యిర్మి. 6: 16; యోహాను 14:6; ఎఫెసీ. 2:18 -22.
' మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు నెమ్మది కలుగును; యిర్మి. 6:16 'నేడే ప్రభువు వచ్చుకొను - వాడే ధన్యుడు = ప్రభువు - కూడ మేఘమెక్కి - వెళ్ళకుండ నుండడు ' ( లూకా. 12:35 - 40 ) || యేసుప్రభువు||
' భూలోకమంతటికి సువార్త - పోవుట కిండియా ప్రధానము - పై లోకంబునుండి వచ్చిన - బైబిలు మిషనును ఎత్తిచూపుము ' || మనో||
' నమ్మరాదని యపవాది - నచ్చజెప్పు, చున్నను - నమ్ముచుండుము దేవుని - వ్రాత వాక్యము సత్యమంచు - నెమ్మది నీ కపుడె కల్గు || స్రీయేసు ||
1. రాకడ గురించి కొద్దో, గొప్పో ఇప్పుడన్ని మిషనులవారు చెప్పుచున్నారు. గాని నేడో రేపో అని బైబిలుమిషనువారు చెప్పుచున్నట్లుగా తక్కిన మిషనులవారు చెప్పుటలేదు. 'ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన వచ్చినప్పుడే మనలను తీసికొని వెళ్తారు ' అని వారు అంటునారు.
అయితే బైబిలు మిషను వారిలోనుండి అన్ని మతములలోని వారినుండి ఎవరు బైబిలు మిషను అనుభవమైయున్న - " నేడో రేపో వస్తారన్న" మాట్త్త విశ్వసిస్తారో వారే ఎత్తబడుదురు. గాని రాకడకు ముందు భక్తులైన వారు అనగా మారుమనస్సు పొంది , రక్షింపబడి, వధువు సంఘములో చేరిన వారు మరణము పొందిన యెడల మోక్షములోనికి వెళ్ళుదురు. అనగా వీరు రాకడ వరకు ఉండరు. ఎందుకంటే వారికి రాకడబోధలు పూర్తిగా తెలియలేదు. గనుక ప్రభువు మరణమును రానిచ్చి మృతులగుంపులోనికి వీరిని చేర్చుదురు.
పదవక్లాసులో ఉన్నవారు బి. ఎ క్లాసుకు రాకపొతే బి.ఏ. ఏలాగు పాస్ కాగలరు? ఎవరైన బైబిలుమిషనులోనికి రాకపోతే, ఆ బోధలు వినకపొతే, రాకడ గురించి ప్రభువు స్వయముగా సన్నిధి కూటములలో చెప్పినది తెలియపోతే ఏలాగు రాకడకు సిద్ధపడగలరు.
ఎక్కడున్నను సరే బిఎబిలు మిషను సిద్ధాంతములు నమ్మి, స్వంత మిషను, స్వంతమతము విడిచిపెట్టితే వారు బైబిలుమిషనే. వారు గుంటూరు రానక్కరలేదు. అందులో ( బైబిలు మిషనులో ) ఉన్నావన్ని అంగీకరించి చదువుకుంటారు.
ప్రభువా! నేను బెబిలుమిషనులో చేరవలెనా? అని మీక్లాసులో ప్రభువును అడగండి. ఆయన ఏలాగు చెప్పితే ఆలాగు చేయండి.మేమందరము మిషనులో చేరినవారమే మేమెందుకు ప్రభువును అడుగవలెను? అని మీరు నన్ను అడుగవచ్చును.
జవాబు:- మీరు బైబిలుమిషనులో చేరియే మాత్రము! ఊదావలె చేరి తప్పిపోవచ్చును. అననియ, సప్పీరాలు ఆదిసంఘములో చేరి తప్పిపోలేదా? గనుక బైబిలు మిషనులోనికి వచ్చి తప్పిపోయిన యెడల వారు ఎత్తబడరు. తప్పిపోయినప్పుడేలాగు ఎత్తబడుదురు? బైబిలులోని వ్రాతవచనములు కొన్ని అర్ధము కానప్పుడు, అవి వ్రాయించిన ప్రభువు వచ్చి చెప్పితే నమ్మకూడదా? అట్లు నమ్మనియెడల, వ్రాతకూడా నమ్మనట్టే.
ప్రశ్న:- రక్షణ ఉండునుగాని ఎత్తబడుట ఉండదు. వారెవరు? ఈ ప్రస్న అడిగిన వారికి ఏమి జవాబు చెప్పవలెను. ఎంత భక్తులైననూ, రాకడకు , సిద్ధపడకపోతే ఎత్తబడరు అనియు, వారు సిద్ధపడకపోయినా - నేను మాత్రము త్వరగా వస్తాను అనియు, సిద్ధపడినవారిని మాత్రమే తీసికొని వెళ్ళుదుననియు ' ప్రభువు చెప్పుచున్నారు.
అంతరంగ క్రైస్తవులు బాప్తిస్మము పొందుటకు శక్తిలేనివారైనప్పటికిని రక్షణ పొందుదురు. మరియు బైబిలు మిషనులోనికి చేరుటకు ఆసక్తి ఉన్నప్పటికిని శక్తి లేకపోవును. అట్టివారు ఎత్తబడుదురు. ఎందుకంటే బైబిలు మిషను వారి హృదయములో ఉన్నది. అది ప్రభువుకు తెలుసునుగాని మనుష్యులకు తెలియదు
- 1) అంతరంగ క్రైస్తవులు ,
- 2) అంతరంగ బెబిలు మిషనువారు,
- 1 ) ఎత్తబడుదురనే దానిని గూర్చియు ,
- 2 ) బైబిలు మిషనులోనికి రావడము గూర్చియు
- 1వ పని:- అనుదినము మీరు రాకడ ప్రార్ధన చేయండి. ప్రభువా! నన్ను రాకడకు సిద్ధపరచుము! ఆమేన్. అదే చాలు. అయ్యగారి పనేమనగా ప్రజలను తీసికొని వచ్చి రాకడకు సిద్ధపర్చుటే. మీ పని, మీ క్లాస్ అదే.
- 2వ పని:- సిద్ధపడినవారిని తీసికొనివచ్చి, సిద్ధపర్చుట లూకా. 1వ అధ్తాయములో ఉన్నది. ఒకటవ అధ్యాయమంతా చదివి వెదకండి.
ప్రస్న: - ' సిద్ధపడినవారిని సిద్ధపర్చుట ' అనగా యేమి? జవాబు: సిద్ధపడినవారి ప్రస్నలకు , సందేహములకు సరియైన జవాబులు వినిపించుటయే వారిని సిద్ధపరచుట. మీరు ప్ర్స్నలడుగగా అయ్యగారు వాటికి జవాబులు చెప్పి వ్రాయించి సిద్ధపర్చుచున్నారు (లూకా. 1:17 ). అయ్యగారి కులవృత్తి, కులహక్కు, జనమ హక్కు, సువార్త ప్రకటించుటే అదే మీకు చెప్పుచున్నారు. మీరు రాకడకు సిద్ధపడకపోతే ఇంకొక నెల ఇక్కడే ఉండగలరా?
ప్రశ్న: - రాకడకు సిద్ధపడుట ఎట్లు? జవాబు: - ప్రతిదిన కార్యక్రమము చక్కగా జరిగించుట వలననే. అనగా
- ఎ ) ప్రార్ధనమెట్లు ప్రకారముగా ప్రతిదినము ప్రార్ధించుటవల్ల.
- బి ) సైతానును ఎదిరింపవలసిన ఎదిరింపులు ఎదిరించుటవల్ల.
- సి ) బెబిలులో రాకడను గురించి ఎక్కడెక్కడ ఉన్నవో వాటన్నిటిని చదువుటవల్ల అనగా రోజుకు ఎన్ని చదివితే అన్ని ఉదా:- ప్రతి సువార్తలో చివరనున్న అధ్యాయములలో రాకడనుగూర్చి ఉన్నది. ఆలాగే థెస్సలోనీకయులకు వ్రాసిన రెండు పత్రికలలో రాకడనుగూర్చి ఉన్నది. ఆలగే ప్రకటనగ్రంధము అంతా చదువవలెను.
- డి ) రాకడకు ముందు ప్రతివారు ఆదికాండమునుండి ప్రకటన వ్స్రకు రాకడ పేరుమీద ఒకసారి బైబిలంతయూ చదువవలెను. ఓ రాకడ! నేనింకా బైబిలు పూర్తిగా చదువలేదు గనుక ఆగుమని చెప్పి చదువవలెను. గనుక రాకడకు ముందు సిద్ధపడే పని చాలపని యున్నది.
- ఇ ) నేను రాకడ గురించి ఎన్ని పత్రికలు వ్రాసినానో అవన్ని చదివి తీరవలెను. ( బెజవాడ్ద భూషణంగారి వద్ద ఉన్నవి ).
- ఎఫ్ ) 'రాకడ అంత త్వరగా రాదు ' అను తలంపు రోజునకు 10 పర్యాయములైన రాకమానదు. గనుక ఈ తలంపును ఎదిరించడి. ఓ సాతానా అది నీ తలంపు అని ఎదిరించండి. దానిని కాళక్రింద వేసి తొక్కవలెను.
- జి ) " నేను రాకడకు సిద్ధమౌదును అనిగాని, సిద్ధముగా ఉన్నాను అనిగాని ప్రభువు చెప్పలేదు. కాబట్టి నెను నేను వెళ్ళునది నిశ్చయము కాదు" అను తలంపు పుట్టకమానదు. ఇది గడ్డు పిశాచి, దానిని శరీరమంతటితో త్రొక్కవలెను. వాడు మీ అందరిమీద పడతాడు. అయ్యగారి వ్రాతలు, బోధలు కలిగిన పుస్తకములు; నోట్సులు = నోటులు = రూపాయి నోటులు ).
- ఎచ్ ) నేను చెప్పిన రాకడ పాఠములు మీరు ఇతరులకు చెప్పుట వలన రాకడకు సిద్ధపడగలరు.
- ఐ ) 'ప్రభువా! నేను నీ రాకడకు సిద్ధముగా ఉన్నాను ' అని ప్రభువుతో చెప్పుటవల్ల రాకడకు సిద్ధపడగలరు.
-
జె. )
- 1 ) 'ఓ సాతానా,
- 2 ) ఓ లోకమా,
- 3 ) ఓ శరీరమా!
పై ఆత్మీయ విషయములన్ని గ్రహించినవారమై, ఆయన సన్నిధిలో మనలను సరిచేసికొనుచు, ఆయనపై ఆనుకొనినవారమై, త్వరగనే వచ్చుచున్న ఆయన రాకడకు సిద్ధపడియుందుముగాక! ఆమేన్.
మొదటి రాకడ వచ్చు నన్న పధము సిద్ధించెను ఇదియు సిద్ధించును - యేసు త్వరగ వచ్చును - ఎత్తబడును సంఘము || స్రీయేసు||