1. బైబిలు తరగతి పాఠము
(బైబిలులోని 66 పుస్తకములలోనున్న అంశములు)
పాతనిబంధన
-
ఇప్పుడు లోకములో నున్నటువంటి మంచివి అన్నియు దేవుడు మొదట ఎట్లు చేసినాడో అది ఆదికాండములో నున్నది.
-
దేవుని ప్రజలు
బానిసత్వమును విడిపించుకొని ఎట్లు బయటికివచ్చినారో అది నిర్గమ కాండములోనున్నది.
-
దేవుని ప్రజలు అరణ్యములో ఎట్లు దైవారాధన
చేసిరో అది లేవీయ కాండములో నున్నది.
-
ఆరాధన శాలలో దేవుడు బోధించిన బోధ దేవుని ప్రజలు ఎట్లు వాడుకలో పెట్టిరో అదియును, ఎట్లు
సేవచేసిరో అదియును, ఎట్లు తమ జనాంగమును లెక్కపెట్టినారో అదియును సంఖ్యాకాండములో నున్నది.
-
ఇదివరకు బోధించిన బోధలు దేవుడు
మోషేద్వార ప్రజలకెట్లు జ్ఞాపకము తెచ్చెనో అది ద్వితియోపదేశ కాండములో నున్నది.
-
దేవుడు తన జనమునకు యెహోషువాద్వార పాలెస్తీనా
దేశమును ఎట్లు పంచిపెట్టెనో అది యెహోషువ గ్రంథములో నున్నది.
-
తన ప్రజలు ఎన్నో పర్యాయములు పాపములో పడిపోగా దేవుడు వారిని
శిక్షించుచు, ఎట్లు న్యాయాధిపతులద్వారా రక్షించెనో అది న్యాయాధిపతుల గ్రంథములో నున్నది.
-
ఏ అన్యురాలియొక్క
వంశములో యేసుప్రభువు జన్మించవలెనో ఆ అన్యురాలైన రూతు అనే భక్తురాలి చరిత్ర రూతు గ్రంథములో నున్నది.
-
దేవుని ప్రజల రాజ్యము ఎట్లు స్థాపింపబడినదో అది మొదటి సమూయేలు గ్రంథములో నున్నది.
-
ఆ రాజ్యములో కొంత పని ఎట్లు జరిగెనో అది రెండవ సమూయేలు గ్రంథములో నున్నది.
-
ఆ రాజ్యము ఎట్లు స్థిరపడెనో అది మొదటి రాజుల గ్రంథములో నున్నది.
-
ఆ రాజ్యము ఎట్లు మహోన్నత స్థితిలోనికి వచ్చెనో అది రెండవ రాజుల గ్రంథములో నున్నది.
-
ఆ రాజ్యముయొక్క చరిత్ర అదివరకున్న చరిత్రకంటె వేరుగా యెహోవా రాజైయున్నాడనునదియును మొదటి దినవృత్తాంత గ్రంథములో
నున్నది.
-
ఆ రాజ్యము ఎట్లు కొనసాగెనో అదికూడ వేరే రీతిగా రెండవ దినవృత్తాంత గ్రంథములో నున్నది.
-
చెరలోనుండి తిరిగివచ్చిన వారికి ఎజ్రా ఎట్లు దైవబోధ వినిపించెనో అది ఎజ్రా గ్రంథములో నున్నది.
-
పడిపోయిన దేవాలయము నెహెమ్యా ఎట్లు కట్టించెనో అది నెహెమ్యా గ్రంథములో నున్నది.
-
దేవుడు తన ప్రజలను నరహత్యనుంచి ఎట్లు తప్పించెననో అది ఎస్తేరు గ్రంథములో నున్నది.
-
మానవుడు శ్రమలు అనుభవిస్తేనేగాని దైవభక్తి వెల్లడిలోకి రాదు అని యోబు గ్రంథములో నున్నది.
-
అన్ని విషయములలో నిత్యము దేవునిని ఎట్లు స్తుతించవలెనో అది కీర్తనల గ్రంథములో నున్నది.
-
జ్ఞానము ఎట్లు సంపాదించుకొనవలెనో అది సామెతల గ్రంథములో నున్నది.
-
లోకములో ఉండే సమస్త సుఖములు వ్యర్థమేగాని ఒక్క దైవభక్తిమాత్రమే మానవులకు ఉపయోగకరమని ప్రసంగిలో నున్నది.
