ఉపదేశము: ఫాదర్. ముంగమూరి దేవదాసు
సంఘ శోధన
ప్రసంగ తేది: 26-10-1955
సాయంత్రం
వాక్యము: రోమా 16:20; ప్రకటన 2:1 - చివరివరకు.
పట్టీలోని 29లోని శూన్యమనగా నెరవేర్పు లేకపోవుట:- మనిషి ప్రార్ధించినాడు. ఏదో కారణముచే దేవుడు వినలేదు. గనుక నరుడు చచ్చేపోవును. దేవునికి దూరముగా వెనుకకు పోయి.
ఉదా:- అనిబీసెంటు కుమార్తెకు జబ్బుచేయగా ఆమె పట్టుదలతో ప్రార్ధించెను. గాని కుమార్తె బ్రతుకలేదు. ఈమె ఒక పాదిరిగారి భార్య. అయినను ప్రార్ధన వినలేదు. కుమార్తె చనిపోయెను గాన పూర్తిగా మతము విడిచెను. ఆలాగే ప్రార్ధన నెరవేరనప్పుడు దేవుని విడిచి దూరమగుదురు అనిబీసెంట్ పేరు తీసివేసికొని, సీతాదేవి అని పేరుపెట్టుకొనెను. ఈమె ఇంగ్లండు దేశస్తురాలు. ఆ దేశస్తులందరు నిందించగా అక్కడ ఉండలేక అక్కడనుండి వచ్చివేసి ఢిల్లీలో మకాముపెట్టెను. ఈమె మద్రాసులో అడియార్ అనే స్థలములో చనిపోగా మంచి గంధపు చెక్కలతో కాల్చివేసిరి.
ఈమె 1896 సం॥లో రాజమండ్రి వచ్చి మంచి ఉపన్యాసములిచ్చినది. నాన్ కోపరేషన్ కాలములో ఇండియన్స్ , ఇంగ్రీషువారిమీద తిరుగుబాటుకు ఈమె కారకురాలు. మద్రాసులోని క్రైస్తవులు ఈమెను ఖండించుటకు కొన్ని పుస్తకాలు వ్రాసిరి. ప్రార్ధన నెరనేరకపోతే దేవుని విడచిపెట్టుట గొప్ప పాపము. నెరవేరకపోవుట అనే హానికంటే దేవుని విడిచిపెట్టుట గొప్పహాని.
1. మంచిలో కీడు:- అనగా మేలు చేయుటకు వెళ్లితే అపకారము వచ్చిందనుట అదే ఇది.
2. అన్యాయము:- రాజమండ్రిలో మహమ్మదీయుడు జైలు సూపరిండెంటు అయిరి. ఆయన అన్నాడు నేనొక పాదిరిగారిని జైలులో వేస్తిని. విచారము పెట్టుకొని నేరము చేసినందుగాదు, అన్యాయముగా నన్నక్కడ ఉంచిరని విచారించుచు చివరకు చనిపోయెను. ఇట్టి అన్యాయములకు స్వహత్యచేసికొంటున్నారు.
3. మతహింస:- చావు. షరా:- ప్రతిచావు క్రింద నరకము. అవిశ్వాసులకు. పైవాటన్నిటికి అనగా మోక్షమునకు సంబంధించిన గీతపై వాటన్నిటికి మోక్షము అని అనగా పైవాటన్నిటికి మోక్షము.
ఉదా:- ఒక వ్యాధిగ్రస్తుడు అవిశ్వాసమువలన నరకానికి, ఒక వ్యాధిగ్రస్తుడు విశ్వాసము వలన మోక్షానికి వెళ్లును. గనుక పైన మోక్షము క్రింద నరకము.
స్తుతిలో మినహా:- మరిన్నీ ఈ అవస్త వచ్చినప్పుడు మేము సహించుకొనుట ఇతరులను చూచి మాదిరి నేర్చుకొనుట రానిచ్చినావు. ఇందువలన నా సహింపును బట్టి నీకు మహిమ కలిగేటందుకు రానిచ్చినావు. నీకు మహిమ వచ్చుటనుబట్టి భూమిమీద మీ రాజ్యము వ్యాపించుటకు ఇదంతా మొదటి సంతతి. అనగా ఈ అంశములు మారి సాతానుయొక్క రెండవ సంతతియైయున్న అని స్తుతి చేయాలి. హవ్వ ఒక్క పాపమే చేసెను. ఇన్నివేల సంవత్సరములనుండి ఉన్న మనుష్యులందరు ఎన్ని పాపాలుచేసి ఉంటారు?
