సమాజముగా కూడుకొనుట - 2

(1940వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

( క్రైస్తవ కుటుంబము )
ఆది. 19: 14; యోహా. 20: 24-29; అపో| | కార్య. 10:1 - 48
"యేసు వచ్చినప్పుడు పండ్రెడుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను.". యోహాను 20: 24 - 29.

ప్రభువు శిష్యులు కూడుకొనిన కూటమునకు తోమా రాలేదని శిష్యులు మీటింగు కట్టివేయలేదు. ఎవరు రాకపోయినను మనముకూటములు జరుపుకొనవలెను. వారు తోమా కొరకు కనిపెట్టిన యెడల 8 దినములు ఆలస్యమగును. రానివారి నిమిత్తము కూటము ఆపుచేయకూడదు. కొద్దిమంది ఉన్నను కూటము జరుపవలెను. ఆదివారము సాయంత్రము ప్రభువును చూచిన శిష్యులు, తోమాతో ప్రభువు మాకు కనబడెనని తోమా నమ్మనన్నాడు. కూటమునకు రానని చెప్పినాడు, రాలేదు. అటువంటి తోమాను తీసికొనివచ్చినారు. మనమును ప్రతి ఆదివారము ఎవరినో ఒకరిని సంఘమునకు (సంఘ కూటమునకు ) తీసికొని రావలెను.

పూర్వకాలములో సొదమగొమొర్రాల పట్టణములలో పాపము ఎక్కువాయెను. ఆ పట్టణమును కాల్చి, నాశనము చేయుటకు దేవదూతలు వచ్చిరి. ఆ పట్టణపు పాపము అంచులమట్టుకు నిండియుండెను. గనుక పాపుల మీదికి కీడు రానైయున్నది. అక్కడ "లోతు" అను దైవభక్తుడున్నాడు. దేవుని ఉద్దేశ్యమును దైవభక్తుడు ఎంతకాలము బోధించినను ఆ పట్టణపువారికి ఎక్కలేదు. దేవుని నిర్ణయము చొప్పున ఈ దూతలు ఆ పట్టణమును నాశనము చేయుటకు వచ్చిరి. దైవజనుడైన లోతు వారిని తన ఇంటికి రమ్మని పిలిచెను. గాని వారు మేము రాము నడివీధిలో రాత్రి గడుపుతామని చెప్పిరి. ఆ పట్టణపువారు దుర్మార్గులు గనుక వారిని చంపివేస్తారని లోతువారిని తన ఇంటిలోనికి రమ్మని చెప్పెను. ముందువారు 'రాము ' అని చెప్పిరిగాని బలవంతముచేయగా వెళ్ళిరి. ఊరి వారందరు లోతు ఇల్లు ముట్టడిచేసి, వారిరువురిని బయటికి పంపుమని కేకలువేసిరి. అప్పుడు లోతువారికి బోధచేసెను. గాని వారు అతనిమాటలు వినలేదు. దూతలు లోతును లోపలికి లాగి తలుపువేసిరి. ఆ ఊరి వారందరు తలుపు బ్రద్దలు చేయబోవుచుండగా వారికన్నులు గ్రుడ్డివాయెను. దూతలు లోతు కుటుంబమును పారిపొమ్మని చెప్పెను. వారి బధువులనుకూడ తీసికొని పొమ్మని చెప్పెను. లోతు అల్లుళ్ళు ఆ మాటలన్ని వెర్రి మాటలని త్రోసివేసిరి. ఈ అల్లుళ్ళు మామ వద్దకు వచ్చి 'మేము రాము ' అని వారితో చెప్పిరి. దూతలు దూతలు లోతును, అతని భార్యను, ఇద్దరుకుమార్తెలను నలుగురిని పొలిమేర దాటించిరి. వీరు వెళ్ళిన స్థలము రక్షణస్థలము. అక్కడ హాని రాదు. అగ్ని గంధకము అక్కడ కురువదు. సొదొమ నాశన స్థలము. అయితే రక్షణ రక్షణ స్థలమునకు అల్లుళ్ళు రామని చెప్పిరి. వారు వచ్చేవరకు లోతు ఉండ్శకపోయినాడ? వారెందుకు ఆగలేదు ? అట్లు ఆగడము వలన వీరుకూడ కాలిపోవుదురు. నాశనస్థలమునుండి రక్షణ స్థలము చేరునప్పటికి , అగ్ని గంధకమువచ్చి అన్నిటిని కాల్చివేసెను.

వాక్యము వినుటకు సంఘమునకు లేదా కూటములకు రమ్మని అనేకులను మనము పిలువవలెను. లోతు బోధించినను అల్లుళ్ళు వినలేదు. అలాగే విననివారు, లోబడనివారు అనేకులు ఉంటారు. అయినను చెప్పుట మనవంతు. అయితే మనము చెప్పినప్పుడు అల్లుళ్ళులాంటి వారు రారుగాని, తోమాలాంటివారు వస్తారు. తోమా ముందు రానన్నాడుగాని తర్వాత వచ్చెను. అలాగే కొందరు ముందు 'రాము ' అని చెప్పిన తర్వాత వస్తారు. మనము చెప్పితే రక్షణ స్థలమునకు వచ్చెవారున్నారు , రానివారుకూడ ఉన్నారు. మనపని మనము చేయుచుండవలెను. వారు రక్షణ స్థలమునకు వచ్చిన మనకు సంతోషము, రాకపోతే విచారము. మన ప్రాణమున్న్మత కాలము రమ్మని చెప్పుచుండవలెను. ఎవరు రాకపోయినను మన ప్రార్ధనలు, కీర్తనలు, కూటములు మానరాదు. వీరు నలుగురు రక్షణ స్థలమునకు ప్రయాణమై పోవుచున్నారు. దూతలు పరలోకమునకు వెళ్ళిరి. వీరందరు పోవుచుండగా రక్షణ స్థలమునకు చేరకముందే, లోతుభార్య వెనుకకు తిరిగిచూచెను. అయ్యో! నా ఇళ్ళు, సామాను, అల్లుళ్ళు ఏమైపోయిరో! అణి వాటిపైన ఆశ ఉండి వెనుకకు తిరిగి చూచెను. ఇక్కడ ఎవరైనా వెనుకచూపు గలవారునారా? జాగ్రత్త! వెనుకకు వెళ్ళేవారికి లోతుభార్య పాఠము చెప్పుచున్నది.

  • 1. రక్షణ స్థలమునకు వెళ్ళేవారికి లోతు, ఆయన ఇద్దరు కుమార్తెలు పాఠము నేర్పుచున్నారు.
  • 2. అసలు రానివారికి అల్లుళ్ళు పాఠము నేర్పుచునారు.
  • 3. వెనుకతిరిగి చూచేవారికి లోతుభార్య పాఠము నేర్పుచున్నది.
ప్రభువు దగ్గరకు వచ్చిన వారు తిరిగి వెనుకకు పోరాదు. అగ్ని పట్టణముమీదికి రాగానే శబ్ధమాయెను.లోతు భార్య వెనుకకు తిరిగి చూచి నాశనమాయెను.చివరి వరకు వెళ్ళినవారే రక్షింపబడుదురు. సంఘము రక్షణ స్థలము. ఎన్ని కష్టములు వచ్చినను అక్కడికే పోవలెను. ఎవరు పిలువకుండానే వెనుకకుచూచి ఆమె నాశన మాయెను. ఆమె పట్టణముతట్టు ఆకర్షింపబడెను. ఆమె దూతలమాట విని సగము దూరము వచ్చెను. గనుక ఆమె భక్తురాలేగాని అగ్ని కురిసేటప్పటికి ఆమె సొదొమ పట్టణస్థులలో చేరెను. భక్తురాలు వెనుకచూపు వలన నాశనమాయెను. గనుక వెనుకచూపు హాని! 'ఆ పట్టణము మీద దేవుని మహాకృప ఉనది ' అని ఏలాగు తెలియుననగా, దూతలు నాశనము చేయుటకు వచ్చినామని చెప్పినప్పుడు ప్రభువా! రక్షించు అని వారందరు ప్రార్ధన చేసినట్లయిన, సొదొమ రక్షణ స్థలము అయిపోవును. గాని అట్లు ప్రార్ధన చేయక కొట్టవచ్చిరి. గ్రుడ్డివారైనప్పుడైనా రక్షించుమని అనవలసినది, గాని వారు ఆలాగు అనలేదు. అయితే ఇక్కడ ఇంటిలో లోతు కుటుంబము సర్దినదే సర్దుచుండిరి. కనుక దూతలు వారిని చేతులు పట్టులు పట్టుకొని లాగుకొనివచ్చిరి. వారి నలుగురివి 8 చే తులు, వీరిద్దరివి ( దూతలు ) 4 చేతులు. కాని వారు పట్టుకొనిరి. నశించు వారిమీద కూడ దేవుని దయ ఉండునని లోతు భార్యనుబట్టి తెలిసికొనుచున్నాము. లోకముపుట్టి 6వేల సం || ములు అయినది. యేసుప్రభువు త్వరగావచ్చి సిద్ధపడిన వారిని పరలోకమునకు తీసికొనివెళ్ళును. ప్రభువు ఇంకా రాలేదేమిటి? అనగా అక్కడక్కడ దైవభక్తులు కొన్ని కష్టములలో నున్నారు. వారు రక్షణ చోటికి రావలెనని ఉన్నారు గాని వారికి ఇంకా కొన్ని అడ్డులున్నవి. ఏలాగంటే దేవుని ఉగ్రత సొదొమపై రాకపూర్వము ఇంకా లోతు రక్షణ స్థలమునకు వెళ్ళలేదు. గనుక గంధకము కురువలేదు. కాని రాకడ ( వధువు ) సంఘము వెళ్ళిన తర్వాత భూమిమీదికి ఏడేండ్ల శ్రమలు వచ్చును. చదువరులు ఇట్టి శ్రమను తప్పించుకొందురు గాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद