ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
దేవుని మందిరము
(అరికిరేవుల ప్రార్ధన కూట ప్రతిష్టకు)
- 1. ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడే ఉందునని ప్రభువు చెప్పినారు. చెప్పవలెనంటే న్యాయము చొప్పున ఇట్టి యే స్థలమైన దేవుని మందిరమే. అయితే ప్రత్యేకముగా సంఘమంతయు కూడుకొనుటకు ఒక మందిరమును కట్టవలెనని దేవుడు సొలోమోనుకు చెప్పెను.
- 2. సొలోమోను కట్టినటువంటి గుడివంటి గుడి నేటికాలమందు లోకములో ఉన్న 74 కోట్లు క్రైస్తవులు చందావేసికొని భూలోకముయొక్క పేరుమీద, భూలోకములో ఎక్కడో ఒక చోట కట్టగలరు. కాని ఎవ్వరికి తోచలేదు. గొప్ప గొప్ప గుడులు అమెరికాలో, ఐరోపాలో ఉన్నవి. అవి అక్కడ వారికే. కాని అన్ని భాషల వారికి ఇండియాలో ఎవరైన అట్టి గుడి కట్టగలరా?
- 1) పరిశుద్ధ స్థలము
- 2) అతి పరిశుద్ధ స్థలము అని ఏర్పాటులు ఉన్నవి.
కాని ఇతరులు కూర్చుండుటకు కూడా ఏర్పాటులున్నవి. కాని, ఆ ఏర్పాటు మనకు అనగా ఏర్పాటులున్నవి. కాని, ఆ ఏర్పాటు మనకు అనగా క్రైస్తవ సంఘమునకు లోపలికి వచ్చివేసినది. గనుక అందరు రావచ్చును.
మన దేశములో హిందూమత గుడులు కొన్ని కేవలము బంగారముతో పొదిగారు. అంత మనకు అవసరము లేదుగాని, సామాన్యమైన రాళ్లతోనే మహా విశాలమైన గుడి ఒకటి కట్టుటకు ఇండియాయొక్క సముద్రతీరముగాని, అరికిరేవుల వంటి నదీతీరము గాని పనికి వచ్చును. నేను సలహా ఇవ్వడమే గాని ఎవ్వరు కట్టరు. కట్టితే ఇదే సమయము రాకడ బోధలు ప్రసిద్ధికెక్కినవి చేయుటకు.
కొర్నేలీ నీ ప్రార్ధన వినబడినదని పూర్వము దేవుని దూత తెలియపర్చెను. అట్లే ఎవరైన ఇప్పుడు చేస్తే నెరవేరదు? మన కాలములో ప్రయాణములు చాలా సుళువు. ఎందుకంటే ట్రైన్లు కారులు, బస్సులు, విమానములు మొదలైనవి విరివిగా నున్నవి. అవి మాత్రమేకాక రేడియోలు, బ్రాడ్ క్యాస్టులు ఉన్నవి. గనుక ఇక్కడ చేసే అన్ని ప్రసంగాలు అన్ని భాషలలో వినబడేటట్టు క్రొత్త మిషన్లు కనిపెపెట్టారు.
-
1. మీరు మళ్లీ సంపాదించుకొనవచ్చు గనుక మీవద్దనున్న సొమ్ము అడుగుబొడుగు ఊడ్చి ఇండియాకు పంపండి అని కొర్నేలియస్
వంటి
ఒకరు లేచి
ప్రయత్నము చేస్తే ఎందుకు నెరవేరదు. ఈయన పాకవేయుటకు తిరిగి 135 రూ.లు సంపాదించాడా? లేదా? అలాగే అందరు పోగుచేస్తే 135
కోట్లు
పోగుకావా? మన ఇండియాలోనే పోగవును. ఎందుకంటే మనము 9 లక్షల క్రైస్తవులమున్నాము.
ఇదివరకు జరిగినటువంటి యుద్దాలలో ఎన్ని కోట్ల రూపాయలు దినమునకు పోగైనదో తెలుసునా? ఒకరిని అడిగీతే 23 కోట్లు (రోజునకు) చొప్పున 4 సం॥లు పోగుచేసినారు. అది మనుష్యులను చంపుటకు గాని ఇది మనుష్యులను రక్షించుటకే. మనిషిలో ఉన్న పాపేచ్చలను చంపుటకే. - 2. రెండవ సంగతి:- దేవుని ఆరాధించుటకు ఏర్పడిన దేవాలయము మరియొక పనికి ఉపయోగిస్తే వర్తక వ్యాపారములు చేసిన వర్తకులను చుబుకుతో కొట్టిన క్రీస్తుప్రభువు వచ్చి కొడితే? న్యాయము కాదా? బాటసారులు వస్తే గుడిలోనే పడుకోబెడుతున్నాము. ఇంటివద్ద చుట్టాలుంటే నీవే గుడిలో పడుకుంటావు. పంచాయితీ కేసులు గుడిలో చేయునప్పుడు ఎన్ని చెడ్డమాటలు ఆడుకుంటారు. బోధకులు గుడిలో ప్రసంగములు చేయునప్పుడు సంఘములో ఎవరిమీదనైనా కక్ష ఉంటే పులిపీఠము మీదనే తీర్చుకుంటారు. వివాదములుగల ఇతర మీటింగులుకూడ అక్కడే పెట్టడము ఏమి బాగాలేదు. గుంటూరులో డాక్టరు జాన్ గారు ఇటువంటి మీటింగుల కొరకు గుడిప్రక్కనే పెద్దహాలు కట్టించినారు.
- 3. అరికిరేవులలో ఈ చిన్నపాకలో ప్రతిదినము ఎవరో ఒకరు ప్రార్ధన చేయుటకు కుటుంబాల వారిగా ఆరురోజులు ప్రార్ధన ఎవరిమట్టుకు వారే చేయాలి. ఈ పద్ధతి రోమన్ కతోలిక్కులకున్నది. ఉపవాస ప్రార్థనలుకూడ చేసికొనవచ్చును. క్రీస్తుదాసుగారి గుడిలో ప్రతిరోజు ప్రార్ధన ఉన్నది.
- 1. గొల్లలు మామిడాడ
- 2. మధులమీనాక్షి
- 3. నైజములో సిక్కు మతస్థుల గుడి బంగారముతోనున్నవి.
మన క్రైస్తవ దేవాలయములలో, తెలుగు ప్రాంతములలోనున్న గుడులలో ఒంగోలు గుడి పెద్దదంటారు. ఈ పాకవేయుట పూనుకొన్నవారెవరో ప్రతిరోజు ఈ పాకలోనికి కోరుకొండ, నంబూరులోవలె ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఒక గంటైనా ఉంటే ఎంత పనైనా జరుగును.
తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామమందు ఈ పట్టణమును దైవారాధన నిమిత్తము ప్రతిష్టిస్తున్నాము. ఆమేన్.
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడకూడి యుందురో అక్కడ నేనుందును అనువాక్యము ఒక కాగితము మీద వ్రాసి ప్రస్తుతము ఒక గోడకు అంటించవలెను.
ఇది మీకు తెలుసునా?:- ఎక్కడ ఇద్దరు ముగ్గురు మోకరించి ప్రార్ధించుచుందురో అక్కడ ప్రభువునూ వచ్చి మనిషివలె వారితో మోకరించి యుండును. ఎదుట తండ్రితో ఆయనయు సింహాసనముపై ఉండును. ఇక్కడ మనిషి అక్కడ దేవుడు.