ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

అనుస్థాన విషయములు



దైవ సహవాస-అనుస్థాన విషయములు ఉన్న గ్రంథము బైబిలు.


బోధలో మంచి బోధను మనము అంగీకరింతుము. బోధ నేర్చుకొన్నంత మాత్రమును బోధించినంత మాత్రమును, బోధను అంగీకరించినంత మాత్రమునను అంత ఎక్కువ ప్రయోజనము ఉండదు. అలాగైతే ఏమి చేయవలెను.


2. అనుస్థానము = క్రియ పద్ధతి. అనగా ఉన్నవి చేసి చూచుట, అట్లు చేసిన యెడల మనకు అంతయు మేలే. ఆలాగున చేసి చూసినప్పుడే అనుభవము కలుగును. మరియు ఎక్కువ ఆనందము కలుగును, ప్రయోజనము కలుగును. మనకు తెలిసిన బోధ వేరు క్రియ వేరు అని గ్రహించుకొనవలయును. మనము బోధించే బోధ ఒకరీతిగా నుండి క్రియ ఒకరీతిగా నుండిన యెడల ఇతరులు తప్పుపట్టుటకు ఆక్షేపణకు ఆధారము.


షరా:- కరక్కాయ, గంధకము వలన దంతములు గట్టుపడును అనియు చొప్ప చెవుడు, డొంకలోని వేపమొక్క ఆకు - వ్రణములను మాన్పుననియు చెప్పుట, థియరీ మాత్రము అయియున్నవి. ఆ ప్రకారముగా వాడుట (చేయుట) క్రియయైయున్నది. ఆ రీతిగా వాడనిదే నిజము తెలియదు. సరిగా వాడనియెడల మేలు కలగనప్పుడు, సరిగా వాడి చూడవలెను. అట్లే బైబిలు బోధలు, సిద్ధాంతములు, అర్ధములు నమ్ముట మాత్రమే చాలదు, వాటిని వాడుకలో (అచరణలో) పెట్టి చూడవలయును.


సత్యమును పరీక్షించు సాధనములు:- ఇవి ఎనిమిది కలవు. అందులో మొదటిది

షరా:- బైబిలులో ఉన్నది ఉన్నట్టుగానే నమ్ముట శ్రేయస్కరము. శత్రువులను క్షమించుమని (మత్తయి 5:44) బైబిలులో ఉన్నది, దీనిని మార్చలేము. దీనికి వేరే అర్ధము చెప్పరాదు, స్వాభిప్రాయము పనికిరాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పవలెననునది ఈ వాక్య దృష్టాంతము. పరిసయ్యుల పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడి (మార్కు 8:15) అనునది బైబిలు వాక్యము.


దీని (అర్ధ వివరణ కొరకు సొంత అభిప్రాయాలు అవసరమైనవి) వ్యాఖ్యానము, స్వాభిప్రాయము అగత్యమైయున్నది. ఎందుకనగా పిండి అంటే ఇక్కడ పిండి కాదు పరిసయ్యుల దుర్భోధ అని అర్ధము. బైబిలును మార్చలేదు గాని, దాని నిజ భావమును బైటికి తీసినాము.


బైబిలును బట్టి “మిషను” తేడాలు కలుగలేదు గాని “అర్ధమునుబట్టి” కలిగినవి. ముఖ్యముగా 4 వందల సం॥ల నుండి మిషనులలో పోరాటములు కలవు. మనమిది వరకు చెప్పినట్లు ఈ పోరాటములు అందరు కలిసి క్రీస్తుప్రభువును అడుగుటవలన పోవును. అది నేటివరకును జరుగలేదు. ఇది మా నమ్మిక, అది మీ నమ్మిక. మా నమ్మిక చొప్పున చేయుదుము. మీ నమ్మిక చొప్పున మీరు చేయండని, అన్ని మిషనులవారు ఒకరితో ఒకరు ఒప్పందముగా ఉన్నయెడల బేధాభిప్రాయములుండునుగాని, కలహములు ఉండవు.


స్వస్థి కూటములు:-
1. పీడ, చెవుడు, కాలినొప్పి మొదలగు బాధలలో ఉన్నవారిని ప్రశ్నింపవలెను గాని బోధింపకూడదు.

ఈ ఐదింటివల్ల ప్రజలు విలపించుచున్నారు. ఈ ఆలాపన ఎవరికి వినబడుతుంది? ఇంట్లో యున్నవారికి, వారికంటే ముందు ఎవరికి వినబడుతుంది? దేవునికి. పిల్లవాడు గుంటలో పడిపోతే తనంతట తానే పైకి రాలేడు. ఎవరైనా ఒకరు వచ్చి తీయవలెనుగదా! అట్లే నరులు ఇన్ని చిక్కుల్లో పడిపోయి ఉండగా, దేవుడే రావలెను. ఎవరు వచ్చినా మనిషికి సంతుష్టి ఉండదు. పాపము మొదట ప్రవేశించిననాడే దేవుడు మొదటి మనుష్యుల యొద్దనుండి వెళ్లిపోయెను. అప్పటినుండియు దేవుడు రావలెననే కోరిక నరునిలో యుండెను. అయితే దేవుడు దేవుడుగా వస్తే చూడలేము. గనుక మనిషికి సంతుష్టియుండదు. మనిషి రూపముతో వస్తే సంతుష్టి కాబట్టి కొన్ని ఏండ్ల క్రిందట నరరూపిగా వచ్చి యేసు అనుపేరుచేత పిలువబడెను. అప్పుడే ఆయన నరులలోయున్న రెంటిని బాగుచేసెను. ఆత్మజీవములోని పాపమును పరిహరించుటవల్ల ఆత్మజీవమును బాగుచేసెను.


శరీరములోని వ్యాధిని బాగుచేయుటవల్ల శరీరమును బాగుచేసెను. ఆయన పరలోకమునకు వెళ్లినప్పటికిని ఈ రెండు కథలు నమ్మేవారికి ఇప్పుడును సహాయము చేయగలడు. వ్యాధియున్న వారును చిక్కులున్నవారును అవి పాపమువల్లనే వచ్చినవి గనుక ముందు ఇతర వ్యాధిగ్రస్తులారా పాపములు తీసివేయించుకొనండి. అప్పుడు తక్కినవి ఇక్కడ అంతరించిపోవును. జబ్బులు బాగుచేసికొనుటే మొదటిదనియు ముఖ్యమైనదనియు తలంపవద్దు. ఈ అవస్థలు తెచ్చిపెట్టిన వాడెవడు? సైతాను గనుక క్రీస్తుప్రభువు ముందుగా సైతానునే జయించెను (అరణ్యములో సైతాను శోధింపగా క్రీస్తుప్రభువు అతనిని దైవవాక్యమువల్ల జయించెను).


క్రీస్తుప్రభువు మనకు బదిలీ అయియున్నాడు. గనుక మనము చేయలేని పనులు ఆయన చేసిపెట్టును (రక్షకా నా వందనాలు నేను చేయలేని వన్ని నీవే చేసిపెట్టినావు). క్రీస్తు తనను జయించునని సాతాను తెలుసుకొని మనుష్యులలో ప్రవేశించి ఆయనను చంపి ఆయన సమాధిలో యుండిపోవుననుకొన్నాడు కాబోలు అయితే ఆయన లేచి పైకిపోయెను. వాడు ఇంకేమిచేయును. వాడిచేతకాక ఆయనమీద కోపము శిష్యులపై, ఇప్పటి వారిపై చూపుచున్నాడు. అందుకే శిష్యులను పట్టుకొని ఆ కాలములోని క్రీస్తు వ్యతిరేకులు హింసించినారు. నేటివరకు హింసించుచున్నారు. కాబట్టి హింసకులైనవారు మారి, క్రీస్తుయొక్క జయమును నమ్ముకున్న వారికి కూడా జయము కలుగును. ఆయన వెళ్లిపోయినను మన దగ్గరున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక ఉంటానని అన్నాడు గనుక ఇది నమ్మండి. మీ పాపములు, మీ జబ్బులు మొదలైనవి అంతరించిపోవును.


షరా:-

కంఠత:- దేవుడు ప్రేమమైయున్నాడు.


ప్రార్ధన:- ఓ తండ్రీ! సర్వజనాంగములవారు నీ సంఘముయొద్దకు ఉపదేశము నిమిత్తమై రావలెనని కోరుచున్న నీ అంతరంగ ప్రేమకు అనేక వందనములు. మరియు తండ్రీ! ఆ విధముగానే నీ సంఘముకూడా అనుదినము నీ ఉపదేశము కొరకును నీ సహవాసాభివృద్ది కొరకును, అనుదినము నీ యొద్దకు రావలెనని కోరుచున్న నీ అంతరంగ ప్రేమకు అనేక వందనములు.


ఇది ఆదిసంఘముయొక్క వాడుక. వారు అనుదినము ప్రార్ధన చేసికొన్నారు. ఈ కాలాంత సంఘముకూడ వారి మాదిరి ననునరించి అనుదినము కూడుకొనే భాగ్యమనుగ్రహించుము అని వేడుకొనుచున్నాము. అనుదినము అన్నదికూడ ఆదిసంఘముయొక్క తలంపులోయున్న ఈ మాటకూడ నేటి సంఘముయొక్క తలంపులోను ఉండునట్లు ప్రవేశపెట్టుము.


కుటుంబ ప్రార్ధన అనుదినమున్నదిగదా అనియు, ఆదివార ఆరాధన ఉన్నదిగదా అనియు అప్పుడప్పుడు ప్రత్యేక కూటమున్నదిగదా అనియు, సంతుష్టిపడి ఊరుకొనక అనుదినము కూడ ముఖ్యముగా ఈ దినములయందు అవసరమని తోచేటట్లు నీ సంఘముయొక్క జ్ఞానమును వెలిగించుము. అన్యరాష్టములవారైతే మొదట వారు సువార్త వినుటకును, నీ సంఘమైతే మహిమ సువార్త వినుటకును, నీ పాదములయొద్ద కూర్చుండుటకును త్వరపడే చురుకుదనము అనుగ్రహించుము.


ఆది సంఘమునకు ఎన్ని పనులున్నను ప్రత్యేక దేవాలయము లేకపోయినను, ధనికులకున్నన్ని సౌకర్యములు లేకపోయినను అనుదినకూటము జరుపుకొనినట్లు నేటి సంఘముకూడా జరుపుకొనే శ్రద్దననుగ్రహించుము. (మత్తయి 11:29) ప్రకారము నాయొద్ద నేర్చుకొనండి అని వ్రాయబడిన వాక్యముయొక్క నిజార్థమును గ్రహించుకొని ఆ పనిమీద అనుదినము సమావేశముకాగల సమయోచిత జ్ఞానము దయచేయుము.

నేర్చుకొనుచున్నవిగాక “నాయొద్ద అనుమాట చొప్పున నీయొద్దకూడ నేర్చుకొనవలెననే ఆతురత కలిగించుము”. మూడు విధములైన నేర్పు మాత్రమే గాక నీయొద్ద నేర్పు ఎంతో అవరమని తోచేటట్లు దయచేయుము.


పైమూడు విధములు నీయొద్ద నేర్చుకొనుటయే అయి ఉన్నప్పటికిని ప్రత్యేకముగా నాయొద్ద అని నీవు స్పష్టముగా వ్రాయించిన మాటను గౌరవించి అది ఎట్లో అని ప్రశ్నించుకొని ఆ మూటిని అనుసరించిన విధముగా ఈ నాలుగవదియు అనుసరించే అనుస్థాన శక్తి దయచేయుము. ఆమేన్.