రక్తపుకొల్లు - రాకడ గుంపు

(10-11-1959వ సం || లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము )

ప్రసంగి. 12:1-2; మత్త. 24:7; 1కొరింథు. 10:11
" మిమ్ములను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొనుకాలము వచ్చుచున్నది." యోహాను 16:2.

బిడియ మెందుకు నీకు - భీతి కలుగదు పరుల - పై తీర్పు తీర్చెదవు - తెలుసునా - పుడమియంతట
వ్యాప్తి - పొందేదవు నీ యెదుట - బడి నిల్వాయుధము తెలుసునా - జడియ శత్రువు నీకు తెలుసునా - కడకు
నీకే జయము తెలుసునా ( యెష. 54:14-17 ) ||క్రైస్తవ సంఘమా||

రాకడ మేఘములో చేరుకొనుటకు సరదపడుచున్న సంఘమా! రాకడానంద, మేఘారోహణ భాగ్యములు పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వంతముచేసి, మిమ్ములను తన వశములో ఉంచుకొనునుగాక! ఆమేన్. ఈరోజు మీకొక ప్రత్యేక అంశమును వివరించుదును. అదేమనగా, ఏకాంగి ఆరోహణము అయిన వెంటనే, ఇది శక్తిపూజవల్ల కలిగినది గాని , క్రీస్తు మహిమవల్లకాదు అనే వదంతి పుట్టును. ఆరోహణమైన కొన్ని దినములకు మతవిరొధులు సభలు చేసికొని, క్రైస్తవులు అన్నిమతములవారిని భయపెట్టు చున్నారు గనుక వీరిని ఏమిచేయవలెను ' అని ఆలోచించిచుదురువారిని . హతముచేయుటకంటె వేరేమార్గములేదు అని తీర్మానించుకొందురు. కాబట్టి ఇండియా దేశమంతట రక్తపుకొల్లు అగును. అనగా రక్తము ఏరులై పారును. కాబట్టి నమ్మగలవారు ఇపుడే అనుదినము ఒక గంట అయినను దేవుని సన్నిధిలో మోకాళ్ళూని ప్రార్ద్గనయందుండుటవల్ల జరుగబోవు హత్యలు తప్పించుకొనవచ్చును. ఇది సుళువైన పద్ధతి. ' జలప్రళయము వచ్చును ' అని నోవాహు చెప్పగా ప్రజలు హేళనచేసిరి. అట్లే రక్తప్రళయము వచ్చునని, త్వరలోనే వచ్చునని మేము చెప్పుచుండగా ఎక్కువమంది క్రైస్తవులు హేళన చేయుదురు. తీరా హత్యలు ఆరంభించిన వెంటనే నమ్మిప్రార్ధన చేయవలెనని కొందరు పూనుకొందురు కాని అదురులో కుదరదు. ఆ స్థితి సిద్ధబాటు కుదిరితే ఇపుడే కుదరవలెను. ఈ సంగతి ఇండియా క్రైస్తవులందరికి ఎవరు ధైర్యముగా తెలియజేయుదురో, వారు మహోపకారులు. ' హింసలు కలిగినపుడు ఆ చోటునుండి వేరొకచోటుకి పారిపోవుడి ' అని యేసుప్రభువు చెప్పలేదా? ఆ కాలమందు క్రీస్తు బోధవినుటకు అనేకులు సరద పడుచుండగా యూదుల అధికారులు ఏమన్నారు. " లోకము ఆయన తట్టు తిరిగిపోవుచున్నది, మనము ఏమిచేయగలము! మనము ఈలాగు ఊరకుంటే రోమీయులువచ్చి మనదేశమును ఆక్రమించుకొందురు" అనిచెప్పి కుట్రాలోచనచేసి, ప్రభువును చంపివేయలేదా! క్రైస్తవులు ఆ ప్రవచనములను నమ్ముచున్నారుగదా! ఈ ప్రవచనము ఎందుకు నమ్మరు? మీకు తెలిసినది మాకు ఎందుకు చెప్పలేదు? అని క్రైస్తవులు బైబిలుమిషను వారిని నిందిస్తారు గాని మనము ఇదివరకే పత్రికలో ప్రచురంచగా, అవి చదివి, ' హత్యలు ' బైబిలుమిషనువారికే, తక్కిన మిషనుల వారికికాదు ' అని చెప్పుచున్నారు. సద్భొధచేసిన ఏ దేశములోనైన సరే, ఏ కాలములోనైనా సరే వ్యతిరేక వ్యక్తులులేచి కుట్రాలోచనలు చేసినట్లును, సద్భోదలు నమ్మునట్లును చరిత్రవల్ల తెలియుచున్నది.

