ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

ప్రభువు రక్తముద్వారానే జయము



ఆదాము, హవ్వ ఏదెను వనములో పాపములో పడకముందు ధనము, జ్ఞానము, శక్తి, పని లేకుండెను అది.1:27-29; 3:23. వారు అప్పటివరకు జీవవృక్ష ఫలము తినలేదు, కానీ వారు దేవుని మాటకు విధేయత చూపిన అదికూడా వచ్చియుండును. మన ప్రభువులో నిత్యజీవమున్నది. మనమును ఆయనవలె ఉండగోరిన ఆయన జ్ఞానము, శక్తి మనకును వచ్చును. యేసుప్రభువునకు ఉన్న జ్ఞానము, ఆదాము జ్ఞానము కంటె గొప్పది. మనము జ్ఞానమును ప్రభువుయొద్ద సంపాదించినయెడల, పరసంబంధమైన జ్ఞానము మనకు వచ్చును. 1కొరింధి. 12 అధ్యా!. యేసుప్రభువు పునరుత్తానుడైన తర్వాత ఆరోహణుడై వెళ్లేటప్పుడు నేను మరల తిరిగి వస్తానని వాగ్ధానము చేసినాడు. ఆయన నిజముగా వస్తూయున్నారని గురుతులు కనబడుచున్నవి.


ఏవరు సిద్ధపడిరో ఎవరు ఎదురు చూస్తూయున్నారో, వారు ఆయనద్వారా పైకెత్తబదుదురు. ఆ దినమున ఆయనను చూతురు ఆయన రహస్యములన్ని తెలుసుకొందుము. నిరీక్షణ కలిగిన మహిమ.


దృష్టాంతము: పిల్లవాడు బడికి వెళ్ళి అన్నీ ఒక దినమే నేర్చుకొనజాలడు. ఆలాగే మనమును అన్నీ ఒకసారి నేర్చుకొనలేము. పాఠశాల బిడ్డలు తమ తరగతుల వరుసలో పై తరగతికి వెళ్లుదురు. ఈ నిరీక్షణ బిడ్డలకుగలదు. మనము దైవిక జ్ఞానము పొందవలెను. ఇవియొక దినము తెలియును. జ్ఞానము ఆయన దూతలను బట్టియు కెరూబులనుబట్టియు, మహిమనుబట్టియు వచ్చును సామె. 8:4 జ్ఞానము ఘోషెంచుచున్నది.


మనుష్యుడు: మనము బుద్ధిహీనులమై పోయినాము తీతు 3:3 మనము అవివేకులము.


యేసుప్రభువును పొందనివారు బుద్ధిహీనులుగాను ఉన్నారు. ఇది పాపియొక్కస్థితి. అవిధేయులు, అవివేకులు, మోసపర్చబడినవారు, నానావిధమైన దురాశలకు లోనగుచున్నారు. ఇది మన అంతరంగము. మనమాయనను పొందినప్పుడు జ్ఞానులమగుచున్నాము 1కొరింథి 13:7-10; సామె 8:5 బుద్ధిహీనులకు బుద్ది ఎట్లున్నది తెలుసుకొనవలెను. దేవుని ఆత్మ ఇప్పుడు పిలుస్తూనేయున్నది. దేవుని ఆత్మకు హక్కు ఉన్నది. యేసుప్రభువు సత్యమైయున్నాడు. ఆయన సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును (యోహాను 8:31-33). అనేకమంది చిన్నబిడ్డవలెనే ఉంటున్నారు. ఆత్మీయ జీవితములో ఎదగనే మనము ఆయనలో నివసించినప్పుడు అప్పుడాయన అనేక రహస్యములు మనకు బైలుపరచును సామె 8:4. తెలివి జ్ఞానముతో నిండి ఉన్నా ఆయనకు విధేయత చూపవలెను యోహాను 7:17. ఆయన చిత్తము చొప్పున చేయవలెను. సామె 8:11 జ్ఞానము ముత్యములకన్న శ్రేష్టమైనది. లోకమంతా పొందిన ఏమిలేదు, జ్ఞానము పొందవలెను. ఇదే నిజమైన దైవజ్ఞానము సామె 8:14. పరాక్రమము 8:34 నా గడపయొద్ద కనిపెట్టుకొని; 8:35 నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. బిక్షగాండ్లను పోలియుండకుడి.
దృష్టాంతము: ఒకరు బాగా చదువుకొని డాక్టరైయుండును, గాని తెలివిలేని బుద్ధిహీనునివలె అనవసరమైనవాటికి డబ్బు వ్యర్థముగా ఉపయోగించును.


హెబ్రీ. 1:13,14 1కొరింథి. 6:3లో మనము దేవదూతలకు తీర్పుతీర్చుదుము అని వ్రాయబడియున్నది. పనులలో సహాయపడుటకు అందరకు అనేకమంది సేవకులున్నారు. మనకు దేవదూతల సేవచేయుదురు. మనము క్రీస్తు రక్తముచేత కడుగబడితే దేవదూతలు సేవచేయును హెబ్రీ. 1 చివర వచనము. ప్రభువు శరీర రక్తములద్వారా కలిగే ఈ శక్తి అధికారము ఆదామునకు ఇచ్చినదానికంటె మనకు ఎక్కువ. రోమా. 8:29,30. ఆయన తన కుమారుని సారూప్యమునకు మనలను మార్చును. పరసంబందమైన రహాస్యములను మనమాయనకు లోబడితే గ్రాహ్యముగును (అర్థమగును) మనలను తన సారూప్యము గలవారినిగా చేయవలెనని తలంచవలెను. ఆయనవలె మనము అయ్యేవరకు ఆయనకు తృప్తిలేదు. గనుక నీ కాలమును నీ సమస్తమును దేవునికొరకు వాడవలెను మత్తయి 12:36. మనము చేయు వ్యర్థమైన ప్రతి సంగతికి లెక్కచెప్పవలెను. యేసుప్రభువు మాటలలో వ్యర్థమైన మాటలు లేవు. ఆయన చెప్పినది నెరవేర్చును. అంధకారశక్తులను చంపుటకు దేవునిశక్తి పొందవలెను. వాక్యము చెప్పునప్పుడు నిద్రపోకూడదు. లోకస్థులు సినిమాలకుపోయి నిద్రపోరు. దేవుని వాక్యము దగ్గర నిద్రవచ్చును. దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలకించిన యెడల దేవుని సింహాసనముమీద కూడ్చుండుటకు నేర్చుకొందురు. జయించువారు వీటిని స్వతంత్రించుకొందురు. ఆ మహిమను ఎక్కువగా కోరండి. యోహాను 14:2లో ఆన అంటున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములుకలవు, నేను మీకు స్ధలము సిద్ధపరుచుదును. మిమ్మును తీసికొనివెళ్లుదును. మీరు ప్రభువు ఆత్మతో నింపబడినప్పుడు మీరు ఆయనలో నున్నప్పుడు ఆయన దృష్టిలో మీరు ఎంతో గొప్పవారు. పౌలు కొరకు ఏ రక్తము చిందింపబడెనో అదే మనకును చిందింపబడెను.


ప్రకటన 12:11 గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టి జయించినవారు ఎట్లు సైతానును జయించిరి. రక్తముద్వారా మీరు ప్రభువునకు మహిమనిచ్చిన జయించెదరు. ప్రతి దినము మీ పాపములు ఒప్పుకొనిన ప్రభువు తన రక్తముతో మిమ్మును కడుగును. ప్రభువా! నీ రక్తముచేత నా నోటిని, కండ్లను, చేతులను కడుగుము. ఇట్లు ప్రతిదినము ఒప్పుకో! ప్రతిదినము తప్పుమాట విషయము, మాటల విషయములలో నీ రక్తముతో కడుగుము అని అడగండి. నీ సాక్ష్యముద్వారా నీ ప్రభుని రక్తమని నీవు మహిమపరచెదవు. అదే రీతిగా జయించెదవు. తీయన రక్తముద్వారానే జయము. నీవు ప్రతిదినమును కడుగబడినట్లయితే నీకు దేవుని సంగతులకొరకై ఆకలి దప్పులు వచ్చును. మీరు జయ జీవితము పొందేదానికి ప్రార్ధిస్తూయున్నారా? విడువక విసుకక ప్రార్ధించిన యెడల జయము పొందెదము.