ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

బాప్తిస్మము

ప్రసంగ తేది: 30-11-52
అజర్యా గారి పుస్తకము నెం (2)



బాప్తిస్మము” : ఇది తెలుగుమాట కాదు. యేసుప్రభువు వాడిన మాట గ్రీకు భాష. సువార్తికులు వాడిన మాటకు అర్ధము ముంచడము, చిలకరించటము, క్రుమ్మరించటము, కడగటం, స్నానము చేయడం, శుద్ధిచేయడం. దీనినిబట్టి చూస్తే బాప్తిస్మము ఏవిధముగా పొందినా ఒక్కటే. ఏవిధంగా ఇచ్చినా బాప్తిస్మమే. "ఎవరికి ఏ పద్ధతిని కావలెనో ఆ పద్ధతి ప్రకారముగా పుచ్చుకొనవచ్చును". తలపై సీళ్లుపోయుట చిలకరింపుకాదు. ముంచి బాప్తిస్మము ఇచ్చుట, చిలకరింపు బాప్తిస్మమిచ్చుట, నీళ్లుపోసి బాప్తిస్మమిచ్చుట, ప్రాణాపాయ వ్యాధులలోనున్నవారికి నీళ్లుచల్లుట, అన్నిటికి నీరే.


కొందరు నీటికి కొలతలు వాడెదరు. నదిలోనున్న నీరంతా వాడవలెనా? లేక చెంబుతో వాడవలెనట. ముంచడము అన్నిటిలో పెద్దకొలత. కొన్నిటితో ఇస్తేనే బాప్తిస్మముకాదు అనేమాట బైబిలులో కొలతలేదు. కాని నీటితో బాప్తిస్మము ఇవ్వమని ఉన్నది. ఏదైనా నీటితో ఇవ్వవలెను.


గిన్నె నిండా అన్నము ఉంటే భోజనము అనెదరు. సాసరు అన్నము తిన్నా భోజనం అందురు. ఆకులో తిన్నా భోజనము అందురు. గరిటెలో తిన్నా భోజనము అందురు. అన్నిటిలోనున్నది అన్నము. ఎంత ఉన్న భోజనమే. సలీమురేవులో నీళ్లు విస్తారముగానున్నవి. తీర్ధముచేసే స్థలాలు నీళ్లులేని ప్రదేశములో పెట్టెదరా? నీళ్లు ఉన్నంతమాత్రమున స్నానమునకేనని అనకూడదు. త్రాగుటకు కావలెను అనేకమైనవి తీర్చుకొనుటకు కావలెను. అనేకమంది తీర్ధానికి వస్తారు గనుక ఎక్కువ నీళ్లున్న ప్రదేశములు ఏర్పర్చవలెను. ఒక్కొరికైతే అన్ని పేళ్లు అక్కరలేవు. నీళ్లలోకి వెళ్లి ఎంతమాత్రమున మునిగినాడా? అనేది సబబుగా ఉండదు. నీళ్లు త్రాగుటకు నీళ్లలోనికి దిగి నీళ్లు పాయలుచేసికొని మంచివి తీసికొని త్రాగెదరు. నీళ్లలోకి పోయినంత మాత్రమున మునిగినాడా అనవలెనా? రేవు గనుక కొద్ది లోతునకైనా వెళ్లవలెను. అందుకని నీళ్లలోనికి వెళ్లితే మునిగినాడని ఊహించినారు కాని మునిగినట్లులేదు.


యోహాను అదివరకు యేసుప్రభువు చెప్పులవారునైనా విప్పుటకు తగను అనెను. అటువంటి యోహాను ఆయనను పట్టుకొని ఏలాగు ముంచియుండును. అది రూలు గనుక ఆయన పొందవలెను. ఈయన ఇయ్యవలెను. అది నెరవేరుటకు అట్లు జరిగెను. నేను నీళ్లతో ఇస్తున్నాను. నా వెనుక వచ్చువాడు పరిశుద్దాత్మతో ఇచ్చును అని ఉన్నది. నీళ్ల; బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఇవి రెండు అయినవి.


కాని పౌలు ఒకే బాప్తిస్మము అని చెప్పెను. ప్రభువు నీళ్లతో పొందగానే వెంటనే ఒడ్డునకు వచ్చెను. వెంటనే పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందెను. మనకు ఆలాగు రాలేదు.


ఉదా:- భోజనము చేసి నేను ఇంకా తినలేదు అనంటే అబద్ధము. కాని అది నిజము. ఎందుకంటే నీల్లింకా త్రాగలేదు. అది తిన్నప్పుడు ఇది త్రాగవలెను. అది త్రాగితే సంపూర్తి అప్పుడు పూర్తి గనుక అవి రెండు కాదు ఒక్కటే కాని వాడినపుడు సంపూర్తి. అలాగే నీళ్లు బాప్తిస్మముపొందిన తరువాత పరిశుద్దాత్మ బాప్తిస్మము పొందితే అది సంపూర్తి. కాని ఇది పొందినంత మాత్రమున పూర్తికాదు. గనుక అది పొందినపుడు (పరిశుద్ధాత్మ బాప్తిస్మము) పూర్తియగును.


బాప్తిస్మము పొందవలెనన్న ఆటంకములున్నవి గనుక ప్రభువుని నీవు నాకాలాగు పరిశుద్దాత్మ బాప్తిస్మము ఇవ్వమని అడిగిన ఆయనకు ఆటంకములేదు. పాదిరిగారికి నీళ్ల బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమున్నదిగాని ప్రభువునకు లేదు. గనుక (పరిశుద్దాత్మ బాప్తిస్మము) ఇదైనా ముందు పొందవచ్చు. ఆలాగు జరిగినది (అపో! 10:44-48). తరువాత నీళ్ల బాప్తిస్మము పొందవచ్చును. ఈ రెండు జరిగినపుడు సంపూర్తి.


నీళ్లతో యోహాను బాప్తిస్మము ఇచ్చెను. పరిశుద్దాత్మ యేసుప్రభువు ఇచ్చేది. ఆయన పైకి వెళ్లిన తరువాత పరిశుద్ధాత్మ వచ్చినది. నీళ్ల బాప్తిస్మమునకు ఆభ్యంతర పడినవారు ఆత్మ బాప్తిస్మము పొందిన తరువాత ఆ నడవడి, శక్తి పవిత్రత చూచి అంగీకరింపవచ్చును. నీళ్లు, అన్నము, కూర అంతా కలిపి భోజనము. అలాగే నీళ్లతో, పరిశుద్ధాత్మతో, అగ్నితో ఇవన్నీ కలిపి బాప్తిస్మము అనవలెను. అన్నీ కలిపి ఇవ్వవలెను. తరువాత భాషకూడ వచ్చును. ఇవన్నీ ఒక పర్యాయమే రావలయును. ప్రభువా! ఇవ్వండి అనవలెను. ఇవ్వకపోతే కనిపెట్టవలయును. వారికిచ్చినపుడు నాకు ఇవ్వకూడదా అని అనకూడదు. కనిపెట్టవలెను.