కొన్ని యేవనిన:- 10 ఆజ్ఞల విరోధ పాపములు
- 1. విగ్రహారాధన
- 2. దైవ దూషణ
- 3. పూజదినమును అతిక్రమించుట.
- 4. ఆజ్ఞ పెద్దలను గౌరవింపకపోవుట
- 5. నరహత్య
- 6వ ఆజ్ఞ: కుటుంబ జీవితము చెడగొట్టుకొనుట
- 7వ ఆజ్ఞ: దొంగతనము
- 8. అబద్ధసాక్ష్యము (అల్లరి బాజావారికి, చెడుగు ప్రకటించే వారికి) రక్షణలేదు.
- 9,10 దేనికైనను ఆశించుట.
- 10. బైబిలులో ఉదహరింపబడిన పాపములు.
- 11. లోక చరిత్రలో ఉన్నా పాపములు.
ప్రయాణములో ఒక ఆయన ఒకరితో భోషాణములో వెయ్యిరూపాయలున్నవి. మా చెల్లికి అప్పగించి వచ్చినానని చెప్పగా, ప్రక్కనుండి విన్న మూడవవాడు, సొమ్ముగల అతని చెల్లి దగ్గరకు వెళ్ళి, ఆ మాటలే చెప్పి మీ అన్న ఆ సొమ్ము తెమ్మన్నాడని మాయమాటలు చెప్పి ఎత్తుకొని పోయెను. అన్న తెమ్మన్నాడనుకొనెను అతని చెల్లి.
12. ఊహ పాపము:- ఒకరిమీద ఒకరికి కక్ష ఉన్నది. నేను మగవానినైతే చంపివేసియుందును గాని బెయిల్ లోకి వెళ్ళవలసి వస్తుందని ఊరుకుంటున్నాను అనెను. ఇది ఊహే, గాని పాపము.
13. మాట పాపము:- పోలీసు ఇన్స్ పెక్టర్ , పోలీసువారిని కోపము వచ్చి కాల్చివేస్తానన్నాడు. ఆ మాటకు పైవారు అతనిని డిస్ మిస్ చేసిరి.
14. క్రియా పాపములు:-
15. ప్రయత్న పాపములు:- అనగా ఒకని జేబులోనున్న సొమ్ము తీయుటకు దొంగ చేయిపెట్టెను. సొమ్ముగలవాడు చూచినందున పారిపోయెను.
సాతానుయొక్క మొదటి సంతతి పాపములకు విరోధముగా చేయవలసిన ప్రార్ధన:-
- 1) దేవా నన్ను పాపములో పడవేసేటంతటి ఉరవడిగల శోధన రానిచ్చినావు గనుక స్తోత్రము. పాపములో పడుటవేరు, పడనందువలన కలిగే ఫలితము వేరు.
- 2) నేనైతే పాపక్రియ చేయలేదు. గాని ఊహలో, మాటలో పాపము చేసినాను. అట్లు చేస్తుండగా నీవుచూచి ఊరుకున్నావు గనుక స్తోత్రము.
- 3) దేవా నేను ఎన్నటికి ఏ పాపములో పడను.
నమ్ము నా మాట అని కొందరు సత్య ప్రమాణములు చేయుదురు. అది సాతాను ఆలకించుచుండును. ప్రయాణమైపోయింది. సైతాను వస్తాడు. వచ్చి అతనికి తెలియకుండనే పాపములో పడవేస్తాడు అప్పుడు ప్రార్ధన, దేవా నేను పాపములో పడిపోతే పడవద్దు, పడవద్దు హాని అని అన్నావుగాదు. నీవు అంటే (పడేవుందునుగాదు) పడివుందును కాదు. అట్లు అనకుండా ఊరుకున్నందుకు నీకనేక వందనములు. సాతానుయొక్క మొదటి, రెండవ సంతానములను గూర్చి వాటిలో పడకుండ
- 1) ఆపుదల
- 2) కాపుదల దయచేయుము.
