ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మస్



ఇది పాలస్తీనాలోని బేత్లెహేము అను ఊరిలో జరిగిన వృత్తాంతము. ఇది జరిగి రెండు వేల సంవత్సరములైనది. క్రొత్తరీతిగా పొడిచిన ప్రత్యేక నక్షత్రమును చూచి ఆ జన్మవార్త గ్రహించినవారై తూర్పు దేశమునుండి కొందరు జ్ఞానులు వెళ్ళి యేసుక్రీస్తు అను ఆ లోకరక్షకుని దర్శించిరి. ఈ విధముగా దేవుని చూడవలెను. ఆయనలో ఉండవలెను. అను నరవాంఛకు సిద్ధి లభించెను. ఆ జ్ఞానులలో నొకరు మన హిందూ దేశము నుండి వెళ్ళిన ఒక ఋషియనియు ఆయన శిష్యులింకను ఉన్నారనియు క్రైస్తవోత్తముడగు సాధు సుందరసింగు గారు వ్రాసి యున్నారు. ఇది మనకు క్రొత్త.


ఇట్లు వారు, వీరు వెళ్ళి దైవావతారుని ఆరాధించిన కార్యమునకు క్రిష్ట్మస్ అని పేరు, దేవదూత యేసుజన్మ వర్తమానమును కాపరులకు చెప్పుచు ఇది ప్రజలందరికి కలుగబోవు సువర్తమానము అని ప్రవచించెను. నేడు ఈ వార్త సర్వజనాంగమునకు తెలిసినది. అన్ని దేశములలో ఈ పండుగ చేయుచున్నారు.


సర్వలోక ప్రజాసంఖ్య వ్రాయునప్పుడు నడచిన ఈ చరిత్ర సర్వలోక రక్షణ నిమిత్తము గనుక సర్వలోక చరిత్రలో ముఖ్య చరిత్రలకు మించిన ముఖ్య చరిత్రయై యున్నది.


ఈ జన్మకథ నమ్మువారికి ఆయనను గూర్చిన అనుభవము ప్రత్యక్ష మగును.


ప్రార్ధన:- దేవా! నీవు మా నిమిత్తమై నరుడవైనావు. వందనములు. నిన్ను ఆరాధించు స్వభావము మాకు దయచేయుము. ఆమెన్.