రెప్పపాటు - సిద్ధపాటు

( 11 - 12 - 1955వ సం | |లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము. )

దా.కీర్తనలు 18:9; మత్తయి 24:27; 1కొరిథి. 15:51 - 52
"ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము," 1కొరిథి. 15:52.

నీ కిష్టులైనట్టి - లోకవాసులకు = రాక మానదు శాంతి - రంజిల్లు వరకు దేవ || దేవ || ప్రియులారా! దేవప్రియులారా! మీరు పాడుకొన్న కీర్తనలో నున్న ("దేవ ప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి = దేవునికిష్టులౌవారలకు - ఈ వసుధను లభియించును శాంతి....") దేవుని ప్రియులారా! దేవునికిష్టమైన వారికి సమాధానము కలుగునుగాక అని ఎవరినిగూర్చి వ్రాయబడినదో ఆ ప్రియులారా! దిసెంబరు నెలలో లూథరు మిషనులోను, చర్చిమిషనులోను, రోమన్ కథోలిక్ మిషనులోను మూడు సగతులనుగూర్చి ఉపన్యాసములు జరుగును. మొదటి ఉపన్యాసము ప్రభువు బేత్లేమునకు వచ్చుట. రెండవ ఉపన్యాసము మనము ప్రార్ధన చెయునప్పుడుడెల్ల ప్రభువు మనయొద్దకు రావడము. బేత్లేహేమునకు అనగా భూమిమీదికి వచ్చుట. ఇప్పుడు అనగా ప్రార్ధిచినపుడు మన యొద్దకు రావడము. మూడవ ప్రసగము ఏమనగా, మేఘాసీనుడై మనలను తీసికొని వెళ్ళుటకు మనయొద్దకు రావడము. ఈ మూడు రాకడలను గురించి ఈనెలలో ప్రసగములు జరుగుచుండును. కాబట్టి నేను ఈవేళ 3వ రాకడ అనగా ప్రభువు మేఘాసీనుడై వచ్చుటయు, మనకొరకు తిరిగి వచ్చుట అనువిషయమై కొంతచెప్పెదను.

ప్రభువు బెత్లెహేములోనికి వచ్చుట్త మొదటిరాకడ. మేఘాసీనుడై వచ్చుటయు , సఘమును తీసికొనివెళ్ళుటకు వచ్చుటయు, రెండవ రాకడ న్యాయము చొప్పున ఆయన పెండ్లికుమారుడుగా వచ్చుట అనునది 3వ రాకడ కావలెను. కానీ అది బైబిలులో ఎక్కడనులేదు. బేత్లేమునకు వచ్చిన రాక భూమిమీదనున్న వారందరికొరకు వచ్చిన రాకడ. అందుకే దూతల యొక్క పాటలో భూమిమీద సమాధానము అని వ్రాయబడినది. అయితే సంఘములోనికి వచ్చిన రాకడ ఏదనగా, మనము ప్రార్దించేటప్పుడు ఒకొక్కరి యొద్దకు వచ్చే రాకడ మేఘములోనికి వచ్చే రాకడ, తన సంఘముకొరకు మాత్రమే ఒక రాకడ. భూలోకమందలి వారికొరకు వచ్చే రాకడ మరియొక రాకద. ప్రభువు పెండ్లి కుమారునిగా మేఘముమీద మధ్యాకాశమునకు వచ్చే రాకడ ఒక ప్రత్యేక కార్యక్రమము. దాని కొరకు ప్రత్యేకముగా సిద్ధపడవలెను. ఆ ఎగిరి వెళ్ళే గుంపులో అనేక వరుసలలో ఉన్న భక్తులుందురు. గనుక ఆ రాక కొరకు సిద్ధపడవలసిన బాధ్యత ప్రతి నరునిమీద ఉన్నది. ఆ భక్తుల వరుసలు ఈలాగు ఉన్నవి.

  • ( 1 ) ప్రభువు భూమిమీద జన్మించినప్పుడు ఆయన బోధ విని మార్పు చెంది సిద్ధపడిన వరుస.
  • ( 2 ) ఆయన సంఘముద్వారా విని మార్పు చెందిన భక్తుల వరుస.
  • ( 3 ) ఈ కడవరి కాలములో పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది రాకడకు సిద్ధపడిన భక్తుల వరుస.
ఈ వరుసలోనే అనగా నీటి బాప్తిస్మము పొంది ఆత్మ బాప్తిస్మము పొందిన వారిలో నుండియే గాక మరికొంతమందినికూడ ప్రభువు ఏర్పాటు చేసికొనిఉన్నారు. అనగా నీటి బాప్తిస్మము పొందని వారిలో నుండు కొంతమందిని ఆయన వాకు ఈ గుంపుల వారినందరినీ ఆయన రెప్పపాటులో ఆకర్షించుకొనును.

ఈ రెప్ప పాటు అనే గుర్తు లోకమునకు ఎప్పటినుడో యున్నది. ఎప్పటినుండియున్నది అనగా 2000 సం || ల యున్నది. ఈ రెప్పపాటు అనే గుర్తు రెండువేల సం ||ల ఈలాగేయున్నది. తక్కిన గుర్తులు జరుగుట , జరిగిపోవుట జరుగుచున్నవి.తక్కిన గురుతులు లోకములో ఉన్నవి. ఈ రెప్పపాటు గురుతు మన శరీరములో ఉన్నది. మనము ఎన్నోసార్లు రెప్పవేయుచున్నాము. రెప్పవేసిన ప్రతిసారి రాకడ విషయము గురించి తలంచుకొనవలయును. అట్లుచేయుట అసాధ్యమే. కాని రోజులో ఒకసారైనా రాకడ విషయములు తలంచుకొనవలయును. రెప్పపాటు అంటే ఏమిటో తెలిసికొనడానికి శాస్రజ్ఞులు కనిపెట్టరు. 1గంటకు 60 నిమిషములు. 1నిమిషమునకు 60 సెకండ్లు. 1 సెకండును 11 భాగములు చేయగా 1/11వ భాగము రెప్పపాటు ' అని గుర్తించిరి. రోజు కంటె గం || లు తక్కువ. గం ||ల కంటె నిమిషమును ఎంతో తక్కువ. నిమిషమే ఎంతో తక్కువ అనుకొంటే అందులో సెకెండు మరీ తక్కువ. ఆ సెకెండు మరింత తక్కువనుకొంటే ఆ సెకెండులో 1/11వ భాగము రెప్పపాటు. ఇంత దీర్గకాలములో సిద్ధపడలేని మనము 1 /1వ భాగము కాలములో సిద్ధపడగలమా? సిద్ధపడలేము. రాకడకు సిద్ధపడకపోతే, అసలు పుట్టగతులేయుండవు. అందుచేతనే దేవుడు రోజులో ఒకసారైనా రాకడ విషయములు తలంచుకొంటూ యుండమన్నారు

'నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు = గానన్ పరిశుధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసికొనును ' | | త్వరగారానున్న | |

' క్రీస్తుప్రభువు నన్ను సిద్ధపర్చును.నాయంతట నేను సిద్ధపడలేను. నా వల్ల కానేరదు. ఓ ప్రభువా! తండ్రీ! నీవే నన్ను సిద్ధపర్చుము. నేనింతవరకు సిద్ధముగాఉన్నాను. తరువాత విషయము నీవే చూచుకొని నన్ను సిద్ధపరుచుము ' అని ప్రార్ధింపవలెను. సిద్ధపడుట అనగా మొదట మన పాపములను ఒప్పుకొనవలెను. ఇక ఎన్నటికిని చేయనని పూర్తిగా ఒప్పుకోవలయును. మరలా తప్పును చేయకూడదు.

పడిపోవుట మానవనైజముగాన తప్పిదములో పడిపోయినపుడు మరల వెంటనే ఒప్పుకోవలయును. ఎవరైనాసరే సిద్ధపడవలెనంటే, క్రీస్తుప్రభువుతో వెళ్ళవలెనంటే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనవలెను.ఒప్పుకొనిన పాపములనుండి తప్పుకొనవలెను.

  • ( 1 ) మనము ఒప్పుకొనుట్త్త,
  • ( 2 ) తప్పుకొనుట,
  • ( 3 ) చెప్పుకొనుట.
ఈ మూడు పద్ధతుల ప్రకారము ఎవరు చేయ గలరో వా రు సిద్ధపడగలరు. వారు ఇంక ఏమి చెయవలెనంటే, దేవుడు చేసిన మేళ్ళన్నిటికి స్తుతి చేయవలెను. కృతజ్ఞతాస్తుతి చేయవలెను. అట్లుచేసిన తరువాత ప్రభువు రాకడకు సిద్ధపడియున్నాను అనుకోవలయును. ' నేనెంతవరకు సిద్ధపడి ఉండాలో! ' అని అంతవరకు సిద్ధపడి ఉండండి. రాకడకు అనగా 1/11వ భాగమునకు సిద్ధముచేయుమని ప్రార్ధన చేయవలెను. ' మనము సిద్ధపడనిదే,' నన్ను సిద్ధపర్చుము అని అడుగుటకు నోరురాదు. ఒకవేళ నోరు వచ్చినను మనస్సు రాదు. ఒకవేళ మనస్సు వచ్చిననుగాని అది హృదయపూర్వకముగా కాదు. కారణము ఏమనగా మొదట సిద్ధపడి ఉండకపోవుటయే. సిద్ధపడేవారైతే ఈ ప్రార్ధన స్వయముగా ఉంటుంది. మరియొక సంగతి చెప్పుదును. బాగా వినండి, బాగా గుర్తు పెట్టుకొనండి. ఆ కాలములో ఏమి ఏమి జరుగుననగా సిద్ధపడియుండే వారు మంచి పనిమీద ఉన్నను, ఆపదలోనున్నను, గాఢనిద్రలో ఉన్నను, కష్టములోనున్ననూ, హానిస్థితిలో ఉన్నను, శ్రమలోనున్నను వెళ్ళిపోవుదురు. ఈ శ్రమలు కేవలము శరీరమునకె. శరీరము మాత్రమే శ్రమలలో యుంటుంది గాని ఆత్మ జీవము తగ్గదు. అందుచేత ఆత్మకును, శరీరమునకును సంభదములేదు. గనుక చింతలేదు ఒకరు మంచిపనిమీద ఉన్నపుడు బండికి వెళ్ళవలెనంటే, ఆ పని ఎంత అర్జెంటు అయినను సరే, మరియొకరికి అప్పగించి ట్రైనుకు వెళ్ళిపోతారు. ట్రైనుకు వెళ్ళవలసినవారు కష్టములలోనున్నను , ఆ సమయమునకు వెళ్ళవలెను కాబట్టి వెళ్తారు అప్పటికి ఇంకా బండి రాకపొతే స్టేషనులోనే కునికిపాట్లు పడతారు. టికెట్టు ముందే కొనుకుంటారు గనుక నిద్రలోనున్న సమయములో బండికి గంటకొట్టగా, తుళ్ళిపడిలేచి వెంటనే బండి ఎక్కుతారు. ఇవి . లోకసంభంద సంగతులు. రాకడ్ద సమయమున మీకుకూడ అట్లే జరుగుతుంది. గనుక మనము ముందే సిద్ధపడవలెను.తరువాత ఆయన సిద్ధపరుస్తారు. ఆ తరువాత ప్రభువు వచ్చి తీసికొని నేనింతవరకు సిద్ధముగాఉన్నాను. తరువాత విషయము నీవే చూచుకొని నన్ను సిద్ధపరుచుము ' అని ప్రార్ధింపవలెను సిద్ధపడుట అనగా మొదట మన పాపములను ఒప్పుకొనవలెను. ఇక ఎన్నటికిని చేయనని పూర్తిగా ఒప్పుకోవలయును. మరలా తప్పును చేయకూడదు.

పడిపోవుట మానవనైజముగాన తప్పిదములో పడిపోయినపుడు మరల వెంటనే ఒప్పుకోవలయును. ఎవరైనాసరే సిద్ధపడవలెనంటే, క్రీస్తుప్రభువుతో వెళ్ళవలెనంటే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనవలెను.ఒప్పుకొనిన పాపములనుండి తప్పుకొనవలెను.

  • ( 1 ) మనము ఒప్పుకొనుట్త్త,
  • ( 2 ) తప్పుకొనుట,
  • ( 3 ) చెప్పుకొనుట.
ఈ మూడు పద్ధతుల ప్రకారము ఎవరు చేయ గలరో వా రు సిద్ధపడగలరు. వారు ఇంక ఏమి చెయవలెనంటే, దేవుడు చేసిన మేళ్ళన్నిటికి స్తుతి చేయవలెను. కృతజ్ఞతాస్తుతి చేయవలెను. అట్లుచేసిన తరువాత ప్రభువు రాకడకు సిద్ధపడియున్నాను అనుకోవలయును. ' నేనెంతవరకు సిద్ధపడి ఉండాలో! ' అని అంతవరకు సిద్ధపడి ఉండండి. రాకడకు అనగా 1/11వ భాగమునకు సిద్ధముచేయుమని ప్రార్ధన చేయవలెను. ' మనము సిద్ధపడనిదే,' నన్ను సిద్ధపర్చుము అని అడుగుటకు నోరురాదు. ఒకవేళ నోరు వచ్చినను మనస్సు రాదు. ఒకవేళ మనస్సు వచ్చిననుగాని అది హృదయపూర్వకముగా కాదు. కారణము ఏమనగా మొదట సిద్ధపడి ఉండకపోవుటయే. సిద్ధపడేవారైతే ఈ ప్రార్ధన స్వయముగా ఉంటుంది. మరియొక సంగతి చెప్పుదును. బాగా వినండి, బాగా గుర్తు పెట్టుకొనండి. ఆ కాలములో ఏమి ఏమి జరుగుననగా సిద్ధపడియుండే వారు మంచి పనిమీద ఉన్నను, ఆపదలోనున్నను, గాఢనిద్రలో ఉన్నను, కష్టములోనున్ననూ, హానిస్థితిలో ఉన్నను, శ్రమలోనున్నను వెళ్ళిపోవుదురు. ఈ శ్రమలు కేవలము శరీరమునకె. శరీరము మాత్రమే శ్రమలలో యుంటుంది గాని ఆత్మ జీవము తగ్గదు. అందుచేత ఆత్మకును, శరీరమునకును సంభదములేదు. గనుక చింతలేదు ఒకరు మంచిపనిమీద ఉన్నపుడు బండికి వెళ్ళవలెనంటే, ఆ పని ఎంత అర్జెంటు అయినను సరే, మరియొకరికి అప్పగించి ట్రైనుకు వెళ్ళిపోతారు. ట్రైనుకు వెళ్ళవలసినవారు కష్టములలోనున్నను , ఆ సమయమునకు వెళ్ళవలెను కాబట్టి వెళ్తారు అప్పటికి ఇంకా బండి రాకపొతే స్టేషనులోనే కునికిపాట్లు పడతారు. టికెట్టు ముందే కొనుకుంటారు గనుక నిద్రలోనున్న సమయములో బండికి గంటకొట్టగా, తుళ్ళిపడిలేచి వెంటనే బండి ఎక్కుతారు. ఇవి . లోకసంభంద సంగతులు. రాకడ్ద సమయమున మీకుకూడ అట్లే జరుగుతుంది. గనుక మనము ముందే సిద్ధపడవలెను.