దేవా నాకు
- (1) స్వతంత్రము
- (2) బలము
- (3) జ్ఞానము
- (4) తప్పు ఒప్పులు చెప్పే మనస్సాక్షి ఇచ్చియున్నావు.
అందుచేనే నీవు ఊరుకుంటున్నావు. గనుక నీవు న్యాయస్థుడవు గనుక స్తోత్రము.
4. తీరా పడిపోయిన తరువాత క్షమాపణ కోరితే ఇస్తావు గనుక స్తోత్రము. ఉదా:- మన్యమునకు వర్తకార్థమై తండ్రి తన కుమారుని పంపుచూ అవసరమైన చెప్పులు, గొడుగు, కర్ర, కత్తి, తుపాకి మొదలైనవన్నీ ఇచ్చి వాటిని ఆయా ఏ సమయములలో వాడుకొమ్మని చెప్పెను. అట్లే దేవుడు స్వతంత్రత, శరీరబలము, జ్ఞానబలము, మనస్సాక్షికి ఇచ్చినాడు. మరియు పాపము చేస్తే హాని అనియు మనస్సాక్షి చేత చెప్పించుచున్నాడు. అందుచేత నరుడు పాపములో పడుచున్నను ఊరుకొనుచున్నాడు. ఐతే పడేటప్పుడు బలవంతముగా దేవుడు రెక్కపట్టుకొని లాగితే పడడు గాని, అంతరంగములో పడిపోయే ఉంటాడు. దానినిబట్టియైనా హాని రాకమానదు. అందుచేత దేవుడు ఊరుకున్నాడు.
ప్రకటన 19:2వ:- ఆయన తీర్పులు న్యాయములును, సత్యములునుయై యున్నవి. ప్రకటన 16:7లో ఉన్నవి. ఒక మనిషి తెలిసియే పాపములో పడ్డాడు. ఎందుకు పాపములో పడ్డానని దేవుడొచ్చి అడుగగా ఎందుకు పడనిచ్చావు అని అడిగెను. తీరా పడిందాక ఉండి తీర్పులో ఎందుకు అడుగుతున్నావు? పడేటప్పుడు అడుగకపోయావా? అని నేరస్తాపన చేసెను.
లూథరు గిరిలో 10 ఆజ్ఞలు వివరించి అయ్యగారు చెప్పుచుండగా ఇప్పుడు చెప్పుచున్నారేమి? గ్రామాలలో మేము పనిచేసి పాపము చేసిన తరువాతనా? ముందే చెప్పలేకపోయారా? ఇప్పుడు చెప్పుచున్నారని అడిగిరి. అట్లే దేవుని మీద నేరము మోపుటకు దేవుడు లోకువగా దొరికినాడు.
ఆదాము, హవ్వలను, ఆదామా ఎందుకు తిన్నావనగా నాకు జతగా ఇవ్వకపోయినా జరిగుండును. జతగా ఇచ్చిన ఆమెవల్ల ఇది వచ్చిందని దేవుని మీద ఆదాము నేరము మోపెను.
16. మొండి పాపము:- ఇంతమంది పాపము చేస్తే ఊరుకున్నా దేవుడు నేను చేస్తే ఎందుకు ఊరుకోడని చేయుట మొండిపాపము.
17. కృపను లోకువ కట్టే పాపము:- అనగా నేనెన్ని పాపాలు చేసినా మహాప్రభో అని అంటే, క్షమించు అని అంటే క్షమించునని బైబిలులో ఉన్నది గనుక నేనెన్ని చేసినా క్షమించునని ఆయన కృపను లోకువ కట్టి చేయుపాపము.
యం.డి. అయ్యగారు ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఒకరికి దేవుని కృపను గూర్చి ఎక్కువగా చెప్పిరి. ఆయన కృపను లోకువగట్టుకొని అన్ని పాపాలు చేసి నేను జయించలేను. ఆయన కృపగలవాడు క్షమించునని పూర్తిగా పాపములు చేసి పూర్తిగా చెడిపోయెను.
- 1) సైతాను పాటము
- 2) సైతాను యొక్క మొదటి సంతతి పాటము
- 3) సైతాను యొక్క రెండవ సంతతి పాటము.
