ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

మహా దేవుని గుడి

ప్రసంగ తేది: 11-3-1958వ సం॥ము గుంటూరులో దేవదాను అయ్యగారు చేసిన ప్రసంగము, మంగళవారం ఉదయం. (మరియు 8-11-1959)



వాక్యము: ఎజ్రా 5:8లో మహా దేవునియొక్క మందిరమున్నది.


ఈ వాక్యములో ఉండే ముఖ్యమైన అంశములు మనము చదివినాము. అన్యులైనవారు, దేవుని బిడ్డలు కట్టుచున్న ఆలయమునకు ఒక పేరుపెట్టిరి. ఆ పేరు వారికి తోచిన బిరుదు. అదేమనగా “మహా దేవుని గుడి” అది మహా దేవుని గుడి అని ఎందుకు అనవలెను? వాళ్లుకొలిచే దేవుడు మహాదేవుడు కావాలిగాని, యూదులు కొలిచే దేవుడెట్లు మహాదేవుడు? ఆయన నిజముగా మహాదేవుడైన యెడల వారే వచ్చి కొలవాలి గాని రాజుకెందుకు అట్లు ఉత్తరపునఖలు వ్రాయాలి? వారేవచ్చి ఆ మహాదేవుని కొలవాలి, నమస్కరించాలి. బైబిలులో ఇది అన్యులనుగూర్చి ఉన్న ఒక మహా విడ్డూరంగా వ్రాయబడిన జరిగిన సంగతి. వారు (ఇతర మతస్థులు) ఒప్పుకొనుచున్నారుగాని, క్రైస్తవమతము మహాదేవుని మతమని తెలుసుగాని వారు ఆటంక పరచక మానరు. క్రైస్తవ మతసంస్థలు మంచిపనులు ఎన్నిచేసినా వారు ఆటంకపరచక మానరు. వారి ప్రయత్నములు ఎట్లు సాగెననగా, ఇశ్రాయేలీయులు చేయుపని వృద్ధి అగుచున్నది అని ఉన్నది. ఈ గుడి పని వృద్ధి అగుచున్నదని కన్నులారా చూచిరిగాని, వారి దుష్టనైజమునుబట్టి ఆపుచేయుటకు అట్లు చేసిరి. అట్లే మన ఇండియాలో క్రైస్తవమతము వృద్ధిచూచి మనము ఆపినా ఇది ఆగదు అనుకున్నారు.


మన దేశాధికారి నెహ్రూగారు ఒక సభలో ఏమి చెప్పిరనగా "క్రైస్తవ మతము ఎంత ఆపవలెనన్నా అంత వృద్ధిలోనికి వస్తున్నదని" చరిత్రనుబట్టి చెప్పిరి. కాబట్టి క్రీస్తుమతము వృద్ధిలోనికి వచ్చివేసెను, ఆపుచేయలేమని అన్నారు. ఇప్పుడు విరోధులు క్రైస్తవమతమును ఆపవలెనని (ఆర్య సమాజకులు) ప్రయత్నించుచున్నారు. ఆర్యసమాజకులు “ఇవన్నీ తెలిసిన నెహ్రూగారు సింహాసనముమీద ఉన్నంత కాలము క్రైస్తవమతము ఉండునుగాని మరొకరు వచ్చినా ఉండదు” అన్నారు.


ఇదే క్రైస్తవమతము గూర్చి ఆనాడు రోమావారు “ఊహించిన” ఆగిపోవును అని అన్నారు గాని ఆగిందా? ఆ పని జరిగిందా? లోకచక్రవర్తులు ఆపవలెనన్నా ఆగిందా? క్రైస్తవ మతముయొక్క ఖ్యాతి ఈ 20 వందల సంవత్సరములలో మరింత వృద్ధిలోనికి వచ్చెను, ఆగదు. ప్రభువున్నంతకాలము. నెహ్రూగారున్నంత కాలముకాదు. కాబట్టి విశ్వాసులారా! కష్టములు రాక తప్పవు. శరీరానికి, జీవనానికి, శత్రువుల వల్ల దెబ్బలు వస్తాయి. మనము ప్రార్ధనలో ఉంటే వారు గెలువరు. లేకపోతే జయమురాదు. మోషే చేతులెత్తినప్పుడు జయము కలిగింది. దింపినప్పుడు అపజయము కలిగింది, సన్నిధి కూటములో ఆయా అంశములు పెట్టుచున్నారు గాని శత్రు భయముగూర్చి పెట్టుటలేదు.


యేసుక్రీస్తువారి (పై వస్త్రము-అంగీ) బట్ట ముట్టుకొనవలెనని విశ్వాసము ముదిరి 12సం॥ల నుంచి రక్తస్రావముచే బాధపడిన స్త్రీ బట్ట ముట్టుకొని బాగుపడింది. యాయీరు ఇంటిలో చిన్నది చచ్చేపోయింది. ప్రభువు ఆ బిడ్డను బాగుచేసిరి. ఇక్కడ ఈమె బ్రతికి ఉంది గానీ అక్కడ ఆ చిన్నది చచ్చే ఉంది. గనుక ప్రభువు బ్రతికున్న 12 యేండ్ల రక్తస్రావ స్త్రీయొక్క రక్తస్రావాన్ని 12 యేండ్లు చనిపోయిన 12సం॥ల చిన్నదానిని బ్రతికించారు (మత్తయి 9:18-26; మార్కు 5:42). ఇది పన్నెండేండ్లే అది పన్నెండేండ్లే. ఈమె వుట్టుగనే ఆమెకు వ్యాది ప్రారంభించింది. ఆమెను ఈమెను ఒకేసారి బ్రతికించిరి. బైబిలులోని 66 పుస్తకములలో ఉన్న 62 పుస్తకాలలో దేవుని మహిమ ఉన్నది. మిగిలిన 4 సువార్తలలో అధిక మహిమ ఉన్నది.


4 సువార్తలు చదివినచో ఎవరికి జ్ఞానమురాదు? ఇందులోనే అసలు జ్ఞానముంది. అయితే, మనుషులు మరొక జ్ఞానమును వృద్ధిచేసికొనిరి. అది గ్రంధాలయములవల్ల వృద్ధిచేసికొనిరి. వీటికి జోడు 4 సువార్తలలోని జ్ఞానము చేర్చాలి. అప్పుడు మనిషి జ్ఞానము సంపూర్తియగును. రక్తస్రావ స్త్రీ వృత్తాంతములో ఒక స్త్రీ జబ్బుగానుండి మందు వేసికొంది. డబ్బు ఖర్చుచేసింది. డబ్బు ఖర్చు అయినది కాని బాధపోలేదు, పోలేదు, పోలేదు సరికదా! కాని డబ్బు పోయింది. ఆమె జబ్బు పోలేదుగాని, డబ్బుపోయింది అప్పటికి 12 సం॥లు అయిపోయాయి. వైద్యులయొద్దకు వెళ్లి ఈ 12 సం॥లు తీసికొన్న మందులు అవి అరిగిపోయాయి. ఇక మిగిలింది యేసుక్రీస్తుప్రభువే. గనుక 12సంలు నమ్మలేదు. ఈ 12 సం॥లు ప్రభువు మనస్సులో ఉన్నవి. ప్రభువు ఆ పనిమీదనే రోగులను బాగుచేయుటకే ఆయన వచ్చారు (మత్తయి 9:12,13).


అవిశ్వాసులను, శరీర రోగులను బాగుచేయుటకు ప్రభువు వచ్చారు. జబ్బులకు మందువాడే కథ తెలుసు ఆమెకు. ఆ రెండవ కథ తెలిసికొనుటకే ఆ 12 సం॥లు ఉంచాడు. అప్పుడీ ఆ అమ్మాయికి విశ్వాసము కుదిరినది. అక్కడ ఆ బిడ్డ పుట్టిందిగాని ఈమెలో 12సం॥లు పట్టింది. ఆ బిడ్డకు 9 నెలలే పట్టింది. ఈ మనుష్యుల కథ ఇట్లుంది. ప్రార్ధన అయిపోయి ఆమేన్ అనగానే జబ్బు పోయింది అని అనుకొనవలెనట. పోలేదంటే దయ్యం, అవిశ్వాసము కూడా ఉంటుంది. పోయింది అనగానే పోతాది. క్రైస్తవులందరు చేసే గొప్ప పొరపాటు అదే. దేవుడు కలుగజేసిన మనిషికి అంత జ్ఞానముంటే దేవునికి ఇంకెంత జ్ఞానమున్నది? పోయిందనుకుంటే దయ్యము, జబ్బు, అవిశ్వాసము నుంది రక్తస్రావముతో బాధపడుచున్న బ్రతికి ఉన్నా, చచ్చినట్లుగా ఉన్న 22 యేండ్ల రక్తస్రావ రోగిని, చనిపోయిన 12 యేండ్ల చిన్నదానిని ప్రభువు బ్రతికించారు. అన్నీపోవును. ఆమేన్.