ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

మతోద్ధారణ ఉపవాస ప్రార్ధన

ప్రసంగ తేది: 27-10-1957 ఆదివారం రాత్రి



వాక్యము:- కీర్తన 46.


బైబిలంతటిలో భక్తులయొక్క జీవితాలున్నవి. అయితే వారందరు గతించి పరలోకానికి వెళ్లిపోయిరి. బైబిలు బైబిలులాగే ఉన్నది. బైబిలులోని భక్తులు పరలోకానికి వెళ్లిరిగాని బైబిలు భూమిమీదే ఉన్నది. బైబిలు వ్రాయబడిన తరువాత బైబిలు ప్రక్కనే క్రొత్త సంఘము ఏర్పడినది. ఆ సంఘము బైబిలులోనే ఏర్పడినది. ఈ బైబిలులో ఆదికాండము నుంచి మలాకీ వరకు పాతనిబంధన సంఘమున్నది. అయితే క్రొత్త నిబంధన పుస్తకము వచ్చినప్పుడు క్రొత్త సంఘమేర్పడింది. అది అపో॥కార్య॥ గ్రంథములో ఏర్పడింది. అదివరకు యూదులే సంఘస్తులు. ఈ అపో.కార్య. 15వ అధ్యా॥ మొదలుకొని ఇప్పటివరకు లోకాంతము వరకు అన్యులు, యూదులు సంఘము.


దా.కీర్తన. 46వ అధ్యా॥లో దేవుడనైన నేను అన్యులలో మహోన్నతుడనగుదునని ఉన్నది. యూదులలో దేవుడు మహోన్నతుడు. సంఘము వచ్చాక అన్యులలో మహోన్నతమైన సంఘము వచ్చెను. అన్యులనగా యూదులు కానివారు. బైబిలులో భక్తులెలాగున్నారో అన్యులు, యూదులు కలసిన సంఘములోను దేవుడు గొప్ప భక్తులను లేపెను. వారిలో ఒకరు డా॥ మార్టిన్ లూథర్. ఆయన ద్వారా క్రైస్తవ సంఘములో దేవుడు గొప్ప మార్పు చేయించెను. ఏలాగంటే అంతకుముందు గొలుసులతో బంధించిన బైబిలును డా॥ మార్టిన్ లూథర్ ద్వారా తీయించి అందరికి అందేటట్లు అచ్చులో వేయించెను.

గనుక ఈ అక్టోబర్ 31వ తేదీని లూథర్ మిషనువారు గొప్ప పండుగ ఆచరిస్తారు. ఎందుకనగా బైబిలు బైటికి వచ్చింది గనుక స్తుతించే పండుగ. అంతకుముందు బైబిలులేదు. ఇప్పుడు అన్ని మిషనుల వారికి బైబిలు వచ్చింది గనుక అన్ని మిషనులవారు స్తుతించి దేవునికి స్తుతి పండుగ చేయవలెను.


ఆ పండుగకును దేవుడు చేయించిన పనికిని, 18 ప్రశ్నలు వ్రాసి మనమధ్య ఉన్నవి. ఎన్ని ప్రశ్నలు అడుగగలమో అన్ని ప్రశ్నలకు జవాబు పొంది మిగతా వాటిని తరువాత అడిగి తెలిసికొందాము. ఎందుకు అడగాలనగా లూథర్ కాలములో జరిగిన చరిత్ర చదివి బాగుపడక బేధాభి ప్రాయములు కలిగించుకొనిరి. అవి పోవాలంటే ప్రభువునడిగి తెలిసికొంటే బేధాభిప్రాయములు సద్దణగును. గనుక ప్రభువా! నీ వర్తమానమును నీద్వారానే అందించుమని వేడుకొంటున్నాము. ఆమేన్.


1వ ప్రశ్న:- లూథర్ బైబిలును దొంగిలించినాడని అనుచున్నారు. దీనికి జవాబేమి? ఇది నిజమా?


జ:- ఈ ప్రశ్న అవ్వమ్మను సృష్టించుటలో ఆదికాండములోనే బైలుదేరినది. గాఢనిద్ర కలుగజేసి నేను ఆదాము ప్రక్కటెముక దొంగిలించినానని అంటున్నారు. అది దొంగతనమా! అవసరమునుబట్టి ప్రక్కటెముకను బైటికి తీసినట్లు సంఘమునకు బైబిలనే అద్దము అవసరమును బట్టి బైటికి తీసినాడేగాని దొంగిలించలేదు. అది దొంగతనము చేయుటకాదు. వాడుకలో లేనిదానిని వాడుకలో పెట్టుటకు బైటికి తీసినాడుగాని దొంగకాదు.


2వ ప్రశ్న:- లూథర్ కు స్వదేశీయ/స్వర్గీయ భాషావరము పొందినాడని కొందరు వ్రాసినట్లు అంటున్నారు ఇది నిజమా? ఈ సంగతి లూథర్ మిషను పుస్తకములోలేదు. ఇతర పుస్తకములలో ఉన్నది. ఇది నిజమా?


జ:- అవును. స్వర్గీయభాష ఆత్మను పొందినందున మాట్లాడినాడు. అందుకనే మీలో అనేకులు ఆత్మను పొందినప్పుడు ఆయనకూడ వచ్చుచున్నారని చెప్పిరి. అప్పుడు ఒక పెద్ద వ్యక్తిగా లూథర్ గారు దర్శనములో కనిపించిరి. అందుకు మనిషి రోడ్డుమీద కన్పించిన నాకు భయము పుట్టియుండును. అది ఆయన ధైర్యమును జ్ఞాపకము చేసినవి.


3వ ప్రశ్న:- ఈ వ్రాయబడిన పుస్తకము అమెరికాలో ఒక దొరగారి వద్ద దొరుకునని ప్రభువు చెప్పిరట. అది ఎట్లు దొరుకును? అడ్రస్ ఏది?


జ: -


4వ ప్రశ్న:- మాతో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడినావా? మేము విన్నట్లు ఆయన విన్నాడా? మాకు కనబడినట్లు ఆయనకు కనబడినావా?


జ:- లూథర్ కు వ్రాతద్వారాను, దర్శనముద్వారాను, స్వరముద్వారాను మనో ప్రత్యక్షత ద్వారాను, స్వప్నములద్వారాను మాట్లాడితిని.

ఏ.సి. కాలేజిలో బ్రిటానికా అనే పుస్తకమున్నది. అది రెండు బైబిళ్లంత ఉన్నది. దానిలో ఈ సంగతులున్నవి.


5వ ప్రశ్న:- చిన్నపిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చునని లూథర్ బోధించెనట. ఇది నిజమా? జిక్రావ్ అనే బోధకులు చిన్నపిల్లలకు కూడా బాప్తిస్మము ఇవ్వకూడదని బోధించినప్పుడు కోటలోనుండి బైటికి వచ్చి లూథర్ గారు, చిన్నపిల్లలు జన్మపాపము ఉండును గనుక బాప్తిస్మము ఇవ్వాలి.
ఇవ్వకూడదని ప్రభువు అయ్యగారికి చెప్పిరి. మీరేమి చెప్పుతారు? లూథర్ గారు చెప్పినది వ్రాసినది చిన్న పిల్లలకు బాప్తిస్మము ఇవ్వవచ్చునని. తేడా ఉన్నది గనుకనే ప్రభువును అడుగవలెను.


జ:- చిన్నపిల్లల బాప్తిస్మము గురించి శిష్యులకేమి నేర్పినాను. వెళ్లి చెప్పండి నమ్మినవారికి బాప్తిస్మము ఇవ్వమన్నారు. చిన్నపిల్లలైతే వాక్యము విని వారు నమ్మలేరు. నమ్మనివారు బాప్తిస్మము పొందలేరు. చిన్నవారికి బాప్తిస్మమిచ్చుట అనగా సిద్ధముగాని నేలలో విత్తబడిన విత్తనములే. దానిలో ఫలితముండదు. గవర్నమెంటులోను 20 సం॥లు క్రిందివారిని మైనార్టీలో లెక్కించుదురు. గనుక పరలోకపు గవర్నమెంటును నమ్ముట చేతకానివారిని బాప్తిస్మములో ఎంచకూడదు. బాప్తిస్మముగూర్చిన క్రమమును స్థిరపరచుటకే నేను 30 సం॥ల వయస్సులో పొందినాను అని చెప్పిరి.


6వ ప్రశ్న:- దర్శనాలు, తప్పుడు సిద్ధాంతములు అని లూథర్ గారు అన్నట్లు పుస్తకములో వ్రాసినారని ఉన్నది నిజమా?


జ:- ఒక బోర్డు కనబడినది. బోర్ట్ మీద

ఈ మూడింటి భావమేమిటి ప్రభువా అని అడుగగా ఆయనకు

సత్యవేద గ్రంథమును నేనే ఉండి వ్రాయించినాను. మత గ్రంథములలో

బైబిలులో మాత్రమే ఈ మాట ఉన్నది.

లూథర్ గారు

అయ్యగారు ఈ కాలములోను ప్రభువు మాట్లాడతారని లూథరన్ వారితో వాదించిరట.


7వ ప్రశ్న:- లూథర్ గారి దగ్గరకు ఒకసారి సాతాను వచ్చి ఆయన పాపాలనుగూర్చి ఆయనతో వాదించినప్పుడు సిరా బుడ్దితో దానిని కొట్టినాడట. ఆ సిరా మచ్చ గోడమీద ఉన్నదట. సిరా బుడ్డియు ఉన్నదట. పిశాచి వచ్చినదన్నమాట నిజమా?


జ:- నడిచే మనిషి ఒక కాలు ముందు ఒక కాలు వెనుక పెట్టి ఉన్నట్లు సాతాను కన్పించి అవును అన్నది. ఛీ! సాతానా! నిన్నెవరడిగినారు? నీవు వచ్చినావు నేను నిన్ను అడుగలేదు. ప్రభువునడిగితే నీవెందుకు వచ్చావ్? అనగా అప్పుడు సాతాను అన్నది. “సాతాను దయ్యములు సంఘకార్యములకు సాధనములుగా నుండును తెలుసునా”? అని మీరే వ్రాసికొన్నారుగదా?

8వ ప్రశ్న:- లూథర్ పేరుమీద లూథర్ మిషను పేరుపెట్టి మిషను స్థాపించిరి. అది లూథర్ గారికిష్టమా?


జ:- నాకిష్టములేదు. హేళనగా శత్రువులు లూథరన్స్ అని పిలిచిరి. అయితే లూథరన్ లు నాయందు గౌరవముంచే నా పేరున పిలువబడుటకు నాపేరు మీద మిషనును స్థాపించిరి. నాపేరు కంటే స్థాపన ముఖ్యము గనుక. ప్రభువు అడ్డగించక ఉన్నట్లు చెప్పమని నాకు ప్రభువు సెలవిచ్చినందున చెప్పుచున్నామనిరి. (అయ్యగారి ఆర్డర్ లో) జర్మనీ దేశములో క్రైస్తవులు లూథర్ గారి బోధ వినుచున్న గుంపునుచూచి అరుగో ఇరుగో లూథరన్స్ అని హేళన చేసిరి. లూథర్ గారికి ఆ హేళణ వచ్చినది. ఆ పేరు అలాగే వచ్చెను. ఆపేరుమీద సంఘస్థాపన జరిగినది. స్థాపన ముఖ్యము గనుక దేవుడు అడ్డగించలేదు. ఇప్పుడు నాకు సెలవిస్తే నేను చెప్పుచున్నానని భూలోకానికి వచ్చి చెప్పుచున్నారు.


9వ ప్రశ్న:- లూథర్ గారు భూలోకములో ఎక్కడ తప్పులున్నవో అవి దిద్దుటకు సంచారము చేయుచున్నట్లు ఒకరు చెప్పిరి. ఇది నిజమా?


జ:- ఆ దిద్దుబాటు సన్నిధికూటమే. పెద్ద లూథర్ గారు తాటిచెట్టును చూచినట్లు చూడాలి. 30 సం॥రాల వయస్సు ఉండి చురుకుదనముతో తిరుగుచున్నారు. చెయ్యెత్తి ఏమో చెప్పుకుంటు తిరుగుచున్నారు. ఇదేమి ప్రభువా అని అడుగగా:- ప్రభువన్నారు. ఇంత పెద్దవ్యక్తి వ్యక్తిగతముగా ఎందుకు వచ్చిరనగా మేడగది సంఘము దిద్దబడి శుద్ధి పొందిన సంఘము ఈ విధముగా లోటుపాటులలో పడిపోయినందువలన దిద్దుబాటు చేయుటలో ఈయనతో సమమైన పెద్దపులి లేనేలేదని చెప్పిరి. 16వ శతాబ్దములో ఉండేవారందరికి గిరజాలుండును. లూథర్ గారు 16వ శతాబ్ధములోనివాడు. 67 సం॥రాల వయస్సులో చనిపోయెను. విస్తారముగా బోధించిరి. గుండెనొప్పి వలన చనిపోయిరి. మార్కు 16:17వచనము వ్రాయలేదని ఎవరో కల్పించిరని పండితులు అంటున్నారు గనుక ఆయన రావడము ఆ వాక్యము ఎత్తడము నిజము. ఆయన సంచారము చేస్తూ ఇప్పుడు తిరుగుచున్నారు.

10వ ప్రశ్న:- మియన్న పోలిస్ అనే ప్రాంతములో 11వేల మంది గుడిలో వెలుపల స్థలములేక 7వేల మంది ఉన్నారు. ఆ మీటింగునకు లూథర్ గారు వెళ్లారా? అయ్యగారు “యేసుప్రభువు కనబడుచున్నారు. బైబిలు వివరించుచున్నారు”. ఇది మీరుకూడ చర్చించండి అని టెలిగ్రామ్ ఇచ్చిరి. బైబిలుమిషను చరిత్రకూడా వ్రాసి రాజారావుగారికి చూపించారు.


జ:- ఇప్పుడు మీకు యవ్వన లూథర్ వలె కన్పించిన కారణము మియ్యన్న పోలిస్ లోని యవ్వనులను ప్రేరేపించి ఈ సంఘపు పునాది యేసునాధుడే అని పాడుతూ ఓ యవ్వనవంతులారా! ఈ సంఘపునాది శ్రీ యేసునాధుడే అని పాడుచున్నారు. ఎఫెసి 2వ అ॥ము వచ్చెను.


11వ ప్రశ్న:- ప్రభువా! మా కూటాలకు లూథర్ గారిని పంపి కొన్ని హెచ్చరికలు చెప్పిస్తారా?


జ:- సన్నిధి సభ్యులు కన్పించుచున్నారు. మార్టిన్ లూథర్ గారు వచ్చి ఒక చెయ్యి ఒక్కొక్కరి వీపుమీదను ఒక చెయ్యి పరలోకపు తట్టు ఎత్తి “మాకర్త గట్టి దుర్గము నే నమ్ముకున్న మా ఆయుధము” నాకు సంప్రాప్తమైన కష్టములన్ని తొలగించునని నమ్ముచున్నావా? నమ్ముచున్నావా? అనే ప్రతి ఒక్కొక్కరిని అడుగుచున్నారు. ఈ గట్టిదనము సన్నిధి ధ్యానము చేసి అనుభవించి స్థిరపడండి.


12వ ప్రశ్న:- ప్రభువా! నీ స్నేహితుడైన మిలాంగ్టన్ ను తీసికొని వస్తారా? ఆయనచేత మాకేదైనా చెప్పిస్తారా? (లూథర్ కంటే మిలాంగ్టన్ చిన్నవాడు) జర్మనీలో లూథర్ వ్రాసిన వ్రాతలు దిద్దుబాటు చేస్తారు. లూథరు కోపధారి మిలాంగ్టన్ శాంతిపరుడు. మిలాంగ్టన్ 18 సం॥ల వయస్సులో వ్యాకరణము వ్రాసిరి. తెలివిగలవాడు. లూథర్ వ్రాసిన ప్రతి వ్రాత ఈయనకు చూపిస్తారు. మిలాంగ్టన్ సమ్మతించేవారు. మిలాంగ్టన్ గొప్ప వేదాంతి.


జ:- మిలాంగ్టన్ అను నేను లూథర్ గారి స్నేహితుడను మాత్రమే గాదు ఆయన ప్రాణమును కాపాడుటలో భటునివంటి వాడను. ఆయన వ్రాతలు దిద్ది సరిపెట్టుటలో సలహాలిచ్చుటలో పరిచారకుడనుకూడాయై ఉన్నాను. మీరుకూడా ప్రభువునందు మీ నమ్మకము నిలిపి శాంతి గొర్రెపిల్ల మనసు కలిగి ముందుకు సాగిపొండి అని చెప్పిరి.


13వ ప్రశ్న:- డా॥ మార్టిన్ లూథర్ గారు ఫిలిప్ మిలాంగ్టన్ ఒకప్పుడు చావ సిద్ధముగా నున్నప్పుడు మార్టిన్ లూథర్ గారు ప్రార్ధించగా ఆయన బ్రతికి యున్నారు; గనుక కాకానిలో జబ్బు పోతాయి అంటే కొందరు నమ్ముటలేదు. అది పిశాచి పని అంటున్నారు. అట్టి వారి దగ్గరకు వెళ్లి నీవే చెప్పు ప్రభువా! అని ప్రార్ధించండి.


జ:- భీమవరంలో శేషారత్నంగారు మీటింగులు పెట్టినప్పుడు అది పిశాచిపని వెళ్లవద్దన్నారు. పేపర్ లోకూడా పాపులకు రక్షణని వ్రాస్తున్నాము. కాకానిలో రక్షణ గూర్చే చెప్పుచున్నాము. లూథర్ గారు చేసినట్లు లూథర్ మిషను పుస్తకములోనే యున్నది. అది నమ్మితే ఇదెందుకు నమ్మకూడదు.


14వ ప్రశ్న:- ఇప్పుడు నీవిచ్చిన జవాబులన్నీ అచ్చువేయచ్చునా? ఇది నీకిష్టమా?


జ:- ప్రభువు అయ్యగారికి 3 సంగతులు చెప్పి విశ్వాసులకే చెప్పు. అవిశ్వాసులకు చెప్తే వారింకా చెడిపోతారని చెప్పిరట. కనిపెడితే అందరికి ప్రభువు చెప్తారు.


15వ ప్రశ్న:- లూథర్ మిషను విడిచిపెట్టుమని లూథర్ గారు అయ్యగారికి చెప్పిరట నిజమా?


జ:- అవును. ఎందుకనగా లూథర్ మిషనుకంటే మంచి మిషను లేదని 46 సం॥లు బోధలు చేసినాను. నా సేవకుడు గనుక లూథర్ ద్వారా చెప్పిస్తే నేను చెప్పిన దానికి బలమని ఆయనద్వారా చెప్పించితిని. నా చిత్తము నెరవేర్చేటందుకు లూథర్ మిషనును విడిపింపచేయుటకు లూథర్ మిషనుకు మూలకారకుడైన లూథర్ గారి ద్వారా చెప్పించితిని.


16వ ప్రశ్న:- లూథర్ కుమార్తెలు, కుమారులు వంశములోనుండి వచ్చిన వారెవరైనా ఉన్నారా?


జ:- లూథర్ చనిపోయి 400 సం॥లు అయినది. వారెవరైనా తెలిస్తే జర్మనీలో వ్రాసిన వ్రాతలు వారి దగ్గర ఉండవచ్చు.