ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు

క్రిస్మస్, క్రిస్మస్, క్రిస్మస్



క్రిష్ట్మస్ పండుగ చేయువారికిని, అభిమానులకును “మహా సంతోషకరమైన సువర్తమానము” అను వచనమును క్రిష్ట్మస్ సందేశముగా గైకొనండి (లూకా 2:10).


ఆరోగ్యానందము, సంతానానందము, స్వజనానందము, సంపాధ్యానానందము, విధ్యానందము, నైసర్గిక సద్గుణానందము …..ఈ మొదలైన ఆనంద స్థితులు మానవులకు కలవు. ఈ సంతోషములు మంచివే, ఉండవలసినవే. నేటివర్తమానములో మహాసంతోషమని ఉన్నది. కనుక ఇది పైన ఉదహరించిన సంతోషములకు మించిన సంతోషము ఎందుచేత? దేవుడు మనకొరకు మనుష్యుడుగా మన భూమి మీద వెలసినాడు. అందుచేత ఈ చరిత్ర మహాసంతోషకరమైన మొదటి చరిత్ర. ఇది ఎంత గొప్ప సంతోషకరమైన సంతోషమో! దేవదూతకు తెలుసును గనుక మహా అనుమాట ఉపయోగించినాడు.

క్రిష్ట్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. గనుక ఆయనను ఆరాధించుట యందు దృష్టినుంచక, ఆచారములయందే దృష్టియుంచుట క్రిష్ట్మస్ కాదు. దేవదూతలు దేవుని మహిమపరచిరి. మనము అట్లు చేయని యెడల మన పండుగ పండుగ కాదు. నూతన సంవత్సరపు దీవెనలు, క్రిష్ట్మస్ పండుగ దీవెనలు చదువరులందరిమీద సూర్య కిరణములవలె పడును గాక! (కిరణములను ఎవరు తప్పించుకొనగలరు?)