సమాప్తము
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- 1. మరణము తప్పదు. శ్రమకూడా తప్పదు. ఈ రెండు ఎప్పుడు వచ్చునో ఎవరికిని
తెలియదు. ముందే జాగరూకత కలిగి ప్రవర్తింపవలెను.
- 2. వయస్సులో చిన్నవారిని చూచి వారు చేతకానివారని,
పనికిరానివారని,
అభిప్రాయపడరాదు. అట్టి అభిప్రాయము వారియెదుట బైలుపడరాదు. ఎందుకనగా వారి భవిష్యత్ మనకు తెలియదు గనుక వారే దేశమునకు,
సంఘమునకు,
నాయకులు అగుదురేమో.
- 3. ఎవరిని ఏ విషయములోను నిరుత్సాహపరుప రాదు గాని, దేవుని వాక్యమునుబట్టి, ప్రార్ధన
సహవాసమునుబట్టి ప్రజలను ప్రోత్సాహపరుపవలెను.
- 4. ప్రపంచములో కుటుంబమే ప్రాముఖ్యమైన స్థలము. ఇతరులతో, పరులతో
కలసి
జీవించుట ఎట్లో నేర్చుకొను పాఠశాలవంటిది ఈ కుంటుంబమే.
- 5. మన శాశ్వత జీవిత నివాసమును నిర్మించుటకు శ్రమలు
చలువరాళ్ల
వంటివని చెప్పవచ్చును.
- 6. గతకాల అపజయములనుగూర్చి అధైర్యపడక, ప్రస్తుతమందుగల ఆశీర్వాదములను తలంచుకొని జీవితము
కొనసాగించుము ముందునకు నీవు అనేక దీవెనలు పొందగలవు.
మరనాత