ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
నమ్మిక
ప్రసంగ తేది: 3-4-1956
1. దేవుని నమ్మే నమ్మిక, గుణము మనలో పుట్టుకలోనే దేవుడు పెట్టినాడు. అది క్రొత్తగా పెట్టనక్కరలేదు.
ఉదా:- మనము
పుట్టినప్పుడు, ఇప్పుడున్నంత లేము. క్రమక్రమముగా పెరిగినాము. ఆలాగే దేవునియందు నమ్మిక మనకు క్రమక్రమముగా పెరుగవలెను.
అప్పుడే మనకోరికలు నెరవేరును.
2. నమ్మే గుణము పెట్టాడు. ఆ గుణము వృద్ధియగుటకు మొదట తల్లిదండ్రులు సాధకులు.
ఉదా:- బిడ్డకు పాలు త్రాగాలని ఉంటుంది.
ఆ
బిడ్డకు
తల్లి పాలిస్తాదని అతడు అనుకుంటాడా? అనుకొనడా? అక్కడున్నా కుక్క తనకు పాలిచ్చును అని అనుకొనడు. తల్లే ఇచ్చును అని
అనుకొనును.
కుక్కయందు కాక, తల్లియందు బిడ్డకు నమ్మిక యున్నది. అతనిలోని నమ్మిక వృద్ధికి
- 1) తల్లిదండ్రులు
- 2) మతము అనగా బోధకులు.
బోధకులు:- దేవుని నమ్మండి, ప్రార్థించండి. బైబిలు చదవండి అని చెప్పుతారు. ముందు తల్లివల్లను, తరువాత బోధకుల వల్లను తనలో నమ్మిక వృద్ధియగును.
3వది. విన్నది నమ్ముట.
4. బోధకుడు గొప్పవాడు. బోధకులు చెప్పేది యేమిటంటే దేవుడు పుట్టుకలో పెట్టిన నమ్మికనే చెప్పుదురు. మిగతావన్నియు స్వభావ సిద్ధముగా వస్తాయి. కాని దేవునిమీద నమ్మిక బోధకుడు చెప్పితేనే గాని నమ్మలేరు. పుట్టుకలో నమ్మిక పెట్టకపోతే అసలే ఉండదు. అసలే ఉండదు కాబట్టి బోధకులు చెప్పితే అర్దమగుచున్నది. అందరిలోని నమ్మిక బోధకులు చెప్పినప్పుడె ఆ నమ్మికలు బైటకు వస్తాయి బోధకుడు చెప్పుచుండగా తెలియును. ఆ తెలియుటే జ్ఞానము చెప్పుచున్నప్పుడు ఆ సంగతులు తెలిసికొని తనలో తాను మురిసికొంటాడు. బోధకుడు చెప్పే విషయములు తెలియనప్పుడు నమ్మవలెను. జ్ఞానమును పుట్టించినదే మనస్సాక్షి క్రమముగా పెద్దవాడైనాడు. మొదట బోధించుట బోధకుని పని. అది అయిపోయినది. నమ్ముట అనెది మనస్సు పని.
ఉదా:- దొంగతనము చేయకూడదు. విషయము
- 1) జ్ఞానము
- 2) బోధకుడు చెప్పారు.
కాని మానరు. ఉదా:- కుర్రవారు శెనగపప్పు ఎత్తుకొనిపోయి లేదని అబద్ధమాడును. కాబట్టి మనస్సాక్షి చెప్పుచున్నప్పటికిని ఒప్పుకోడు. అందుచేత దేవుని ఏది అడిగినను అది ఆయన దయచేయడు. ఎందుచేతనంటే ఒకదరినుండి
- 1) మనస్సాక్షి
- 2) జ్ఞానము
- 3) బోధకులు వీరు చెప్పిన మాటలు వినలేదు. కాబట్టి దేవుడు ఏమియు నెరవేర్చడు.
7వది. దేవునిమీద నమ్మిక ఇప్పుడు తెలిసికొనవలెనంటే మొదటిగా దేవుడు మనిషిలో పుట్టించిన నమ్మిక. ఇప్పుడు దేవుని నమ్ముట ద్వారా బైటకు వచ్చినది.
- 1) తల్లిని
- 2) తన వారిని
- 3) బోధకులను
- 4) జ్ఞానమును
- 5) మనస్సాక్షిని నమ్ముట ఎందుకంటే దేవుని నమ్ముటకు.
117వ కీర్తన.
దేవుడు మలను కలుగజేసినాడు. ఆయన కృప నిరంతరము మనలను వెంటాడుచున్నది. దేవుని నమ్ము గుణము మనలో ఉన్నదీ. మనము నమ్మదగిన గుణము
దేవునిలో ఉన్నది.
ఉదా:- ఒక మనిషి మరొక మనిషిని నమ్మే గుణము అతనిలో ఉండవచ్చు. కొంత కాలానికి పోవచ్చు. అయితే దేవునిలో
నుండి
మనిషి నమ్మదగిన గుణము నిరంతరము ఉండును.
ఒక్కొక్క సమయములో ఆయనను ఎంత ప్రార్ధించిన కష్టములు తొలగిపోవు. నిజముగా నమ్మిక ఉన్నది. ఆయన ప్రార్ధన వినుటలేదు. ఎందుచేత
నంటే
వారు ఆయనను హత్తియుండుటకు కష్టములు తప్పించడు. కీడు తొలగించడు. కోరికలు నెరవేర్చడు. ఎందుకంటే ఆయనకు మన పైనున్న అత్యధిక
ప్రేమ చొప్పున ఈ కష్టములద్వారా తన దగ్గరకు చేర్చుకొనుటకు వేసికొనుటకు, కష్టములుగాని, కోరికలుగాని నెరవేర్చడు. అంత
మాత్రమున
మనము ఆయనయందు అవిశ్వాస ముంచకూడదు. కష్టములెంతగా ఉండునో ఆయన ప్రేమ అంతగా ఉంటుంది.
నీవేయని నమ్మిక,
యేసు నాకు ...