పెండ్లికుమార్తె స్థిర నిరీక్షణ

( 15 - 1 - 1949వ సం | |లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము )

యెష. 9:7; లూకా. 21:25; 1థెస్స. 4:13-15

" ప్రభువురాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగియుండుడి , మీ హృదయములను స్థిరపరచుకొనుడి . " యోకో. 5:8

" నేను వచ్చువరకు ఇచ్చట - నిలకడ గలిగి నిలిచియుండుము - నేను వచ్చి రెప్పపాటు-లోనే నిన్ను కొనిపోయెదను " ||మనో||

ప్రార్ధన:- యేసుప్రభువా! నీ రాకడకు అనగా ఏ కాలములోని వారు నీ రాకడకు ఎవరు సిద్ధముకావలెనో, వారుయొద్దకే నీవు వస్తావు గనుక వందనములు. పాత నిబంధనలో నీ రాకడకు సిద్ధమైన వారియొద్ధకు వచ్చినందులకు స్తొత్రములు. క్రొత్త నిబంధన కాలములోకూడ నీ రాకడకు సిద్ధమైన వారియొద్దకు వచ్చినందులకు స్తోత్రములు. సంఘ కాలముయొక్క రాకడకు సిద్ధమైయున్న వారి యొద్దకు కూడా వచ్చెదవు గాన నీకు వందనములు. ఈ దినమందు నీ రెండు రాకడల గురించి ధ్యానించుచున్న మాకు తోడైయుండుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. నేటి దిన ధ్యానాంశము రెండవ రాకడ:-

యేసుప్రభువు వచ్చునని పాత నిబంధనలో భక్తులు నిరీక్షించిరి. వారికి ఆయన దర్శనములో కనబడినారు. అది ఒక రాకడ. ఆలాగు వచ్చినది ఆ తర్వాత బేత్లెహేమునందు జన్మించినది మొదలు, ఆరోహణ వరకు కనబడుతూనే ఉన్నారు. అది ఒక రాకడ. ఇంకొక రాకడ ఉన్నది. అదేదనగా ఆయన ఆరోహణమైనప్పటినుండి రేపు మేఘములో రావలసిన ఘడ్యవరకు ఉన్న రాకడ. దానికే రెండవ రాకడని పేరు పెట్టినారు. అది ప్రత్యేకమైన సంఖ్యలతో లెక్కపెట్టవలసియున్న అది రెండవ రాకడ్ద కానేకాదు. మరింత ఎక్కువ సంఖ్యను మనము వాడవలసియుండును. రెండవ రాకడ అయిన తరువాత ఏడు సంవత్సరముల శ్రమకాలములో మారుమనసు పొందేవారి నిమిత్తమై వ్స్తారు. తరువాత హర్మగెద్దోను యుద్ధము చేయుటకు వస్తారు. ఆ తరువాత భూమిమీద భక్తులతో కలసి వెయ్యేండ్లపాలన చేయవస్తారు. ఆ తరువాత సజీవుల తీర్పు తీర్చవస్తారు. ఆ తరువాత అంత్యదినమందు అవిశ్వాసులిన మృతులనులేపి తీర్పు విధించ వస్తారు. ఇవన్ని రాకడలే అవిగాక ఇంకా ఉన్నవి. ఈ దినము మన దేవాలయమునకు వచ్చిరి. అది ఒక రాకడ. వచ్చేవారము వచ్చిన యెడల అదొక రాకడ. దైవభక్తులు కూడుకొన్న దగ్గరకు ప్రతిదినము వస్తారు. అదొక రాకడయే. ఈలాగు క్రీస్తురాకడలెన్నో లెక్కపెట్టలేము. అవన్ని ఈ దినము వివరిపలేము. ప్రతి రాకడ విషయము,ఎవ్వరైన విపులముగా వివరించిన, వినసొంపుగానుండును. ఆ వివరము విశ్వాసులను బలపర్చును.

ఈ దినము మాటలాడునది ప్రభువు రెండవరాకడలో సంఘము నిమిత్తమై, ప్రభువు వచ్చేరాకడ. ఈ రెండవరాకడను గురించి ప్రతిదినము ప్రార్ధనలో జ్ఞాపకముంచుకొనవలెను. ఈ దినము రెండు సంఘముల నిరీక్షణను గురించి చెప్పెదను. ఒక సంఘము కొరంథి సంఘము, రెండవ సంఘము థెస్సలోనికయ సంఘము

  • ( 1 ) కొరింథి సంఘమునకు పౌలు ఒక్కమాట చెప్పెను అదేదనగా ' మీరందరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యముకాదు; ( 1కొరింథి. 11:20 )
  • ( 2 ) ప్రభువు వచ్చే పర్యంతము మీరు ప్రభువు భోజనము తీసికొనవలెను.
  • ( 3 ) ఆయన మరణమును జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. రాకడవరకు కొరిథి సంఘమునకు ప్రభువు భోజనమును గురించి అపోస్తలుడైన పౌలు చెప్పెను.
(2 ) థెస్సలోనికయలో ఉన్న సంఘమునకు ' మనము రాకడవరకు సజీవులమై నిలిచియుందుమని చెప్పిరి.
  • (1 ) మనము,
  • ( 2 ) రాకడ వరకు
  • ( 3 ) సజీవులమై యుందుము
  • ( 4 ) నిలిచియుందుము.

కొరింథి సంఘమునకు - థెస్సలోనికైయ సంఘమునకు చెప్పిన రెండును సమానముగానే యున్నవి. యేసుప్రభువు జన్మము మొదలు ఆరొహణము వరకు అది ఒక కథ. ఆరోహణము మొదలు యేసుప్రభువు మేఘముమీద తిరిగి వచ్చు పర్యంతము, అది సంఘకాలకథ. మొదటిది క్రీసుప్రభువుయొక్క భూలోక చరిత్రకథ. అది 33 1 \2 సంవత్సరములే. అయితే, .సంఘకాలములో ఇప్పటికి 20 వందల సం ||గడిచిపోయినది. ప్రభువు వస్తాననారుగాని ఇంకా 20 వందలలోకూడ రాలేదు. ప్రభువు త్వరగా వచ్చెదన్న్నందువల్ల కొరంథీయులకు భ్రమ. ప్రభువు త్వరగా వచ్చెదనన్నందువల్ల, వచ్చువరకు సజీవులమైయుండు మనము పాలుపొందుదుమనేది, తెహ్స్సలోనికైయులకు ఉన్న భ్రమ. ఈ రెండు సంఘములకు కూడా బ్రమే. ప్రభువు రాకకొరకు మొదటి శతాబ్ధము నుండి 20వ శతాబ్ధము వరకు యున్న వారందరికి భ్రమే . ప్రభుచు వచ్చును గనుక వ్రాయించారు అని చెప్పి 20 వందల సంవత్సరములు భక్తులు ఎదురుచూచుచున్నారు. ఈ కాలమందు ఆయన రాకకు నిరీక్షించుచున్న మనము ఒకటవ శతాభ్దము వారు ఈ నిరీక్షణు ప్రారంభించునట్లును, 20వ శతాభ్దమువారు కొనసాగించునట్లును జ్ఞాపకముంచుకొనవలెను. ప్రభువురాకడ ఆలస్యమైనందున, ఆ 20వందల సంవత్సరములోని భక్తులు కనిపెట్టినను వారికి మరణము వచ్చినది. అలాగున రాకడకు కనిపెట్టువారిలో ప్రతి శతాబ్ధములోను మరణము వచ్చినది. నేటికాలములోను అంతే. వస్తానన్న ఆయన తప్పక రావలెను. మొదటి రాకలో వచ్చిన ఆయన రెండవ రాకడలో తప్పక రావాలి. ఆలాగే ఇప్పటి విశ్వాసులైన మనము దేనికొరకు కనిపెట్టవలెను. దేనికొరకు సిద్ధపడవలెను? మంచి మరణము కొరకా? లేక రెండవరాకడకొరకా? దేనికొరకు? ముగింపులోనున్న రెండవరాకడకొరకే సిద్ధపడవలెను. రాకడ కొరకు మనము సిద్ధపడునప్పుడు ఆయన దయవలన మరణమునకు సెలవిచ్చి రానిచ్చిన, సిద్ధపడి వెళ్ళవలెను, గానీ దిగులుపడకూడదూ. ఎవరిని రాకడకు సిద్ధపరచి తీసికొని వెళ్ళవలెనో ప్రభువునకు తెలియును.

ఒక మంచి గొప్ప భక్తుడున్నాడు. రెండవ రాకడకు సిద్ధపడుచున్నాడు. ప్రభువు మంచి మరణమిచ్చి తీసికొని వెళ్ళుచుండగా , ఏమిటిది ప్రభువా! నన్ను మరణింపజేసి తీసికొనివెళ్ళుచున్నావు; అని ఏడ్వగా , ప్రభువు కన్నీళ్ళు తుడిచి, 'రాకడద్వారానైననూ, మరణముద్వారానైననూ నావద్దకే నీవు రావలెను. నీ ప్రవర్తనద్వారా, సేవద్వారా నీవు మరణమునకే సిద్ధపడినావు గనుక మరణమిచ్చి తీసికొని వెళ్ళుట్త్త్త కృపయే' అనెను. ఉదాహరణకు:- ఒక రోగికి దాక్టరుగారు ఆరోగ్యరీత్యా ( రాగులు ) చొడె జావ ఇవ్వమని చెప్పారు. ఆ ప్రకారంగానే ఆ రోగికి ( రాగులు ) చోడిజావ ఇవ్వగా, ఆ రొగి అయ్యా! నేను గోధుమజావ అడిగితే, ఈ చోడిజావ నాకెందుకన్నాడు. రోగి ఆశ గోధుమ జావపై ఉన్నది. అయితే, శరీరము చోడిజావే భరించగలదు అది నాకు తెలుసును అని డాక్టనెను. ఆలాగే నేటికాల భక్తులనేకులు రాకడకు సిద్ధపడుచుండగా, మరణములోనికి వెళ్ళుదురు. ప్రకటనలో ప్రభువే వారి కన్నీరు తుడుచుననియున్నది. ఒక భక్తుడు మరణకాలములో 'దేవుడులేడు, దయ్యాలులేవు ' అనేస్థితిలో నుండగా, ఒక బోధకుడు తన బోధవల్ల అతనిని మరల నిరీక్షణ స్థితికి మార్చెను. లేకపోయిన ఆ భక్తుడు నరకములోనికి వెళ్ళవలసినదే.

అలాగే విశ్వాసులు రాకడకు ఆశించి ప్రయత్నించి సిద్ధపడకపోయిన యెడల తమ జీవితమువల్ల, ప్రయత్నము వల్ల ఏమి ప్రయోజనము! కాబట్టి మరణము లేదా రాకడ ఎప్పుడు వచ్చునో తెలియదు గనుక రెంటికి సిద్ధపడవలెను. ప్రభువు దేనికి తీసికొనివెళ్ళినా, చితపడకూడదు. గోధుమజావ ఆశించిన రోగికి, చోడిజావ ఇచ్చినను దాక్టరును ఏమి అనకూడదు. మనందరము రాకడనే ఆశించి సిద్ధపడి, భ్రమపడి, ఆశించి యుండవలెను. బైబిలులో రాకడనుగూర్చి ఎక్కడేమియున్నా అది చదువవలెను. ప్రతిదినము రాకడ తలంపు కలిగి ఉండాలి. ప్రభు రాకడ గురించి ప్రకటించి 20 శతాబ్ధములు గడిచెను గాన అప్పటికంటే ఇప్పుడే రెండవరాకడ సమీపముగా యున్నది గనుక ఆ రాకకే సిద్ధపడవలెను.

ఈ రెండవ రాకడ గురించి చాల ఆక్షేపణలున్నవి.

  • ( 1 ) బేత్లేహేములో మనిషిగా జన్మించి పనిచేసిన ఈయన వడ్లవాడుకాడా? యోసేపు, మరియమ్మల బిడ్డకాడా? అని ఆక్షేపించినంత మాత్రమున ఆయన లోకములో పుట్టుటమానెనా? ఆక్షేపణ ఆయనకు ముందే తెలిసినను జన్మించుటమానలేదు.
  • ( 2 ) ఆయన సిలువపైయున్నపుడు 'వీడు ఇతరులను రక్షించెను. తన్నుతాను రక్షించుకొని దిగకూడదా?' అన్నారు. ఈ ఆక్షేపణ వచ్చునని ఆయనకు అప్పుడే తెలిసినను సిలువవేయబడకుండా ఉన్నాడా? చనిపోకుండా ఉన్నాడా? ఆక్షేపించుదురని పనులు మానెనా? మానలేదు.
  • ( 3 ) మరణమునుండి లేచిన తరువాత కూడ 'లేవలేదు, శవాన్ని ఎత్తుకొని పోయిరని ' బంట్రోతులక్ లంచమిచ్చి అబద్దాలు చెప్పించిరి. అదికూడ ఆయనకు తెలిసినను లేవకుండా ఉన్నాడా?
  • 1. పుట్టకుండా ఉండలేడు,
  • 2. అద్భుతాలు చేయకుండా ఉండలేదు,
  • 3. సిలువమ్రాను ఎక్కవలసియుండినను, యెరూషలేము రాకమానలేదు ,
  • 4. సిలువ ఎక్కుట మానలేదు,
  • 5. చనిపోవుట మానలేదు,
  • 6. లేవకుండుట మానలేదు,
  • 7. పరలోకమునకు వెళ్ళుట మానలేదు.
అలాగే నేటికాలములో నామక క్రైస్తవులు సిద్ధపడేవారిని ఆక్షేపించినను, అంతమాత్రమున ఆయన రెండవసారి రాకుండా ఉండునా? అలాగే అనేకులు ఆక్షిపించినంత మాత్రమున సంఘమును తీసికొనిపోకుందా ఉండునా? ఆయననుగూర్చి వ్రాసినవన్ని జరిగినప్పుడు రాకడ ఎందుకు జరుగదు! ఈ 20వందల సంవత్సరములలో సువార్త భూదిగంతములు వ్యాపించి, సువార్త పని చాలా జరిగింది. 2, 000 భాషలలో బైబిలు అచ్చుపడి వెళ్ళినది. భూదిగంతమనగా జపాను, అమెరికా; తూర్పు దేసాలు, పడమర దేశాలు ఈ మధ్యంతా సువార్త వ్యాపించియున్నది. ఈ సువార్త ఎంతగా వ్యాపింపదన్న మాత్రమున ఆలాగు జరుగలేదు, గాని వ్యాపించి తీరినది గుర్తులలో భూకంపములు కరువులు, యుద్ధములు మొదలైనవి జరుగుచున్నవని మనము చూచుచున్నాము. గురుతులు, ప్రవచనములు నెరవేరుచున్నవా లేవా? అలాగైన రాకడ తప్పక నెరవేరును. పాతనిబంధన గురుతులు, దానినిబట్టి వచ్చిన మొదటి రాకడ నెరవేరినది. అది మనము చూడలేదు. గనుక మనకాలములోని గుర్తులు నెరవేర్పు మనము ఎందుకు చూడము! ప్రస్తుత విషయాలనుబట్టి వెనుకటివి నెరవేరినవి అని తెలుసుకొనుట సుళువేకదా!
  • ( 1 ) " సజీవులముగా నిలిచియుండు మనము ప్రభువుతో వెళ్ళుదుము అన్న పౌలు సజీవముగా వెళాడా
  • ( 2 ) కొరింథియులు నేటివరకు ప్రభువు భోజనము తీసికొనుచున్నారా? అని ఎందరు ఆక్షేపించినను మనము మన రాకడ నిరీక్షణను సజీవముగా కాపాడుకొనవలెను.
ఈ రెండు సంఘముల వారు భక్తిగల మరణము పొందిరి. ' థెస్సలోనికయ వారితో సజీవులుగా నిలిచే మనము వెళ్ళుము ' అని ఎపూడూ అనవలెను. ఎవరు ఆ సజీవులు? ఇప్పుడిక్కడ ఉన్నవారే. లోకములో సజీవులుగా ఉండి సిద్ధపడువారే. అట్టి నిరీక్షణ సిద్ధబాటులో మనమును ఆలాగున సిద్ధపడుదుముగాక .
  • ( 1 ) పక్షికాళ్ళలో మూలుగులేదుగాన, గాలిలో అది ఎగురును. మృగములకు, మనిషికి కాళ్ళలో మూలుగు ఉండునుగాన గాలిలో ఎగురలేరు. అలాగే ఎవ్వరిలో పాప మూలుగు, 'నిరాశా మూలుగు, " నిరీక్షణ లేనిమూలుగు," " అవిశ్వాసమూలుగు" మొదలగు మూలుగులు ఉండునో; ఎవరిలోనైతే కాలయాపన ఉండునో అనగా రాకడ ఈ రోజుకాదు 'రేపూ అనేవారు రాకడలో వెళ్ళరు. ' రాకడ మనకాలములో రాదు, సిద్ధపడుట ఎందుకు? అనేవారు వెళ్ళరు.
  • ( 2 ) ' త్వరగా వస్తానన్న ' ఆయన మాటనుచూచి, కొందరు ' త్వరగారాడు ' అనుట పాపమేకదా! సిద్ధపడకపోవుట పాపమే. నామక క్రైస్తవులు , అన్యులు ఆక్షేపించుదానికి లెక్కచేయక, రాకడకు సిద్ధపడవలెను.
  • 1. నిరీక్షణ లేకపోవుట,
  • 2. విశ్వాసము, లేకపోవుట,
  • 3. రాకడభ్రమ లేకపోవుట,
  • 4. సిద్ధపడకపోవుట,
  • 5. బైబిలులో రాకడ వాక్యములు తెలుసుకొనకపోవుట,
  • 6. ఆకాశము, బూమి, సముద్రములో కనబడుచున్న గుర్తులు తెలిసికొనకపోవుట,
  • 7. కాలయాపన అనగా ' మనకాలములోరాడు అనుటా ఇవి అన్నియు పాపములే.

ప్రార్ధన:- ఓ ప్రభువా! నేను రాకడకు సిద్ధపడెదను. రాకడకే సిద్ధపడుచున్నానని మరణమునకే నేను సిద్ధపడిన తీసుకో ప్రభువా! రాకడకు సిద్ధపడుచుండిన నీవే నన్ను సిద్ధపరచి, ఆకర్షించుము ప్రభువా! నీ చిత్తము మాలో జరిగించుమని యేసు నామమమున వందించుచున్నాము. ఆమేన్.

మంచి మరణమునకని చేసినబోధ ఈ వేళకు అది సరిపడదు.

  • 1. సజీవ రాకడ,
  • 2 మహిమగల రాకడ,
  • 3. ప్రాణముతో ఎగిరివెళ్ళే రాకడ,
  • 4. మరణముచూడని రాకడ. మరణము తెలియనిరాకడ,
  • 6. యేసుప్రభువు మేఘాసీనుడై ఆకర్షించె రాకడ.
|. ప్రభువా! నేను సిద్ధముగా యున్నానని చెప్పే రాకడ. షరా:- రెప్పపాటు రాకడకు ప్రతి రెప్పపాటులో సిద్ధపడి యుండవలెను. ఈ మాటలు ప్రతివారు అట్టి రాకడకు సిద్ధపడుదురుగాక. ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद