రాకడ సంగ్రహ సలహాలు, సూచనలు, సవివరణలు

(29-11-1939వ సం||లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

నహూము 2:4; లూకా. 21:29-33; 2పేతురు 3:10-12.
" ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడను, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునైయున్నాడు. " దాని. 2 :21.


రాకడ విశ్వాసులారా! నేటిదిన ధ్యానము రాకడ సంగతులు తెలిసికొనుటకు కాదు, రాకడ అనుభవములు చెప్పుకొనుటకు కాదు కాని రాకడకు సిద్దపడుటకే ఇందులోని ప్రార్ధనలైనను, స్తుతులైనను ఏర్పడినవి. ఇదివరకు నేర్చుకొన్నవి ఇందులో క్లుప్తముగా ఇముడ్చుచున్నాను. అవేవనగా, ఇదివరకే ముగింపవలసిన పనులు అనగా

  • (1) బైబిలంతా తెలిసికొనుట, తెలిసికొనుట,
  • (2) సువార్తపని ముగించియుండుట అనగా ఎవరికి చెప్పగలమో , వారికి చెప్పియుండుట, మరియు రాకడ సంగతులు కలిగియున పత్రికాదులు పంచిపెట్టుట,
  • (3) రాకడకు చేయవలసిన ప్రార్ధనలన్నియు చేసి ముగించుట.
  • (4) ఎవరికి తీర్చవలసిన బాకీలు వారికి తీర్చివేయుట , సమాధానపడువారితో తప్పులొప్పుకొని,
  • (5) సమాధాన పడుట
  • (6) అప్పులు తీర్చి వేయుట,
  • (7) ఇదివరకు వ్రాసికొన్న నోట్స్ ఒక పర్యాయము చూచుకొనుట; కూటనాయకులు , రానిమెంబర్లకు నోట్సంతా వినిపించి యుండవలెను.

ఈ కార్యములు ముగించనిదే మన సిద్ధబాటు సంపూర్ణముకాదు.


ప్రార్థన: ఓ దయగల తండ్రీ! మేము రాకడకు సిద్ధపడుట అనే విషయము యోచన చేయుటకు కూడుకొనియున్నాము, వందనములు. ఈ సమయమును సద్వినియోగపరచుకొనే కృప దయచేయుము. గనుక నామకార్ధముగా చేయక, నిరీక్షణతో చేసే కృప దయచేయుము. త్రియేకదేవా! నీకే ఘనత, కీర్తి ప్రభావము కల్గునుగాక! ఆమేన్.


"రాకడకు నేను సిద్ధపడుదును. సిద్ధబాటుకొరకు చేయవలిసినవన్నియు తప్పకచేసి తీరెదను" అని ప్రభువు రెండవ రాకకు సిద్ధపడుచున్న మీరందరు ఒక తీర్మానము చేసికొనవలెను. ఇదివరకు మీరు నోట్సుమీదను, ఇతరుల ప్రార్ధనలమీదను ఆనుకొన్నయెడల ఇప్పుడది మానివేయవలెను. మీకు మీరే ప్రార్ధనా స్తుతులతో కనిపెట్టుటలో యుండి వాక్యమును ఆధారము చేసికొని, ప్రభుయేసుని నమ్ముకొని సిద్ధపడండి.

రాకడను గురించి పత్రికలలోయుండు సంగతులను చదివేసి యుండవలెను. మనము చేయవలసినది మనము చేయకపోతే, ప్రభువు చేయునని నీవెట్లు నిరీక్షించగలవు. సిద్ధపడుటలో ఆలస్యము చేయకూడదు. "నీవు వెళ్ళి ఆలాగు చేయుము" అని యేసుప్రభువు ఒక శాస్త్రితో చెప్పెను. ఎవరు చేయవలెను ప్రభువా అని తిరిగి అడుగకూడదు. ఎవరు చేయవలసినది వారు, నీవు చేయవలసినది నీవు చేయుము.


నాకు రాకడను గురించి తెలియలేదు అనకూడదు. తెలిసికొనకపోవుట ఎవరి తప్పు? నీదేగదా! విశ్వాసులొక మోటుమాట అనగా గడుసుమాట అందురు. అందరూ సేవచేయుచూ ఉండగా, అనేకుల ఆత్మరక్షణ కొరకు ఎదురుచూస్తు ఉండగా కేవలము మీరు మాత్రము వెళ్ళుదురా? అని కొందరు విశ్వాసులు ప్రశ్నించుదురు. నీవు రక్షింపబడిన తరువాత ఎక్కువ సేవచేస్తే, ఎక్కువ ఫలితము పొందుదువుగాని రాకడలో నీకు పాలెక్కడ? నీవు ఎక్కువగా బైబిలు చదివితే, ఎక్కువ జ్ఞా నం పొందుదువు, కాని రాకడలో పాలెట్లుండును? నీవెక్కువ మందినిగూర్చి ప్రార్ధన చేస్తే ఎక్కువ ప్రార్ధనా ఫలితం పొందుదువు గాని రాకడలో పాలు ఎక్కడ? ఎక్కువ సువార్త పనిచేస్తే ఎక్కువగా సువార్త ఫలితం పొందుదువు కాని రాకడలో పాలె ట్లుండును? ఎక్కువ చందా ఇస్తే, అట్లు ఫలితం పొందుదువు. కాని రాకడలో పాలెట్లుండును. రాకడకు సిద్ధపడితేనే రాకడ ఫలితము పొందుదువు.

రాకడకు సిద్ధపడువారు ఈ క్రింది అంశమును ధ్యానించవలెను

  • (ఎ) జలప్రళయ కథ,
  • (బి) దానియేలు 2వ అధ్యాము,
  • (సి) ఏలీయా ఆరోహణము,
  • (డి) దానియేలు 7వ అధ్యాయము,
  • (ఇ) హనోకు ఆరోహణము ,
  • (ఎఫ్) మార్కు 13: 32 - 37లో ప్రభువు ఏ సమయమున వచ్చునో; అనగా సాయంకాలము, వచ్చునో కోడికూయునప్పుడు , తెల్లవారునప్పుడు; రాకడనుగూర్చి ఈ మొదలైన ప్రభువు మాటలు, అపోస్తలుల మాటలు, వాటి వివరము, అర్ధము పూర్తిగా నేర్చుకొనవలెను. మనము నేర్చుకొన్న గుర్తులు పునఃపఠన చేయవలెను;

నీవు రాకడకు సిద్ధపడగోరిన యెడల ఈ క్రింది ప్రశ్నలు ధ్యానించుము. అవి ఏవనగా:

  • 1. చదువరీ! క్రీస్తు త్వరగా వచ్చుననగా ఆయనకు అడ్డములేమియు లేవు అని అర్ధమనియు, గురుతులైన తరువాత ఆయన త్వరగానే వచ్చుననియు గ్రయించినావా?

  • 2. ప్రభువు ఫలానప్పుడు వస్తానని ప్రభువు తారీఖు చెప్పలేదు గనుక ఎప్పుడుబడితే అప్పుడే ఆయన వచ్చుననియు గ్రహించినావా?

  • 3. బహిరంగమైన గురుతులేకాదు. ప్రభువు నీకు స్వయముగా చెప్పిన గురుతులు గ్రహించినావా? అనగా నేను వచ్చేవేళయినదని ప్రభువు నీకు చెప్పుట గ్రహించినావా? అనగా నేను వచ్చేవేళయినదని ప్రభువు నీకు చెప్పుట గ్రహించినావా?

  • 4. నీవు రక్షింపబడినావని నీకు నిశ్చయమేనా? ఇదికూడ ప్రభువు నీకు చెప్పినాడా?

  • 5. నీవు పరిశుద్ధత్మ బాప్తిస్మము పొందినావని ప్రభువు నీతో చెప్పినాడా? ఇది నిశ్చయమేనా? " ఏది నిజమో," అను పత్రిక బాగా చదివినావా?

  • 6. ఇంతకాలం స్థిరంగా ఉండి, ఆయన వచ్చేటప్పుడు చల్లబడెదవని నీకు తోచినదా? హెబ్రీ 6వ అధ్యాయము.

  • 7. ఇప్పుడు చెప్పబడియున్న వారందరూ అబద్ధ ప్రవక్తలు కారనియు, బైబిలులో చెప్పిన అబద్ధ ప్రవక్త ఏడేండ్లలో వచ్చుననియు, ఎవరుబడితే వారు అంత్య క్రీస్తు కాదనియు , అతడు ఏదేండ్లలో వచ్చుననియు నీవు గుర్తంచినావా?

  • 8. అబద్ధ ప్రవక్తలైన , అంతెక్రీస్తులైన, క్రీస్తుయొక్క దైవత్వము ఒప్పుకొనని వారికైనా; లోకములో కలుగుచున్న ఆందోళనలు వారు చూచి, రాకడ దగ్గర బడ్డదని చెప్పినప్పుడు ,- " ఇప్పుడు 1900 సం|| ల నుండి ఉన్నవేకాని క్రొత్తవేవి కావనే వారికిని; రాకడ గురుతులు కొన్ని స్థలములలోనే జరుగుచున్నవి గాని అన్ని స్థలములలో గురుతులు నెరవేరుటలేదు అనువారికిని; ఈ రీతిగా రాకడకు ఎదురు ప్రశ్నలువేయు వారికి జవాబు చెప్పగలవా?

  • 9. "నేను తప్పకుండ ఎత్తబడుదుననే" విశ్వాసమునుబట్టి ఆనందించు వారిని గూర్చియు! నాయందభిమానము గలవారు నన్ను గూర్చి ప్రార్ధన చేయుచున్నందున ఎత్తబడుదుననే నమ్మకముగలవారిని గూర్చియు; నేను బాప్తిస్మము పొందినాను గనుక ఎత్తబడునని సంతోషించే వారిని గూర్చియు; రాకడను గూర్చిన ఇన్ని సంగతులు నేర్చుకొనక, సిద్ధపడక - "యేసుప్రభువును నమ్మినవారిని ఆయన తీసికొని వెళ్ళును గనుక నన్నుకూడ తీసికొని వెళ్ళునని" సంతోషించేవారిని గూర్చియు; ఆయన రాకడనుగూర్చికూడ సువార్త ప్రకటనలో చేర్చి ప్రకటిస్తూ అనేకమందిని నమ్మింపజేస్తున్నాను గనుక తప్పకుండ ఎత్తబడుదునని సంతోషించేవారిని గూర్చియు; ఏమి చెప్పుదువు? ఇవన్నియు ఎత్తబడుటకు నిజమైన కారణములేనా? అట్టివారికి పరిశుద్ధాత్మకు విరోధమైన పాపములను గూర్చియు, హెబ్రీ 6వ అధ్యాయములోని ప్రారంభ వాక్యములను గూర్చియు, యెహెజ్కేలు 33:23 -33 వరకు ఉన్న సంగతిని గూర్చియు జ్ఞాపకము చేసినావా?
    • 1) ఎవరు వాక్యంవింటారో, ఎవరు విని విశ్వసిస్తారో, ఎవరు విశ్వసించిన ప్రకారం విధేయులై నడుచుకుంటారో, ఎవరు ఆలాగు నడుచుకుంటు,

    • 2) విమలాత్మ ప్రోక్షణము అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుదురో '

    • 3) ఎవరు ఎత్తబడవలసిన నూతన యెరూషలేములోనుండు కాంతిని చూచేటందుకు ఈ భూలోకములోనే తర్ఫీదు అగుదురో '

    • 4) ఎవరు యోహానువలె ఈలోకములో యేసుక్రీస్తు ప్రభువుతో మిక్కిలి సహవాసము చేయుదురో అట్టివారు ఎత్తబడుదురని మీరెప్పుడైన విన్నారా ?

