ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
సంస్కార, బాప్తిస్మ ఆదివారము
ప్రసంగ తేది: 22-9-1957, అనురాగరావు గారి పుస్తకము (3)
వాక్యము: ఆది 2:1; మార్కు 16:15; 1కొరింథి. 11:23.
విశ్రాంతిని కోరే ప్రియులారా! నేడు రెండు విశ్రాంతి ఆచారములు మన ఎదుట ఉన్నవి.
- 1) స్నాన సంస్కారము
- 2) ప్రభు భోజన సంస్కారము.
ఈ రెండును మనకు విశ్రాంతిని అనుగ్రహించే ఆచారములు.
- 1. స్నానము = అనగా బాప్తిస్మము అంటున్నాము. ఇది బైబిలులో ఉన్న పేరే.
- 2. ప్రభు భోజన సంస్కారము అంటున్నాము. స్నానమంటే అనుదినము మనము చేసే స్నానముకాదు, భోజనము అంటే అనుదినము మనము చేసే భోజనం కానేకాదు.
స్నానమనేది ఎందుకేర్పడింది? (బాప్తిస్మము) అని అంటే మనము అనుదినము చేసే స్నానము ఎందుకేర్పడిందో బాప్తిస్మముకూడా అందుకే ఏర్పడింది. తేడా బహిరంగ శరీరానికి స్నానము. ఆత్మ స్నానానికి బాప్తిస్మము.
- 1. అనుదిన భోజనం శరీరానికి
- 2. సంస్కార భోజనము
ఆత్మకు.
- శరీర స్నానమెంత అవసరమో ఆత్మ స్నానము అంత అవసరము.
- శరీర భోజనం ఎంత అవసరమో ఆత్మ భోజనం అంత అవసరము. అది ఇది అవసరమే.
రెండు తప్పవు. ఏది విడిచిపెట్టకూడదు.
1. శరీర స్నానము వలన మలినముపోయి, శరీర శుద్ధి అనే మేలు కలుగుచున్నది. ఈ శరీర స్నానమువలన శరీరమునకు ప్రాణములో హాయిగానుండి విశ్రాంతి కలుగుచున్నది. ఆత్మస్నానమైన బాప్తిస్మమువల్ల రెండు ఉపకారములు : ఆత్మకు అంటిన పాపము శుద్ధియైపోతుంది.
2. ఏ మతానికి సంబంధించిన వారిక్కడికి వచ్చి బాప్తిస్మము పొందుచున్నారో ఆ మతాచారము పోవును.
3. పాపపరిహారము అంతమువరకు చేసిన దానికి సంబంధించిన మలినము పోవును.
4. పూజ దానికి సంబంధించిన ఆచారములు అంతరించును.
5. సిద్దాంతములన్నియు పోవును గనుక శరీర స్నానముకంటే ఆత్మస్నానమే గొప్పదిగా కనిపించును. శరీరస్నానము వల్ల శరీర శుద్దేగాని ఆత్మ మలినము పోదు. గడచిన 20 సం॥ల వల్ల శరీర స్నానము వల్ల శరీర మలినము పోయింది గాని
- 1) పూజలు
- 2) ఆచారములు
- 3) సిద్ధాంతములు మొ॥వి పోలేదు. ఈ క్రొత్త మతములో ఈ క్రొత్త బాప్తిస్మము పొందగానే ఈ నాలుగు పోయినవి. ఆత్మకు సంబంధించిన బాప్తిస్మమువల్ల ఒక మతములోనుండి వచ్చి మరొక మతములోనికి ప్రవేశము దొరుకుతుంది.
- 4) మతప్రవేశమువల్ల పరలోక ప్రవేశము దొరుకుతుంది, లభించుచున్నది గనుక బాప్తిస్మమువల్ల పై నాల్గు ఇంకా
- 5) క్రైస్తవ సంఘ ప్రవేశము. 6) ఈ ప్రవేశమువల్ల ప్రపంచములోని సుమారు వందల కోట్ల క్రైస్తవులు బంధువులౌతారు.
- 7) పరలోక పరిశుద్ధులు బంధువులౌదురు. ఈ 7 ఉపకారాలు ఆత్మస్నానమువల్ల కలుగును.
- 8) ఈదినము నుండి వారు క్రీస్తు బిడ్డలు. ప్రభువు ఒక్కమాటచెప్పిరి. నమ్మి బాప్తిస్మము పొందినవారు రక్షింపబడుదురు.
- 9) వారు నా శిష్యులగుదురు. ప్రభువుయొక్క శిష్యత్వము దొరుకును. వారు ప్రభువుకు శిష్యులైనట్లు ఈ దినము బాప్తిస్మము పొందినవారు శిష్యులు అగుదురు.
- 10) రక్షణ భాగ్యము దొరుకుతుంది. ఈ లోక భాగ్యములన్నిటిని మించినది.
- 11) నమ్మకమనే గుణము వారిలోనికి వచ్చివేస్తుంది. ఈ నమ్మకమనే గుణమువల్ల రక్షణ బాప్తిస్మము నమ్మకమునుబట్టి జీవాంతము వరకు స్థిరమైపోవును.
- (1) బాప్తిస్మము పొంది (2) రక్షణ పొంది నమ్మకము పోగొట్టుకున్న ఈ రెండు పోవును. నమ్మకము-బాప్తిస్మము రక్షణకు ముద్రవేయును. గనుక బాప్తిస్మము వలన 12 మేళ్లు వచ్చును. ఇప్పుడు పొందేవారు, పొందియున్నవారు, వీటియందు జాగ్రత్తగా ఉండి 12 మేళ్లను కాపాడుకోవాలి.
II. బాప్తిస్మము ఒక్కసారే. అయితే ప్రభు భోజనం అనేకసార్లు. ప్రభువు నికొదేముతో తిరిగి జన్మించాలని చెప్పెను. జన్మించినవారికే పరలోక బాగ్యము, దాని ప్రవేశము దొరుకును. బాప్తిస్మము జన్మస్థిథి. నరుడు పుట్టుట ఒక్కసారే. బాప్తిస్మమును ఒక్కసారే. పుట్టిన మనిషి అనేకసార్లు తినవచ్చును. బాప్తిస్మమైన తరువాత అనేసార్లు తిని త్రాగుట అనేకసార్లు ఉండవచ్చు.
లూథరన్ వారు మూడు నెలలకొకసారి, చర్చి మిషను వారు వారానికి ఒక్కసారే, బాప్తిస్టువారు నెలకు ఒక్కసారి, అమెరికాలో సంవత్సరములో ఈస్టరునాడు ఒక్కసారే తీసికొంటారు. ఎందుకనగా ప్రభువుభోజనముయొక్క గౌరవము తగ్గిపోరాదని, సంవత్సరానికి ఒక్కసారైతే భయము, గౌరవము, భక్తి ఉంటుందని. కాని బైబిలులో ఇంతకాలానికి సంస్కారము పుచ్చుకోవాలని వ్రాయబడలేదు. రోజు తీసికొంటే ఈలోక భోజనమువలె సామాన్యమై భక్తి తగ్గిపోతుంది. ఎప్పుడు సంస్కార సమయములో ప్రభు శరీర రక్తాన్ని జ్ఞాపకం చేసికోవాలి.
- I
- 1. నన్ను జ్ఞాపకము చేసికొనండి.
- 2. పుచ్చుకొనండి బైబిలులో ఈ రెండు ఉన్నవి.
కొందరు తినుటకాదు. జ్ఞాపకము చేసికోమన్నారు. రొట్టె, ద్రాక్షారసముతో పై రెండు ఇక్కడ లేవు అంటున్నారు. ఆ రెండు లేకపోతే మామూలు భోజనమే అగును. ప్రభువన్నారు - నా సహోదరులకు మేలుచేస్తే నాకు చేసినట్లే అన్నారు. మన లెక్క ప్రభువునకు చేస్తే ప్రభువుకే, సహోదరులకు చేస్తే సహోదరులకే అని లెక్క ఆ మాటను బట్టి చూస్తే రొట్టెతో శరీరము, ద్రాక్షరసముతో ప్రభువు రక్తమన్నట్లే విశ్వాసమునుబట్టి భావించాలి. గుడిలో సంఘ ఏర్పాటును బట్టి సంస్కారాన్ని మూడు నెలలకు, ఒక నెలకు, ఒక వారమునకు తినవచ్చును. సంఘాన్ని ఒకొక్కప్పుడు ప్రేరేపణనుబట్టి పాదిరిగారిని పిలిచి నాకు కోర్కెగా ఉన్నదని చెప్పి పుచ్చుకోవచ్చు.
II. పాదిరిగారు వీలులేక ఒప్పుకోలేకపోయినట్లయితే ప్రభువా పాదిరిగారు వచ్చి నాకివ్వడం నీకు అంగీకారం. ఇవి స్థాపించిన నీవే వచ్చి సంస్కార ఇవ్వమంటే ప్రభువు పాదిరిగారివలె డన్సువేసికొని వచ్చి పుచ్చుకొనండని మీకొరకు చిందించినదని చెప్పి పాదిరిగారివలె చెప్పి ఇచ్చును.
- 1. ద్రాక్షారసము - జీవానికి సంబంధించినది.
- 2. రక్తము అనగా సిలువపై చిందించినదికాదు.
ఆత్మజీవనమునకు వృద్ధి కలుగజేసేది. మహిమ శరీరములోనికి మహిమరక్తము వచ్చెను.
రక్తము = జీవము.
ఉదా:- ఒక కానిస్టేబుల్ వచ్చి అయ్యా మా అబ్బాయికి పేరుపెట్టమని యేసుపాదము అడిగెను
(తాడేపల్లిగూడెం).
అతని
తమ్ముని పేరు యేసుపాదమేనట. ఒకరికి పెట్టినావుగదా! అని అడుగగా ప్రభువుకు రెండుపాదాలుగదా!
వీరికికూడా యేసుపాదమని చెప్పిరి. పెద్ద యేసుపాదము కుమారుని పేరు యేసుజీవము. ఆ జీవమే = రక్తము.
గనుక దర్శనము నమ్మనివారికి ఇది తప్పక జరుగును. ఒకప్పుడు ఐ.బి.యం. స్థాపనప్పుడు లూథరన్స్ లో సంస్కారము జరుగుచుండగా దానికి అయ్యగారు వెళ్లిరి. కాని వారివ్వలేదు. వారు రావద్దన్నా ఆ బల్లమీదే ఉండి ప్రార్ధించగా ప్రభువా! సంఘము నాకు ఇవ్వనన్నారు గనుక నీవే వచ్చి ఇవ్వమన్నారు. అప్పుడు సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుచుండెను. దాని అర్ధము ఇంకా ప్రభువు చెప్పలేదు. సంఘమంతా సంస్కారము తీసికొంటున్నారు. నాకు ఆ ప్రక్క ఈ ప్రక్క మనుష్యులున్నారు. మధ్య తెల్లబట్టపరచిన ఒక బల్ల వచ్చెను. తెల్లని అంగీతో ప్రభువు వచ్చిరి.
పాదిరిగారు చెప్పినట్లు ప్రభువు చెప్పి, అయ్యగారికి ప్రభువే సంస్కారము ఇచ్చిరి. పాదిరిగారు సంఘానికిచ్చిరి. అయ్యగారేంటి రావడంలేదని సంఘము చూస్తూనే వెళ్లిరి. అయ్యగారికి ఇచ్చినట్లు మనకును ఇస్తారు. సన్నిధి కూటాలు ఎక్కువగుచున్నట్లు దర్శనములు ఎక్కువగుచుండెను. దర్శనములోనే బాప్తిస్మము, సంస్కారము ఇస్తారు. ఇది ఆత్మకు శరీరానికి పాదిరిగారివ్వాలి. నేను చెప్పిన సంగతులు మీ గ్రహింపులో బైలుపడునుగాక! ఆమేన్.