-
సంఘమునకు దేవునికిని ఉన్న సహవాసమును గురించి పరమ గీతములో నున్నది.
-
క్రీస్తుప్రభువుయొక్క చరిత్ర యావత్తును ప్రవచన రూపముగా యెషయా గ్రంథములో నున్నది.
-
చెరలోకివెళ్ళిపోగా యెరూషలేములో మిగిలిపోయిన యూదులమధ్యను దైవ చిత్తమును, తీర్పును యిర్మియా వినిపించిన సంగతి
యిర్మియా
గ్రంథములో నున్నది.
-
శ్రమలోనుండి శ్రమను ఒకరు వివరించిన సంగతి విలాపవాక్యముల గ్రంథములో నున్నది.
-
చెరలోనున్న యూదులకు దేవుని చిత్తమును యెహెజ్కేలు బయలు పరచిన సంగతి యెహెజ్కేలు గ్రంథములోనున్నది.
-
రాబోవు కాలములో అంతి
క్రీస్తు పరిపాలన ఉండుననియు, మెస్సీయా లోకమంతటిని ఏలుననియు దానియేలు ప్రవచించిన ప్రవచనములు దానియేలు గ్రంథములో
నున్నవి.
-
దేవుని ప్రజలు బ్రష్టులైనందువల్ల దేవుడే స్వయముగా వారికొరకు వార్తపంపి నాయొద్దకు తిరిగి రావలెనని చెప్పినట్టు
హోషేయ
గ్రంథములో
నున్నది.
-
అంత్య దినములయందు దేవుడు తన ఆత్మను అందరిమీద కుమ్మరించునని యోవేలు గ్రంథములో నున్నది.
-
ఇతర జనాంగముల వారికిని దేవుని ప్రజలకును వారి వారి పాపస్థితినిబట్టి శిక్ష లభించుననియు, మార్పు పొందినవారు
చేర్చుకొనబడుదురనియు ఆమోసు గ్రంథములో నున్నది.
-
ఎదోము (ఏశావు) తన సహోదరునికి విరోధియైనందున శిక్ష కలుగుననియు, ఇతరులకు అపకారముచేసిన వారికి అపకారము కలుగుననియు
ఓబద్యా
గ్రంథములో నున్నది.
-
యూదులకు దేవుడు అయియున్న దేవుడు అన్యులకుకూడ దేవుడే గనుక వారికీ సంగతి చెప్పుము అని యోనా గ్రంథములో నున్నది.
-
దేవునివంటి క్షమాపణ కర్త మరియొకరు లేరు అని మీకా గ్రంథములో నున్నది.
-
దైవ ద్వేషకులకు గొప్ప హాని అనియు, పశ్చాత్తాపపడు వారికి ఆదరణ కలుగుననియు నహూము గ్రంథములోనున్నది.
-
దేవుడెందుకు లోకములో కీడు జరుగనిచ్చుచున్నాడో ఆ సంగతియును ఎన్ని కష్టాలున్నను దేవునియందు ఆనందించుట మానకూడదనియు
హబక్కూకు గ్రంథములో నున్నది.
-
దేవుడు ఎంత ప్రేమగలవాడైనప్పటికిని పాపమును పాపకార్యములను అనప్యాంచుకొను దేవుడనియు పాపముమానువారికి రక్షణ దయచేయుననియు
జెఫన్యా
గ్రంథములోనున్నది.
-
ఇప్పటి దేవాలయములకంటె భావికాలమందు మహా మహిమగల దేవాలయము లేచునని హగ్గయి గ్రంథములో నున్నది.
-
పూర్వికులు
పాపస్థితిలో ఉన్నందున వారికి హాని కలిగినది. మనకట్లు కలుగకుండు నిమిత్తమై జాగ్రత్తగానుందము అని జ్ఞాపకము తెచ్చిన సంగతి
జెకర్యా గ్రంథములో నున్నది.
-
మీ పాపములను గురించి పశ్చాత్తాపపడండి, యెహోవా తట్టు తిరుగండి అని మలాకీ గ్రంథములో నున్నది.
క్రొత్త నిబంధన
-
యేసుప్రభువు రాజై యున్నాడని మత్తయి సువార్తలో నున్నది.
