ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు

సంఘ పోరాటము

ప్రసంగ తేది: 26-10-1955
బుధవారము ఉదయం



వాక్యాలు:- 1యోహాను 3:8వ; ఎఫెసీ. 6:12.


ప్రార్ధన:- మహోన్నతుడవైన దేవా! నీవు సైతానుయొక్క కార్యములను లయపర్చుటకు ఏర్పాటైనావు. కాబట్టి స్తోత్రము. నీవుండి సింహాసనముమీద కూర్చున్నావు. భూమివైపు చూస్తున్నావు. జర్మనీ యుద్ధము జరిగేటప్పుడు ఒక ఇంగ్లీషు పటాలపు నాయకుడు పటాలములో లేనివాడు అదివరకనే యుద్ధములు చేసినవాడు కొండెక్కి దిగువను యుద్ధమేలాగు జరుగుచున్నదో సర్దాగా చూచుచున్నాడు. అలాగే యేసుప్రభువా! నీవు పరలోకములో నీవు సింహాసనముపై పై విజయ సింహాసనముపై కూర్చుండి చూస్తున్నావు. నా సంఘము పిశాచియొక్క సైన్యములతో ఎట్లు పోట్లాడుచున్నదో అని చూస్తున్నావు. సంఘమునకు అపజయము కలుగునని తోచునప్పుడు రెండు చేతులు జోడించి నీ తట్టు ముఖము యెత్తి సంఘము ప్రార్ధించుచుండును. అప్పుడు నీవు అద్భుతకరమైన సహాయము పంపుదువు.


ఏలాగంటే గొప్ప యుధ్ధము జరిగేటప్పుడు యెరూషలేములో, ఊరిబైటనున్న ఒలీవా కొండమీద ఇంగ్లీషు పటాలము ఉండగా శత్రువులు ఆవరించి యున్నప్పుడు పటాలమును నడిపించు నాయకుడైన ఆలెన్ బీ అణే ఆయన ఏమి చేయవలెనో తోచక ఇంగ్లాండులో నున్న చక్రవర్తికి టెలిగ్రామునిచ్చెను. అప్పుడాయనేమి జవాబు చెప్పెనంటే భయపడకుము, మోకాళ్లూనుము ప్రార్ధించుము. అదైన తరువాత నీకేమి తోచునో అట్లు చేయుమనెను. నీకు విమానముమీద పటాలములను పంపిస్తాను అని చెప్పగా అనగా టెలిగ్రాము ఇవ్వగా అలెన్ బీ దొరగారు వెంటనే మోకాళ్లూని, తనతోపాటు సైన్యమంతయు మోకాళ్లూనియుండగా ఆయన సహాయము కొరకు ప్రార్థించెను. అలాగే ప్రభువు ఆ సాతానుయొక్క భూలోకములో కనబడుచున్నప్పుడు ; సంఘము నిన్ను ప్రార్థిస్తే సంఘములో నీకును హాజరు ఆర్జీ పెట్టుకుంటే (అందరు కలిసి, సంతకాలుచేసి) నీవు తప్పక వింటావు. సహాయము చేస్తావు.


ఉదా:- న్యాయాధిపతులు 5వ అధ్యాయములో ఉన్నట్లు ఇస్రాయేలీయులకు సహాయము చేసేటందుకు, పరలోక సైన్యమును పంపినట్లు ఇప్పుడుకూడా పంపుదువు. ఆ పటాలము లోకస్తులు చూడలేరు. అయితే సంఘము చూడగలదు. ఇప్పుడు సంఘము ఆయుధపాణి సంఘముగా మారవలెను. లేనియెడల జయమురాదు. ప్రభువా మాకటువంటి శక్తి దయచేయుము. సైతాను క్రియలు లయము చేయుటకు నీవు ఏర్పాటైయున్నట్లు సంఘముకూడా ఏర్పాటైయున్నది.


సంఘముకూడా ఏర్పాటెయున్నదని సంఘమునకు తెలియజేయుము.

అందుచేత సాతాను యొక్క ఆటలు సాగుచున్నవి గనుక ఓ ప్రభువా నీవు వచ్చి

నీ ఆయుధము వదులుము అని సంఘమును ప్రేరేపించుము అని వేడుకొనుచున్నాము. మోకాళ్లమీదనున్న పాపులను సైతాను జయించలేదు.

యేసుప్రభువా! నీ అవతారము మా అవతారము ఎందుకంటే నీ అవతారము పరిశుద్ధ శరీరముగల అవతారము. యేసుప్రభువా నీ అవతారము పరిశుద్ధ శరీరావతారము.

కాబట్టి సంఘమునకు కూడా జరుగదు. నీ అవతారమే మా అవతారము. నీ అవతారము వంటిదే. మా అవతారము. నీవు పరిశుద్ధమైన ఆత్మను కలిగినవాడవు. గనుక

అట్లే సంఘమునకు కూడా నీవు ఆత్మనిస్తే

లోకసంబంధమైన యుద్దాయుధములు దొరికితే ఇవి నేను

పొడుగాటిరాజు జయించినాడా? పెద్ద సైన్యమా జయించినది? చిన్న రాయి జయించినది. చిన్న కుర్రవాడైన దావీదు జయించెను. సంఘము కుర్రవానికి సమానము. గనుక లోకస్తులను సంఘమనే కుర్రవాడు జయించును.