తరువాత ఆయన సిద్ధపరుస్తారు. ఆ తరువాత ప్రభువు వచ్చి తీసికొని వును. గనుక క్రిస్మస్ పండుగ మొదటిరాకడడిసెంబరు నెలలో మనమందరమును తలస్తున్నాము. మన ఎదుట గోడ ఉంటే అవతల ఏముందో! అని గోడెక్కి చూస్తాము. ఆలాగే మన ఎదుట క్రిస్మస్ పండుగ ఉన్నది. క్రిస్మస్ పండుగ అనేదానికి ఎదుట రాకడయున్నది. గనుక క్రిస్మస్ పండుగలోనే మనకు రాకడ పండుగలు ఉన్నవి క్రిస్మస్ పండుగరోజున క్రీస్తుప్రభువు తొట్లోయున్నట్లుగాను, రాకడ తలంచుకొంటే, మహిమ వస్త్రములు ధరించుకొని మధ్యాకాశములో మేఘముమీద నిలునట్లుగాను మన గుర్తుకు వచ్చును. అయితే ఆ గడియవరకు ఎదురుచూడాలి. అప్పుడు సిద్ధపడగలము. ఆ గడియవరకు అనగా ఆ రెప్పపాటుకాలము వచ్చువరకు చెడ్డపనులు మానవలయును, మంచిపనులు చేయవలయును. ఈ పండుగలనే ఆ గురితో మనము చేయాలి. ఈ ప్రకారంగా మనముంటే రాకడకు సిద్ధపడగలము. ఇప్పుడు నేను ఈ గుర్తులను గురించి, భక్తుల మరణములను గురించి , పరిశుద్ధ రాకడను గురించి చెప్పాను. క్రిస్మసును గురించి చెప్పాను. రాకడను గురించి చదువుదురు గనుక తెలిసికొనగలరు. చదువుతారు. క్రైస్తవ ప్రసంగములలోను, పత్రికలలోను రాకడను గురించి క్రిస్మస్ పండుగ అనగా రాకడపండుగకు ముంగుర్తుగానున్న పండుగ. గనుక ఇంటికి వెళ్ళుటకు త్వరపడుచున్న ఓ సఘస్తులారా! ప్రభువు రాకడకు త్వరపడండి. గనుక ఏ పండుగ గొప్పది. రెండవ రాకడ పండుగే. ప్రభువు జన్మించి 2000 సం || లు జరిగినది. జరిగినప్రభువు జన్మము తలంచుకొని క్రిస్మస్ ఆచరిస్తున్నాము. ఆలాగైతే రాబోఅ రాకడ పండుగనుతలంచుకొని ఇంకా ఎక్కువ చేయాలి ప్రభువు రాకడలో వస్తున్నారంటే కొంతమందికి భయము. సిద్ధపడలేదు గనుక భయము. సిద్ధపడని వారికి వారు సిద్ధపడు నిమిత్తమైన ప్రసంగాలు భోధకులు చేస్తున్నారు. ఇప్పుడు అన్నిదేశములలోను భక్తులు ఎక్కువగా బోధద్వారాను , పత్రికద్వారాను విరివిగా రాకడ ప్రసంగములు చేస్తున్నారు. ఈ కొద్దిమాటలు ప్రభువు మీ హృదయములో ముద్రించి, స్మరించి, తన రాకడకు సిద్ధపర్చునుగాక! ఆమేన్.

యేసుక్రీస్తు ప్రభువు భువికి - నెపుడు వచ్చినన్ గాని = ఈ సమయమునదె యంచు - నెపుడు నమ్ముచున్న యెడల - నెగిరి వెళ్ళగలవుగా | | శ్రీయేసు | |


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद