స్వస్థి ప్రార్ధన పద్ధతి
(జబ్బున్నవారికి)
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- I. ప్రియులారా! ఎంతో కాలమునుండి ప్రార్ధించుచున్నను జబ్బు కుదరలేదు. ఎందుచేత?
జవాబు: మనోనిదానము కుదరనప్పుడును, పొరపాటులున్నప్పుడును, సరియైన నమ్మికలేనప్పుడును, ప్రార్ధన నెరవేరనందున విసుగుదల కలిగినప్పుడును, వ్యాధి నివారణ కాదు. - II. మాకు మనోనిదానము కుదిరినది, పొరబాటులేకుండ చేసికొన్నాము, విసుగుదల లేదు. అయినను ఎందుచేత వ్యాధికుదరలేదు?
జవాబు: అలాగైన నేను కొన్ని సలహాలిచ్చుచున్నాను అట్లుచేసి చూడండి. అవేమనగా,- 1) వీలైన ఒకదినము ప్రార్ధనకు ఏర్పరచుకొని, ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు, బైబిలులో నీ ఇష్టము వచ్చిన వాక్యములు చదువుకొనండి. అప్పుడును జబ్బు కుదరనియెడల,
- 2) మరియొక దినము ఏర్పరచుకొని, మీ కష్టమంతయు వివరించుకొనుచు ప్రార్ధనలో గడపండి. అప్పుడును జబ్బు కుదరనియెడల,
- 3) మరియొక దినము ఏర్పరచుకొని ఇష్టమువచ్చిన క్రైస్తవ కీర్తనలు పాడుకొనండి. అప్పుడు ఇంకను జబ్బుకుదరకున్న యెడల,
- 4) కలిగియున్న ఇబ్బందులు, శత్రుబాధలు, చిక్కులు, గండములు మొదలగు వానిని తప్పించిన దేవుని విమోచన ఉపకారములు తలంచుకొని ఆయనను స్తుతించండి. అప్పుడును జబ్బు కుదరనియెడల,
- 5) ఇదివరకు దేవుడు చేసిన సదుపాయోపకారములు తలంచుకొని, సంతోషముతో ఆయనను స్తుతించండి. అప్పుడును జబ్బు కుదరనియెడల,
- 6) మరియొక దినమేర్పరచుకొని దైవ సన్నిధిలో మౌనముగా నుండండి. అప్పుడు దేవుడు, మీ మనస్సులో సంతోషకరమైన తలంపులు కలిగించును. ఏమిచేయవలెనో తోచును. అప్పుడును జబ్బు కుదరనియెడల,
- 7) మరియొక దినము ఉపవాస దినముగా ఏర్పరచుకొని,
ఉదయము
మొదలుకొని సాయంకాలము వరకు దేవుడు ఏ జబ్బులు పోగొట్టెనో ఆ వచనములు బైబిలులో చదవండి. కొందరికి ఉపవాసముపడదు, గనుక
చేయకూడదు.
ఆది 20:17, నిర్గమ 15:26, సంఖ్యా 12:10-14, 21:4-9, 1 రాజులు 13:4-6; 17:17-24, 11రాజులు 4:1-7, 4:32-37, 5:7-14 20:1-7, 11దిన 7:14, 16:12-14, యోబు 33:25, కీర్తనలు 6:2, 30:2, 41:3, 92:15, 103:1-5, 107:20, సామెతలు 3:7-8, 4:20-22, యెషయా19:22, 38:1-9, 53:4-5, యిర్మియా 17:14, జెకర్యా 12:5, మలాకి 4:2, మత్తయి 4:23-24, 8:2-13, 9:2-8, 20-22, 27-31, 12:9-15, 14:34-36, 15:29-31, 19:1-2, 20:29-34, 21:14, 26:51, మార్కు 1:40-45, 2:1-12, 3:1-11, 5:25-29 34:6,35-42, 6:53-56; 7:31-37, 8:22-26, 10:46-52, 14:47, లూకా 5:12-26, 6:18,19, 7:1-10, 8:43-48, 13:10-10, 14:1-6, 18:9-17, 18:35-43, 22:50-53, యోహాను 4:46-54, 5:1-9, 10:38, 18:10-11, కార్య 3:1-10, 5:15-16, 9:15-18, 32-85, 14:7-11, 19:12, 28:5-9; 1 పేతురు 2:24.
లోకములో జరుగుచున్న స్వస్థత కార్యములున్న చరిత్రలు దొరికిన యెడల అవికూడ చదువుకొనండి. అప్పుడును వ్యాధి కుదరనియెడల, - 8) మరియొక పనిచెయ్యండి: ఇది మిశ్రమ కార్యము. ఏలాగనిన కొంతసేపు దేవునియెదుట మీ అయోగ్యత ఒప్పుకొనండి, కొంతసేపు కీర్తనలు పాడుకొనండి, కొంతసేపు బైబిలు చదువుకొనండి, కొంతసేపు ప్రార్ధించండి, కొంతసేపు స్తుతించండి. తక్కిన సమయమంతయు మౌనముగా నుండి కనిపెట్టుటలో గడపండి. దేవుని తలంపే కలిగియుండండి. మీ జబ్బును తలంచుకొనరాదు. అప్పుడును జబ్బుకుదరని యెడల,
- 9) తెలిసిన ఎవరిచేతనైన ప్రార్ధన చేయించుకొనండి. అప్పుడును జబ్బు కుదరని యెడల,
- 10) ఈ దిగువనున్న ప్రార్ధనవంటి ఒక ప్రార్థన సిద్ధపరచుకొని అనుదినము చేయుచు, స్వస్థత
కొరకు
కనిపెట్టుకొని యుండండి.
కీర్తన 2:3 దేవా! యేసుక్రీస్తు ప్రభువా! నా నిమిత్తమై శరీరధారివై, భూలోకమున వెలసిన తండ్రీ! నీ కనేక వందనములు. నీ దైవత్వమును, నీ దివ్య లక్షణములను, బైబిలులో వ్రాయించిన నీ వాగ్ధానములను, నీవు మా భూమిమీద రోగులకు చేసిన ఉపకార కార్యములను, మా పాపములు వ్యాధులు శిక్షలు వహించి పరిహరించుటకై, నీవు సిలువ మ్రాను మీద మహాయజ్ఞమై, ప్రాణ సమర్పణ చేసిన వృత్తాంతమును, సాతానును, దయ్యములను, పాపములను, పాప ఫలితములను, మరణమును జయించి పునరుత్థాన మొంది ఆరోహణమైన అద్భుత చరిత్రను ఆధారముచేసికొని, నా జబ్బు బాగుచేయుమని నిన్ను వేడుకొనుచున్నాము. పూర్వకాలమందు మాత్రమేకాక నీవు దేవలోకమునకు వెళ్ళిన గడియ నుండి నేటివరకు, నీ విశ్వాసులు చేసిన ప్రార్ధనలు ఆలకించి ప్రజల వ్యాధులు పరిహరించు చున్నావు. కనుక నీకనేక వందనములు. నా పాపములు, నా జబ్బులు పరిహరింతువని దృఢముగా నమ్మియున్నాను. నీకే కీర్తి నన్ను నీ సేవలో వాడుకొనుము.
-
III. ప్రార్ధన
నెరవేరని అన్నిదినములు బాధపడుచుండ వలసినదేనా? ఔషధములు వేసికొనకూడదా?
జవాబు: ప్రార్థించి, తోచిన మందువేసి కొనవచ్చును. గాని దీవించువాడును, స్వస్థపరచువాడును ప్రభువే అని ఆయననే ఆశ్రయింపవలెను. - IV. ఈ పత్రిక వ్యాధిగ్రస్తుల కొరకేనా? లేక ఇతరుల
కొరకుకూడానా?
జవాబు: అందరి కొరకును ఏ అంశమును గూర్చి ప్రార్ధింపవలసి వచ్చినను ఇదే పద్ధతి. - V. ఇంత
ప్రయాసపడితేనేగాని దేవుడు వినడా?
జవాబు: ఇంత ప్రయాసవడుట దేవునిని రక్షించుటకు కాదు, మిమ్మును రక్షించుకొనుటకే. మీ హృదయములు స్వస్థత కొరకు సిద్ధపడుటకే. - VI. ప్రార్ధన రానప్పుదేమి చేయవలెను?
జవాబు: ఇదివరకు చేసిన ప్రార్ధనమాటలే ఉపయోగింపవచ్చును. అవి మీకు మధురముగా లేనప్పుడు, దైవసన్నిధిలో కనిపెట్టుకొని యుండండి. చదువరులారా! మీకు నచ్చినది చేయండి. మిమ్ముగూర్చి మాత్రమేకాక లోకస్టులందరిని గురించియు, అన్ని విషయములను గురించియు ప్రార్ధించండి. కన్నీటి ప్రార్ధన నరుని కఠిన మనస్సును కరిగించును. మిమ్మును మోక్షమందు చేర్చగల క్రీస్తుప్రభువు మీ జబ్బులు పోగొట్టలేడా? నమ్మిక కలుగనియెడల నమ్మి చూడరాదా? ప్రార్థించి చూడరాదా?
మమ్మును దీవించిన దేవుడు మిమ్మునుకూడ దీవించునుగాక! ఆమేన్. మరనాత.