మత్తు పదార్ధములు
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- 1. మత్తు పదార్ధములు ఆహార పదార్ధములు కావు. అవి శరీరారోగ్యమునకు తోడ్పడునవి కావు.
- 2. మత్తు పదార్ధములు
అలవాటు చేసికొన్నవారు సహవాసమువలనను, దానివలన వచ్చు నష్టములు తెలియక ప్రారంభములో అలవాటు చేసికొందురు. గ్రహించినమీదట
మానలేని
బలహీనులగుదురు.
- 3. మత్తు పదార్ధములను అలవాటు చేసికొన్నవారు ఇష్టపూర్వకముగాను, సంతోషముతోను,
స్వేచ్చపూర్వకముగాను
అలవర్చుకొందురు. మానవలసి వచ్చినపుడు ప్రాణసంకటముగా కన్పించును.
- 4. శరీరారోగ్యము పాడుచేసి, ఆయుష్కాలమును
తగ్గించునంతటి శక్తులు మాత్రమే మత్తు పదార్ధములలో గలవు.
- 5. పిచ్చి ఆస్పత్రిలో చేర్చబడినవారిలో ఎక్కువమంది మత్తు
పదార్ధములకు అలవాటు పడినవారే మతి చలించిన రోగులుగా చేర్చబడుచున్నారు.
- 6. మత్తుపదార్ధములు తెలివిని, జ్ఞానమును,
చురుకైన మనసును, గొప్ప మనో బలమును పాడుచేయును.
- 7. మత్తు పదార్థములకు అలవాటుపడిన వారు స్వతంత్రత లేనివారై,
బానిసలుగాను, కాపుదల లేనివారునై యున్నారు.