    • 5) ఎత్తబడు వారికి ' కనిపెట్టుగంట ' అనే ఒక చిన్న పుస్తకము మిక్కిలి ఉపయోగకరమైన పుస్తకమని మీరెప్పుడైన గ్రహించినారా?

    • 6) టైటానిక్ ఓడ - "అదిగో మునిగిపోతుంది" అనేవరకు ఓడలోని పనివారందరు, ఎవరి పని వారే చేసుకుంటున్నారు. అలాగే ఎవరికప్పగింపబడిన పనులు వారు రాకడవరకు చేసికుంటూ ఏమరుపాటుగా ఉండుటకంటె, అన్ని పనులు ముగించుకొని రాకడకు సిద్ధపడి ఉండుటే క్షేమమని మీరెప్పుడైన విన్నారా?

రాకడ సలహాలు :- ఈరెండు మాటలు బాగా జ్ఞాపకముంచుకొన వలయును. మమ్రే = సంస్తము కలిగియుండుట; ఎఫెసీ. 1:16 - 19. హెబ్రోను = దైవసహవాసం; ఈ మాటల అనుభవము ఏమిటో మీకు తెలుసునా? అపో| | కార్యం || 1:11; 1 థెస్స. 4:16, మత్త. 10:24-33లో ఈలాగున్నది, పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. యోహాను 14:3లో ఈలాగున్నది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినపుడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చెదను.

  • 1) 'క్రీస్తురాకడ ఆకస్మాత్తుగా వచ్చును, మనము ఎదురు చూడనపుడు వచ్చునూ అని మీకు తెలియునా? మత్త. 24:27లో ఇట్లున్నది. మెరుపు తూర్పునపుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో, ఆలాగే మనుష్య కుమారుని ఆగమనముండును.

  • 2) 1థెస్స. 5:2లో ఇట్లున్నది రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో (ఏలాగే చెప్పకుండ వచ్చునో), ఆలాగే ప్రభువు దినము వచ్చును.

  • 3) క్రీస్తు రాకడ మిక్కిలి సమీపమైనపుడు భూలోకముయొక్క సంగతి ఏలాగుండునో మీకు తెలుసునా? మత్తయి 24:7లో ఇట్లున్నది. జనముమీదికి జనమును , రాజ్యముమీదికి రాజ్యమును వచ్చును. అపో. కార్య. 2:19లో ఇట్లున్నది. పైన ఆకశమందు మహత్కార్యములను, క్రింద భూమిమీద సూచక క్రియలను, రక్తమును అగ్నిని పొగ, ఆవిరిని కలుగజేసెదను ' అని పేతురు ప్రసంగించెను. లూకా. 21:25,26లో ఇట్లున్నది. రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. యూదులు పాలెస్తీనా దేశమునకు తిరిగి వస్తారని బైబిలులో యున్నది. యెహెజ్కేలు 37:21లో ఉన్నది గ్రహించుదాము. 'ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు అనగా యూదులు చెదరిపోయిరో, ఆయా అన్యజనులలో నుండినవారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట నున్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చెదను.' 11 తిమోతి 3:1లో ఇట్ట్లున్నది. " అంత్యదినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము.

  • 4) క్రీస్తు రాకడకు ముందు అబద్ధ ప్రవక్తలు వస్తారని మీకు తెలుసునా? ఎవరీ అబద్ధ ప్రవక్తలు? క్రీస్తు రాకడ సమీపముగా లేదని ఎవరు వాదిస్తారో, వారే అబద్ధ ప్రవక్తలని గ్రహించుకొనడి, 11 పేతురు 3:3లో ఈలాగున్నది. " అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు, - 'ఆయన రాకడను గూర్చిన వాగ్ధాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని, సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే' అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను."

  • 5) యేసుప్రభువు రాకడ సమీపమైనప్పుడు మనుష్యులు ఎంత నిర్లక్ష్యముగా ఉంటారో మీకు తెలుదునా? మత్తయి 24:38,39లో ఇట్లున్నది. ' జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికెళ్ళిన దినమువరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లిచేసికొనుచు, పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు పర్యంతము ఎరుగక పోయిరి. ఆలాగుననే మనుష్య కుమారుని రాకడయుండును.'

రాకడకు సిద్ధపడే విషయాలు:- ఓ తండ్రీ! జీవాంతము తరువాత ఎవరు ఎక్కడికి వెళ్ళుదురో. నీకు ముందే తెలుసును. నూతన యెరూషలేము వెళ్ళుటకు కొందరు మృతుల గుంపులో చేరుదురనియు; కొందరు సజీవుల గుంపులో చేరుదురనియు; కొందరు ఏడు సంవత్సరములు శ్రమలో సిద్ధపడుదురనియు; మరికొందరు వెయ్యేండ్లలో సిద్ధపడుదురనియు, కొందరు రక్షింపబడిన వారిలో చేరి పరలోకములో యుందురనియు ; మరికొందరు నూతన యెరూషలేములో యుందురనియు నీ వాక్యములోనుండి నేర్చుకొన్నాము. గనుక నేను ఏ గుంపులోనికి తయారు కావలెనో ఆ గుంపులోనికి చేరే కృప దయచేయుము. నేను చేరవలెనని కోరే గుంపులోనికి చేరుటకు ప్రయత్నముచేస్తే నాది ఆ గుంపుకాకపోవచ్చు గనుక నెరవేరక పోవచ్చును, గనుక నేను ఏ గుంపులోనికి చేరవలెనో ఆ గుంపులోనికి చేరే కృప దయచేయుము.

గుంపు కోరిక
1. రక్షింపబడిన వారి గుంపునకు సిద్ధపాటు 1. నూతన యెరూషలేము గుంపులో చేరు కోరిక.
2. మృతుల గుంపు సిద్ధపాటు 2. సజీవుల గుంపులో చేరవలెనని కోరిక
3. ఏడు సంవత్సరముల శ్రమకాల నడత 3. నూతన యెరూషలేములో చేరు కోరిక.
4. వెయ్యేండ్ల సంవత్సరములలో ఉండు కోరిక 4. నూతన యెరూషలేమునకు వెళ్ళే కోరిక

కావున నూతన యెరూషలేమునకు వెళ్ళే భగ్యం , నూతన యెరూషలేమునకు వెళ్ళే ప్రార్ధన, నూతన యెరూషలేమునకు వెళ్ళే ప్రవర్తన కలిగియున్న వారికే ఈ భాగ్యము దక్కును.


సజీవుల గుంపులోనికి వెళ్ళేవారు చేయవలసిన కార్యములు:

  • 1) వాక్యము నేర్చుకొనవలెను.
  • 2) సంఘ సహవాసము కల్గి ఉండవలెను.
  • 3) ప్రార్ధించవలెను.
  • 4) స్తుతించవలెను. , సువార్త చెప్పవలెను.
  • 5.) చందా వేయవలెను .
  • 6.) శ్రమకోరుకొనవలెను.

  • 7) మంచిప్రవర్తన కలిగియుండవలెను.

ఈ జాబితానుబట్టి ఎవరు ఏ గుంపో తెలియును.


ఉదా:- ఒక కుమ్మరి మష్టు బంగారమును శిద్ధిచేస్తే దానిలో ఉన్న మష్టు తేలును. తరువాత కంసాలివాడు ఆ బంగారమును మరల పుటము వేయును . రెండవసారియును పుటమువేయును. ఒక్కొక్కసారి కొంత మష్టు తేలును. ఇంకొకసారి పుటమువేయగా చివరకు అది ముక్కలైపోవును. అనగా మష్టు ఎక్కువ బంగారం తక్కువ. ఎవరు ఏ గుంపులో చేరియున్నారో వారి ప్రవర్తనను బట్టి వారికి తప్పక తెలియును.


బైబిలు గ్రంధములోని రాకడ సూచనలు:

  • (1) తెలివి వృద్ధియగును:- నలుదిశల సంచరించుటనుబట్టి; (దానియేలు 12:4).

  • (2) మోటారు కారుల సూచన:- నహూము . 2:3,4.

  • (3) విమాన సూచన:- యెష. 31:5. 1947సం||లో భక్తిగల అలన్ బే అను బ్రిటిష్ సైన్యాధిపతి, యెరూషలేమును స్వాధీనపరచ్టకు; అప్పటికి దానిని ఆక్రమించిన విరొధులకు తన పేరుమీద ఈ విధముగా పత్రికలు రాయిచి, విమానములోనుండి క్రిదకు చల్లించెను,' మీరు మీ ప్రాణములను దక్కించుకొనగోరిన యెడల యెరూషలేమును విడిచి పారిపొండి.' ఈ పత్రికను చూచిన తురుష్కులు, ఆ వ్రాత క్రింద ఉన్న పేరును చదివి, ఇది దైవ సందేశమని భావించి యెరూషలేమును విడిచి పారిపోయిరి. ఎందుకనగా అరబ్బీ భాషలో ' అలన్ బే ' అనగా దేవుని కుమారుడని ఈలాగు ఆ పరిశుద్ధపట్టణమును తుఫాను గుండ్లతో కాల్చుగూడదని ప్రార్ధించి రక్షించిరి. విమానములనువలన తండ్రి ఈ పట్నమును కాపాడెను.

  • (4) రేడియో టెలివిజన్ సూచన:- యోబు. 38:35; ప్రక. 11వ అధ్యా||.ఇద్దరు సాక్షులు.

  • (5) అణు బాంబు: - ఈ బాంబు వలన లోకము పూర్తిగా నాశనము కాదని లేఖనములు బోధించుచున్నవి. ఎందుకనగా వెయ్యేండ్ల పరిపాలన జరుగవలెను. తర్వాత ||పేతురు 3:10-11వ వచనములో నున్నది నెరవేరును.

  • (6) నరకపు బాంబు సూచన: - హైడ్రోజను బాంబు పేలినందున అనేకులు నశించిరి. 6 మైళ్ళు పూర్తిగా నాశనమాయెను.

  • (7) భూకంపపు సూచన:- 15వ శతాబ్ధమునుండి 19వ శతాబ్ధము : 2119 భూకంపములు సంభవించినవి.

  • (8) సముద్ర తరంగముల ఘోష:- లూకా. 21:25.

  • (9) ఆకాశములో సూచనలు:- ఎగిరిపోవు సాసర్లు:- లూకా. 21:11.

  • (10) అన్యజనుల కాలముల నెరవేర్పు:- లూకా. 21:23-24; రోమా. 11:25; మత్త. 24:15-23.

  • (11) యెరూషలేము మరల కట్టబడుట:- కీర్తన. 102:16; యిర్మి. 31:38- 40 2500 సం||ల క్రితము ప్రవచించెను.

  • (12) పాలస్తీనా పూర్వస్థితికి వచ్చు సూచన:- యెహె. 38:15-16లోని ప్రవచనముల నెరవేర్పు ఉన్నది.

  • (15) తూర్పు రాజుల సూచన:- 6దూత. ప్రక. 12:16

  • (16) అర్ధరాత్రి సూచన:- మత్త. 25:5, 6

  • (17) లోకకార్యముల సూచన: అపో||కార్య. 17:31 యునైటెట్ స్టేట్స్ అధ్యక్షుల మరణములు . 1840:లో (హరిసన్) 1860 లో (అబ్రాహాం లింకన్) 1880 లో (గార్ ఫీల్డు) 1900లో మ్యూక్ కిన్ లే) (రూస్ వెల్ట్) 1940 (మాస్ వెల్డు)1960 (కెన్నడీ)

  • (18) అంటురోగ సూచన:- ఈ రోగములవలన కోట్లకొలది నశించిరి.

  • (19) పెట్టుబడిదారీ విధానముపై కూలివారి పోరాటపు సూచన:- యాకో. 5:1-4.

  • (20) ఇప్పటి దైవిక ఉజ్జీవము:- ఆత్మ కుమ్మరింపు (యెష. 66:8వ) యెహె. 37; యెహె. 2:28 - 29వ) ; తమ దేవుని ఎరుగువారు బలముగల్గి గొప్పకార్యము చేయుదురు (దాని. 11:32వ); అపో. కార్య. 2:17-21 (యాకో. 5:7వ) (లూకా. 21:28వ);

  • (21) నులివెచ్చని సంఘ సూచన:- ప్రక. 3:14-16; ప్రక. 3:10-11వ రాజైనౌజ్జీయా ధనారిని వృద్ధి అతని నాశనమునకు హేతువాయెను.

  • (22) వెయ్యేండ్ల పరిపాలన గూర్చిన, రాకడను గూర్చిన పరిహాసలు: 2పేతు. 3:3-4 క్రొత్త జన్మము పొందినవారికి రెండవ రాకడ బాధకరముగానుండును. (యెష. 3:5) నికోదేమువంటి బోధకులు

  • (23) తప్పుడు బోధకులు లేచుట:- 1 తిమోతి. 4:1-3 గతకాలమునుండి అనేక తప్పుబోధలు లేచినవి. యెహోవాసాక్షులు, క్రీస్తు దైవత్వము ఒప్పుకొనరు. నరకములేదందురు. ఇంకా అనేక భూత బోధలు, వాక్య కరువు, విమతములు లేచును.

  • (24) నోవాహు అ. దినముల సూచన:- తినుచు, త్రాగుచునుండుట (లూక 17:26-27) నోవాహు కాలములో లోకమంతట భ్రష్టత్వముండెను. ఇప్పుడును లోకములో ఆలాగే యున్నది.
    • 1. జనులు తినుచు, త్రాగుచు నుండుట; మితిమీరి త్రాగుట

    • 2. పెండ్లి చేసికొనుట,
    • 3. నీతిమంతుడైన నోవహు యెహోవా జలప్రళయమును గూర్చి హెచ్చరించెను.

    • 4. ఐగుప్తీయుల కాలములో పిరమిడ్ల కట్టబడెను. నోవాహు గొప్ప ఓడను కట్టెను.

    • 5. నోవాహు దినములలో అవినీతి విస్తరించెను. తండ్రి సంతాపపడెను.

    ఈ దినములలోను ఆలాగేయున్నది.

  • (25) యౌవ్వనులు చెడిపోవుదురను సూచన:- (2తిమో. 3:1-4)

  • (26) లోకవినాశము:- మత్త. 24:20; దాని. 12:1.

  • (27) లోకమంతయు సువార్త:- మత్త. 24:14. పైవన్నియు రాకడ గురుతులే.

ఇవన్నియు మన కాలములోనే నెరవేరినవి. ఇకనూ నెరవేరుచున్నవి గనుక ఇందులోని రాకడ హెచ్చరికలను, ఉపదేశ వాక్త్యములను, సందేహ సమాధానములను, దైవ గ్రంధ సాదృశ్య వాక్యములను బహు జాగరూకతో చదివి, ధ్యానించి, తమ సజీవుల గుంపులో చేరియుందురు.


అట్టి సజీవ రాకడ ఆరోహణ భాగ్యము ధ్న్యత, త్వరగా వచ్చుచున్న పెండ్లికుమారుని మహిమ మేఘముల ఎదుర్కొను అంతస్థు ; త్రియేక తండి చదువరులెల్లరకును, ఈ కడవరి కాలములో కనీసము ఒక పర్యాయమైన చదివి, ధ్యానించి, ఆయత్తపడువారికి సంపూర్ణముగా అనుగ్రహించి మహిమ పొందునుగాక. ఆమేన్.


లోకకార్యము లెల్ల - నీకార్య ధాటికి - లొక్కెయని నీకు తెలుసునా - ఏకార్యమైనను ఎంచి చేసిన యెడల - ఏక రీతిని జరుగు తెలుసునా - ఎంతో చక్కగ జరుగు తెలుసునా - ఎంతో వింతగ జరుగు తెలుసునా || క్రైస్తవ||


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद