అందరు చేసికొనవలసిన ప్రార్థన
(యం. దేవదాసు అయ్యగారి ఉపదేశములు)
- యేసుక్రీస్తు ప్రభువా! నా నిమిత్తమై నీవు చేయు సమస్తోపకారముల కొరకై నీకనేక వందనములు.
- నా పాపములు పరిహరించుము.
- పాపములో పడకుండ కాపాడుము.
- నా వ్యాధులు పోగొట్టుము.
- నా కష్టస్థితులలోను, పనులలోను, నాకు తోడైయుండుము.
- నన్ను మాత్రమే కాక సర్వజనులనుకూడ నీ ప్రకటన బోధ మూలముగా నీతట్టు తిప్పి రక్షించుము.
- నా జీవయాత్ర చాలించిన మీదట నన్ను నీ పరలోక రాజ్యములోనికి చేర్చుకొనుము.