ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రిస్మసు వర్తమానము
యెషయా 7:14;మత్తయి 2:1-12:గలతీ 4:1-7
ప్రార్ధన: ఓ దయగల తండ్రీ! సర్వలోకమును మమ్ములను కలుగజేసిన తండ్రీ! మేము గత సంవత్సరము క్రిష్ట్మసు ఆచరించిన సమయమునుండి నేటి క్రిష్ట్మసు వరకును మమ్మును కాపాడినావు గనుక నీకు వందనములు. సర్వలోకమునకు నీ పుత్రుని దానము చేసినావు. నీకనేక వందనములు. తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మునిగాను మాకు ప్రత్యక్షపర్చుకున్నందుకు నీకనేక స్తోత్రములు. మా ఉపయోగార్ధమై ఈలాగుచేసితివి గనుక అనేక స్తోత్రములు. మేము నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించుచున్నాము. మాకు నీ ఆత్మ సహాయము దయచేయుము. ఆమెన్.
ధ్యానవాక్యము: యోహాను 1:14వ వచనము.
ఈ పండుగ యుద్ధములలోను, నదులలోను, సముద్రములలోను, లంకలలోను, ఆకాశములోను జరుపుకొనుచున్నారు. ఎందుకనగా, సర్వమును సృజించిన ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించెను. శరీరధారి అగుటకు అవశ్యకతేమి?
ఆయనకు మనుష్యులతో మాట్లాడవలెనని యున్నది. మనుష్యులకు ఆయనతో మాట్లాడవలెనని యున్నది. గాన ఆయన మనిషిగా మారెను. వాక్యము అనగా మాట్లాడుట మాట్లాడవలసియున్నది గనుక ఆయనకు వాక్యము అను బిరుదు యున్నది. అనగా జీవించు వాక్యము (ప్రకటన 19:13).
ఆయనకు మనుష్యులతో మాట్లాడవలెనని యున్నది. మనుష్యులకు ఆయనతో మాట్లాడవలెనని యున్నది. గాన ఆయన మనిషిగా మారెను. వాక్యము అనగా మాట్లాడుట మాట్లాడవలసియున్నది గనుక ఆయనకు వాక్యము అను బిరుదు యున్నది. అనగా జీవించు వాక్యము (ప్రకటన 19:13).
నరులకు కనబడవలెను అను తలంపు, కోరిక ఆయనకుండెను. ఆ కోరికే దేవుడు మన కొరకు మానవరూపిగా వచ్చునట్లుగా చేసినది. ఆయనకు మనుష్యులతో కలిసి మెలసి యుండవలెను అని యున్నది. ఆయన సాతాను వల్ల వచ్చే పాపమును దానివల్ల వచ్చే నరకమును పరిహరించవలెను. అందువలన మన శరీరమును ధరించెను. ఏలాగున ఆ వాక్యము శరీరధారియాయెను అని అడుగకూడదు. మన కొరకే అలాగు మారెనని నమ్మవలెను.
ఉదాహరణ: అన్నము తినుట వలన తినిన ఆహారము రక్తముగా మారును. అది ఏలాగు మారునో మనకు తెలియదు గనుక అది నమ్మితే ఇదికూడ నమ్మవలసి యుండును. నీరు త్రాగినందువలన దప్పిక ఎలాగు తీరినది? ఆలాగే ఇదికూడ జరిగెను. మనిషి పాపముచేసినాడు గనుక ఆ పాపము తానే అనుభవించెను. దానివల్ల వచ్చే నష్టములను, మరణ నరకములను తానే అనుభవింపవలెను. ఎందుకంటే
ఉదా: అగ్ని ఎప్పుడు కాల్చేదే, నీరు ఎప్పుడు తడిపేదే (స్వభావసిద్ధముగా), అలాగే దేవుడు దేవుడుగా ఉండి భూమిమీదకు రాకూడదు. మరియు దేవునివలెనే ఉంటే ఆయన వాటిని అనుభవించినా, అనుభవించినట్టు కాదు. ఎందుకంటే ఆయనకు బాధయుండదు గనుక.
ఉదా: గాలిని బంధించలేము, కొట్టలేము.
ఆలాగే ఆయన దేవుడు గనుక చనిపోయి లేచినాడు, ఆయన మనిషిగా వచ్చినాడు గనుక చనిపోయి లేచినాడు. గనుక ఆయన మనకు మోక్షమియ్యగలడు.