గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు
15. ప్రార్ధనకోర్కె నెరవేర్చుకొను పద్ధతి
- 1. నీవు ఎవరి మనసు నొప్పించినావో, ఎవరికి వ్యతిరేకముగా ప్రవర్తించినావో వారియొద్ద నీ తప్పులు ఒప్పుకొన్నావా?
- 2. నీ తలంపులలో ఏదైన పొరపాటు ఉన్నదా?
- 3. నీ మాటలలో ఏదైన పొరపాటు ఉన్నదా?
- 4. నీయొక్క క్రియలలో, చేష్టలలో, ప్రయత్నములలో, నడతలో ఏదైన పొరపాటు ఉన్నదా? అవన్నియు క్రీస్తుప్రభువుయొద్ద ఒప్పుకొనవలెను.
- 5. నాకు తెలిసిన పొరపాటు చేయకుండ ఉండుటకు ప్రయత్నింతును అని ప్రమాణము చేయవలెను.
- 6. నేను క్రీస్తుప్రభువును ఆశ్రయించిన తర్వాత ఏ దేవతను, ఏ రక్షకుని ఆశ్రయింపను.
- 7. క్రీస్తుప్రభువు దేవుడు, మనిషైయున్నాడు గనుక ఆయనే నాకు మోక్షము ఇవ్వగలడు, నా జబ్బులు బాగుచేయగలడు. ఆయనే నా చిక్కులు విడదీయగలడని నమ్ముచున్నాను?
- 8. భయము, దిగులు, అధైర్యము, విసుగుదల, అపనమ్మిక, ప్రభువు ఇంకా నా మొర ఆలకింపలేదు అనే ప్రశ్న నిరాశ, ప్రార్ధన నెరవేరలేదు అను దుఃఖము ఈ మొదలైనవన్ని దయ్యములవంటివి గనుక వీటిని నీ మనసులోనికి చేరనియ్యకుము.
- 9. వంటగదిలోనికి ఈగలను, దోమలను, పెంపుడు జంతువులను, కుక్కలను, పిల్లులను, దూడలను, పక్షిజాతిలోచేరిన కోళ్ళను, పిచ్చుకలను వీటిని ఎవరు లోపలికి రానివ్వరో వారే వంటపని బాగా తెలిసినవారు. అప్పుడు వంట పనులన్నియు బాగా జరుగును.
-
10. అలాగే ప్రార్ధన చేయువారు ఈగలవంటి పాడు తలంపులనుగాని, పెంపుడు కోళ్ళవంటి మంచి తలంపులనుగాని రానీయకూడదు.
అట్టివారి
ప్రార్ధనలు బాగా
ఉండును. నెరవేరును.
10. వంటపని ఇంకా బాగా తెలిసినవారు పాత్రలను, గృహమును, చేతులను, శరీరమును శుభ్రముగా నుంచుకొన్నయెడల వంటబాగుగా జరుగును. ఆలాగే ప్రార్ధనలోనికి వెళ్ళకముందు మనము ఉదరము బాగా శుభ్రము చేసికొన్నయెడల అప్పుడు ప్రార్ధన బాగా వచ్చును, నెరవేరును. - 11. జీవరాసులను దయతో చూచుచున్నారా? వాటికి సరిగా మేతపెట్టక, నీరుపెట్టక అనవసరముగా కొట్టుట తప్పు. అదికూడ మానివేసిన ప్రార్ధన నెరవేరును. యెరూషలేము దేవాలయములో యేసుప్రభువు బుద్ధిలేని మనుష్యులను తన బెదిరింపు మాటతో వెళ్ళగొట్టెను గాని, పశువులను కొరడాలతో కొట్టెనుగాని, పక్షులను తోలివేసెను. ఆయన ఏ మనుష్యుని కొట్టలేదు.
“అందుచేతను ప్రార్ధన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను” (మార్కు 11:24).
షరా: ఈ ప్రకారముగా చేసినయెడల మా కోరికలన్నియు నెరవేరును.
ఆయన ఎవనిని గద్ధించక అందరికిని ధారాళముగా దయచేయువాడు (యాకోబు 1:5) గనుక ఆయన మీ పరిపూర్ణ విశ్వాస ప్రార్ధనా కోర్కెలను నెరవేర్చునుగాక! ఆమేన్.