ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

కానుకల పండుగ

ప్రసంగ తేది: 9-3-1958



వాక్యము: ఆది. 4:1-9; ద్వితీ.12:11; 2కొరింథి. 9:5-9.

నీకు జ్ఞాపకముంటే మీ జీవితకాలమంతా ఈ రెండు మాటలే తలంచుకొండి. ఆయన ఇవ్వకపోతే మనము ఇవ్వము. బైబిలులోని కథ జ్ఞాపకము చేస్తాను.

ఈ రెండు బైబిలు చదివిన వారికి తెలియును. ఈ బిడ్డ కథయు బైబిలులోనే యున్నది గనుక అందరికి తెలుసు. హేబెలు కథ జ్ఞాపకము చేయకముందు నేనొకటి చెప్పవలయును అని నా మనస్సునకు తోచినది గనుక ఈ సంగతి సరిగాయుంటే అంగీకరించండి లేనియెడల త్రోసివేయండి.


అయ్యగారికి ఈ ఉదయం ఊహలో ప్రభువు చెప్పినట్లు ఉన్నది. నీవు కానుకల పండుగ రోజున ఒక రూపాయి చందా వేసినావు నీవు వేసిన రూపాయి దేనితో చేసింది? వెండితో కదా! ఆ వెండి ఎక్కడిది? నేనేకదా కలుగజేసినది అది. నేను కలుగజేసినదే రూపాయిగా మార్చుకుని కానుకగా ఇచ్చావు గాని, ఏమి? ఎక్కువ వేసినావు! నేనిచ్చిందే నీవు నాకు ఇచ్చావు. అదేమి కానుక! అట్టుకు అట్టున్నర ఇస్తే అదే గొప్ప.


ద్వితీ. 12:11లో నీ శ్రేష్ట కానుక నా దేవాలయములోనికి తెచ్చివేయండని ఉన్నదనిగాని తోచినంత అనిలేదు. గాని శ్రేష్టమైనదనే ఉన్నది. ఒకరు రూ. 1000 ఇస్తే మనదృష్టిలో ఎక్కువగాని పెద్దదికాదు. ప్రభువంటారట ఇంతేనా? అని అంటారట. వినబడేటట్లు ప్రభువంటే సిగ్గుపడాలి. అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వగలనో అని అనవచ్చు. మనిషిలో

ఈ మూడు కలిస్తేనే మనిషి. నీవిచ్చిన రూపాయికి ప్రాణము, ఆత్మలేదు. గాని శరీరమున్నది. ఈ రూపాయి విలువ ఎక్కువ? 3 కలిగిన మనిషి విలువ ఎక్కువ? అనే ప్రశ్న మనలెక్క ప్రకారము దేనివిలువ ఎక్కువనగా మనిషి విలువే ఎక్కువున్నట్లు తోస్తుంది. దేవుని దృష్టిలో అలాగే. ఎలాగంటే 2వ కథయైయున్న ఆమె కథలో తన కున్నదంతా వేసింది. అదే ఎక్కువ.


శాస్త్రులు సంచులతోనే కానుకలిచ్చిరిగాని ప్రభువు సంచుల విలువ ఎక్కువగా ఎంచక స్త్రీ కానుక ఎక్కువుగా ఎంచెను. కలిగినదంతా ఇచ్చి తనకేమి ఉంచుకోలేదు. మనస్సులోనున్నదంతా ఇచ్చింది. దేవునికి ఏమికావాలి?

ఈ కానుక ఇచ్చే మనిషి సన్నిధికి వచ్చేటప్పుడు మొదటి తన ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని నీవశము చేస్తున్నానని సమర్పణచేయాలి. తరువాత కానుక ఇవ్వాలి. ఇది హేబెలులో జరిగినది. ఆ హేబెలున్నాడే తన మందంతటిలో ఉన్న శ్రేష్టమైన గొర్రెపిల్లను ఇచ్చెను. ఆయనకు ఇష్టమే. దేవుడుకూడా హేబెలుయొక్క శ్రేష్ట కానుకకు ముందు హేబెలునే కానుకగా తీసికొన్నాడు. బైబిలులో రెండు అంగీకరించినట్లు ఉన్నది. మనిషియొక్క శ్రేష్టతనుబట్టి కానుకను అంగీకరించెను. అయితే పిశాచి తన అన్నలో ప్రవేశించి అసూయ కలిగించినందున అతడు తమ్ముని చంపెను. చంపబడినను దేవునిదగ్గరకే హేబెలు వెళ్లెను.

