ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

కానుకల పండుగ

ప్రసంగ తేది: 11-3-1953



వాక్యము: ఆది. 41-5; లూకా 21:1-4 2కొరింథి. 9:5-9.


1. దైవసన్నిధాన వర్తులైన ప్రియులారా! ఎండాకాలము ప్రారంభమైనది. దప్పికవేస్తున్నది. నీళ్లు త్రాగుము అని ఎవరైనా వారికి చెప్పాలా? లేదా వారంతట వారే నీళ్లు త్రాగుదురా? ఎవరైన ఒకరు బహుమానము ఒకరిని ఇచ్చేటప్పుడు నాకు సలాము చెప్పుమని ఈయన చెప్పాలా? ఈయనంతట ఈయనే చెప్పునా? ఏది బాగా ఉంటుంది. నీళ్లు తనంతట తాను త్రాగడం, ఇతరులు చెప్పకుండా త్రాగడం ఏది సహజమైనది. ఒకరు చెప్పుట వలనకాదు, తన మనస్సులో కలుగుట వలన త్రాగుట మంచిది, సహజము. సలాము చెప్పుట సహజము.


2. దేవుడు మన జన్మం నుంచి నేటివరకు అనేక బహుమానములు, ఉపకారములు ఇస్తున్నాడు. చేస్తున్నాడు గనుక సృష్టికర్తకు నమస్కరించుట స్వభావముగనే వస్తుంది. నమస్కరించాలనేది మనలోపలున్న మంచినైజము. ఉండవలసిన నైజము. దేవునివల్ల మనము ఉపకారము పొందినపుడు సంతోషము ఉండునా? విచారముగా ఉండునా? చిరకాలము నుండి జబ్బుగానున్న రోగి దగ్గరకు వెళ్ళి ప్రార్ధించగా ప్రభువు అతని జబ్బు తీసివేసినప్పుడు అతనికి సంతోషముగా ఉండునా? విచారముగా ఉండునా? జబ్బు తనలోనుండి పోయిన వెంటనే సంతోషించును. మూడుసార్లు ఒకరు చెప్పుటవల్ల సంతోషించునా? చెప్పకుండా సంతోషించుట నైజమా? ప్రతిదీ నైజములోనికి వస్తుంది. దేవుడు మనందరకు చేస్తున్నా ఉపకారాలు, ఆయన నైజములో ఉన్న ఉపకారాలే. అవి అనుభవించునప్పుడు సంతోషించుట మన నైజములో నున్న సంతోషమే.


3. దేవునికి కానుకలు

ఒకసారి ఒక కథ చెప్పినాను. ఒకరు అరటిపండు ఒలిసి చిన్న బిడ్డ నోటిలో పెట్టి తినిపిస్తున్నాడు. అప్పుడా బిడ్డ తన నోటిలోనున్న పండు చేతిలోని పండు కొంతతీసి తన సంతోషము వలన నోటిలో పెట్టబోయెను.


సంతోషము చేసిన పని:- ఈ అరటి పండు ఇచ్చినాయనకు ఈ అరటి పండు బిడ్డ కిచ్చినందువల్ల కలిగిన సంతోషముతో సంతోషము. ఆలాగే మనకు కలిగిన ఉపకారములను బట్టి సంతోషము కలుగుచున్నది. ఉపకారమే సంతోషము కలిగిస్తున్నది. ఇది రెండు ప్రక్కల నుండి వచ్చిన

ఆ సంతోషము మనకు ఖాయమైతే దేవునికి మనము తిరిగి కానుకలిచ్చుటయు ఒక నైజమైయున్నది. దేవుడు మనకు చేయు ఉపకారములు రెండు.

దేవుని ఉపకారములు అవిశ్వాసులకు చేసేవి కొన్ని విశ్వాసులకు చేసేవి కొన్ని అవిశ్వాసులు + విశ్వాసులు. దేవుని సృష్టిలోనివారే గనుక ఆయన ఉపకారాలు ఈ ఉభయులకును చేస్తున్నాడు.


ఈ దినము కానుకల పండుగ:- ఈవేళ మీరు తెస్తున్నా కానుకలు ఒకరు చెప్పకుండా, మీ మనస్సులో సహజముగా తెచ్చేవైతే దేవుడు అంగీకరించును. ఒకరు చెప్పవచ్చు. చెప్పిన పిదప దేవునికింత ఇవ్వాలనే మనస్సు, నైజముతో మీరు కానుక తీసికొని రావలెను. బోధకుడు బోధించినంత మాత్రానా కాదు. మీ అనుభవము మీకు బోధించగా తీసికొని వచ్చిన కానుక దేవునికి

గనుక ఇప్పుడు వచ్చిన మీలో ఎవరు నైజమును బట్టి కలిగిన సంతోషమును అనుసరించి కానుక తెచ్చినారో ఎవరిమట్టుకు వారే ఆలోచించండి. నేను అట్టి సంతోషమును బట్టి తెచ్చినానా లేదా? అని పౌలు ఒక చిన్న మాట వ్రాసెను. “మీరు నిశ్చయించుకొన్నా ప్రకారము ఇవ్వవలెను” అని. దేవుని వల్ల పొందిన ఉపకారాలకు తగినంత విలువైన కానుక ఎవ్వరూ ఇవ్వలేరు. దేవుడు అదిచూడడు గాని ఎక్కువ, తక్కువ ఆయనకు లెక్కకాదు గాని హృదయములో ఎంత సంతోషము ఉన్నదో అది ఆయనకు లెక్క కానుకల పెట్టె దగ్గర పరిసయ్యులు వేసిన కానుకలు పెద్ద మొత్తాలు గాని విధవరాలి కానుక చిన్న మొత్తమే. ప్రభువు లెక్క తప్పు చేసిరంట. అదేమంటే ఎక్కువను తక్కువన్నారు. తక్కువను ఎక్కువన్నారు గనుక అజ్ఞాని దృష్టిలో తప్పేగాని, జ్ఞానిలెక్కలో కాదు. ప్రభువు లెక్కసరి. జ్ఞానిని, విశ్వాసిని అడిగితే ప్రభువు చెప్పినదే రైటంటారు. ఐతే దేవుడు మనకిచ్చే కానుకలు ఒక్క నిమిషములో లెక్కపెట్టగలమా? మన బ్రతుకులో మనకెన్ని సంవత్సరాలున్నవో నిమిష నిమిషానికి చేసే ఉపకారాలున్నవి గాని తెలియవు. ఒకటి చెప్పవచ్చును. గుడికి వచ్చేటప్పుడు అందరిలో ప్రాణమున్నది. చావలేదు. ఈ మధ్య ఎన్ని నిమిషాలున్నవి? బ్రతికినామా లేదా? మనలను ప్రాణాలతో కాపాడిననాడా? లేదా? ఒక్కొక నిమిషము, ఒక్కొక ఉపకారము కాదా? నిమిషాలెప్పుడు లెక్కపెట్టము. లెక్కపెట్టలేము.


అబ్రాహాముతో నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత విస్తారము చేస్తాను గాని లెక్కపెట్టలేవన్నారు. అట్లే ఆయనిచ్చు దానాలు లెక్కించలేము. ఆయన చేసేవి అన్ని ఉన్నవి. ఇచ్చే గుణము ఆయనలో ఉన్నదిగాన, మనలోను ఉండాలి. దర్మగుణము ఆనయలో ఉన్నది. గాన అదే మనలోను పెట్టెను. మనకు దానము ఇచ్చే గుణము ఆయన ఇచ్చిందే. ఆయనలో ఉన్నదేగాన మనము ఇతరులకిస్తాము. దేవుడు ప్రతిరోజు కానుక ఇస్తూనే ఉన్నాడు. నిముషాల కానుకలు కాదు. దేవుడు ప్రాణము కలిగిన మనకు ఆయన ఇచ్చే గుణము, ఇచ్చే పని ఎట్లు ఇచ్చెనో అట్లే ప్రాణము లేని వస్తువులకును ఇచ్చేపని ఇచ్చినాడు. పైన ఆకాశమున్నది. ఆకాశమంత భూమి అంతటికి ప్రతిదినము ఏదోయొకటి ఇస్తూనే ఉన్నది. ఆకాశము భూమికిచ్చే పని దేవుడు పెట్టిన పని. ఆయనలో ఉన్న పని పెట్టిన పని అనేది పెట్టిన పని. సూర్యుడున్నాడు. దానికి జీవములేదు. ప్రాణము లేకపోయినా సూర్యునిలో నుండి ఎండ, కాంతి, వస్తుందా? లేదా? ఆ పని సూర్యుని నుండి వచ్చుచున్నట్లు దేవుడు పెట్టిన పని. ఆలాగే మనలోను దేవునికి ఇచ్చుట.


దేవుని + బీదలకిచ్చేపని. ధర్మ కార్యాలన్నింటికి ఇచ్చే పని మనలోను పెట్టియున్నాడు.

చంద్రుని నుండి భూమికి వెన్నెల వస్తుంది. నేను మీకు వెన్నెల ఇస్తున్నాను పుచ్చుకోండి అనుటకు ప్రాణములేదు గాని ఇచ్చేపని మాత్రమున్నది. ఆ పని దేవుని పని. ఇచ్చే పనివల్ల కలిగిన పని. మేఘాలను చూడండి. అక్కడనుండి వర్షము వస్తుంది. నేనే వర్షము పంపిస్తున్నానని మేఘము చెప్పుటలేదు గాని పని జరుగుచున్నది. పై వాని వలన ఉపకారము జరుగుచున్నదని వాటికి తెలియదు. తెలియని వాటివలన ఉపకారములు చేస్తుంటే, తెలిసిన మనద్వారా ఉపకారాలు చేయించడా? బీదలకు అవసరమున్న ధనికులకు ఇతర ధర్మకార్యాలు సంఘానికి కానుకలద్వారా ఉపకారము చేయించడా? చేయించును. ఈ దినము అందరము దేవునికి కానుకలు తెచ్చుటే బుజువు.


దేవుడు మనకు చేసేది ఉపకారము. ఆకాశము మనకు చేసే ఉపకారము చెప్పిరి. ముగ్గురు చేసే ఉపకారాలు చెప్పిరి. ఏదైనా నైజములో నుండియే రావాలి. గనుక మీరింకా కానుక ఇవ్వకముందే నైజములో నుండి తేనట్లయితే నైజములో ఇప్పుడైన పెట్టుకొనిన దేవుడు అంగీకరించును.


ఇంకా ఒకరు చేసే ఉపకారము తరువాత చెప్పుతాను. దేవుడు చేసే ఉపకారాలకు ముగింపు ఉపకారము విలువ తెచ్చి అన్నిటినుండి మించిన ఉపకారము ఏక కుమారుడే. కుమార దానమును, కుమార కానుకను తలంచి నీ కానుకను బట్టి నా కోరిక నెరవేరినదని సంతోషించును. ఈ వర్తమానము మీ ఆత్మీయ వృద్ధికి ప్రతి ఫలముగా మారునుగాక! ఆమేన్.