుము.
- వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రదికిం పుము.
- నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము.
- నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము.
- నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతినిబట్టి నన్ను బ్రదికింపుము.
- (వావ్) యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము నీ మాటచొప్పున నీ రక్షణ రానిమ్ము.
- అప్పుడు నన్ను నిందించువారికి నేను ఉత్తరమీయ గలను ఏలయనగా నీమాట నమ్ముకొనియున్నాను.
- నా నోటనుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసి వేయకుము నీ న్యాయవిధులమీద నా ఆశ నిలిపియున్నాను.
- నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును
- నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును
- సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను.
- నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.
- నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞలతట్టు నా చేతు లెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును. జాయిన్.
- (జాయిన్) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసి కొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.
- నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.
- గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రమునుండి నేను తొలగక యున్నాను.
- యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని.
- నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది
- యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను.
- యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయు చున్నాను నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచున్నాను
- నీ ఉపదేశము ననుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడియున్నది.
- (హేత్)యెహోవా, నీవే నా భాగము నీ వాక్యముల ననుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని యున్నాను.
- కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
- నా మార్గములు నేను పరిశీలనచేసికొంటిని నీ శాసనములతట్టు మరలుకొంటిని.
- నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని.
- భక్తిహీనులపాశములు నన్ను చుట్టుకొని యున్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు
- న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను.
- నీయందు భయభక్తులు గలవారందరికిని నీ ఉపదేశములను అనుసరించువారికిని నేను చెలి కాడను.
- (తేత్) యహోవా, భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపుము.
- యహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసియున్నావు.
- నేను నీ ఆజ్ఞలయందు నమి్మక యుంచియున్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము.
- శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.
- నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపుము.
- గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశ ములను అనుసరింతును.
- వారి హృదయము క్రొవ్వువలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమునుబట్టి ఆనందించుచున్నాను.
- నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను.
- వేలకొలది వెండి బంగారు నాణములకంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు.
- (యోద్) నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనునట్లు నాకు బుద్ధి దయ చేయుము.
- నీ వాక్యముమీద నేను ఆశపెట్టుకొని యున్నాను నీయందు భయభక్తులుగలవారు నన్ను చూచి సంతో షింతురు
- యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును.
- నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.
- నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రదుకునట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగును గాక.
- నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు గాక.
- నీయందు భయభక్తులుగలవారును నీ శాసనములను తెలిసికొనువారును నా పక్షమున నుందురు గాక.
- నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక.
- (కఫ్) నీ రక్షణకొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను
- నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాటకొరకు కనిపెట్టి క్షీణించు చున్నవి
- నేను పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు.
- నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయెను? నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట యెప్పుడు?
- నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి.
- నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయముచేయుము.
- భూమిమీద నుండకుండ వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను.
- నీవు నియమించిన శాసనమును నేను అనుసరించు నట్లు నీ కృపచేత నన్ను బ్రదికింపుము. లామెద్.
- (లామెద్) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది.
- నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగానున్నది
- సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి
- నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనియెడల నా శ్రమయందు నేను నశించియుందును.
- నీ ఉపదేశమువలన నీవు నన్ను బ్రదికించితివి నేనెన్నడును వాటిని మరువను.
- నీ ఉపదేశములను నేను వెదకుచున్నాను నేను నీవాడనే నన్ను రక్షించుము.
- నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను.
- సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి యున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది.
- (మేమ్) నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.
- నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి.
- నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.
- నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.
- నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్టమార్గములన్నిటిలోనుండి నా పాదములు తొల గించుకొనుచున్నాను
- నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధులనుండి నేను తొలగకయున్నాను.
- నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
- నీ ఉపదేశమువలన నాకు వివేకము కలిగెను తప్పుమార్గములన్నియు నా కసహ్యములాయెను.
- (నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
- నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెర వేర్చుదును.
- యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీక రించుము. నీ న్యాయవిధులను నాకు బోధింపుము
- నా ప్రాణము ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను.
- నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశములనుండి నేను తొలగి తిరుగుట లేదు.
- నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.
- నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
- (సామెహ్) ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
- నాకు మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొనియున్నాను.
- నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి.
- నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదు కొనుము నా ఆశ భంగమై నేను సిగ్గునొందక యుందును గాక.
- నాకు రక్షణకలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను.
- నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించు దువు వారి కపటాలోచన మోసమే.
- భూమిమీదనున్న భక్తిహీనులనందరిని నీవు మష్టువలె లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి
- నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- (అయిన్) నేను నీతిన్యాయముల ననుసరించుచున్నాను. నన్ను బాధించువారివశమున నన్ను విడిచిపెట్టకుము.
- మేలుకొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక యుందురు గాక.
- నీ రక్షణకొరకు నీతిగల నీ మాటకొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి.
- నీ కృపచొప్పున నీ సేవకునికి మేలుచేయుము నీ కట్టడలను నాకు బోధింపుము
- నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించునట్లు నాకు జ్ఞానము కలుగ జేయుము
- జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకము చేసియున్నారు యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము.
- బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి.
- నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియు నా కసహ్యములు.
- (పే) నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను.
- నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును
- నీ ఆజ్ఞలయందైన యధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను.
- నీ నామమును ప్రేమించువారికి నీవు చేయదగునట్లు నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము.
- నీ వాక్యమునుబట్టి నా యడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము.
- నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము.
- నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము.
- జనులు నీ ధర్మశాస్త్రము ననుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
- (సాదె) యెహోవా, నీవు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు
- నీతినిబట్టియు పూర్ణ విశ్వాస్యతనుబట్టియు నీ శాసనములను నీవు నియమించితివి.
- నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది.
- నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది.
- నేను అల్పుడను నిరాకరింపబడినవాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను.
- నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము.
- శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి
- నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రదుకునట్లు నాకు తెలివి దయచేయుము.
- (ఖొఫ్) యెహోవా, హృదయపూర్వకముగా నేను మొఱ్ఱ పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము.
- నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నీ శాసనములచొప్పున నేను నడుచుకొనునట్లు నన్ను రక్షింపుము.
- తెల్లవారకమునుపే మొఱ్ఱపెట్టితిని నీ మాటలమీద నేను ఆశపెట్టుకొని యున్నాను
- నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నాకన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచు కొందును.
- నీ కృపనుబట్టి నా మొఱ్ఱ ఆలకింపుము యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు
- యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియు సత్యమైనవి.
- నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరచితివని నేను పూర్వమునుండి వాటివలననే తెలిసికొని యున్నాను.
- (రేష్) నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము
- నా పక్షమున వ్యాజ్యెమాడి నన్ను విమోచింపుము నీవిచ్చిన మాటచొప్పున నన్ను బ్రదికింపుము.
- భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా నున్నది.
- యెహోవా, నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులనుబట్టి నన్ను బ్రదికింపుము.
- నన్ను తరుమువారును నా విరోధులును అనేకులు అయినను నీ న్యాయశాసనములనుండి నేను తొలగక యున్నాను.
- ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
- యెహోవా, చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృపచొప్పున నన్ను బ్రదికింపుము
- నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయవిధులన్నియు నిత్యము నిలుచును.
- (షీన్) అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అయినను నీ వాక్యభయము నా హృదయమందు నిలుచుచున్నది.
- విస్తారమైన దోపుసొమ్ము సంపాదించినవానివలె నీవిచ్చిన మాటనుబట్టి నేను సంతోషించుచున్నాను.
- అబద్ధము నాకసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము.
- నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించు చున్నాను.
- నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు
- యెహోవా, నీ రక్షణకొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను.
- నేను నీ శాసనములనుబట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు,
- నా మార్గములన్నియు నీయెదుట నున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించు చున్నాను.
- (తౌ) యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము.
- నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాటచొప్పున నన్ను విడిపింపుము.
- నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును
- నీ ఆజ్ఞలన్నియు న్యాయములు నీ వాక్యమునుగూర్చి నా నాలుక పాడును.
- నేను నీ ఉపదేశములను కోరుకొనియున్నాను నీ చెయ్యి నాకు సహాయమగును గాక.
- యెహోవా, నీ రక్షణకొరకు నేను మిగుల ఆశపడు చున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
- నీవు నన్ను బ్రదికింపుము నేను నిన్ను స్తుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగును గాక
- తప్పిపోయిన గొఱ్ఱవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.
- Blessed are those whose way is blameless, who walk in the law of the LORD!
- Blessed are those who keep his testimonies, who seek him with their whole heart,
- who also do no wrong, but walk in his ways!
- You have commanded your precepts to be kept diligently.
- Oh that my ways may be steadfast in keeping your statutes!
- Then I shall not be put to shame, having my eyes fixed on all your commandments.
- I will praise you with an upright heart, when I learn your righteous rules.
- I will keep your statutes; do not utterly forsake me!
- How can a young man keep his way pure? By guarding it according to your word.
- With my whole heart I seek you; let me not wander from your commandments!
- I have stored up your word in my heart, that I might not sin against you.
- Blessed are you, O LORD; teach me your statutes!
- With my lips I declare all the rules of your mouth.
- In the way of your testimonies I delight as much as in all riches.
- I will meditate on your precepts and fix my eyes on your ways.
- I will delight in your statutes; I will not forget your word.
- Deal bountifully with your servant, that I may live and keep your word.
- Open my eyes, that I may behold wondrous things out of your law.
- I am a sojourner on the earth; hide not your commandments from me!
- My soul is consumed with longing for your rules at all times.
- You rebuke the insolent, accursed ones, who wander from your commandments.
- Take away from me scorn and contempt, for I have kept your testimonies.
- Even though princes sit plotting against me, your servant will meditate on your statutes.
- Your testimonies are my delight; they are my counselors.
- My soul clings to the dust; give me life according to your word!
- When I told of my ways, you answered me; teach me your statutes!
- Make me understand the way of your precepts, and I will meditate on your wondrous works.
- My soul melts away for sorrow; strengthen me according to your word!
- Put false ways far from me and graciously teach me your law!
- I have chosen the way of faithfulness; I set your rules before me.
- I cling to your testimonies, O LORD; let me not be put to shame!
- I will run in the way of your commandments when you enlarge my heart!
- Teach me, O LORD, the way of your statutes; and I will keep it to the end.
- Give me understanding, that I may keep your law and observe it with my whole heart.
- Lead me in the path of your commandments, for I delight in it.
- Incline my heart to your testimonies, and not to selfish gain!
- Turn my eyes from looking at worthless things; and give me life in your ways.
- Confirm to your servant your promise, that you may be feared.
- Turn away the reproach that I dread, for your rules are good.
- Behold, I long for your precepts; in your righteousness give me life!
- Let your steadfast love come to me, O LORD, your salvation according to your promise;
- then shall I have an answer for him who taunts me, for I trust in your word.
- And take not the word of truth utterly out of my mouth, for my hope is in your rules.
- I will keep your law continually, forever and ever,
- and I shall walk in a wide place, for I have sought your precepts.
- I will also speak of your testimonies before kings and shall not be put to shame,
- for I find my delight in your commandments, which I love.
- I will lift up my hands toward your commandments, which I love, and I will meditate on your statutes.
- Remember your word to your servant, in which you have made me hope.
- This is my comfort in my affliction, that your promise gives me life.
- The insolent utterly deride me, but I do not turn away from your law.
- When I think of your rules from of old, I take comfort, O LORD.
- Hot indignation seizes me because of the wicked, who forsake your law.
- Your statutes have been my songs in the house of my sojourning.
- I remember your name in the night, O LORD, and keep your law.
- This blessing has fallen to me, that I have kept your precepts.
- The LORD is my portion; I promise to keep your words.
- I entreat your favor with all my heart; be gracious to me according to your promise.
- When I think on my ways, I turn my feet to your testimonies;
- I hasten and do not delay to keep your commandments.
- Though the cords of the wicked ensnare me, I do not forget your law.
- At midnight I rise to praise you, because of your righteous rules.
- I am a companion of all who fear you, of those who keep your precepts.
- The earth, O LORD, is full of your steadfast love; teach me your statutes!
- You have dealt well with your servant, O LORD, according to your word.
- Teach me good judgment and knowledge, for I believe in your commandments.
- Before I was afflicted I went astray, but now I keep your word.
- You are good and do good; teach me your statutes.
- The insolent smear me with lies, but with my whole heart I keep your precepts;
- their heart is unfeeling like fat, but I delight in your law.
- It is good for me that I was afflicted, that I might learn your statutes.
- The law of your mouth is better to me than thousands of gold and silver pieces.
- Your hands have made and fashioned me; give me understanding that I may learn your commandments.
- Those who fear you shall see me and rejoice, because I have hoped in your word.
- I know, O LORD, that your rules are righteous, and that in faithfulness you have afflicted me.
- Let your steadfast love comfort me according to your promise to your servant.
- Let your mercy come to me, that I may live; for your law is my delight.
- Let the insolent be put to shame, because they have wronged me with falsehood; as for me, I will meditate on your precepts.
- Let those who fear you turn to me, that they may know your testimonies.
- May my heart be blameless in your statutes, that I may not be put to shame!
- My soul longs for your salvation; I hope in your word.
- My eyes long for your promise; I ask, "When will you comfort me?"
- For I have become like a wineskin in the smoke, yet I have not forgotten your statutes.
- How long must your servant endure? When will you judge those who persecute me?
- The insolent have dug pitfalls for me; they do not live according to your law.
- All your commandments are sure; they persecute me with falsehood; help me!
- They have almost made an end of me on earth, but I have not forsaken your precepts.
- In your steadfast love give me life, that I may keep the testimonies of your mouth.
- Forever, O LORD, your word is firmly fixed in the heavens.
- Your faithfulness endures to all generations; you have established the earth, and it stands fast.
- By your appointment they stand this day, for all things are your servants.
- If your law had not been my delight, I would have perished in my affliction.
- I will never forget your precepts, for by them you have given me life.
- I am yours; save me, for I have sought your precepts.
- The wicked lie in wait to destroy me, but I consider your testimonies.
- I have seen a limit to all perfection, but your commandment is exceedingly broad.
- Oh how I love your law! It is my meditation all the day.
- Your commandment makes me wiser than my enemies, for it is ever with me.
- I have more understanding than all my teachers, for your testimonies are my meditation.
- I understand more than the aged, for I keep your precepts.
- I hold back my feet from every evil way, in order to keep your word.
- I do not turn aside from your rules, for you have taught me.
- How sweet are your words to my taste, sweeter than honey to my mouth!
- Through your precepts I get understanding; therefore I hate every false way.
- Your word is a lamp to my feet and a light to my path.
- I have sworn an oath and confirmed it, to keep your righteous rules.
- I am severely afflicted; give me life, O LORD, according to your word!
- Accept my freewill offerings of praise, O LORD, and teach me your rules.
- I hold my life in my hand continually, but I do not forget your law.
- The wicked have laid a snare for me, but I do not stray from your precepts.
- Your testimonies are my heritage forever, for they are the joy of my heart.
- I incline my heart to perform your statutes forever, to the end.
- I hate the double-minded, but I love your law.
- You are my hiding place and my shield; I hope in your word.
- Depart from me, you evildoers, that I may keep the commandments of my God.
- Uphold me according to your promise, that I may live, and let me not be put to shame in my hope!
- Hold me up, that I may be safe and have regard for your statutes continually!
- You spurn all who go astray from your statutes, for their cunning is in vain.
- All the wicked of the earth you discard like dross, therefore I love your testimonies.
- My flesh trembles for fear of you, and I am afraid of your judgments.
- I have done what is just and right; do not leave me to my oppressors.
- Give your servant a pledge of good; let not the insolent oppress me.
- My eyes long for your salvation and for the fulfillment of your righteous promise.
- Deal with your servant according to your steadfast love, and teach me your statutes.
- I am your servant; give me understanding, that I may know your testimonies!