హేబెలు గొర్రెపిల్ల అర్పించేటప్పుడు తనకు అతని శరీరము, ప్రాణము, ఆత్మను దేవునికిచ్చినట్లు అతనికి తెలియదు. గాని పరలోకానికి వెళ్ళాక తెలిసినది.

ఆ హేబెలుకంటే ఎక్కువ తెచ్చిన మనము ఈ పండుగలో దేవునికి కానుకవేస్తే కూర్చున్న స్థలములోనే సమర్పించుకుని కానుకవేయండి. మీరింతేనా నాకు వేసేది? “అనే మాట ప్రభువుతో అనిపించుకోకూడదు. ఒకసారి గుడిలో ఒక గొప్పాయన దగ్గర (యం.డి. అయ్యగారు) నేను కూర్చున్నాను. ఆయన తన గుప్పిటిలో గట్టిగా పట్టుకొని సంచిలో వేసే సెటప్పుడు చూస్తుండగా అది "కాణి". అది చూచి అయ్యగారు గుండె కొట్టుకొనెను. అయ్యగారు అనుకున్నారట దేవుడు ఇతనికి ఇంత ఇస్తే ఇంతేనా ఈయన దేవునికి వేయవలసినది అని అనుకున్నారట. తక్కువ జీతముగల నేనే ఇంత ఇస్తే ఎక్కువ జీతముగల ఆయన ఇంతేనా వేసేది అనుకుని గుండె బాదుకున్నారట యం.డి. అయ్యగారు.


ఆయన ఇప్పుడు లేడుగాని ఆయనకు తెలియదేమో! నేనీ సంగతి ఎవరికి చెప్పలేదు. నేడే ఈ ఉపన్యాత్ములకు చెప్పుచున్నాను. గనుక ప్రియులారా మీ శరీరాన్ని, ప్రాణాన్ని ఆత్మను దేవుని వశము చేయండి.

ఈ రెండు కలిగియున్నందువలన శరీరములోఏదో ఒకటి జబ్బు, చింత అనే కళంకమున్నది. నా ప్రార్ధన ఆలించలేదే అనే చింతైనా ఉండవచ్చు. ఇన్ని ఉన్నా నేను కానుక ఇస్తే అనగీకరించునా? అని అనుకొనక కానుక వేయండి. మీరే కానుకయైపోయారు గాన ఆయన మీ కానుక తప్పక తీసికొంటారు.

ఉదా:- నిప్పు చేతిలోనుంటే హానేకదా. వాటిని నాకు ఇస్తే మీకు కీడులేకుండా పరిహారము చేసివేస్తాను (దశమభాగము నిప్పు).


యెషయాతో అదే చెప్పెను.

నాకిచ్చినయెడల పరిహారిస్తాను. మంచి ఉంటే అదైనా నాకివ్వండి. అప్పుడు దానిని జాగ్రత్తచేస్తాను. చెడుగు+మంచి నాకివ్వండి. అప్పుడు మిమ్మును నాకు మీరే కానుకగా ఇచ్చినట్టే. అప్పుడు మీ కానుక నాకివ్వండి. ఈలాగు చేసినట్లయితే ఆ కానుక ఎక్కువైనా తక్కువైనా దానికి విలువ ఉన్నది. ఇదే హేబెలు కథలో కనిపించేది. దేవుడు

హేబెలు ముందు గొర్రెపిల్ల ఇచ్చినట్లే బైబిలులో ఉన్నది.

ముందు తననే దేవునికిచ్చుకున్నందున శ్రేష్టమైన కానుక ఇచ్చెను. గనుక రెండు శ్రేష్టమైన కానుకలను దేవుడంగీకరించెను. ఈ దినమున ఎవరైతే దేహాన్ని కానుకగా ఇచ్చి, తమ కానుకను తరువాత ఇస్తారో దానిని దేవుడు అంగీకరించును. ఈదినము హేబెలు కథ, బీదరాలి కథ చెప్పితిని.


3. బిడ్డ కథ:- ఒక తల్లి తన చంటి బిడ్డను ఎత్తుకొన్నట్లున్నది. ప్రతిరోజు ఆ బిడ్డ ఎత్తుకుంటున్నను ఆమె తమ్ముడు అరటి పండు తెచ్చి చంటిబిడ్డ చేతిలో పెట్టెను. ఈ కథ ఇంతే. అప్పుడే పిల్ల వెంటనే తినక ముందు ఆమె ఆ పండు ఇచ్చిన ఆయన నోటిలో పెట్టగా గొప్ప సంతోషము ఆ పండు ఇచ్చిన ఆయనకు వచ్చును. ఆ మంచి గుణము ఆ పిల్లకు బోధవల్లకాదు తల్లి చెప్పినందునను కాదు, గాని సృష్టికర్త నైజములోపెట్టిన లక్షణమేగాని ఎవ్వరుపెట్టలేదు. ఆ పిల్లకు ఆ మంచి గుణమున్నదని మేనమామకు చెప్పలేదుగాని ఆ పెట్టుట అనే క్రియవల్ల తెలిసింది. అలాగే ఈ దినము మీలోనున్న కృతజ్ఞత అనే లక్షణాన్ని గుర్తుగా కానుక ఇవ్వండి. అలాగే మేనమామ ఆ పండు నోటిలో పెట్టుకున్న పిల్లను ఎత్తుకుని బిడ్డ నీవు చేసిన పని మంచిదని ఆ పండుకొంచెము తిని తిరిగి ఆ పండును బిడ్డకే ఇచ్చెను. అలాగే మీ కానుకకు దేవుడు బుణము తీర్చుటకు ఎక్కువే ఇచ్చును. కాబట్టి మీరు ముందు ఏది ఇవ్వాలో అది ఇస్తే ఆ ఎక్కువ తక్కువ కానుకల బుణము ఆయనే తీర్చును.


నేటి కానుకలు రెండు. బీద విధవరాలు రెండు దమ్మిడీలు ఇచ్చినట్లున్నది. 1వ కానుక నీవే 2వకానుక నీ ఆస్తి. ఈ రెండును చందా పెట్టె దగ్గర ఇచ్చిన ఆమెను అంగీకరించినట్లు

హేబెలుకు చాలా గొర్రెలున్నవి. ఆయన వాటిలో మిక్కిలి శ్రేష్టమైన దానిని దేవునికిచ్చెను. ఇతడు మిక్కిలి ధనికుడు. బీద విధవరాలు హేబెలువంటి ధనికురాలు కాదుగాని బీదరాలి కానుక అంగీకరించుట ఆశ్చర్యము.

మన దృష్టిలో బీదరాలు బీదరాలే. దేవుడు పరిసయ్యులను మెచ్చుకొనక బీదరాలిని మెచ్చుకున్నాడు.

గనుక మీరందరు ఇప్పుడు బీదలా? ధనికులా? గనుక మీరు ఇప్పుడు ఆత్మ ప్రేరేపణతో ఇస్తున్నారా? మనస్సు ప్రేరేపణతో ఇస్తున్నారా?


ఉదా:- అనపర్తిలోని ఒక స్త్రీ ఇచ్చిన బియ్యపు చందాలో కొన్ని వెనుకకు తీసివేసికొని రాగా ఆత్మను పొందిన 9, 10 సం॥ల వయస్సుగల పిల్లలు ఆత్మప్రేరేపణతో ఆమె చేసిన పనిని చెప్పగా ఆమె సిగ్గుతో ఇంటికి వెళ్లినది. ఇంకా ఎక్కువే ఇచ్చింది. ఆ పిల్లలు ఆత్మప్రేరేపణగలవారు గాని పశువులుకాచే పశువుల కాపరులు. మీరందరు సన్నిధిలో ఉంటే ఆత్మ మర్మములు తెలియును. గాని లేనియెడల తెలియదు. ఇట్టి సంగతులు తెలియుటకు మీ ఇంటిలో

ఈ మూడు మాటలు మీకు మూడు కథలుగా అందునుగాక! ఆమేన్.