ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

యోనా ఉపవాస చరిత్ర

ప్రసంగ తేది: 10-2-1946.



వాక్యము: యోనా 1:17


ఈవేళ యోనాయొక్క చరిత్ర ఉపవాస చరిత్ర బైబిలులో ఉన్న చరిత్ర చెప్పుచున్నాను. ఈదినము ఈ కథ తీసికొన్నాము. ఇది వరకు మోషే ఏలియా 40 దినములు ఉపవాసమును గురించి చెప్పినాను. మత్యగర్భమందు యోనా మూడు దినములుండెను. సముద్రములో, తుఫాను, ఓడలో గలిబిలి.

1వ భాగము:- చేప కడుపులోనికి వెళ్లిన తర్వాత మనిషికి

ఈ ఐదు, ఇవి తానుచేసిన అపరాధమునకు శిక్ష అక్కడకు వెళ్లడముతోనే ప్రార్ధన ప్రారంభించెను. ఈ ప్రార్థన ముందే చేస్తే బాగుండును. శిక్ష అనుభవించుచున్నాడు కష్టస్థితిలో ఉన్నవారందరు జ్ఞాపకముంచుకొనవలసిన ప్రార్ధన.

మనిషి వచ్చు అవస్తలు చాలా ఉన్నవి దేవుని సెలవు లేనిదే ఏ అవస్థరాదు. మనిషి అపరాధముచేసే తప్పక అవస్థ వచ్చును. యోనాకు అవస్థలు వచ్చినవి గాని మరణమురాలేదు. యోబునుగూర్చి సాతాను సెలవు అడిగినప్పుడు దేవుడు ప్రాణానికి సెలవు ఇవ్వలేదు.


అపరాధము బట్టి అవస్థలు వచ్చును. చేపకు అవస్తే. ఎందుచేత యోనా అరగడు. యోనాకు అవస్తే; కేకలు వేసినాడు. ఈ మూడు రోజులు అవస్థపడమే. ఎక్కువ బాధ చావు కోరుకొన్నను రాదు. ఏడేండ్ల పరిపాలనలో బాధపడలేక చావు కోరుకొంటారు. చావురాదు. యోనా సముద్రములో పడలేదు. చేప కడుపులో పడలేదు. మరి ఎక్కడ పడ్డాడు. అవస్థలలో పడిపోయినాడు. దైవాజ్ఞలకు అప్పుడప్పుడు వచ్చును. ఇట్టి అవస్తలు వచ్చాను.


దేవుడు న్యాయవంతుడు గనుక సామాన్యులకు విశ్వాసులకు భక్తులకు అందరకు దైవాజ్ఞకు వ్యతిరేకముగా (విరోధముగా) నిడిస్తే దుష్ట ఫలితము తప్పదు. యోనా తెలిసి చేసినాడు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. యోనా మారుమనస్సు పొందిన తరువాత తప్పు తెలుసుకొని తన్ను తాను శపించుకున్నాడు. ఎన్ని శపించినా తనజన్మమునే.


ఇది భక్తులకు గొప్ప అంతస్తు. నోటితో దూషించని దైవభక్తులు మనస్సుతో దేవునిదూషిస్తారు. యోబు ఏమి పాపము చేయలేదు. తననే శపించుకొనెను గాని దేవునిని దూషించలేదు. అట్లే యోనాకూడా అనలేదు. ఇది భక్తుల శ్రేష్టత. ఎన్ని శోధనలు వచ్చిన దేవునిమీద విసుగుకొనరాదు. విసుగుకొనకూడదు దేవుని పక్షముగా దేవుని ప్రతినిధులై యోనావలె యోబు ఉండవలెను.

ఈ మూడు చూపించినవి. ఈ మూడు ఏకకాలమందే మ్రింగినవి. దేవుడు మనమీద ఏదైనా కోపము వచ్చిన కోపము చూపడు కాని అవస్థలు మూలముగా కోపము వచ్చును. దేవునిలో దివ్యలక్షణములు ఉన్నవి.

మూడు రోజులవరకు మ్రింగుచునేయున్నవి తరువాత చేప మ్రింగినది. తరువాత సముద్రము మ్రింగినది. తరువాత అవస్థలు మ్రింగినవి గనుక మొట్టమొదట మ్రింగినది దేవుని న్యాయ లక్షణము.


1వ ఉదా:- పిల్లి ఎలుకను పట్టుకొని విలవిలలాడించినట్లు యోనాను దేవుని న్యాయలక్షణము మూడు రోజులు భుజించినది.


2వ ఉదా:- పులి మేకను పట్టుకొని గుంజినట్లు యోనాను న్యాయము గుంజినది. వెంటనే దేవుని ప్రేమ బయలుదేరి యోనాను రక్షించినది.


3వ ఉదా:- సాధుసుందర్ సింగ్ గారిని పట్టుకొని పాడు నూతిలో పడవేసిరి. అంధకారము గ్రమ్ముకొన్నది. శవముల కంపుగా లేదు ఉన్న గాలి కంపు తాళము వేసిరి. తాళపు చెవి రాజుగారి దగ్గర ఉన్నది.


సాధుసుందర్ సింగు ప్రార్ధన:- నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రార్ధనచేసినాడు. 3 రోజులు తర్వాత దేవదూతలు గొలుసు వేసి బైటకు తీసినారు. దేవుని మహిమ కొరకు హతసాక్షులైనను మనము దేవుని కొరకు కొన్ని భయంకరమగు శ్రమలు వచ్చును.