ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
మతోద్ధారణ పండుగ
వాక్యము: ఎఫెసి 5:15,16; కొలస్సీ 4:5; 2కొరింధి. 6:2-11; సౌలు, పేతురు అపో॥కార్య. 16:25,26; 12:5-10.
ప్రార్ధన:- తండ్రీ! నీ అమూల్య వాక్యవర్తమానము అందించుము. వర్షాకాలమందు గొట్టములలోనుండి పడు నీళ్లక్రింద పిల్లలు శుభ్రపడునట్లు మా ఆత్మీయ జీవితమును ప్రతిదినము శుభ్రముచేసి, దిద్దుబాటుచేయుము. ఈ వర్తమానము చదువు ప్రతి ఒక్కరు ఈ వర్తమానము నాకుకాదు అని అనుకొనక దానిని అంగీకరించు కృప దయచేయుము.
దేవుని వాక్యమును విని, నమ్మి, ప్రవర్తించుట వలన ఒక అనుభవము. దేవుని వాక్యమును ప్రకటించుటవలన మరియొక అనుభవము వచ్చును. దేవుడు మోషేగారి ద్వారా శాపములు, దీవెనలుగల ప్రసంగములు రెండుసార్లు ఇశ్రాయేలీయులకు వినిపించెను (లేవీ. 26; ద్వితీ 28).
మోషే మొదటగా లేవీయకాండములో ఆయన సేవలోను, రెండవదిగా ద్వితియోపదేశకాండములో తన జీవితాంతమందు వినిపించెను, చివర ఆయన మరణము చివరి అధ్యాయములో నున్నది.
దేవుడు జర్మని దేశములో లూథరును లేపి గ్రంథమును బైటికి తీసెను. బైబిలు గ్రంథములోని వాక్య ప్రసంగములను కూడా వినిపించెను. బైబిలులో వర్తమానములు తీయుట గొప్ప పని.
బైబిలు బైటికి తీయుటనుబట్టి డి.యల్. మూడీ మొదలైన భక్తులైన వారు వర్తమానములు తీసి వ్రాసిరి. 20వ శతాబ్ధములో రేడియోలద్వారా ప్రసంగములు అన్ని దేశములకు పంపి వినిపించుటకు 14 దినములలో "లూథరు స్థితి" ఐరోపా అంతా వినబడెను.
అధునిక సమాచార పద్ధతుల ద్వారా ఇప్పుడు ప్రసంగము చేసిన అన్ని దేశములకు ఒకేసారి, ఒకే సమయమందు వినబడును. అందరు ఒకచోట ప్రసంగించినవి బైబిలు గ్రంథములోనివే. ఈవేళ మతోద్ధారణ పండుగ. దేవుడు మోషేకు ప్రవక్తలకు, శిష్యులకు, యోహానుకు కాల క్రమమున బైలుపర్చినాడు.
తుదకు “బైబిలు మిషను” బైలుపడినది. రాకడకు ఇంకా బైలుపర్చును. వెయ్యేండ్లలో ఇంకా బైలుపర్చును. లూథరు 16వ శతాబ్ధములో బైబిలు బైటికి తీసెను. దానిని ఇప్పుడు ఆచరించి దీవెనలకు స్తుతించుచున్నాము. లూథర్ కు బైబిలు విషయము ఇంతవరకు వచ్చునని తెలియదు గాని, ఇంకను వృద్ధిలోనికి వచ్చుచున్నది.
లూథరు బైబిలు బయటికి తీసి ఆకాల ప్రజలకు చూపించగానే శత్రువులు రేగిరి. ఎలాగంటే దీపము వెలిగించగానే పురుగులు చేరును. మార్టిన్ లూథర్ ను ఆనాటి క్రైస్తవ మతసంఘ పెద్దలు ఆయనను పంది అనిరి. ద్రాక్షతోట పాడుచేయు పంది అనిరి. త్రాగుబోతు అనిరి. లూథరు తన జీవితములో 67 సం॥లు జీవించి లూథరు అనేక గ్రంథములు చదివి, చివరి దశలో గుండెనొప్పి చేత చనిపోయెను. అయినప్పటికిని నేటికిని జర్మనీ దేశములో వ్రాతలున్నవి. వాటిలో కొన్ని జర్మనీ భాషనుండి తర్జుమాకానివి కలవు. అవి ఎంతో సంతోషకరమైనవి. అటంకములు, నిందలున్నను దేవునిరాజ్యము సాగవలెను.
లూథరు ధైర్యముగానేయుండి ఒక్కసారె నిరాశపడెను. ఆయనచుట్టు శత్రువులుండిరి. వారిచుట్టు ఫెడ్రిక్ గవర్నమెంటు సంబంధీకులు వ్రాతలో మిలాంగ్టన్ అనే స్నేహితుడు శత్రువులున్నా స్నేహితులున్నారు గనుక సాగించెను. అది మాత్రమేగాక ముఖ్యముగా కష్టకాలములు రాకమానవు గనుక ఉపయోగము చేసికొనండి. దీనికున్న ముగింపుకాదు మనము పెట్టుకొన్న ముగింపు దేవుడు ఈ వర్తమానమును దీవించునుగాక!
ప్రార్ధన:- కష్టములు ఎట్లు నివారణగాని ఎట్లు వచ్చినదని నాడు ఆలోచన, పాము వచ్చింది చంపునట్లు ప్రయత్నించవలెనుగాని ఎట్లు వచ్చినదని ఆలోచింపకూడదు. అలాగే కష్టములు, కరవులు మొదలైనవి వచ్చినవి. చిక్కు విడదీసుకొనే ఉపాయము కలిగించుము.
నాకేమి కొదువ అని సంతోషముతో పౌలు సీలలు పాడినట్లు పాడవలెను. బద్దకమునకు అజ్ఞానమునకు చోటియ్యక, పాము వివేకము, పావురమువలెను నిష్కళంకముగా నుండునట్లు కృప దయచేయుము. 4వేల సం॥ల క్రింతము జరిగినవి జ్ఞాపకముంచుకొని సంతోషించుచున్నాము. బైబిళ్లు దొరకు కృప దయచేయుము.
లూథరు గారికి దొరికినట్లు అందరికి అచ్చులో దొరికే కృప దయచేయుము. ఈ గ్రంథము చదువుచు వ్రాసికొనే కృప దయచేయుము.