గ్రంథకర్త: ఫాదర్. ముంగమూరి దేవదాసు

18. సంస్కార ప్రసంగము



లూకా 22:14-23; కీర్త. 23:5; 1కొరిం. 11:23-31


“లుబెక్” అనునది ఒకపేరు. చాలామందికి తెలిసేయుండును. ముఖ్యముగా బడిలో చదివినవారికి తెలిసేయుండును. ఇది జర్మనీ దేశములో ఉన్న ఒక పట్టణము. ఒకసారి వారు తమ ప్రాంతములోని భూమిని త్రవ్వుచుండగా పెద్దరాయి దొరికినది. దానిపై అక్షరములుగల వాక్యాలు చెక్కబడి ఉన్నవి. అవేవనగా యేసుప్రభువు ప్రజలకు చెప్పిన మాట ఆయన బోధ ఆయనను గురించి ఇదివరకు ఎవరికి వినబడి ఉన్నదో వారికే ఆ మాటలు చెందియున్నవి. అది విన్న వారిలో విశ్వాసులు + అవిశ్వాసులు ఉండవచ్చునుగాని, ఆ రాతిమీద మాటలు మిక్కిలి బలహీనముగా ఉన్నవారికే.


1. యేసుప్రభువు విశ్వాసులందరికి చెప్పునదేమనగా:- ఆ మాటలు నాలుగు సువార్తలకు చెందినవి. అక్కడక్కడున్న సంగతులు ఎత్తి సూచాయిగా వ్రాసిన మాటలు. ఇదొక చిన్న ప్రసంగముగా పొందుపర్చి ఎవరో ఆ రాతిమీద చెక్కివేసెను. వారు భూమిలోనుండి త్రవ్విన రాయి కడిగి


చదువగా:-

కాబట్టి ప్రియులారా! మీరు నాకు మంచిమంచి బిరుదులు పెట్టి పిలుస్తున్నారేగాని ఆ ప్రకారము మీరు నడుచుటలేదు. అట్లు మీరు నడిచినంత మాత్రమున నాకు సంతోషములేదు. ఆ రాతిమీద వ్రాసిన మాటలలో నేను చెప్పినవి కొన్ని ఇదిగో మన అందరియెదుట బల్లయు, దానిపై రొట్టె ద్రాక్షారసమును ఉన్నది. అయితే మీరు వచ్చి ఈ రొట్టెను మీరు తీసికొన్నపుడు నేను చూస్తాను. అంతమాత్రమున నాకు సంతోషములేదు. దానితోపాటు నేనిచ్చు శరీరం పుచ్చుకొంటే నాకు సంతోషముగాని వట్టి రొట్టె తీసికొంటే నాకు సంతోషములేదు. అట్టివారు నేటి దినాలలో చాలామంది ఉన్నారు. ఆలాగే ద్రాక్షారసంతోపాటు నేనిచ్చు రక్తం తీసుకుంటేనే నాకు సంతోషమని చెప్పను. మీరు వచ్చి రొట్టె + ద్రాక్షారసము, శరీరము + రక్తం తీసికొంటే నాకు అపరిమిత సంతోషము కలుగును, కలుగుచున్నది. ఈ వేళ బల్లదగ్గరకు వచ్చువారు కనబడే ఈ రెండు, కనబడని ఆ రెండు, మొత్తము నాలుగు తీసికొనేటందుకే ప్రభువు ఏర్పాటు చేస్తున్నారు. రొట్టె, ద్రాక్షారసము తీసికొనవలెనంటే బజారులోనే అది తిని త్రాగవచ్చును.


నన్ను జ్ఞాపకము చేసికొనుటకు తిని త్రాగండని ప్రభువే చెప్పెను. అయితే రొట్టెను జ్ఞాపకము చేసికొనండనిగాని ద్రాక్షారసము శరీరము, రక్తము జ్ఞాపకము చేసికొనండనిగాని చెప్పలేదు. గాని నన్ను జ్ఞాపకము చేసికొనండని చెప్పెను. (లూకా 22:19) ఆ “నన్ను” అనుమాటలోనే శరీరం, రక్తము, రొట్టె, ద్రాక్షారసం ఉన్నది. ఆ నాల్గింటిలో మొత్తము ఆయనే ఉన్నారు. యేసుప్రభువును గూర్చి ఒకమాట వ్రాయబడెను. “నేను నా స్వకీయులయొద్దకురాగా వారంగీకరించలేదు” నన్ను అనుటలో సగంగాదు కాని, పూర్తిగానే నన్ను వెంబడించలేదని నన్ను వెంబడించండి అనగా సగంకాదు. పూర్తిగానే వెంబడించాలి. బైబిలులోని యెరూషలేము దేవాలయములో ప్రభువు కానుకపెట్టెవద్ద కూర్చుండగా సంఘదృష్టిలో చాలామంది వచ్చిరిగాని, ఆయన దృష్టిలో అనేకమంది సున్నా అయిపోయిరి. అనగా ఆయన దృష్టిలో కొద్దిమంది. ఒక విధవరాలు ముఖ్యురాలు, విధవరాలు వేసినది ముఖ్యకానుక. గొప్ప వారిచ్చినదికాదు. ఆలాగే బల్లయొద్దకు 50మంది రావచ్చును గాని అది పాదిరిగారి లెక్కగాని, ప్రభువు లెక్కలో అదికాదు. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆలాగు తీసికొంటారో వారే ఆయన లెక్కలోని వారు. ప్రభువు కాదు రమ్మని పిలుచుట. మనస్సు పూర్తిగా వచ్చువారినే రమ్మని పిలుచుచు రమ్మంటున్నారు. విధవరాలు 2 కాసులు స్వల్పమేగాని ప్రభువు దృష్టిలో ఆమె రెండు కాసులు గొప్పవి. లూబెక్ పట్టణంలో దొరికిన రాయి మీద వ్రాతలో ప్రభువు ఎట్టి ఆలాపన చూపినాడో అట్టి ఆలాపనతోనే ప్రభువు ఇక్కడ బల్లవద్ద నిలబడియున్నారు. ఆ నాలుగు పుచ్చుకొన్న వారితో అనేకమంది రారు. వారు పుచ్చుకోరు. వచ్చిన రానిలెక్కలోనివారే. ఎందుకంటే పరిసయ్యులు వచ్చి వందలువేసిన మంచి మనుష్యులుకారు గనుక వారురారు, వారు సంపూర్ణ కానుక వేయరు అన్నట్టే ఇక్కడ అర్ధము.


ఉదా:- రాజు విందు చేసెనని బైబిలులో ఉన్నది. రాజు విందుకు పిలువబడినవారు రాజు విందుచేసినారా? లేదు. పిలిచినవారు రానందున సేవకులను పంపి గొందులలోనివారిని పిలుచుకొని రమ్మనెను (మత్తయి 22:1-10) సంస్కారము తెలిసి రానివారికిని, వచ్చి సిద్ధపడని వారికిని ఈ ఆట నేను సిద్ధపర్చినాను గాని వారు రారని ప్రభువు చెప్పుచున్నారు. అదేలోకములో జరుగుచున్నది. విందులోనికి వస్తానన్నవారే రారు. ప్రభువు కూడా చెప్పేది ఈ మాటే. వారు రారు.


ఈ కొద్దిమాటలు దేవుడు దీవించి బల్లయొద్దకు రాగల స్ధితి మీకనుగ్రహించునుగాక! ఆమేన్.