ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

బాప్తిస్మ ఆదివారము

ప్రసంగ తేది: 27-10-1957.
అనురాగరావు గారి. పుస్తకము (3)



వాక్యము: మార్కు 16:15,16.


ఈవేళ నేను మాట్లాడవలసిన విషయము వేరే ఉన్నది. గనుక ఈ దినము రేపల్లె తాలూకానుండి హిందూ విశ్వాసులు బాప్తిస్మము + ప్రభుసంస్కారముల కొరకు వచ్చియున్నారు. గనుక అంశము మారింది. యేసుప్రభువు పరలోకానికి శిష్యులయొద్ద సెలవు తీసికొని వెళ్లేటప్పుడు వారికి పని అప్పగించిరి. అప్పుడు ముఖ్య శిష్యులు 11 మంది. కాని వారికి అప్పగించిన పని చాలా విశాలమైన పని.


ప్రభువు మాటలు వినండి:-

మనుష్యులు కొద్దిమందేగాని పొలములు ఎన్నో కోట్ల ఎకరాల పొలము.


చివరిమాట భూదిగంతములన్నారు:- భూమికి నాలుగు దిక్కులున్నవి. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరములు ఉన్నవి. నాలుగు దిక్కులకు మధ్య మూలలున్నవి. ఈశాన్యం, వాయవ్యము, ఆగ్నేయం, నైబుతి మూలలు. అక్కడకు దిక్కులైనవి. 8 దిక్కులు, 4 స్థలాలు. ప్రభువు ముఖ్యమాటన్నారు. 11మంది శిష్యులైన మీరు బోధచేసి శిష్యులుగా చేయమన్నారు. చాలకష్టమైన పని. ఈ 11 మంది శిష్యులను యూదాకాక వారిని నిజశిష్యులుగా మార్చాలంటే 33 1/2 సం॥రాల 12 దినాలు పట్టినవి.


ఇది సన్నిధి కూటములో చెప్పిరి. 33 1/2 సం॥ల 6 మాసముల 12 దినాలు. ఇది ప్రభువు వయస్సు. అదివరకు వారికి పాతనిబంధన ఉన్నది. ఆ భక్తులను నిజ శిష్యులుగా చేయాలంటే 33 1/2 సం॥ల 6 మాసముల 12 దినాలు పడితే ఏమి తెలియని వారిని శిష్యులనుగా చేయాలంటే ఎంత కష్టము.

వారిని శిష్యులుగా చేయుట కష్టము. ఈ దినము బాప్తిస్మము పొందవచ్చిన వారెంతో కాలము నుండి వింటూ, ఇప్పటికి దారిలోపడిరి. ఎంతవరకుంటారో, అదివారికి ప్రభువుకు తెలియాలి. స్వంత జిల్లాలోనేగాదు, అన్ని విదేశాలకు వెళ్లండి ఇది ప్రాముఖ్యమైన మాట.


బాప్తిస్మము

11మంది శిష్యులైనట్లు అందరిని శిష్యులుగా చేయాలి. మన గురువు ప్రభువు. మనందరము ఆయన శిష్యులుగా ఉండాలి. భూదిగంతాలకు వెళ్లలేకపోయినా వెళ్లండి అన్నారు గనుక వెళ్లగలిగినంతవరకు వెళ్లవలెను. 8 దిక్కులు 4 జనాంగాలు వెళ్లండి. తక్కిన 12కు వెళ్లండనేది తాళపుచెవి.


ఈ దేవాలయములో మన సంఘములో బాప్తీస్మము పొందేవారెందరున్నారు. పొంది ఇంట్లో ఉన్నారా? ప్రభువు చెప్పినట్లు వెళ్లి చెప్పుచున్నారా? అందరు అనుకొండి:-

అందుకనే పౌలు సువార్త ప్రకటించకపోతే శ్రమ అని వేదన ఉన్నట్లు చెప్పిరి.


11 మంది ఆ కాలములో అంతా విడిచిపెట్టి వెళ్లిరి మనమైతే ప్రభువు ఇష్టములేని గుణములు విడిచిపెట్టి వెళ్లండి. ఒక భక్తుడన్నాడు విడిచిపెట్టి వెళ్లునప్పుడు గేటు దగ్గర పేతురుండి రక్షించబడిన నీవు ఎందరిని రక్షించావు అని అడుగునట. ఒకాయన నాకు తీరుబడి లేదన్నాడట. నీకు రక్షించుటకు తీరుబడిలేకపోతే నీకు బహుమతి ఇవ్వను, మాకు తీరుబడి లేదన్నారట.

నమ్ముటనగా ప్రభువును గూర్చిన బోధ నమ్మి బాప్తిస్మముపొందాలి. నమ్మినాను బాప్తిస్మమెందుకని కొందరందురు. నమ్మిన నీవు బాప్తిస్మముపొందాలి. పొందకపోతే నమ్మలేదన్నమాట. నమ్మి, పొంది; అప్పుడు రక్షణ.


దీపములో

న్యాయతకు బాప్తిస్మము పొందాలనేవారికి 6 ప్రసంగాలు చేయాలి. అవన్నీ చెప్పను. ముఖ్యమాట నమ్ముటే చెప్తాను. మీరు బాప్తిస్మానికి వచ్చినారు గనుక వచ్చిన మీరు పొందండి అని చెప్పను. నమ్ముచున్నామని వచ్చిన మిమ్ము నమ్ముచున్నారా అని అడుగముగాని బాప్తిస్మము పొందుచున్నారని మాకు తెలుసును.


మీరు నమ్మినారో లేదో నమ్మకం ఉంటుందో లేదో అది ప్రభువుకే తెలుసు. పశ్చిమ గోదావరి నుండి వైశ్య కుర్రవాడు 16 సం॥ల అబ్బాయి అయ్యగారి దగ్గరకు వచ్చి ఎల్లప్పుడు మీ దగ్గరే ఉంటానన్నాడు. వాదములో గట్టివాడు అన్నాడట. మీరు వృద్దాప్యములో తిరుగలేనప్పుడు యింటింటి దగ్గర బియ్యము, కూరగాయలు అడిగి తెస్తాను, వైష్ణువుడను గనుక అడుగ సిగ్గుపడనని చెప్పెను. గుంటూరు వచ్చాడు, అయ్యగారిమీద విశ్వాసము పోలేదు. 25 సం॥రాలైనది జరిగి. గుండ్లవల్లేరులోని చిన్నకూటానికి అప్పుడే సన్నిధి కూటముగూర్చి బోధించి సన్నిధికి గది కట్టండి అన్నారట. సన్నిధిగూర్చి జీవితములో వినలేదన్నారట బాప్టిస్టువారు. ఆ వైశ్య కుర్రవాడు విని చెప్పిందంతా సత్యమని ముద్రవేసికొన్నాడట. అయ్యగారు బోధకు పంపిస్తే తను వెళ్లినచోటెల్లా మా మతములు మంచిది, మా ప్రభువే మంచివాడు మీరందరు మాలోనికి రావాలని బోధించగానే కయ్యము వచ్చేది.


ఆ అబ్బాయి బోధ వింటూ ఆ ప్రకారము చేస్తున్నారో లేదో అని చూచేవాడట, రెప్పవెయడట. కన్నుతిప్పడట, ఇట్లు అయ్యగారి దగ్గర ఉంటూ వేరే మిషను వారి దగ్గరకు సహవాసానికి వెళ్లగానే వారన్నారట - ఏమంటే నీ నదిలో ముంచబడితే

ఒక సం॥ము బోధ విడచిపెట్టి కృష్ణాలో ఒకరాత్రి ముంచగా పైకిచూస్తే ఆత్మరాలేదు. చుట్టుచూస్తే వరాలు రాలేదు. వారిని అయ్యగారిని విడిచి కమ్యునిస్టులో చేరి నాయకుడై జైలుచేసి అయ్యగారివద్దకు రాగా బైబిలు చదివి ప్రార్థిస్తున్నావా? బోధ ఎవరికైనా చెప్పుచున్నావా? అన్నారట. లేదని చెప్పి నాకు కమ్యునిస్టు బోధ బాగుందన్నాడు. గనుక అక్కడే ఉండిపోయినాడు. గనుక ఈ దినము బాప్తిస్మము పొందువారు పెడబోధ విన్నట్లయితే కడకు పోతారు. దానికి ఒక సూత్రమున్నది.


గనుక మిక్కిలి తరచుగా ప్రభువు భోజనము తీసికొన్నా బలము వచ్చి కడకు పోకుండా ఉంటారు. సన్నిధి సభ్యులు ప్రతి లక్ష్మివారము మోకాళ్లూని సంస్కారము కొరకు అడగండి అని చెప్పిరి. వారట్లు చేయగా ప్రభువు సంస్కారము ఇచ్చిరి. దేవదూతలు వచ్చిరి. ఒక్కొక్కరి వద్ద నిలిచిరి. సన్నిధిలో బల్ల ఉన్నది. రూపాయి బిల్లంతా రొట్టె, దేవదూత ఒక్కొక్కరి దగ్గర నిలిచి దీవించుట, కాపాడుట, జరిగెను.


19 సం॥రాల క్రితము దేవాలయములో ఏప్రిల్ 24వ తేది పగలు 10 గం1॥కు 1938 సం॥ము ఆరాధనలో అయ్యగారికి ప్రభువు ఇచ్చిరి. అందరు బల్ల దగ్గరకు, పాదిరిగారి దగ్గరకు వెళ్లుచుండగా ప్రభువు నా దగ్గరకు వచ్చి ఇచ్చిరి. ఇదీ ప్రక్కనున్న డాక్టర్లకే తెలియలేదు. ఈ సంగతి సన్నిధి కూటాలకు చెప్పగా వారట్లు చేసిరి. ప్రభు సంస్కారమిస్తూ - “గుడిలోనిది మానవద్దు, సంఘము ఎప్పుడిస్తే అప్పుడు పుచ్చుకొనండి. నేనిచ్చినప్పుడు నా దగ్గర పుచ్చుకొనండి”. నేనిచ్చినప్పుడు నా దగ్గర పుచ్చుకొనండని చెప్పిరి. ఈ కొద్దిమాటలు దేవుడు దీవించునుగాక! ఆమేన్.