వర్షకాల స్తుతి
ప్రసంగ తేది: 21-6-1945
-
1. ఓ దేవా! నాకు ఎండ అవసరమని ఎండకాలము అవసరమని ఇట్టి ఎండకాల బుతువును ఎట్లు ఏర్పర్చినావో అట్లే మాకు నీళ్లు కావలెనని
వర్షకాల
బుతువు ఏర్పరచినందుకు స్తోత్రము.
-
2. ఎండిపోయిన భూమి మెత్తబడుటకు పంటకు పనికి వచ్చు నిమిత్తమై మెత్తబడుటకు వర్షము పంపుచున్న నీకు స్తోత్రము.
-
3. చెట్లు, మొక్కలు, గడ్డి మొదలైనవి నీళ్లు పీల్చుకొని పచ్చబారునట్లు వర్షదారను పంపించుచున్న నీకు స్తోత్రము.
-
4. అట్లే దాహముచేత ఇటు అటు సంచరించుచుండిన జీవరాసులకు, మృగాదులకు, పక్షులకు, దాహము తీర్చుటకై నీళ్లుపట్టించే నిమిత్రము
వర్షోదకమును కురిపించుచున్న నీకు అనేక స్తోత్రములు.
-
5. అగ్ని బాప్తిస్మమును జ్ఞాపకము తెచ్చిన వేసవికాలము పూర్తియెన పిమ్మట వెంటనే అద్భుతమైన రీతిని కృప వర్షోదక
బాప్తీస్మమును
జ్ఞాపకము చేసే వర్షకాలమును ప్రవేశపెట్టిన నీకు స్తోత్రము.
-
6. మానవులకు త్రాగే నిమిత్తమై, వాడుకొనే నిమిత్తమై పొలములకు నీరు పెట్టుకొనే నిమిత్తమై కావలసినన్ని నీళ్లు ధారాళముగా
ఇచ్చే
వర్ష బుతువును ఏర్పరచిన నీకు స్తోత్రము.
-
7. ప్రతి బుతువు అనగా ఎండకాలము, వర్షకాలము, శీతాకాలము, అను ప్రతికాలము వంతుల చొప్పున పాపులమైన మాకు ధర్మమై (దానమై)
కొన్నాళ్లు నిలువబడే కృప దయచేసినందుకు నీకు స్తోత్రము. ప్రతి బుతువు ప్రపంచము మీదికి వచ్చి ఇదిగో నేనే దేవుడు నీకు
అనుగ్రహించే దానమునై యున్నాను గనుక సుఖించుమా ప్రపంచమా అన్నట్లున్నది.
-
8. ఓ దేవా! భూమిమీద ఉన్న గుంటలు, చెరువులు, నదులు నీళ్లతో నింపగల వర్ష బుతువును ప్రసాదించినందుకు స్తోత్రము. మరియు
అవసరమునుబట్టి మేము పాత్రలు పట్టగా వర్షధారలు పడు నిమిత్తమై ధారల బుతువును అనుగ్రహించినందుకు స్తోత్రము. కిరణాల
బుతువులు
అనుగ్రహించిన నీవు ధారాళ బుతువును అనుగ్రహించిన నీకు స్తోత్రములు.
-
9. భూమిమీద ఉన్న గత్తర యావత్తును ముఖ్యముగా నివాస స్థలములయొద్ద నిలిచియున్న గత్తర యావత్తును ప్రవాహమున బడి
కొట్టుకొనిపోయి
శుభ్రమౌ నిమిత్తమై ప్రవాహోదక వర్ష బుతువును యుంచినందుకు స్తోత్రములు.
-
10. వేడివేడి అని పరితాపము పొందిన ప్రజలు చల్లబడినది చల్లబడినది అని ఆనందించేటందుకు చల్లని నీరు కుమ్మరించునట్టి వర్ష
బిందువుల కాలము దయచేసినందుకు స్తోత్రము.
-
11. ఈ సంవత్సరము వర్షములు బహు బాగుగా కురియుచున్నవి గనుక పంటలు పండుటచేత కరువు తీరునని నోరారా అనుకొనేటందుకు ప్రజలు
చెప్పేటందుకు వాన నీరు దయచేసినందుకు సోత్రము.
-
12. శుద్ధి జంతువులకు, వృక్షములకు, నేలకు ముఖ్యముగా మనుష్యులకు అవసరమైయున్నదని తెలిసి శుద్ధ జలము కుమ్మరించే వర్షించు
బుతువు
పంపినందుకు స్తోత్రములు.
-
13. వర్షకాలమువల్ల కలుగవలసిన మేళ్లు అనుభవించి సర్వజనులు నిన్ను స్తుతించు నిమిత్తమై జలము సమృద్ధిగా పంపగోరుచున్న
తండ్రి
నీకు నిత్య మంగళ స్తోత్రము.
-
14. ఎప్పుడు ఎండకాలము వచ్చునా? ఎప్పుడు ఈ చలి తీరునా? అని ప్రజలు ఎండకాలము కొరకు కనిపెట్టుకొని యుండే విధముగానే
ఎప్పుడు
వేడి
తగ్గుటకు వర్షకాలము వచ్చునాయని ప్రజలు కనిపెట్టుచున్నారు ఈ ప్రకారము నీవు పంపే బుతుదానము కొరకు ఆశించే నిరీక్షణ
లక్షణము
మానవులకు కలిగించిన నీకు అనేక స్తోత్రములు.
-
15. ఒక బుతుదానము నీవు ప్రత్యేకముగా పంచిపెట్టే సమయమందే తక్కిన బుతుదానములలోని కొంత అప్పుడప్పుడును పంచిపెట్టుచున్న
నీకు
ఆనంద స్తోత్రము. ఎండదానము అనుభవించుచున్న కాలమందే వర్షము చలికూడ అనుభవించు చున్నాము. వర్షదానము అనుభవించుచున్న కాలమందే
మధ్యమధ్య ఎండ, చలి అనుభవించుచున్న సమయమందే కొద్దిపాటి ఎండయు, చినుకులు అనుభవించు చున్నాము. ఇట్టి మార్పు దానముల
నిమిత్తమై
నీకు స్తోత్రములు. దానకర్తవైన ఓ తండ్రీ! నీ దానములన్నిటికి స్తోత్రములు అర్పించుచున్నాము.
-
16. వర్షకాలము నీ కృపా వర్షమును జ్ఞాపకమునకు తెచ్చుచున్నందుకు నీకు స్తోత్రములు. ఎండకాలము నీ మహిమను, శీతాకాలము మేము
పరలోకములో పొందే నెమ్మది, విశ్రాంతి చల్లదనమును జ్ఞాపకము చేయునట్లు ఇది నీ కృపావర్షమును జ్ఞాపకము చేయుచున్నందుకు నీకు
స్తోత్రములు.
-
17. నీవు పంపే వర్షోదకమును ఎట్లు వాడుకొనవలెనో నేర్పించే జ్ఞానశక్తిని అనుగ్రహించినందుకు స్తోత్రములు.
-
18. నీళ్లు అనారోగ్యమును పరిహారము చేసికొనుటకును, ఆరోగ్యమును వృద్ధిచేసికొనుటకును బయలుపర్చినందుకు స్తోత్రము.
-
19. ఆత్మీయమైన జీవమునకు ఆధారముగానున్న జీవజలమును జ్ఞాపకమునకు తెచ్చు సృష్టిజలము అనుగ్రహించిన నీకు స్తోత్రము.
-
20. ఓ తండ్రీ! నీ వాక్యముయొక్క పని గొప్ప పని. ఆ గొప్ప పనిని మేము జ్ఞాపకము తెచ్చుకొనేటందుకు వర్షమును సాదృశ్యముగా
ఉదాహరించినావు (యెషయా 55:10,11). ఈ గొప్ప విషయము మేము వర్షకాలమున జ్ఞాపకము తెచ్చుకొని ఈ రెండు విషయములను గూర్చి
నిన్ను
స్తుతించుచున్నాము.
-
21. ఓ దేవా! ఎండ సమయములో నీడ కలిగించునట్టి మేఘములను అనుగ్రహించిన నీకృపకు స్తోత్రములు. వర్షము వచ్చునని నిరీక్షణ
కలిగించునట్టి వర్షమేఘము నిమిత్తమై స్తోత్రము.
-
22. మేఘము గర్జించునపుడు భయము కలుగును. సీనాయి కొండమీద ఉరిమినపుడు కొండ దిగువనున్న ఇశ్రాయేలీయులు భయపడిరి. నీవు ఆజ్ఞలు
ఇచ్చినప్పుడు ఇట్లు జరిగినది. నీ ఆజ్ఞలకు మేము భయపడవలెననియు పరిశుద్ధుడవైన నీ యెదుట మేము గజగజ లాడవలెనననియు జ్ఞాపకము
చేయు ఉరుము నిమిత్తమై నీకు స్తోత్రము.
-
23. అరణ్యములో పగటివేళ ఇశ్రాయేలీయులకు గొడుగుపట్టిన మేఘములను తలంచుకొని నిన్ను వందించుచున్నాము. మరియు పెండ్లికుమార్తె
శాఖవారు మహిమ మేఘము నిమిత్తమై కనిపెట్టుచున్నారు. ఆ మేఘములో వెళ్లుటకు ఆశించుచు సిద్ధపడుచున్నారు. నీవు సహాయము
చేయుదువని
నమ్ముచున్నాము.
-
24. ప్రభువైన! యేసూ నీ రాకడను జ్ఞాపకము చేయు మేఘమును తరచుగా మా కన్నుల యొదుటికి రప్పించుచున్న నీకు స్తోత్రము. అది
మాత్రమే
కాకుండా నీ రాకడను గురించి జ్ఞాపకము చేసే నిమిత్తము మేఘము, మెరుపులు పుట్టించుచున్న నీకు స్తోత్రములు. ఒక ప్రక్కనుంచి
మరియొక
ప్రక్కకు మెరుపు ఎట్లు వెళ్లునో మనుష్య కుమారుని ఆగమనము అట్లే ఉండునని తెలిపినావు (లూకా 17:24) గనుక మెరుపు వంటి
నీరాకడ
మా
మనస్సులకు వచ్చుచున్నది. నీవు పెట్టిన మెరుపులోనుండి మానవులు దీపములు కల్పించుకొనే జ్ఞానము కలిగించినందుకు స్తోత్రము.
-
25. ఎంత గుండె దిట్టముగలవారినైనను భయపెట్టే పిడుగుకూడ మేఘములో అమర్చినావు. పాపజీవితములో మాత్రమేకాక పాప వాంఛలోను,
అజాగ్రత్తలోను (పరలోకమునకు సిద్ధపడని స్థితిలో) ఉన్న వారు నిన్ను జ్ఞాపకము తెచ్చుకొనే నిమిత్తమై, తండ్రి తప్పించుమని
ప్రార్ధన చేసే నిమిత్తము ఉపయోగముగా నున్నది.
-
26. శరీరమునకు వేడి చేయునపుడు ఉపయోగముగా నుండునట్టి వడగండ్లు పంపుచున్న నీకు స్తోత్రము ఇశ్రాయేలీయులు పాలస్తీనా
వెళ్లేటప్పుడు ఫిలిష్తీయులమీద పడి వారి సైన్యము వెనుకకు వెళ్లెను. ముఖ్యముగా పిల్లలకు వినోదముగా నుండునట్టి ఆట
గోలీకాయల
వంటి
వడగండ్లు నిమిత్తము తండ్రి నీకు స్తోత్రము. (ఇదివరకు ఆట వస్తువులు, చేపలు, పక్షులు, జంతువులు).
-
27. యాకోబు 5:7; ద్వితీ 11:14 యిర్మియా 5:24. ఓదేవా! భూఫలములు అనుభవించు నిమిత్తమై తొలకరి కడవరి వానను పంపించుచున్న
నీకు
స్తోత్రము. ఈ సంగతివల్ల పరిశుద్దాత్మ బాప్తిస్మము జ్ఞాపకము వచ్చుచున్నది స్తోత్రము. ఆది సంఘములో పెంతెకొస్తు దినమున
తొలకరి
వాన అనగా మొదట పరిశుద్దాత్మ బాప్తీస్మము కలిగెను. మా కాలము రాకడకు, ముందటికాలమగుటచేత ఇప్పుడు కడవరి వాన కురియుచున్నది.
అక్కడక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుచున్నారు. ఇది వింతైన సంగతి.