'సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును,
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ప్రకటన 1:3.

మొదటి సందేశము: మరనాత

(22-9-1948వ సం||లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

మలాకీ 3 : 1 ; యెహాను 5:25-29; 1కొరింధి. 16:22
"ప్రభువైన యేసూ, రమ్ము" ప్రక. 22:20
హల్లెలూయ ..... హల్లెలూయ ..... హల్లెలూయ - మా ప్రభువు
వచ్చుచున్నాడు హల్లెలూయ
హల్లెలూయ .... హల్లెలూయ .... హల్లెలూయ మా - ప్రభువు
వచ్చియున్నాడు హల్లెలూయ

'మరనాతా అను ఈ మాట బైబిలులో 1కొరింధి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనములోని క్రింద సూచనలో లిఖితమైయున్నది. ( 1కొరిధి. 16:22 ). మరియు ఇదే మాట ఇంగ్లీషు బైబిలులోకూడ ఉన్నది. మరనాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు లేక ప్రభువు వచ్చియున్నాడు లేక ప్రభువైన యేసూ రమ్ము అని అర్ధము. గ్రీకు భాషలోని పదమును తర్జుమా చేయకుండా అట్లే బైబిలులో ఉంచినారు. మొదటి శతాబ్ధములోని క్రైస్తవులు కలిసికొన్నపుడు ఉద్రేకముతో ప్రభువు వస్తున్నారు అని అనుకొని ఉల్లసించేవారు. గవర్నరు ఇప్పుడు గ్రామములోనికి వచ్చేముందు గ్రామములోని ప్రజలు ఉత్సాహముతో చెప్పుకొన్నట్లు చెప్పుకొనవలెను. ఎంతమందికి ఎన్నిసార్లు సలాములు చేసినా "మరనాత" అని అనవలెను. అనగా ప్రభువు వస్తున్నాడు అని అనుట సంతోషముతో అనకపోతే అది మంచిదికాదు. ఒక విశ్వాసి మరనాత అనుట చూచి మరొక విశ్వాసి సంతోషించి మరనాత అనవలెను. ఈరీతిని "మరనాత" అనుట ప్రతి పరిచయమున నీకుండిన యెడల ప్రభువు రాక నీ మనస్సులోనుండును. 'ప్రభువు రాకడా విశ్వాసులకే గాని అందరకుకాదు. కొన్ని వందల సంవత్సరముల క్రితమే రష్యాలో ఈష్టరు పండుగ రోజున ఒక విశ్వాసి "మరనాత" అని చెప్పగా, మరియొక విశ్వాసి అవును నిశ్చయముగా ప్రభువు లేచియున్నాడు అని తిరిగి ఎదుటివారికి చెప్పే అలవాటు కలిగియుండిరి.

    "మరనాత" అను మాటలో మూడు సంగతులను తెలియజేయు రెండు మాటలు కలవు
  • 1 ) ప్రభువు వచ్చుచున్నాడు. ఇది ప్రవచనము
  • ( 2 ) ప్రభువైన యేసూ రమ్మూ, ఇది ప్రార్ధన.
  • 3 ) ప్రభువు వచ్చియున్నారు ఇది ప్రసంగము.
గనుక ఈ మాటలో ప్రవచనము, ప్రార్ధన ప్రసంగము ఇమిడియున్నవి.

మరనాత అనగా మరన్+ఆత అనగా సంస్కృతములో ఆగమనము అని అర్ధము. ఇంగ్లీషులోని చొమె అనే మాటకు తర్జుమా చేయువారు - "ఇప్పుడే, త్వరగారమ్ము" అన్నట్లు తెలుగు భాషలోనికి వ్రాసిరి. మొదటి శతాబ్ధములోనివారు, గురుతులు, చూడక మునుపే ప్రభువు వచ్చుచున్నాడని సంతోషించిరి. ఆ మొదటి శతాబ్ధములోని వారే వస్తున్నారని సంతోషించిన యెడల గుర్తులు చూచిన మనము మరి ఎక్కువగా సంతోషిచవలెను గదా! మనము ఆత్మ కుమ్మరింపునుగూర్చి ఇతరులకు బోధించవలెను. 'అన్ని గురుతులు నెరవేరినవి, ఆత్మ కుమ్మరింపు గురుతు జరుగుచున్నది గనుక అందరికి చెప్పండి, అప్పుడు అందరూ ఆత్మ కుమ్మరింపుకై కనిపెట్టుదురు, ఆత్మకుమ్మరింపు పొందుదురు.ప్రభువు రాకముందు అందరు ఆత్మను పొందవలెను. మీ చెవులు మూసికొని, ' రాకడ సంతోషము కలిగించుమనీ ప్రార్ధించిన 20 నిమిషములలో ప్రభువు కనబడును రాకడ ప్రభువు తప్పక కనబడును.

  • 1 ) జన్మించిన ప్రభువు ,
  • 2 ) బోధించినప్రభువు,
  • 3 ) సిలువ వేయబడిన ప్రభువు ,
  • 4 ) పునరుత్థానుడైన ప్రభువు,
  • 5 ) ఆరోహణమైన ప్రభువు ,
  • 6 ) రాకడ ప్రభువుగా కనబడును.

ఉదరశుద్ధి, శరీరశుద్ధి చేసికొని ప్రార్థనలో ఉండండి , ప్రభువు ప్రత్యక్షమౌను. మూఢ భక్తివద్దు . ప్రభువు కనబడునని సంతోషించడి. ఒకదినమంతా ఉపవాస ప్రార్ధన చేసిన తరువాత కనబడకపోతే చింతతో పండుకొంటే అప్పుడైన ప్రభువు తప్పక కనబడును. ఇది దేవదాసు అయ్యగారి అనుభవము. బైబిలుగురుతులు నీకవసరములేదు. ప్రభువు ఎప్పుడో వచ్చునని తలంచుటకాదు. ఈ కాలమే ప్రభువు వచ్చేది ........

"నేడే ప్రభువు వచ్చుననుకొను - వాడే ధన్యుడు = ప్రభువు - కూడ మేఘమెక్కి - వెళ్ళకుండ నుండడు ( లూకా. 12; 35-40 ) | | యేసు | |

మరనాత డ్రిల్:
  • 1. నీకు తెలిసిన విశ్వాసి కనబడితే ప్రభువు వస్తున్నాడని మరనాత అను సలాము చేయవలెను.
  • 2. అవిశ్వాసులను చూచిన మరనాత సలాముచేసి ప్రభువు రాకడ కథ చెప్పవలెను.
  • 3. ప్రభువైన యేసూ రమ్ము ! అని రెండు చెతులు జోడించి చెప్పవలెను. ఈ మూడు డ్రిల్స్ ( అభ్యాసములు ) ' మరనాత ' మాటక్రింద ఉన్నవి.
  • 4. వెనుకకు తిరిగి అనగా ఈ పై డ్రిల్ ఐన పిమ్మట బడి పిల్లలు రాగా అనగా సన్నిధిలోనికి రాగా ప్రభువు కనబడును. ఇక్కడ మాట్లాడుట ప్రభువు వంతు.

ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడగును 1కొరింథి. 16 :22 దీని అర్ధమేమనగా, ప్రభువు జన్మము, ఆయన చరుత్ర శ్రమ విషయములలో, పునరుత్థాన విషయములలో తరగతి గదులలోనికి వచ్చునట్లు పై మూడు విషయములు జరిగించిన పిమ్మట గదిలోనికి ప్రేమించినవాడు; ప్రభువు రాకడను ప్రేమించకపోతే వానిది సంపూర్ణ ప్రేమకాదు. గనుక వాడు శాపగ్రస్తుడని ఉన్నది. 'మరనాతా అది సంఘములోని విశ్వాసుల హృదయములలో నాటు కొన్నది. మొదటి శతాబ్ధములోని వీరు వెళ్ళిన తరువాత 'ప్రభువు రాలేదు ' అను దండకములు ( బోధ ) ప్రభలినవి. 2వేల సంవత్సరముల వరకు ప్రభలుచూనే ఉన్నావి. ఈ మరనాత శబ్ధము మొదటిగా ఎవరి దగ్గరకు వచ్చినది ? మొదటి శతాబ్ధములోని వారి దగ్గరకేగదా ! వారు సందేహింపక నమ్మిరి. మనకు సందేహము కలిగినది. ఏ సందేహము ? ప్రభువు ఇంకా రావడములేదు అను సందేహము; ప్రభువు ఎప్పుడు వస్తే మనకేమి ? అనుకునేవారికి "మరణాత " అనగా చావు వచ్చును. ఐతే నేడే ప్రభువు వచ్చునని అనుకొనేవారికి ' మరనాత ' అనగా ఆరోహణము వచ్చును.

మీకు ' మరణాత ' కావలెనా ? ' మరనాత ' కావలెనా? మనకు చావు లేకుండా ఆరోహణమయ్యే మరనాత కావలెను . అట్టి దివ్యభాగ్యము త్రిత్వతండ్రి మీకు దయచేయును గాక! ఆమేన్.

మరనాత అనగా మన ప్రభువు - మరల వచ్చుట = దీనిన్ తరచుగా సలామున వాడు నరులు ధన్యులు | | యేసు | |


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद