విచారణ

(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)



ఎవరు ఏది చెప్పినను మొదటిసారి వినవలెను. తర్వాత అది ఎంత వరకు నిజమో! దేవుడిచ్చిన జ్ఞానమునుబట్టి ఆలోచింపవలెను. ఆ తర్వాత చెడుగును విసర్జింపవలెను, మంచిని అవలంభించవలెను. ఏదియు వినకముందు నేరస్థాపన చేయకూడదు. ఆలాగే మంచిదని నిర్ధారణ చేయగూడదు. ఎన్నిమారులు విన్నను, ఎంత ఆలోచించినను, సత్యాసత్యములు నిర్ణయింవ వీలులేనవ్చుడు దేవుని ప్రార్ధింపవలెను.


దేవుడే మీ హృదయమునకు సత్యమును బయలుపరచును. అసత్యమును తెలిసికొనక పోయినయెడల హాని కలుగును. సత్యమును తెలిసికొననియెడల కలుగవలసిన మేలు కలుగదు. గనుక పరీక్ష అవసరమే. క్రైస్తవ మతవిషయములు ఎవరివలననో ఒకరివలన మీరిదివరకే వినియుందురుగాని, నేనెట్లు చెప్పుదునో అది మీరు వినలేదు. గనుక దయచేసి ఇప్పుడు వినండి. కడవరకు వింటేనే గాని మిరు సత్యమును గ్రహించలేరు, లేనిచో మీకనేక సందేహములు కలుగుచుండును. మరనాత.