-
యేసుప్రభువు సేవకుడైయున్నాడని మార్కు సువార్తలో
నున్నది.
-
యేసుప్రభువు అచ్చమనిషై యున్నాడనియు, మనిషికంటె ఎక్కువైన వ్యక్తి అనియు లూకా సువార్తలో నున్నది.
-
యేసుప్రభువు దేవుడని
యోహాను సువార్తలో నున్నది.
-
మేము యేసు ప్రభువును చూచిన సాక్షులమైయున్నామని శిష్యులు కనబరిచిన సాక్ష్యము అపోస్తలుల కార్యములలో
నున్నది.
-
నీతిమంతుడు విశ్వాసమువల్ల జీవించును క్రియలవల్లకాదు అని రోమా పత్రికలో నున్నది.
-
యేసు
ప్రభువైయున్నాడు అనియు, సంఘములో దిద్దుబాటు జరిగినదనియు మొదటి కొరింథి పత్రికలోనున్నది.
-
సంఘమునకు కావలసిన పరిచర్య జరుగవలెనని రెండవ కొరింథి పత్రికలోనున్నది.
-
క్రీస్తు ప్రభువు సంఘమునకు స్వేచ్చ అనుగ్రహించునని గలతీ పత్రికలో నున్నది.
-
సంఘము క్రీస్తుయొక్క శరీరము అని ఎఫెసీ పత్రికలోనున్నది.
-
క్రైస్తవుల ఐక్యత ఎన్నికష్టములున్నను విడిపోగూడదని ఫిలిప్పీ పత్రికలో నున్నది.
-
క్రీస్తుప్రభువు సంఘమునకు శిరసై యున్నాడని కొలస్సయులకు పత్రికలో నున్నది.
-
క్రీస్తుప్రభువు మేఘాసీనుడై తన సజీవుల సంఘము కొరకు వచ్చునని మొదటి థెస్సలోనికై పత్రికలోనున్నది.
-
క్రీస్తు ప్రభువు భూమిమీదికి తన వారితో వచ్చును. (హర్మగెద్దోను) అని రెండవ థెస్సలోనికై పత్రికలోనున్నది.
-
సంఘ పరిపాలన విషయములు మొదటి తిమోతి పత్రికలో నున్నవి.
-
శ్రమ కాలములో ప్రభువు యెడలగల అభిమానము పోగొట్టుకొనరాదని రెండవ తిమోతి పత్రికలో నున్నది.
-
సంఘమునకు క్రమమైన నడవడిక ఉండవలెను. అని తీతు పత్రికలో నున్నది.
-
పశ్చాత్తాపపడు వారిని క్షమించి చేర్చుకొనవలెనని ఫిలేమోను
పత్రికలో నున్నది.
-
యేసుప్రభువు అందరికన్న శ్రేష్టుడని హెబ్రీ పత్రికలోనున్నది.
-
విశ్వాసమున్న లాభమేమి? క్రియలు లేనప్పుడు అని యాకోబు పత్రికలోనున్నది.
-
ప్రభువు నిమిత్తము శ్రమలు పడుట మేలు అని మొదటి పేతురు పత్రికలోనున్నది.
-
భ్రష్టత్వ కాలమందును పవిత్రులమై యుండవలెనని రెండవ పేతురు పత్రికలోనున్నది.
-
దేవునితో సహవాసము కలిగియుండవలెనని మొదటి యోహాను పత్రికలోనున్నది.
-
సత్యమును అంగీకరించి దానికి విధేయులమై యుండవలెనని రెండవ యోహాను పత్రికలోనున్నది.
-
సంఘములో అతిధి సత్కారము కలిగియుండవలెనని మూడవ యోహాను పత్రికలో నున్నది.
-
తొట్రిల్లకుండా జాగ్రత్తగా నుండవలెను. రెండవ రాకకు ముందు లోకముయొక్క దుస్థితి ఎట్లుండునో ఆ సంగతి యూదా
పత్రికలోనున్నది.
-
తుదకు క్రీస్తుకును, ఆయన భక్తజన సంఘమునకు ఎట్లు కడవరి జయము కలుగునో ఆ సంగతియు, ఆటంకపరులకు అపజయమెట్లు కలుగునో ఆ
సంగతియు
ప్రకటన గ్రంథములో నున్నది.