భావికాల కష్టములు ముందుగా తెలిస్తే జాగ్రత్త పడవలెను అను ఒక సిధాంతము చాలా ఉపయోగము. కొన్నాళకు బైబిళ్ళు దొరకవు. అందుచేత ఇప్పుడే బైబిలు కథలు బాగా నేర్చుకొన్నయెడల, అట్టి కొదువకాలములో మనస్సునందు బైబిళ్ళుండును. ( 12 బైబిళ్ళు ఒక గోతిలో పాతిపెట్టవలెను. ఆ కాలము అయిదు వందల సంవత్సరములుండును. బైబిళ్ళులేని కాలములో రహస్యముగా చదువుకొనవచ్చును అని ఒకరికి దర్శనము వచ్చినది ). దీనికి వాక్య కరువు అనిపేరు. హింసలు ఆగిపోయిన తరువాత రహస్యముగా తీసికొని చదువగలుగుదురు. హంతకులు ఎందాక రక్తము వాలికించుట చూస్తారు! ఎందాక శములు గిజగిజ కొట్టుకొనుట చూస్తారు! మగవారిని హత్యలు చేయుచుంటే, ఆడువారు నడుము కట్టుకొని , ఎందుకు చంపుచున్నారు అని అడుగుదురు అయినాగాని వారిని హింశించుటకు హింసకులు ఆగరు. ఎందుకనగా ఇరవైవందల ఏండ్లునుండి క్రైస్తవమతము బోధిస్తు ఉంటే ప్రజలు అంగీకరించలేదు. క్రీస్తుప్రభువు ఆరోహణమైన తరువాత హింసలు ఆరంభము అవలేదా! ఇప్పుడు కూడ ఆలాగే ఆరంభమగును. నోట్సులుకూడ కాల్చివేయుదురు. విశ్వాసులు భయపడనక్కరలేదు.

' భవిష్యత్తు ' అనే పత్రిక ఒకటి వ్రాసి ప్రోగ్రాం అచ్చువేయించవలెను. అపుడు అదంతట తిరుగును. ఆ ప్రోగ్రాము అయ్యగారి దగ్గర ఉన్నది. క్రొత్త బైబిళ్ళు ఎప్పుడు వ్రాయాలో! ఏకాంగి ఆరోహణ, విజ్ఞాపన ప్రార్ధన నెరవేర్పు ఎపుడో? రాకడ సిద్ధాంతములు ప్రకటించుట ఎప్పుడు? రాకడ సిద్ధాంతములు భొధించుట ఎపుడో? ఈ మొదలైనవన్నియు ఆ కార్యక్రమమైయున్నది. ఇపుడు సన్నిధి కూటములకు ఎక్కువపని. అందుచేత కనుగొనలేకపోవుచున్నాము. యోహానుకు ప్రకటనగ్రంధము ఏలాగు సినిమాలాగున కనబడెనో, ఆలాగే సన్నిధి కూటస్తులకుకూడ రాకడవరకు అన్ని సంగతులు చూపించబడును. గాని సన్నిధి కూటస్తులు తరచుగా కూడుకొనుటలేదు. ఈ కాలములో తిరస్కరణ విద్య ప్రభువు నేర్పించును. పరిపూర్ణముగా నమ్మినవారు దొరకరు గనుక పైపైన నమ్మినవారిని హింసకులు హింసింతురు. క్రైస్తవ మతమును విడిచిపెట్టనివారిని ' విడిచిపెట్టుమని ' అడుగుతారు. అవిశ్వాసులనుకూడ విడిచిపెట్టమంటారు. విశ్వాసులకు తప్పించుకొనే మార్గము ఇస్తానని కొరింథీయుల పత్రికలో ఉన్నది. ఆ కాలములో తల్లిని నరికితే, పిల్లలు- ' మమ్మును నరుకరు ' అని అనుకొందురు. గాని వారినికూడ నరికివేయుదురు. ఎక్కడ దాగుకొన్ననూ, హింసకులు మూలమూలకు వచ్చెదరు, వచ్చి చంపుదురు. హత్యలు ఒక్కసారే జరుగవు. క్రమముగా చేస్తారు. ముందు మతమును విడిచిపెట్టుమని అడుగుతారు. వ్యతిరేకముగా మాట్లాడితే చంపివేస్తారు. ముందు మన హిదూదేశములోనే ప్రారంభమగును. హిదూదేశముయొక్క అభిప్రాయములు క్రైస్తవులను పట్టి హతము చేయవలెను ) అన్నీదేశములకు వెళ్ళిపోవును. మనబైబిలుమిషను ఇక్కడ పుట్టినది గనుక మనము కప్పిన అనగా దాచిననూ, ఉండదు. అన్ని దేశములకు వెళ్ళిపోవును గనుక హింసలు అన్నిదేశములలోను ఉండును.

గురుతులు:- గురుతులు అయిపోయినవి కాని ఇంకా చిల్లర గురుతులు ఉన్నవి. పౌలు - ' సమాజముగా కూడుకొనుడి ' అన్నారు. హెబ్రీ. 10:28. గాని ఇంతవరకు ఎవరున్నూ అట్లు కూడుకొనలేదు. సమాజమనగా 10 మంది. ఒకరికొకరు అనగా ఒక్కొక్కరే .ఇది ముఖ్యమే అది ముఖ్యమే. తక్కువగా, సమాజముగా కాని ఎక్కువగాని కూడుకొని, రాకడకు సిద్ధపడండి.

మేఘములోనికి వెళ్ళలేనివారు ఎవరనగా:-
  • 1. ఏ పాపమైన వదలలేనివారు వెళ్ళలేరు. ఇదందరికి తెలిసిన విషయమే.
  • 2. కొందరు బైబిలు సరిగా చదవకపోవడము వలన వెళ్ళలేదు.
  • 3. ప్రార్ధన సరిగా చేయకపోవడంవల్ల వెళ్ళలేరు.
  • 4. ఆరాధనకు వెళ్ళలేకపోవడమువలన వెళ్ళలేరు.
  • 5. సరిగా సాక్ష్యము ఇవ్వనందువలన వెళ్ళలేరు.
  • 6. కానుకలు సరిగ్గా ఇవ్వకపోవడమువలన వెళ్ళలేరు.
  • 7. మందస్థితివలన రాకడలోనికి వెళ్ళలేరు.

గొప్పశోధన కాలము: కొందరు క్రైస్తవులు లోకమును విసర్జించుచున్నారు గాని పాపముచేయుట మానుటలేదు. ఆత్మీయ ఆచారములు బాగాచేస్తున్నారుగాని పాపమును విసర్జించలేరు. కులనిష్ట పాదుకొని ఉంది అది సాధారణముగా పోదు. అది సాధారణమైనది కాదు, భయంకరమైన పాపము, పాపముకంటే పెద్ద పాపము, ఇది పాపంకాదు గాని పాపం ఏ ప్రకారంగా పైకి వెళ్ళనియ్యదో, ఇదికూడా ఆలాగే పైకి వెళ్ళనియ్యదు. మనదేశమునకున్న ఈ చిక్కు తక్కిన దేశస్థులకు లేదు. ఈ గొప్ప శోధన తప్పించుకొనుట చాలకష్టము.

  • ( 1 ) పాపము చేసే పాపాత్ములు రాకడలో వెళ్ళరు.
  • ( 2 ) మందస్థితి గలవారు వెళ్ళరు.
  • ( 3 ) కులనిష్టగలవారు ఇక్కడే ఉండిపోవుదురు.
అయితే, మరణ సమయము వచ్చేటప్పుడు, ఈ 3ను వదులుకొనేవారుకూడ ఉంటారు. అప్పుడు ప్రభువు వారికి మరణము రానిచ్చి, క్షమించి, వారినికూడ మోక్షమునకు తీసికొని వెళ్తారు గాని వారు రాకడ గుంపులో ఉండరు. పెండ్లికుమార్తె వరుసలో ఉండరుగాని రక్షణలో ఉంటారు. కావున మరణ సామీప్యకాలమునకాక ముందుగానే వీటిని విసర్జించి పెండ్లికుమార్తె వరుసలో చేరవలెను.

రాకడ గుంపు ఎవరంటే :- రాకడ, రాకడ అని కలవరించేవారు. రాకడ గుంపు ఎవరంటే రాకడకు సిద్ధపడేవారు. అట్టివారికి మఋఅణము లేదు. వారు ఉన్నపాటుననే రెప్పపాటులో, మహిమ సరీరముతో ఎగిరిపొతారు. అట్టివారు నిద్రలో ఉన్నాసరే, మేఘములోనికి వెళ్ళిపొతారు. గనుక ఎంతమంది రాకడ గుంపుకు తయారవుచున్నారో పరీక్షించుకొనండి ఈ పాఠము అందరు వ్రాసుకొనదగిన గొప్పపాఠము. రక్షణ అనేది మారుమనస్సునుబట్టి ఉన్నది. రాకడ అనేది ప్రత్యేకమైన రీతిగా సిద్ధపడుటనుబట్టి ఉంటుంది. గనుక ఇదంతా జాగ్రత్తగా ఈ రాత్రంతా, జాగ్రత్తగా ఆలోచించుకొని రేపు మీ జవాబు చెప్పండి.

రాకడ ఏర్పాటును గురించి ఇంకా ఎక్కువగా చెప్పవలెను. మన సంఘములోనుండి కొందరు బైటకు వెళ్ళిపోవలెనను ఆలోచనలో ఉన్నారు. మరికొంతమంది ఇంకనూ వెళ్ళిపోవుచున్నారు. ఆలాగే కొందరు క్రీస్తుమతము లోనికి వస్తున్నారు. వారు సిద్ధపడినవారైతే రాకడ వస్తున్నారు. వారు సిద్ధపడినవారైతే రాకడ గుంపుకు వెళ్తారు అనగా వెళ్ళిపోవల్సినవార్ వెళ్ళిపోగా మిగిలినవారును, క్రొత్తగా వచ్చి కలిసేవారును రాకడ గుంపులోనికి వెళ్ళుదురు. వెళ్ళిపోవల్సినవారు వెళ్ళిపోగా అనగా చనిపోగా అనగా చనిపోయేవారు చనిపోగా, ఇతర మతముల లోనికి వెళ్ళిపోయేవారు వెళ్ళిపోగా; మిగిలినవారును క్రొత్తగా వచ్చేవారున్ను కలిసి మేఘంలోకి వెళ్తారు.

సంఘభక్తులలో సిద్ధపడివెళ్ళేవారు మరియు వెళ్ళనివారు ఉన్నారు:-
భక్తిపరులు నామక భక్తిపరులు
1. వీరు జీవితకాలమంతా దేవునిని నమ్మి దేవునిని హత్తుకొని జీవిస్తారు. 1. వీరు జీవితకాలమంతా భక్తులే కాని చివరి గడియలో అనగా రాకడ గడియప్పుడు భక్తులు కాదు. ఇట్టివారు మోక్షానికి వెళ్ళరు. తమ విసుగుదలను బట్టి వీరు మేఘములో వెళ్ళరు. ఎందుకనగా తమ ప్రార్ధన దేవుడు విన్నాడేకాదని విసుగుకొనువారు. దేవుడు వీరికి బుద్ధి చెప్పుటకు వీరిని కొనిపోరు.
2. వీరు దేవుడు-ప్రార్ధన విన్నా వినక పోయినా వారున్న స్థితిలోనే ఉండి రాకడకు సిద్ధపడుదురు. 2. .జీవితకాలమతా భక్తిగా ఉండి చివరికాలములో చెడిపోయిన వారు.
3. భూలోక జీవితమంతా చెడిన స్థితిలో ఉండి చివరి గడియలో మారినవారు. ఎలాగంటే చావు సమయములో కుడి చేతి ప్రక్క దొంగ పొందిన మారునస్సు వలె వీరునుమారుమనస్సు పొందుదురు. 3. భక్తిగానే ఉంటారుగాని రాకడకు సిద్ధపడరు. అందుచే దేవుడు వీరిని మరణముద్వారా, హేడెస్సులోని బోధ ద్వారా మార్పు చెందిన మోక్షమునకు వెళ్ళుదురు.
4.ఎన్ని చిక్కులు , ఎన్ని అవమానములు ఎన్ని అవస్థలు , ఎన్ని నిందలు ఉన్నప్పటికిని రాకడ వదలరు. వీరే ఆరోహణమై ఎగిరి వెళ్ళేవారు. 4. వీరిలో రాకడ నమ్మనివారు ఉన్నారు. వీరు భక్తులేగాని అన్నీ నమ్మి, రాకడ సామీప్యమన్నా నమ్మరు. గనుక వీరు వెళ్ళరు.
5. రాకడ విషయములన్ని బైబిలులో ఉన్నవి గనుక బైబిలును అనగా దైవగ్రంధమునుబట్టి విశ్వసించి ఆరోహణమై ఎగిరి వెళ్ళేవారు. - -

'మీ దీపములు వెలుగుచుండనియ్యుడి ' అని ప్రభువు అన్నారు గనుక మనము రాకడకు సిద్ధపడి, మెళకువగా ఉండవలెను. మనలను ఏలుబడి చేసే పాపములను ఏరిపారవేయవలెను. పరిశుద్ధాత్ముని వశమై పాప నైజమును వదలించుకొనవలెను. అప్పుడు సూటిగా ఎగిరివెళ్ళగలము. అట్టి దివ్యభాగ్యము త్రిత్వతండ్రి మనకు దయచేయునుగాక. ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद