ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ఏలియా ఉపవాసము

ప్రసంగ తేది: 3-2-1946



వాక్యము: 1రాజు. 19:3-8; యోహాను 6:27-55; 2తిమో. 2:1-7


మోషే 40 దినములు ఉపవాసము, ఏలియా 40 దినములు చేసిన ఉపవాసము 1రాజు. 19 అధ్యా॥ కర్మెలు కొండమీద చేసిన బలి అక్కడ నుండి రాజుభార్య చంపు కూటమి యూదాకు వెళ్లుట. బెయెర్షబా నుండి బదిరీవృక్షము క్రింద ఉండెను. ఒక దిన ప్రయాణము నడిచి ఆకలిచేత ఉండినపుడు దేవదూత ముట్టుకొని ఈ మాట చెప్పెను. లేచి భోజనము చేయుము దగ్గర రొట్టె, నీళ్లు ఉంది; అది తిని నీళ్లు త్రాగెను. దేవదూత రెండవమారు వచ్చి ముట్టి భోజనము చేయుమని చెప్పి క్రొత్తమాట చెప్పెను. నీవు దూరప్రయాణము చేయవలెను అని చెప్పెను. అప్పుడు హోరేబుకొండకు ఏలియా వెళ్లెను. అరణ్యములో 40 రాత్రులు, 40 పగళ్లు నడిచెను. అక్కడ చేరి హోరేబు కొండలో ఒక నివాసము ఏర్పాటు చేసికొనెను. దూత భోజనము పెట్టిన ఆ భోజనముద్వారా 40 దివారాత్రులు నడిచెను. ఈ ప్రయాణము, ఈ అరణ్యము పూర్వము ఇశ్రాయేలీయులు నడచినది. బైబిలులో ఎవరైనాసరే ఒకపూట భోజనముచేసి 40 దివారాత్రులు నడిచారా? ప్రభువు తపస్సులో ఉండెను. మోషే ప్రయాణము చేయలేదు గాని ఏలియా 40 దినములు ప్రయాణము చేసెను. దూతవచ్చి ఏలియాను ముట్టుకొనెను. స్వరము వినెను. పరిచర్య చేయించుకొనెను. ఎంత ధన్యుడు? మొదట కాకులు పరిచర్య చేసెను. దేవునికి అసాధ్యము ఏమున్నది? దేవుడు కాకులచేత ఆహారము తెచ్చి విశ్వాసులను పోషించును. చేసినది ఎక్కడని తెలియదుగాని రికార్డులో ఉన్నది మాత్రము అక్కడ ఉన్నది రొట్టె.


ఏలియా బేయెర్షబాలో చేసిన పని ఏమి? సేవకులను పెట్టి అబ్రాహాము కొండ ఎక్కాను. ఏలియా సేవకుని క్రిందపెట్టి బదరీ చెట్టుకు వెళ్లి ప్రార్ధనలోయుండెను. క్రీస్తుప్రభువు 9మంది శిష్యులను కొండక్రింద పెట్టి ప్రభువు కొండ ఎక్కెను. దాసులే తన అవస్థ చూడకూడదు గనుక వారిని అక్కడపెట్టి వెళ్లెను. ప్రభువు దేవుని నోటనుండి వచ్చిన మాటద్వారా జీవించును. ఇక్కడ రొట్టెకాదు గాని దేవుని మాటద్వారా దీవెన పొందితిని. బలముపొందెను.


దేవుని పిలుపు ఉండవలెను. ఏలియాను ప్రత్యేకమైన పనికి పిలిచాడు గనుక ప్రత్యేకమైన పని, ప్రత్యేకమైన శక్తి అవసరము. గనుక అట్లు చేసెను. దేవుడిప్పుడుకూడా ఇట్లు చేయవచ్చును. దేవుడు నన్ను ప్రత్యేకమైన పనికి పిలువవలెను. అప్పుడు ఆహారము లేకుండా ఉండవచ్చును.


బబులోనులో దేవుని గొప్ప అద్భుతము 4గురు పిల్లలు మామూలు భోజనము మాకు చాలును అనెను. ఈ 4గురు బాలుర ముఖములు కళగా నుండెను. సామాన్య ఆహారమువలన పుష్టి బలము, ఆరోగ్యము, కళ వచ్చెను. దేవుని ఆశీర్వాదమువల్ల ఇట్లు జరిగెను. ఏలియాకు సామాన్య ఆహారము శక్తికి మించిన శక్తి వచ్చెను. సామాన్యశక్తికంటె గొప్ప శక్తి వచ్చెను. ఇది దేవునివలన కలిగెను. దీవెన ఆహారమువల్ల శక్తివచ్చినది అని ఉన్నది. దానియేలుతో ఇంకా ఉన్నవారికికూడ శక్తివచ్చినది. మనకును వచ్చును. వేరే పని ఉంటే ఏర్పాటు ఉంటే ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటే ప్రత్యేకమైన శక్తి ఉండును.


40 దినములు ఒకచోట ఉండుట కష్టము. ప్రయాణముచేయుట కష్టమా? ఇది మహా అద్భుతము. ఉపవాస ప్రార్థనలను ఇతరులకు కనబడకుండ ప్రభువు చేయమనెను. అంటే ప్రభువు చెప్పినట్లు నీరసము కలుగకుండ ఉండవలెను. అట్లుండగలిగితే ఉపవాసము చేయవచ్చును. ప్రత్యేకమైన పని ఉంటే ప్రత్యేకమైన శక్తి దేవుడిచ్చును చేయండి. "ప్రత్యేకశక్తి" ఇవ్వకపోతే ఉపవాసము వల్ల బలహీనత కలుగును. మరణము సంభవించును. గాన చేయవలెను అనిగాని ఇప్పుడు ఉపవాస ప్రార్ధన చేయవద్దని కొన్ని తెగలు ఉపవాసము చేయవద్దనుచున్నారు. ప్రభువు మార్కు 9:29 లో చెప్పినది ఉపవాసమువల్ల దయ్యమును వెళ్లగొట్టవచ్చుననెను. ఉపవాసము చేయునప్పుడు తైలము వ్రాసికొనమనెను. ముఖము కడుగుకొనమనెను.


పరిసయ్యులు నీ శిష్యులు ఉపవాసము చేయుటలేదనగా నేను వెళ్లిన తరువాత చేస్తారని ప్రభువు చెప్పెను. గనుక వీటిద్వారా ఉపవాసము చేయవచ్చును. అపో॥ పౌలు ఉపవాసమువల్ల ఆత్మకు మేలున్నదని చెప్పెను.


క్రొత్త నిబంధనలో ఈ నాలుగు ఉన్నవి గనుక సహింపునుబట్టి, ఇష్టమునుబట్టి చేయవచ్చునని ఒక తెగ, దీర్ఘ ప్రార్ధనలు చేయవద్దని ఇంకొక తెగ అనుచున్నారు. గాని పరిసయ్యులు చేసిన ప్రార్థనలు చేయవద్దని ప్రభువు చెప్పినాడుగాని అనేక అంశములు ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? ఒక అధికారియొద్దకు వెళ్లితే ఒకమాట ఉంటే ఒకమాటేగాక కొన్ని మాటలైన మాట్లాడవచ్చును. చేసినది చేయకూడదుగాని ఎక్కువ ఉన్నవి గనుక చేయవలెను. పరిసయ్యులవలె ఎక్కువ సమయము గడుపుటకు అని మెప్పుకుగాని ఇక్కడ ఎక్కువ అంశములు ప్రార్థించుట

ఎవరిది గొప్ప ఉపవాసము? అబ్రాహాము తన కుమారుని బలి ఇచ్చుటకు వెళ్లెను. అప్పుడు 3 దినములలో దేవుడు ఆకాశనక్షత్రములవలె నీ సంతానమును చేస్తానన్నాడో ఇప్పుడు బలి ఇమ్మనుచున్నాడు ఇది ఏమి? అను ప్రశ్న అబ్రాహామునకు వచ్చినదా? రాలేదు. డేరా నుండి 3 దినముల ప్రయాణములలో గొప్ప శోధన ఉన్నది.

40 ఏండ్ల వయస్సుగల ఇస్సాకును వానిని చేతులారా బలివేయనా? ఇట్లు ఆలోచనలు కలిగేటందుకును 3 దినములు గడువు ఇచ్చెను. మన జీవితము ఒక గడువు అనగా 100సం॥ల గడువు ఉంటే

ఇది సైతానుకు ఇవ్వబడిన గడువు. మనకు జయించే గడువు ఇచ్చెను. మన ఆయుష్కాలము ఇచ్చెను. అబ్రాహామునకు శోధన ఆయుష్కాలము, జీవము, జయము ఈ మూడు ఉన్నవి. కుమారుడు నాయనా బలి అర్పణకు గొఱ్ఱెపిల్ల ఎక్కడ? అన్నప్పుడు, కత్తి ఎత్తేటప్పుడు, మూడు దినముల గడువును జయించెను గనుక విశ్వాసుల తండ్రి అని పేరువచ్చెను.


మనము జయించేటందుకు దేవుడు గడువులు ఇచ్చును. ఏలియాకు 40 దినముల గడువు ఇచ్చెను. నేను ఒకరోజు తిన్నాను రెండు బుడ్లు నీళ్లుత్రాగాను ఇంత ప్రయాణము చేయగలనా? అనే ప్రశ్న ఆయన మనస్సులోనికి వచ్చినట్లు 40 దినముల గడువు ఇచ్చెనుగాని ఏలియాగారి మనస్సులోనికి రాలేదు. అబ్రాహామునకు రాలేదు ఏలియాకు రాలేదు. ఏలియా మా పితరులు ఈ అరణ్యమందు నడచిరి. మన్నా తిన్నారు నీళ్లు వచ్చినవిగాని దేవుడు ఆ నీళ్లే నీకాహారము అనును. ఒక దిన ఆహారము 40 దివారాత్రములు సంతుష్టి పరచినది. క్రీస్తుప్రభువు 5రొట్టెలు 5వేల మందికి పెట్టెను. మనమట్లు చేయవలెనంటే చినగింజంతైనారాదు. ఒకదినమంటే ఒక సంవత్సరమని లెక్క ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ప్రయాణముచేసిరి (కాలమానమిది) దీనికి సూచనగా ఏలియా 40 దినములు ప్రయాణముచేసిరి. పూర్వికులు 40 సం॥లు చేస్తే నాకు 40 దినముల ప్రయాణము చేయ తరుణమిచ్చెనని నంతోషించెను. సాధుసుందర్ సింగ్ కూడ చేయలేక పోయెను గాని గొప్ప మేలు కలిగెను.


కొండమీద మోషేకు 40 దినములు ఏవిధమైన తలంపు రాకుండా దేవుని సన్నిధిలో ఉండెను. మనము ఒక అరగంటయినా ఉండలేము. ఏలియా దైవసన్నిధిలో ఉన్నాడా? లేడా? ఏలియా కనబడని దేవుని సన్నిధిలో ఉండెను. ఇదే ఎక్కువ కష్టము. యెహోవాయొక్క సన్నిధి మీకుకూడ వచ్చును. బదరీవృక్షము నుండి హోరేబు కొండవరకు ఏలియాతో దేవుని సన్నిధి వెళ్లెను. ఈయనకు ఇశ్రాయేలీయుల వాగ్ధానమున్నది. ఏలియాకు అబ్రాహాముకు కలిగిన తలంపు కలిగి ఉండవచ్చును గాని లెక్కచేయలేదు. అరణ్యములో నేను వెళ్లవలెనుగాని మృగములున్నవి. ఏలియా మనవంటి స్వభావముగలవాడు యాకోబు 5:17. దీనినిబట్టి మన స్వభావము మనతో వచ్చును. ఏలియా తన స్వభావము మరచిపోయి వెళ్లెను. నా పితరులకంటె గొప్పవాడనా? అని మొదట అనెను. అలాగే పేతురుకూడ సందేహముపడి నీటిలో పడిపోయెను. పేతురు సందేహపడుట, ప్రభువు గద్దించి చేయి పట్టుకొని పైకి ఎత్తెను. ఇది ఒకసారే జరిగెను. ఏలియా అట్లు చేయలేదు.


మన నైజమును విడిచిపెట్టితే పైనుండి అగ్నియైనను, వర్షమైనను పడును. ప్రత్యేకమైన శక్తి ప్రత్యేకమైన పని పిలుపు ఉంటేనే చేయవచ్చును. ఏలియా ఎదురేమి చెప్పలేదు. అగ్నిలోకి ముగ్గురు బాలురు వెళ్లిరి. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్లెను. పేతురు నీటిపై నడిచెను. దైవజనుల లక్షణము ప్రశ్నలులేని విశ్వాసము. దైవాశీర్వాదము వల్ల శక్తి బలము సమస్తమును కలుగును గనుక అందుకే ప్రార్ధన చేసికొనుచున్నాము. దేవుని పని ఎక్కువ ఉంటే ఎక్కువ శక్తి ఇచ్చును. మనము ప్రార్ధన బైబిలు చదువుట మనము చేసే భక్తికి సరిపోవును. గాని మనము చేయు పనికి చాలా అవసరమగును. ఎక్కువ పని చేయవలెనంటే ప్రభువు ప్రత్యేక పిలుపు, శక్తి ఇచ్చును.


ఏలియా ప్రయాణము ఆహాబు శక్తికి మించి కోరుకొనలేదు గనుక దేవుడే ఇచ్చెను. మనము కూడా దేవుని సెలవుమీద వెళ్లవలెను. అట్లు చేయనియెడల మనకు అనేక శ్రమలు కలుగును. ఏలియా ప్రార్ధన స్థలమునుండి సన్నిధి స్థలమునకు వెళ్లవలెను. తరువాత పని చేయించవలెను. గనుక దేవుడిట్లు పనిచేసెను. 20వ అధ్యాయము నుండి దేవుని సన్నిధి కొండకు వెళ్లుటయే గొప్ప విషయము కాకులు ఏలియాయొద్దకు ఎగిరివచ్చెను గాని ఏలియా దేవునిసన్నిధికి ఎగిరివెళ్లెను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమేన్.