ఈ మూడింటికి రెండే చెప్పిరి.
1వ పాఠము:- ఇప్పుడు పాపాత్ములయొక్క తండ్రి పాఠము:- అనగా సైతాను గురించి పాఠము లక్ష ప్రశ్నలున్నవి.
1. ప్రశ్న:- దేవుని యొక్క లక్షణములుగల పరిశుద్ధ దూతలలో ఒకరికి ఎక్కడినుండి వచ్చి దుర్బుద్ధి ప్రవేశించినది. అదివరకు పరిశుద్ధత తప్ప అపరిశుద్ధత లేనేలేదు గదా అని అనేకులు ప్రశ్నించుచున్నారు. దానికీ కొందరు భక్తులు ఒక జవాబు చెప్పుచున్నారు. ఒక యజమానుని ఇల్లు కాలిపోవుచున్నది. అతడు ఇంటికి వెళ్లి ఎవరు నిప్పు పెట్టినారని అడుగుచు తిరిగి ఇంటికి వచ్చెను. అప్పటి ఇల్లు ఏమైపోతుంది. బూడిదైపోతుంది. గనుక సైతానులో పాపము ప్రవేశించినది. ఆ పాపము మనుష్యులలో ప్రవేశించెను. ఆ పాపమును తీసికొవేసికొనే పద్ధతి ఆలోచించవలెను. గాని ఎవడు పెట్టెను అనేది ఈ పాపికెందుకు? అనవసరము. ఆ ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పరు. ఆ ప్రశ్నకు జవాబు లేదు. లేని దానిని పట్టుకొని వ్రేలాడితే ఏమిలాభము?
2. దేవదూతకు దేవుడు అన్ని గుణాలతో పాటు స్వతంత్రత యిచ్చెను. ఎందుకంటే దైవ లక్షణములు తనలోనున్నవి. కాపాడుకొనుటకు, వాడుకొనుటకు ఆనందించుటకు ఇచ్చినాడు. ఆ స్వతంత్రత దూత వాడుకొనలేదు.
ఉదా:- ఒక బల్లమీద ఒక బీదవానికి, ఒక ధనవంతుడు రొట్టె, పండు అన్నము, కూర, పది రూపాయలు పెట్టి కుర్చీమీద కూర్చుండబెట్టి ఇవన్నీ నీకే అని చెప్పి యజమానుడు లోపలికి వెళ్లెను. ఈ బీదవాడు అన్నీ తిన్నాడు. సొమ్ము వంక చూచినాడు. అది జేబులో వేసికొని వెళ్లితే బాగుండును గాని వదలిపెట్టి వెళ్లిపోయెను. గ్రామాలు తిరిగెను. నీవు బాగా ఉన్నావు. నీకేమిటి? బిక్షము అని తోలివేసిరి. అప్పుడే రూపాయిలుంటే కొనుక్కొని తిని ఉందును లేవు గనుక ఆకలితో బాధపడవలసి వచ్చెను. ఆలాగే దేవదూత అన్ని లక్షణములు వాడుకొని స్వతంత్రత అనే లక్షణమును వాడుకొననందున వాయుమండల లోకమునకు వచ్చివేయవలసి వచ్చినది. ఎంత చెప్పినా ఈ ప్రశ్నకు జవాబు నచ్చదు. దేవుడు ఇచ్చిన శక్తిని లక్షణాలను సైతాను వాడుకొనక పాపములో పడిపోయెను. ఇప్పుడు మనిషిలో కూడ పాపములో పడిపోయెను. ఇప్పుడు మనిషిలోకూడ దైవలక్షణములున్నవి. అందులో ఒకటి శక్తి. అది వాడుకుంటే మనిషి పాపములో పడడు.