- It is time for the LORD to act, for your law has been broken.
- Therefore I love your commandments above gold, above fine gold.
- Therefore I consider all your precepts to be right; I hate every false way.
- Your testimonies are wonderful; therefore my soul keeps them.
- The unfolding of your words gives light; it imparts understanding to the simple.
- I open my mouth and pant, because I long for your commandments.
- Turn to me and be gracious to me, as is your way with those who love your name.
- Keep steady my steps according to your promise, and let no iniquity get dominion over me.
- Redeem me from man's oppression, that I may keep your precepts.
- Make your face shine upon your servant, and teach me your statutes.
- My eyes shed streams of tears, because people do not keep your law.
- Righteous are you, O LORD, and right are your rules.
- You have appointed your testimonies in righteousness and in all faithfulness.
- My zeal consumes me, because my foes forget your words.
- Your promise is well tried, and your servant loves it.
- I am small and despised, yet I do not forget your precepts.
- Your righteousness is righteous forever, and your law is true.
- Trouble and anguish have found me out, but your commandments are my delight.
- Your testimonies are righteous forever; give me understanding that I may live.
- With my whole heart I cry; answer me, O LORD! I will keep your statutes.
- I call to you; save me, that I may observe your testimonies.
- I rise before dawn and cry for help; I hope in your words.
- My eyes are awake before the watches of the night, that I may meditate on your promise.
- Hear my voice according to your steadfast love; O LORD, according to your justice give me life.
- They draw near who persecute me with evil purpose; they are far from your law.
- But you are near, O LORD, and all your commandments are true.
- Long have I known from your testimonies that you have founded them forever.
- Look on my affliction and deliver me, for I do not forget your law.
- Plead my cause and redeem me; give me life according to your promise!
- Salvation is far from the wicked, for they do not seek your statutes.
- Great is your mercy, O LORD; give me life according to your rules.
- Many are my persecutors and my adliaries, but I do not swerve from your testimonies.
- I look at the faithless with disgust, because they do not keep your commands.
- Consider how I love your precepts! Give me life according to your steadfast love.
- The sum of your word is truth, and every one of your righteous rules endures forever.
- Princes persecute me without cause, but my heart stands in awe of your words.
- I rejoice at your word like one who finds great spoil.
- I hate and abhor falsehood, but I love your law.
- Seven times a day I praise you for your righteous rules.
- Great peace have those who love your law; nothing can make them stumble.
- I hope for your salvation, O LORD, and I do your commandments.
- My soul keeps your testimonies; I love them exceedingly.
- I keep your precepts and testimonies, for all my ways are before you.
- Let my cry come before you, O LORD; give me understanding according to your word!
- Let my plea come before you; deliver me according to your word.
- My lips will pour forth praise, for you teach me your statutes.
- My tongue will sing of your word, for all your commandments are right.
- Let your hand be ready to help me, for I have chosen your precepts.
- I long for your salvation, O LORD, and your law is my delight.
- Let my soul live and praise you, and let your rules help me.
- I have gone astray like a lost sheep; seek your servant, for I do not forget your commandments.
- क्या ही धन्य हैं वे जो चाल के खरे हैं, और यहोवा की व्यवस्था पर चलते हैं!
- क्या ही धन्य हैं वे जो उसकी चितौनियों को मानते हैं, और पूर्ण मन से उसके पास आते हैं!
- फिर वे कुटिलता का काम नहीं करते, वे उसके मार्गों में चलते हैं।
- तू ने अपने उपदेश इसलिये दिए हैं, कि वे यत्न से माने जाएं।
- भला होता कि तेरी विधियों के मानने के लिये मेरी चालचलन दृढ़ हो जाए!
- तब मैं तेरी सब आज्ञाओं की ओर चित्त लगाए रहूंगा, और मेरी आशा न टूटेगी।
- जब मैं तेरे धर्ममय नियमों को सीखूंगा, तब तेरा धन्यवाद सीधे मन से करूंगा।
- मैं तेरी विधियों को मानूंगा: मुझे पूरी रीति से न तज!
- जवान अपनी चाल को किस उपाय से शुद्ध रखे? तेरे वचन के अनुसार सावधान रहने से।
- मैं पूरे मन से तेरी खोज मे लगा हूं; मुझे तेरी आज्ञाओं की बाट से भटकने न दे!
- मैं ने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है, कि तेरे विरूद्ध पाप न करूं।
- हे यहोवा, तू धन्य है; मुझे अपनी विधियां सिखा!
- तेरे सब कहे हुए नियमों का वर्णन, मैं ने अपने मुंह से किया है।
- मैं तेरी चितौनियों के मार्ग से, मानों सब प्रकार के धन से हर्षित हुआ हूं।
- मैं तेरे उपदेशों पर ध्यान करूंगा, और तेरे मार्गों की ओर दृष्टि रखूंगा।
- मैं तेरी विधियों से सुख पाऊंगा; और तेरे वचन को न भूलूंगा।।
- अपने दास का उपकार कर, कि मैं जीवित रहूं, और तेरे वचन पर चलता रहूं।
- मेरी आंखें खोल दे, कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं।
- मैं तो पृथ्वी पर परदेशी हूं; अपनी आज्ञाओं को मुझ से छिपाए न रख!
- मेरा मन तेरे नियमों की अभिलाषा के कारण हर समय खेदित रहता है।
- तू ने अभिमानियों को, जो शापित हैं, घुड़का है, वे तेरी आज्ञाओं की बाट से भटके हुए हैं।
- मेरी नामधराई और अपमान दूर कर, क्योंकि मैं तेरी चितौनियों को पकड़े हूं।
- हाकिम भी बैठे हुए आपास में मेरे विरूद्ध बातें करते थे, परन्तु तेरा दास तेरी विधियों पर ध्यान करता रहा।
- तेरी चितौनियां मेरा सुखमूल और मेरे मन्त्री हैं।।
- मैं धूल में पड़ा हूं; तू अपने वचन के अनुसार मुझ को जिला!
- मैं ने अपनी चालचलन का तुझ से वर्णन किया है और तू ने मेरी बात मान ली है; तू मुझ को अपनी विधियां सिखा!
- अपने उपदेशों का मार्ग मुझे बता, तब मैं तेरे आश्यर्चकर्मों पर ध्यान करूंगा।
- मेरा जीवन उदासी के मारे गल चला है; तू अपने वचन के अनुसार मुझे सम्भल!
- मुझ को झूठ के मार्ग से दूर कर; और करूणा करके अपनी व्यवस्था मुझे दे।
- मैं ने सच्चाई का मार्ग चुन लिया है, तेरे नियमों की ओर मैं चित्त लगाए रहता हूं।
- मैं तेरी चितौनियों में लवलीन हूं, हे यहोवा, मेरी आशा न तोड़!
- जब तू मेरा हियाव बढ़ाएगा, तब मैं तेरी आज्ञाओ के मार्ग में दौडूंगा।।
- हे यहोवा, मुझे अपनी विधियों का मार्ग दिखा दे; तब मैं उसे अन्त तक पकड़े रहूंगा।
- मुझे समझ दे, तब मैं तेरी व्यवस्था को पकड़े रहूंगा और पूर्ण मन से उस पर चलूंगा।
- अपनी आज्ञाओं के पथ में मुझ को चला, क्योंकि मैं उसी से प्रसन्न हूं।
- मेरे मन को लोभ की ओर नहीं, अपनी चितौनियों ही की ओर फेर दे।
- मेरी आंखों को व्यर्थ वस्तुओं की ओर से फेर दे; तू अपने मार्ग में मुझे जिला।
- तेरा वचन जो तेरे भय माननेवालों के लिये है, उसको अपने दास के निमित्त भी पूरा कर।
- जिस नामधराई से मैं डरता हूं, उसे दूर कर; क्योंकि तेरे नियम उत्तम हैं।
- देख, मैं तेरे उपदेशों का अभिलाषी हूं; अपने धर्म के कारण मुझ को जिला।
- हे यहोवा, तेरी करूणा और तेरा किया हुआ उद्धार, तेरे वचन के अनुसार, मुझ को भी मिले;
- तब मैं अपनी नामधराई करनेवालों को कुछ उत्तर दे सकूंगा, क्योंकि मेरा भरोसा, तेरे वचन पर है।
- मुझे अपने सत्य वचन कहने से न रोक क्योंकि मेरी आशा तेरे नियमों पर है।
- तब मैं तेरी व्यवस्था पर लगातार, सदा सर्वदा चलता रहूंगा;
- और मैं चोड़े स्थान में चला फिरा करूंगा, क्योंकि मैं ने तेरे उपदेशों की सुधि रखी है।
- और मैं तेरी चितौनियों की चर्चा राजाओं के साम्हने भी करूंगा, और संकोच न करूंगा;
- क्योंकि मैं तेरी आज्ञाओं के कारण सुखी हूं, और मैं उन से प्रीति रखता हूं।
- मैं तेरी आज्ञाओं की ओर जिन में मैं प्रीति रखता हूं, हाथ फैलाऊंगा और तेरी विधियों पर ध्यान करूंगा।।
- जो वचन तू ने अपने दास को दिया है, उसे स्मरण कर, क्योंकि तू ने मुझे आशा दी है।
- मेरे दु:ख में मुझे शान्ति उसी से हुई है, क्योंकि तेरे वचन के द्वारा मैं ने जीवन पाया है।
- अभिमानियों ने मुझे अत्यन्त ठट्ठे में उड़ाया है, तौभी मैं तेरी व्यवस्था से नहीं हटा।
- हे यहोवा, मैं ने तेरे प्राचीन नियमों को स्मरण करके शान्ति पाई है।
- जो दुष्ट तेरी व्यवस्था को छोड़े हुए हैं, उनके कारण मैं सन्ताप से जलता हूं।
- जहां मैं परदेशी होकर रहता हूं, वहां तेरी विधियां, मेरे गीत गाने का विषय बनी हैं।
- हे यहोवा, मैं ने रात को तेरा नाम स्मरण किया और तेरी व्यवस्था पर चला हूं।
- यह मुझ से इस कारण हुआ, कि मैं तेरे उपदेशों को पकड़े हुए था।।
- यहोवा मेरा भाग है; मैं ने तेरे वचनों के अनुसार चलने का निश्चय किया है।
- मैं ने पूरे मन से तुझे मनाया है; इसलिये अपने वचन के अनुसार मुझ पर अनुग्रह कर।
- मैं ने अपनी चालचलन को सोचा, और तेरी चितौनियों का मार्ग लिया।
- मैं ने तेरी आज्ञाओं के मानने में विलम्ब नहीं, फुर्ती की है।
- मैं दुष्टों की रस्सियों से बन्ध गया हूं, तौभी मैं तेरी व्यवस्था को नहीं भूला।
- तेरे धर्ममय नियमों के कारण मैं आधी रात को तेरा धन्यवाद करने को उठूंगा।
- जितने तेरा भय मानते और तेरे उपदेशों पर चलते हैं, उनका मैं संगी हूं।
- हे यहोवा, तेरी करूणा पृथ्वी में भरी हुई है; तू मुझे अपनी विधियां सिखा!
- हे यहोवा, तू ने अपने वचन के अनुसार अपने दास के संग भलाई की है।
- मुझे भली विवेक- शक्ति और ज्ञान दे, क्योंकि मैं ने तेरी आज्ञाओं का विश्वास किया है।
- उस से पहिले कि मैं दु:खित हुआ, मैं भटकता था; परन्तु अब मैं तेरे वचन को मानता हूं।
- तू भला है, और भला करता भी है; मुझे अपनी विधियां सिखा।
- अभिमानियों ने तो मेरे विरूद्ध झूठ बात गढ़ी है, परन्तु मैं तेरे उपदेशों को पूरे मन से पकड़े रहूंगा।
- उनका मन मोटा हो गया है, परन्तु मैं तेरी व्यवस्था के कारण सुखी हूं।
- मुझे जो दु:ख हुआ वह मेरे लिये भला ही हुआ है, जिस से मैं तेरी विधियों को सीख सकूं।
- तेरी दी हुई व्यवस्था मेरे लिये हजारों रूपयों और मुहरों से भी उत्तम है।।
- तेरे हाथों से मैं बनाया और रचा गया हूं; मुझे समझ दे कि मैं तेरी आज्ञाओं को सीखूं।
- तेरे डरवैये मुझे देखकर आनन्दित होंगे, क्योंकि मैं ने तेरे वचन पर आशा लगाई है।
- हे यहोवा, मैं जान गया कि तेरे नियम धर्ममय हैं, और तू ने अपने सच्चाई के अनुसार मुझे दु:ख दिया है।
- मुझे अपनी करूणा से शान्ति दे, क्योंकि तू ने अपने दास को ऐसा ही वचन दिया है।
- तेरी दया मुझ पर हो, तब मैं जीवित रहूंगा; क्योंकि मैं तेरी व्यवस्था से सुखी हूं।
- अभिमानियों की आशा टूटे, क्योंकि उन्हों ने मुझे झूठ के द्वारा गिरा दिया है; परन्तु मैं तेरे उपदेशों पर ध्यान करूंगा।
- जो तेरा भय मानते हैं, वह मेरी ओर फिरें, तब वे तेरी चितौनियों को समझ लेंगे।
- मेरा मन तेरी विधियों के मानने में सिद्ध हो, ऐसा न हो कि मुझे लज्जित होना पड़े।।
- मेरा प्राण तेरे उद्धार के लिये बैचेन है; परन्तु मुझे तेरे वचन पर आशा रहती है।
- मेरी आंखें तेरे वचन के पूरे होने की बाट जोहते जोहते रह गईं है; और मैं कहता हूं कि तू मुझे कब शान्ति देगा?
- क्योंकि मैं धूएं में की कुप्पी के समान हो गया हूं, तौभी तेरी विधियों को नहीं भूला।
- तेरे दास के कितने दिन रह गए हैं? तू मेरे पीछे पड़े हुओं को दण्ड कब देगा?
- अभिमानी जो तरी व्यवस्था के अनुसार नहीं चलते, उन्हों ने मेरे लिये गड़हे खोदे हैं।
- तेरी सब आज्ञाएं विश्वासयोग्य हैं; वे लोग झूठ बोलते हुए मेरे पीछे पड़े हैं; तू मेरी सहायता कर!
- वे मुझ को पृथ्वी पर से मिटा डालने ही पर थे, परन्तु मैं ने तेरे उपदेशों को नहीं छोड़ा।
- अपनी करूणा के अनुसार मुझ को जिला, तब मैं तेरी दी हुई चितौनी को मानूंगा।।
- हे यहोवा, तेरा वचन, आकाश में सदा तक स्थिर रहता है।
- तेरी सच्चाई पीढ़ी से पीढ़ी तक बनी रहती है; तू ने पृथ्वी को स्थिर किया, इसलिये वह बनी है।
- वे आज के दिन तक तेरे नियमों के अनुसार ठहरे हैं; क्योंकि सारी सृष्टि तेरे अधीन है।
- यदि मैं तेरी व्यवस्था से सुखी न होता, तो मैं दु:ख के समय नाश हो जाता।
- मैं तेरे उपदेशों को कभी न भूलूंगा; क्योंकि उन्हीं के द्वारा तू ने मुझे जिलाया है।
- मैं तेरा ही हूं, तू मेरा उद्धार कर; क्योंकि मैं तेरे उपदेशों की सुधि रखता हूं।
- दुष्ट मेरा नाश करने के लिये मेरी घात में लगे हैं; परन्तु मैं तेरी चितौनियों पर ध्यान करता हूं।
- जितनी बातें पूरी जान पड़ती हैं, उन सब को तो मैं ने अधूरी पाया है, परन्तु तेरी आज्ञा का विस्तार बड़ा है।।
- अहा! मैं तेरी व्यवस्था में कैसी प्रीति रखता हूं! दिन भर मेरा ध्यान उसी पर लगा रहता है।
- तू अपनी आज्ञाओं के द्वारा मुझे अपने शत्रुओं से अधिक बुद्धिमान करता है, क्योंकि वे सदा मेरे मन में रहती हैं।
- मैं अपने सब शिक्षकों से भी अधिक समझ रखता हूं, क्योंकि मेरा ध्यान तेरी चितौनियों पर लगा है।
- मैं पुरनियों से भी समझदार हूं, क्योंकि मैं तेरे उपदेशों को पकड़े हुए हूं।
- मैं ने अपने पांवों को हर एक बुरे रास्ते से रोक रखा है, जिस से मैं तेरे वचन के अनुसार चलूं।
- मैं तेरे नियमों से नहीं हटा, क्योंकि तू ही ने मुझे शिक्षा दी है।
- तेरे वचन मुझ को कैसे मीठे लगते हैं, वे मेरे मुंह में मधु से भी मीठे हैं!
- तेरे उपदेशों के कारण मैं समझदार हो जाता हूं, इसलिये मैं सब मिथ्या मार्गों से बैर रखता हूं।।
- तेरा वचन मेरे पांव के लिये दीपक, और मेरे मार्ग के लिये उजियाला है।
- मैं ने शपथ खाई, और ठाना भी है कि मैं तेरे धर्मपय नियमों के अनुसार चलूंगा।
- मैं अत्यन्त दु:ख में पड़ा हूं; हे यहोवा, अपने वचन के अनुसार मुझे जिला।
- हे यहोवा, मेरे वचनों को स्वेच्छाबलि जानकर ग्रहण कर, और अपने नियमों को मुझे सिखा।
- मेरा प्राण निरन्तर मेरी हथेली पर रहता है, तौभी मैं तेरी व्यवस्था को भूल नहीं गया।
- दुष्टों ने मेरे लिये फन्दा लगाया है, परन्तु मैं तेरे उपदेशों के मार्ग से नहीं भटका।
- मैं ने तेरी चितौनियों को सदा के लिये अपना निज भाग कर लिया है, क्योंकि वे मेरे हृदय के हर्ष का कारण है।
- मैं ने अपने मन को इस बात पर लगाया है, कि अन्त तक तेरी विधियों पर सदा चलता रहूं।
- मैं दुचित्तों से तो बैर रखता हूं, परन्तु तेरी व्यवस्था से प्रीति रखता हूं।
- तू मेरी आड़ और ढ़ाल है; मेरी आशा तेरे वचन पर है।
- हे कुकर्मियों, मुझ से दूर हो जाओ, कि मैं अपने परमेश्वर की आज्ञाओं को पकड़े रहूं।
- हे यहोवा, अपने वचन के अनुसार मुझे सम्भाल, कि मैं जीवित रहूं, और मेरी आशा को न तोड़!
- मुझे थांभ रख, तब मैं बचा रहूंगा, और निरन्तर तेरी विधियों की ओर चित्त लगाए रहूंगा!
- जितने तेरी विधियों के मार्ग से भटक जाते हैं, उन सब को तू तुच्छ जानता है, क्योंकि उनकी चतुराई झूठ है।
- तू ने पृथ्वी के सब दुष्टों को धातु के मैल के समान दूर किया है; इस कारण मैं तेरी चितौनियों में प्रीति रखता हूं।
- तेरे भय से मेरा शरीर कांप उठता है, और मैं तेरे नियमों से डरता हूं।।
- मैं ने तो न्याय और धर्म का काम किया है; तू मुझे अन्धेर करनेवालों के हाथ में न छोड़।
- अपने दास की भलाई के लिये जामिन हो, ताकि अभिमानी मुझ पर अन्धेर न करने पांए।
- मेरी आंखें तुझ से उद्धार पाने, और तेरे धर्ममय वचन के पूरे होने की बाट जोहते जोहते रह गई हैं।
- अपने दास के संग अपनी करूणा के अनुसार बर्ताव कर, और अपनी विधियां मुझे सिखा।
- मैं तेरा दास हूं, तू मुझे समझ दे कि मैं तेरी चितौनियों को समझूं।
- वह समय आया है, कि यहोवा काम करे, क्योंकि लोगों ने तेरी व्यवस्था को तोड़ दिया है।
- इस कारण मैं तेरी आज्ञाओं को सोने से वरन कुन्दन से भी अधिक प्रिय मानता हूं।
- इसी कारण मैं तेरे सब उपदेशों को सब विषयों में ठीक जानता हूं; और सब मिथ्या मार्गों से बैर रखता हूं।।
- तेरी चितौनियां अनूप हैं, इस कारण मैं उन्हें अपने जी से पकड़े हुए हूं।
- तेरी बातों के खुलने से प्राकाश होता है; उस से भोले लोग समझ प्राप्त करते हैं।
- मैं मुंह खोलकर हांफने लगा, क्योंकि मैं तेरी आज्ञाओं का प्यासा था।
- जैसी तेरी रीति अपने नाम की प्रीति रखनेवालों से है, वैसे ही मेरी ओर भी फिरकर मुझ पर अनुग्रह कर।
- मेरे पैरों को अपने वचन के मार्ग पर स्थिर कर, और किसी अनर्थ बात को मुझ पर प्रभुता न करने दे।
- मुझे मनुष्यों के अन्धेर से छुड़ा ले, तब मैं तेरे उपदेशों को मानूंगा।
- अपने दास पर अपने मुख का प्रकाश चमका दे, और अपनी विधियां मुझे सिखा।
- मेरी आंखों से जल की धारा बहती रहती है, क्योंकि लोग तेरी व्यवस्था को नहीं मानते।।
- हे यहोवा तू धर्मी है, और तेरे नियम सीधे हैं।
- तू ने अपनी चितौनियों को धर्म और पूरी सत्यता से कहा है।
- मैं तेरी धुन में भस्म हो रहा हूं, क्योंकि मेरे सतानेवाले तेरे वचनों को भूल गए हैं।
- तेरा वचन पूरी रीति से ताया हुआ है, इसलिये तेरा दास उस में प्रीति रखता है।
- मैं छोटा और तुच्छ हूं, तौभी मैं तेरे उपदेशों को नही भूलता।
- तेरा धर्म सदा का धर्म है, और तेरी व्यवस्था सत्य है।
- मैं संकट और सकेती में फंसा हूं, परन्तु मैं तेरी आज्ञाओं से सुखी हूं।
- तेरी चितौनियां सदा धर्ममय हैं; तू मुझ को समझ दे कि मैं जीवित रहूं।।
- मैं ने सारे मन से प्रार्थना की है, हे यहोवा मेरी सुन लेना! मैं तेरी विधियों को पकड़े रहूंगा।
- मैं ने तुझ से प्रार्थना की है, तू मेरा उद्धार कर, और मैं तेरी चितौनियों को माना करूंगा।
- मैं ने पौ फटने से पहिले दोहाई दी; मेरी आशा तेरे वचनों पर थी।
- मेरी आंखें रात के एक एक पहर से पहिले खुल गईं, कि मैं तेरे वचन पर ध्यान करूं।
- अपनी करूणा के अनुसार मेरी सुन ले; हे यहोवा, अपनी रीति के अनुसार मुझे जीवित कर।
- जो दुष्टता में धुन लगाते हैं, वे निकट आ गए हैं; वे तेरी व्यवस्था से दूर हैं।
- हे यहोवा, तू निकट है, और तेरी सब आज्ञाएं सत्य हैं।
- बहुत काल से मैं तेरी चितौनियों को जानता हूं, कि तू ने उनकी नेव सदा के लिये डाली है।।
- मेरे दु:ख को देखकर मुझे छुड़ा ले, क्योंकि मैं तेरी व्यवस्था को भूल नहीं गया।
- मेरा मुक मा लड़, और मुझे छुड़ा ले; अपने वचन के अनुसार मुझ को जिला।
- दुष्टों को उद्धार मिलना कठिन है, क्योंकि वे तेरी विधियों की सुधि नहीं रखते।
- हे यहोवा, तेरी दया तो बड़ी है; इसलिये अपने नियमों के अनुसार मुझे जिला।
- मेरा पीछा करनेवाले और मेरे सतानेवाले बहुत हैं, परन्तु मैं तेरी चितौनियों से नहीं हटता।
- मैं विश्वासघातियों को देखकर उदास हुआ, क्योंकि वे तेरे वचन को नहीं मानते।
- देख, मैं तेरे नियमों से कैसी प्रीति रखता हूं! हे यहोवा, अपनी करूणा के अनुसार मुझ को जिला।
- तेरा सारा वचन सत्य ही है; और तेरा एक एक धर्ममय नियम सदा काल तक अटल है।।
- हाकिम व्यर्थ मेरे पीछे पड़े हैं, परन्तु मेरा हृदय तेरे वचनों का भय मानता है।
- जैसे कोई बड़ी लूट पाकर हर्षित होता है, वैसे ही मैं तेरे वचन के कारण हर्षित हूं।
- झूठ से तो मैं बैर और घृणा रखता हूं, परन्तु तेरी व्यवस्था से प्रीति रखता हूं।
- तेरे धर्ममय नियमों के कारण मैं प्रतिदिन सात बेर तेरी स्तुति करता हूं।
- तेरी व्यवस्था से प्रीति रखनेवालों को बड़ी शान्ति होती है; और उनको कुछ ठोकर नहीं लगती।
- हे यहोवा, मैं तुझ से उद्धार पाने की आशा रखता हूं; और तेरी आज्ञाओं पर चलता आया हूं।
- मैं तेरी चितौनियों को जी से मानता हूं, और उन से बहुत प्रीति रखता आया हूं।
- मैं तेरे उपदेशों और चितौनियों को मानता आया हूं, क्योंकि मेरी सारी चालचलन तेरे सम्मुख प्रगट है।।
- हे यहोवा, मेरी दोहाई तुझ तक पहुंचे; तू अपने वचन के अनुसार मुझे समझ दे!
- मेरा गिड़गिड़ाना तुझ तक पहुंचे; तू अपने वचन के अनुसार मुझे छुड़ा ले।
- मेरे मुंह से स्तुति निकला करे, क्योंकि तू मुझे अपनी विधियां सिखाता है।
- मैं तेरे वचन का गीत गाऊंगा, क्योंकि तेरी सब आज्ञाएं धर्ममय हैं।
- तेरा हाथ मेरी सहायता करने को तैयार रहता है, क्योंकि मैं ने तेरे उपदेशों को अपनाया है।
- हे यहोवा, मैं तुझ से उद्धार पाने की अभिलाषा करता हूं, मैं तेरी व्यवस्था से सुखी हूं।
- मुझे जिला, और मैं तेरी स्तुति करूंगा, तेरे नियमों से मेरी सहायता हो।
- मैं खोई हुई भेड़ की नाईं भटका हूं; तू अपने दास को ढूंढ़ ले, क्योंकि मैं तेरी आज्ञाओं को भूल नहीं गया।।