ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ప్రభు భోజన సన్నాహోపదేశము ప్రవేశము

ప్రసంగ తేది: 3-11-1959
రెవ. డా॥ జె. జాన్ సెల్వరాజ్ అయ్యగారి పుస్తకము (1)



వాక్యము: దానియేలు 2:9; ప॥గీ॥ 4:11


పాట: బైలుపరచినావు....

షరా:- ఇది ఎలాగుందనగా: మనము పుట్టటము ఒక్కసారే, తినడము రోజు. అలాగే పాపపరిహారము పొంది నూతన జన్మము కలిగియుండడము ఒక్కసారే. కాని ప్రభు భోజనము అనేక పర్యాయములు.


అయ్యగారు - దేవా నాకు సహింపు దయచేయుమని ప్రార్ధన చేసికొన్నారు.


షరా:- బైబిలు మిషనులో దర్శనమందు ప్రభువే స్వయముగా సంస్కార భోజనము వడ్డించుచున్నారు ప్రతి లక్ష్మివారము. అయినప్పటికిని ప్రతిరోజు ఇస్తాను అని అంటున్నాను ఇదేవరకే.

ప్రార్ధన:- దయగల ఓ తండ్రీ మీయొక్క మహామహోపద్యాయుడైన తండ్రీ నీకు వందనములు. మాయందు నీకు అధికమైన ప్రేమ అందుచేత ఆకాశము, భూమి మా యెదుట పరచి ఇవిగో ఇవి మీ కొరకే ఇవిగో నేను నీ కొరకే అని చెప్పగల దేవుడవు గనుక నీకు స్తోత్రములు. దయగల తండ్రీ ఎవరు తైలము తెచ్చుకొన్నారో వారిని ఆ తైలమును వారు సద్వినియోగపరచునట్టి చర్యను దీవించుము. అది నీవు నీ గ్రంథము చెప్పే తైలము ఎవ్వరైతే ఈ గదిలో ఆత్మశుద్ధి లేకుండా ఉన్నారో అట్టివారిని శుద్ధీకరించుము మరియు శరీరములో ఎవరికి అనారోగ్యమున్నదో వారికి స్వస్థత దయచేయుము. మాకందరికి సుఖనిద్ర దయచేయుము. ఇప్పుడు ఎవరైతే క్రొత్తగా ప్రార్ధన కొరకు వచ్చినారో వారిని కనికరించి వారియొక్క కోరిక నెరవేర్చుము. ఓ తండ్రీ ఈ గృహములో, ఈ కంపౌండులో కాకానితోటలో, పట్టణమంతా ఉన్న ఒక్కొక్కరిని దీవించుము. మా తరగతిని దీవించుము. రేపు ఎవ్వరు సిద్ధముగా ఉందురో వారికి అంతరంగ సంస్కార భోజనము అనుగ్రహించుము. ఓ తండ్రీ! మా జీవితకాలము అంతయు శరీర ఆహారము భుజించుచున్నాము మూడు నెలలకు ఒక పర్యాయము కాక ఒక నెలకు ఒక పర్యాయము కాక ఎప్పుడుపడితే అప్పుడే సంస్కార భోజనము కొరకు ఆశించే శ్రద్ధ దయచేయుము. అప్పుడు మా శరీరాత్మలకు బలము ఉండును. సైతానుయొక్క యత్నములన్నీయు నాశనము చేయుము. భూతము కనబడగానే మేము స్వభావ సిద్ధముగా భయపడుదుము. అలాగుకాక మాలో నీవు సంస్కార భోజనము ఉండుట కావలి. దూతలు ఉండుట చూచి సైతాను భయపడవలెను కాని మేము భయపడకూడదు అట్టి సింహపు గుండె దయచేయుము. రేపు సంస్కార భోజనము తీసికొనేటట్టు ఆకలి దప్పిక శ్రద్ధ దయచేయుము. ఈ రాత్రి సర్వగండములనుండి కాపాడుము. మాయొద్ద నీ దూతలను కావలిగా ఉంచుము ఆమేన్.


అయ్యగారికి రాజమండ్రిలో ఎంత స్పష్టమైన సంస్కారభోజనము ఇచ్చినారో మాకును అనుగ్రహించుము ఆమేన్.