3. దుర్బుద్ధి పుట్టినందువలన:- మోక్షములో ఉండలేదు. అందుచేత దేవుడు వాయుమండలమునకు పంపివేసెను. ఫ్రాన్సు దేశములో ఒక గొప్ప పండితుడు నాస్తికుడైనాడు. హేడెస్సుకు వెళ్లినాడు. అతని భార్యాపిల్లలు మోక్షములో ఉన్నారు. ప్రార్థించారు. ఇతడును ప్రార్థించెను. ఏమని నేను పాపముచేస్తే మాత్రము దేవుడు నన్ను మోక్షానికి చేర్చుకోకూడదా అని దేవునితో వాదించెను. అప్పుడు దేవుడు అతనిని తీసికొని వెళ్లి మోక్షములో పెట్టెను. అక్కడతడు కొన్ని నిమిషములుండి, నేనిక్కడుండలేను అన్నాడు. మహిమ చూడలేకపోయెను. మతాబీలు వెలిగేటప్పుడు ఎవరైనా దాని తట్టు తేరిచూడగలరా? అప్పుడతడు మరలా పాతాళ లోకమునకు పంపివేయబడెను. భార్యా పిల్లలు గొల్లుమన్నారు. అప్పుడు ప్రభువు వచ్చి వారిని రెక్క పట్టుకొని ఎక్కువ మహిమలోనికి తీసికొనివెళ్లి కూర్చుండబెట్టెను. అప్పుడు వారు పండితుని పూర్తిగా మరచిపోయిరి. అందుచేత వారికి దుఃఖములేదు. మనిషికి ఇష్టము లేకపోతే ప్రభువు అతనిని మోక్షములో చేర్చుకొన్నను ప్రయోజనము లేదు. ఎన్నో సం॥ములైనది. పిశాచి వచ్చివేసి గాని నేటివరకు మారుమనస్సు పొందలేదు.
యోహాను 8:44.
- 1. నరహంతకుడు
- 2. సత్యమందు నిలచినవాడు కాడు
- 3. అబద్దానికి జనకుడు.
- 4. అబద్ధికుడు.
ఇది చాలా భయంకరమైన స్టేట్ మెంటు. ఇది ప్రభువు యూదులకు వినిపించిన వాగ్మూలము. గనుక అతడు రక్షించబడుటకు ఏమి సందులేదు. రేపు నరకములోనికి వెళ్ళేవారియొక్క గతికూడా ఈలాగే ఉండును. బోధకులు వెళ్లి మీరు నరకములోనుండి వచ్చివేయండని అంటే రారు. ఎందుకంటే సాతానుయొక్క గుణమే వారికి వచ్చింది. ఎప్పుడైనా మీకు ఏ చెడ్డ తలంపైనా పుడితే అది దయ్యము అని అనవలెను. నీకు ఏ చెడ్డపనైనా కనబడితే ఇది దయ్యము పని అనవలెను. ఒక మనిషి కాలువలో పడ్డాడు. ఈతగాడు ఒడ్డున నిలువబడి అతన రెక్క పట్టుకొని బైటకు లాగబోతే నేనెందుకు పడ్డానో నాకు ఈత బాగావచ్చును గాని దురదృష్టమని ప్రసంగము చేయబోయెను. అప్పుడు ఈతగాడు ఈ మాటలెందుకు నేను లేవనెత్తడానికి వచ్చానుగదా? నాచేయి పట్టుకో అన్నాడు. నాకు ముందు ఇది చెప్పండి తరువాత చెయ్యిపట్టుకుంటాననెను. అనేకమంది ఇప్పుడీస్థితిలో ఉన్నారు. క్రీస్తు వచ్చి రక్షించుటకు చేయి చాపుచుంటే అందుకొనక కుశల ప్రశ్నలడుగుచున్నారు. పేతురు ఆలాగు చేయలేదు. మునిగిపోవుచు రక్షించమన్నాడు. అప్పుడు ప్రభువు పైకి లేవనెత్తి రక్షించినాడు. అందరు పేతురు పద్ధతి అవలంబిస్తే ఎవరు నరకమునకు వెళ్ళవలసిన అవసరములేదు.
ప్రార్ధన:- సైతానుకుగాని, అతని సైన్యమునకు గాని లొంగకుండా ఉండేటట్లు మమ్మును కాపాడుమని ఇప్పుడీప్రార్ధన చేయండి. వెన్న వచ్చేవరకు గొల్లలు చిలుకుదురు. ఆలాగే సంతోషము వచ్చేవరకు చిలకరించినట్లు ప్రార్ధించండి.
మనుష్యులను శోదించుటకు నీవు సైతానుకు సెలవిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. ఆమేన్.