ప్రసంగీకులు: ఫాదర్. ముంగమూరి దేవదాసు
క్రీస్తు జన్మోపదేశము
యెషయా 9:6; లూకా 2:11.
మనకు – మనకొరకు; మీకు – మీకొరకు
క్రీస్తుప్రభుని జన్మమును పండుగగా భావించుచున్న విశ్వాసులారా! మీకు రక్షకుని జన్మానంద భాగ్యము లభించునుగాక!
క్రైస్తవులకు క్రిష్ట్మసు పండుగ కాక, మరియొక మొదటి గొప్పపండుగ గలదా? దేవుడు మానవులకు పూర్తిగా బైలుపడిన వ్యక్తి క్రీస్తుప్రభువే. మన భూమిమీద మన నరజాతిలో క్రీస్తుప్రభువు పుట్టినాడు గనుక మన కొరకే అని ఎందరు అనగలరో ఆ అందరి కొరకే ఆయన. ఆయన జన్మమునకు పూర్వము కొన్ని వందలయేండ్ల క్రిందట ఈ వృత్తాంతము యెషయా అను ప్రవక్తకు దర్శనమందు కనబడెను. అందుచేతనే ఆప్రవక్త మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడు అనుగ్రహించబడెను” అని వ్రాయుచున్నాడు (యెషయా 9:6).
మనకు అనగా మనకొరకు మన ఉపయోగము నిమిత్తము, మనకు అని చెప్పుటలో యెషయా ఎవరికి చెప్పుచున్నాడో ఆ ప్రజలలో తన పేరుకూడ కలిపి మాటలాడుచున్నాడు. “మనకు” అను మాటలో ఆయన ఉన్నట్టు మనమును ఉన్న యెడల ఈ రక్షకుడు మనకే అని సంతోషముతో చెప్పగలము. మనకొరకు అనుమాట బహువచనము గనుక దానిలో విశ్వాసుల సంఘమున్నది. మనకొరకు శిశువు పుట్టెను శిశువు గనుక అందరును వెళ్ళి చూడవచ్చును., ముట్టుకొనవచ్చును, ఎత్తుకొనవచ్చును, ముద్దుపెట్టుకొనవచ్చును. శిశువును చూచినవారు ఎవరును భయపడరు. దేవుడు నిరాకారుడైన దేవుడు తన ప్రభావముతో భూమి మీదికి వచ్చిన యెడల ఎవరును చూడవెళ్ళరు, భయపడి పారిపోవుదురు. ఆ దేవుడే శిశువుగా వచ్చినందువలన గొర్రెల కాపరులును, తూర్పుదేశ జ్ఞానులును చూడవెళ్ళిరి. నిర్భయముగా సమీపించిరి. పూజించిరి. క్రీస్తువలన దేవుడు అందరికిని చనువైన దేవుడైనాడు. అందరును ఎంతధన్యులు! యేసుప్రభువును తల్లిదండ్రులు దేవాలయమునకు తీసికొని వెళ్ళినప్పుడు సుమెయోను అను ఒక వృద్ధుడు ఆ శిశువును చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించెను, మరియు ఆ గడియలోనే అన్న అను ప్రవక్తి లోపలికి వచ్చి శిశువును దర్శించెను. జన్మసమయము మొదలుకొని ఆరోహణ సమయము వరకు మనుష్యులు ఆయనను చూచుచునే యుండిరి.
- 1. శిశువు అనుమాట మహా విశాలమైన మాటయై యున్నది. ఎట్లనగా విశ్వాసులును, అవిశ్వాసులును అనగా లోక వాస్తవ్యులందరును చూచుటకు వీలుపడిన వ్యక్తి. శిశువు స్వకీయులైన యూదులు ఒక జనాంగముగా క్రీస్తును అంగీకరింపలేదు. లోకమునకు ఆయన వచ్చినను వారు ఆయనను తెలిసికొనలేదు. ప్రభువు వీధులలోను, మార్గములలోను, పండుగ స్థలములలోను, బహిరంగముగా కనబడినపుడు ప్రజలు ఆయనను చూచిరే గాని దేవుడనియు, లోకైక రక్షకుడనియు గ్రహింపలేదు (యోహాను సువార్త మొదటి అధ్యాయము).
- 2. “మనకు కుమారుడు అనుగ్రహింపబడెను”- ఈ మాట కేవలము విశ్వాసులకే అన్వయించును. దేవుని కుమారుని అంగీకరించు విశ్వాసులు ఆయన మూలముగా దేవునికి వారసులై యున్నారు. వారికి కుమార వారసత్వము కలుగును. వీరు ధన్యులు. శిశువును చూచినా కొందరు ధన్యులు కారు అయితే అంగీకరించిన వారందరును ధన్యులే ఎందుకనగా చూచిరి, తెలిసికొనిరి, అంగీకరించిరి. అనేకులు చూడలేకపోయినను తెలిసికొనిరి, నమ్మిరి, అంగీకరించిరి. వారు కూడ ధన్యులే. మరియొక సంగతి, మనుష్యుని కుమారుడు మనుష్యుడే గాని పక్షిగాడు. అలాగే దేవుని కుమారుడు దేవుడే. దేవుడే మనకు అనుగ్రహింపబడినాడు. ఆయన బలవంతుడైన దేవుడు అనియు, నిత్యుడైనతండ్రి అనియు చెప్పుచు యెషయా తన ప్రవచనమును కొనసాగించుచున్నాడు. శిశువు కుమారుడు దేవుడు తండ్రి అయియున్న క్రీస్తు మనకు క్రిస్ట్మసు కాలమందు దొరికినాడు. ఇది నమ్మిన యెడల మనము ఎంత సుఖజీవుల మగుదుము!
ఇంకొక సంగతి వినండి, క్రీస్తు జన్మించినాడు, దేవదూత కాపరులకు వినిపించిన వర్తమానములో ఈ మాటలున్నవి “దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11). చూచితిరా యెషయా ఎవరిని శిశువు అని ఉదహరించెనో ఆ శిశువును ఇక్కడ దేవదూత రక్షకుడనియు, ప్రభువైన క్రీస్తు అనియు చెప్పుచున్నాడు. తుదకు ఆ శిశువు క్రీస్తు అని ఇక్కడ తేలినది. ఈ క్రీస్తు ఎవరికొరకు పుట్టినాడని యెషయా చెప్పినాడో ఆ ప్రజలు కొందరు ఇక్కడ ఉన్నారు. వారు విశ్వాసులైన కాపరులు, అక్కడ మనకు అని ఉన్నది. ఇక్కడ మీకు అని వ్రాయబడి యున్నది. మీకు అనగా మీ కొరకు ఆయన పుట్టియున్నాడు. ఈ వాక్కు ఎవరు చదువుదురో, ఎవరు విందురో వారికే అన్వయించును. పిమ్మట ఎవరు నమ్ముదురో వారికి మరింత ఎక్కువగా అన్వయించును. దేవుడు ఎంత గొప్పవాడైనను మన దేవుడు కాని యెడల ప్రయోజనమేమి? మనము ఆయనను మనవానిగా స్వీకరించుకొన్నప్పుడు మనము యెషయాతోను ఆయన ఎవరికి చెప్పెనో వారితోను, ఈ కాపరులతోను, ప్రాగ్ధేశజ్ఞానులతోను, తదనంతరము వచ్చిన విశ్వాసులందరితోను సమాన భాగులమై యుందుము.
క్రీస్తుపుట్టుకకు ముందే పుట్టినాడని యెషయా వ్రాసెను. ఎందుకనగా క్రీస్తు ఆయనకు కనబడెను. మనమైన యెడల క్రీస్తు పుట్టనైయున్నాడు అని వ్రాసియుందుము. భావికాలము యెషయాకు వర్తమాన కాలముగా కనబడెను. దేవదూత ఏమన్నాడు? పుట్టి యున్నాడు అని యెషయా చెప్పినది కేవలము గత కాలార్ధమున భావికాల ప్రవచనము, దూత చెప్పునది కేవలము గత కాలార్ధమున ప్రస్తుత కాల వర్తమానకాలము యెషయా వ్రాసిన శిశువు అనుమాట దేవుని దూతకూడ వాడుచున్నాడు. దూత పలికిన మాటలన్నియు చేర్చిచదువగా ఒకచిన్న క్రిష్ట్మసు ఉపన్యాసమగును.
బోధకులు ఈ ప్రసంగమంతటిని వివరింపవలెను. దీనిలో చాలా ముఖ్యాంశములు గలవు. “భయపడకుడి….మీరు చూచెదరు” ఈ మాటలకు మధ్యనున్న దంతయు ఒక దివ్య ప్రసంగము ఎన్ని మాటలో లెక్కపెట్టి చూడండి, అవి ఎంత ముఖ్యములైన మాటలో! మీ కొరకు పుట్టియున్నాడను మాటలతో ముగింపక దేవదూత తన వర్తమానమును పొడిగించుచు దానికిదే మీకానవాలు; అని వివరము చెప్పెను. క్రీస్తుయొక్క ఈ మొదటి రాకడ ధ్యానసందర్భమున రెండవరాకడను గురించి కూడ మీరు ధ్యానింతురు గాక!
సీ|| మన నిమిత్తమే గదా – తనకు శిశువురూపు
మన నిమిత్తమే గదా – తనకు తల్లి
మన నిమిత్తమే గదా – తనకు దిగువచోటు
మన నిమిత్తమే గదా – తనకు పాక
మన నిమిత్తమే గదా = తనకు పేలిక బట్ట
మన నిమిత్తమే గదా – తనకు తొట్టి
మన నిమిత్తమే గదా – తనకు శత్రుజనము
మన నిమిత్తమే గదా – తనకు నింద
తే|| గీ||
మనకు రావలసిన కీడు = తనకు వచ్చె
మనము చేయు పనులవంతు – తనకు చేరె
మనకువచ్చు దుర్మరణము – తనకుమూగె
మనకు ఈ క్రీస్తు నెరిగించు – పనులు దొరికె
క్రిష్ట్మసు వచనములు
యోహాను 1అధ్యా.; ఎఫెసీ 1:4-12; ఫిలిప్పీ 2:4-7; ఆది 3: 15; ఆది 9:26; 12: 1-13; 49:9,10; సంఖ్యా 24: 16,17; ద్వితీ 18:16-22; కీర్తన 72: 16-18; యెషయా 7:14; మీకా 5:2; లూకా 1: 26-56; మత్తయి 1: 18-25; లూకా 2: 1-20; లూకా 2: 21-38; మత్తయి 2అధ్యా.; గలతీ 4:4,5; రోమా 1:2-9; హెబ్రీ 1:1-5.
మీ హృదయములకు క్రిష్త్మసు మహా సంతోషకరమైన వార్త అందును గాక అను శుభవచనముతో పాటు నూతన సంవత్సరానంద జీవితము వర్ధిల్లుగాక అను శుభవచనముతో పాటు నూతన సంవత్సరానంద జీవితము వర్ధిల్లుగాక అను శుభవచనముకూడ ప్రతిపాదించుచున్నాము.
A Christmas Message: For Us, A Savior is Born
This briefing document analyzes a Christmas sermon delivered by Fr. M. Devadasu, focusing on the central theme of Jesus Christ's birth as a gift "for us" and its significance for believers.
Key Themes:
Christ as a Gift: The core message emphasizes that Jesus' birth is a gift specifically for humanity. This is highlighted through the repeated phrase "for us," derived from Isaiah 9:6: "For to us a child is born, to us a son is given." This gift is accessible to all, symbolized by Christ's incarnation as a baby, approachable and devoid of fear.
Universality and Accessibility: The sermon stresses Christ's accessibility to both believers and non-believers. While some, like the Jewish nation at the time, may not have accepted him, his presence was open to all. This resonates with John 1, where despite appearing publicly, Christ's divinity wasn't universally recognized.
Inheritance for Believers: The phrase "Unto us a son is given" holds a deeper meaning for those who accept Christ as the Son of God. They become heirs of God, inheriting the son and receiving blessings. The act of recognizing and accepting Christ, even without physically seeing him, brings immense blessings.
The Power of Belief: The sermon underscores the transformative power of belief. Accepting Christ elevates believers to a level equal to biblical figures like Isaiah, the shepherds, and prophets. It connects individuals to a lineage of faith, making them part of a larger spiritual community.
Reflection on the Second Coming: The sermon encourages listeners to reflect not only on the first coming of Christ but also on his second coming. This expands the Christmas message beyond the immediate celebration and invites deeper contemplation on the future implications of Christ's birth.
Important Ideas and Facts:
Emphasis on Scripture: The sermon is deeply rooted in scripture, with direct quotes and references to Isaiah 9:6 and Luke 2:11. A list of Christmas-related verses is provided, encouraging further study and reflection.
Language and Tone: The language is simple yet powerful, directly addressing the audience and emphasizing emotional connection. The tone is celebratory and joyful, highlighting the good news of Christ's birth.
Cultural Context: The sermon includes a Telugu poem on Jesus' birth, demonstrating an effort to contextualize the message within a specific cultural setting.
Call to Action: The sermon implicitly calls on listeners to accept Christ, become part of the believing community, and reflect on the significance of both his first and second coming.
Quotes:
"For to us a child is born, to us a son is given." (Isaiah 9:6)
"Today in the city of David, a savior is born to you. This is Christ the Lord” (Luke 2:11).
"Do not conclude with the words that he was born for you, the angel should extend his present and become you; He said in detail."
Overall Impression:
This Christmas sermon delivers a powerful message of hope and joy, centered on the gift of Christ's birth "for us." It emphasizes the accessibility of this gift to all while highlighting the special blessings reserved for those who believe. The sermon effectively blends scriptural analysis, emotional appeal, and cultural context to create a compelling and meaningful Christmas message.