గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

2. క్రీస్తుశక్తి



  1. యేసుక్రీస్తు ప్రభువు దేవుడుగా కనబడని ప్రత్యక్షత గలదా? యోహాను 20:28; రోమా 9:5.

  2. ఆయన అసలైన మానవుడుగా అగుపడని నరావతారము గలదా? హెబ్రీ. 2:16.

  3. ఆయన నివసింపలేని స్థలము గలదా? యోహాను 1:1.

  4. ఆయన తీర్చజాలని అక్కరగలదా? యోహాను 6:12.

  5. ఆయన ధర్మము చేయనేరని ధనధాన్యాదులు గలవా? మత్తయి 6:31-33.

  6. ఆయన నేర్పలేని విద్యగలదా? యాకోబు 1:5.

  7. ఆయన వినలేని ప్రార్ధన గలదా? లూకా 18:1-8.

  8. ఆయన అనుగ్రహింపలేని వరము గలదా? మత్తయి 10:1.

  9. ఆయన క్షమింపలేని పాపము గలదా? 1యోహాను 1:7.

  10. ఆయన నిర్మూలము చేయలేని పాపఫలితము గలదా? 1పేతురు 2:21-22; మార్కు 1:40-45.

  11. ఆయన విజయశక్తి ఇయ్యలేని పాపాకర్షణ గలదా? యోహాను 11:25-27.

  12. ఆయన వెళ్ళగొట్టలేని దయ్యముగలదా? మత్త 8:28-33.

  13. ఆయన రాకుండ చేయలేని మరణభీతి గలదా? మత్త. 8:23-27.

  14. ఆయన కలిగింపలేని పరిశుద్ధత గలదా? ఎఫెసీ. 5:27.

  15. ఆయన తొలగింపలేని కీడుగలదా? మార్కు 10:27.

  16. ఆయన కోరుకొనని నరుడు గలడా? యోహాను. 17:24-26.

  17. ఆయన వాడుకొనలేని వస్తువు గలదా?. 17:24-27.

  18. ఆయనకు తెలియని మానవ కష్టస్థితి గలదా? హెబ్రీ 4:15.

  19. ఆయన మనకు చేయలేని సహాయము గలదా? మార్కు 7:37.

  20. ఆయన మనలను నడిపింపలేని మోక్షము గలదా? యోహాను 14:3.

మీరు ఆయనను నమ్మినయెడల సమస్త విషయములలోను మీకు సర్వ సహాయకారిగా నుండును. మన విషయమై భూమిమీద వెలసి మానవుల ఉపయోగార్థమైన పనులు చేయుచు తనకు తానే మరణమునకు లోనై మన పాపపరిహారార్థమైన రక్తమును చిందించి బ్రతికివచ్చి నిత్య జీవరక్షకుడనిపించుకొని మోక్షలోకమునకు వెళ్ళి తన భక్తులను తీసికొని వెళ్ళుటకు త్వరలో రానైయున్న యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేయలేదు?


“నా నామమునుబట్టి మీరు నన్నేమి అడిగినను నేను చేతును” అని యేసుప్రభువు వాగ్ధానమిచ్చియున్నాడు. యోహాను 14:14


చదువరులారా! ఈ మాటలలోనుండి మీకు గొప్ప దీవెనలు కలుగునుగాక! ఆమేన్.