2రాజు. 13:18-19; మార్కు. 9:23; 1కొరింథి. 11:23-30
" బాణములును పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను." 11రాజులు 13:18-19
ప్రవక్తయైన ఎలీషా ఇశ్రాయెలీయుల రాజును బాణములను నేలకు కొట్టుమని చెప్పగా, రాజు ముమ్మారు మాత్రము బాణములను నేలకు కొట్టి ఊరుకొనెను. ఈ మూడు బాణముల క్రంద ఒక కథ ఉన్నది. అదేదనగా విశ్వాసమును చెడగొట్టును. ఎలీషా చెప్పిన దేమనగా బాణములను తీసికొని నేలను కొట్టుమనెను. రాజును బాణములతో నేలను కొట్టుమనుటలో అర్ధము లేదు గాని; పులిని గాని, శత్రువులను గాని కొట్టుమనిన రాజునకు గౌరవముగాను, అర్ధముతో కూడినదిగా నుండును. రాజు నేలను బాణములతో కొట్టునా? నేల నెందుకు కొట్టవలెనని మనమందుము. అయితే రాజు ఆలాగున అనలేదు. మానవునిలో కూడ విశ్వాసమును చెడగొట్టునది దాగుకొనియున్నది. విశ్వాసము చెడగొట్టుట ద్వార రక్షణ కూడా పోగొట్టును. అవిశ్వాసికి దేవుడు అక్కరలేదు, రక్షణ అక్కరలేదు, విశ్వాసము వద్దు. ఈ స్థితికి మనుష్యుడు వచ్చుచున్నాడు. ఒక అమ్మాయి దంపుడు కర్రను తీసికొని ఇసుకను దంచుచుండెను. ఇది నిజముగా ధాన్యమును దంచుటయా? ఆ అమ్మాయి ఆట కొరకు ఆలాగు చేయును. ఆలాగే రాజును బాణములతో నేలను కొట్టుమనునది ఆటగాను, వృధాగాను కనభడును. ఒక కుర్రవాడు కర్రతో కుండలో దంచును. కుండ పగిలిపోవును. ఈ విధముగానే బాణములతో నేలను కొట్టుట వృధాగా పైకి కనబడును. అయినను ఆలాగు చేయుట విశ్వాసమునకు గ్ర్త్తైయున్నది, గాన గాన రక్షణకుకూడ ముంగుర్తైయున్నది. . నమ్మకపోతె నేలను కొట్టడు; కొట్టకపోతే రక్షణలేదు. ఈ మూడు బాణములు విశ్వాసమునకు ముంగుర్తైయున్నవి.
ప్రవక్తయైన ఎలీషా బాణములను నేలను కొట్టుమని అనినప్పుడు ఇశ్రాయేలీయుల రాజు అనేక పర్యాయములు కొట్టవలసినది గాని 3 సార్లు మాత్రమే కొట్టెను.
- విశ్వాసముయొక్క లక్షణము
- 1. నమ్ముట.
- 2) తీసికొనుట.
క్రీస్తుప్రభువు గ్రుడ్డివానితో "నీవు వెళ్ళి సిలొయమను కోనేటిలో కండ్లు కడుగుకొనుమని" చెప్పుట అనగా కనబడును గంభీరముగా కనబడదు. విశ్వాసముతో ఆ గ్రుడ్డివాడు పని చేసిన మీదట ఆ ఆ మాటలలోనున్న రహస్యము, విలువ తెలిసికొనెను యెహా. 9:7. అంజూరపు పండ్లు ముద్దగాచేసి పుండు మీద కట్టుము. పుండు పొవునని చెప్పుట కూడ తేలికగా కనబడును యెష. 38:21. నయమాను వృత్తాంతములో ఎలీషా ప్రవక్త నయమానుతో "యొర్దాను నదిలో ఏడు మార్లు మునుగుము, కుష్టు రోగము పోవును" అని చెప్పెను 2రాజులు 5:10. దేవుని మాటలు అవిశ్వాసుల్కు ఆటగా నుండును గనుక వారు ఫలితమును పొందలేరు. మూడు బాణములు నేలకు కొట్టవలెనా! అనునది అవిశ్వాసులకు ఆటంకముగా కనబడును. విశ్వాసులు ఆ మాటల చొప్పున చేయని యెడల రక్షణ పోవును.
కొందరు కొన్ని షరతుల ద్వారా రక్షణ పొందుదురు. మరికొన్ని షరతుల ద్వారా పెండ్లి కుమార్తె సంఘములోనికి రాకపోవుటకు కారణము దేవునిమాట వారికి ఆటంకముగా ఉండును. రక్షణలోనికి అనేకులు రాకపోవుటకు కూడ వాక్యమే వారికి ఆటంకము. రాజైన "యెహొయాషు"- బాణములను 3మార్లు నేలపై కొట్టిన తర్వాత ఎలీషా 5 లేదా 6 పర్యాయములు ఎందుకు కొట్టలేదు అని రాజుతో అనెను. 6 పర్యాయములు సంపూర్ణము. 3పర్యాయములు అసంపూర్ణము 3పర్యాయములు రక్షణ గుర్తు. పెడ్లికుమార్తె సంపూర్ణతలోనికి రావలెను. విశ్వాసి రక్షణ పొదుటకు మాత్రమేగాక వధువు సంఘమునకు తయారుకావనున్నవి.
బైబిలు మిషను బోధలు ఇతరులకు ఆటంకముగా నున్నవి.
- 1 ) దర్శనవరము: దర్శనములు, ఇతరులకు ఆటగా నున్నవి. అవి బైబిలులో ఉన్నావా? అని ప్రశ్నించుకొని ఉన్నయెడల నిజమే అని నిర్ధారించుకొనవలెను. వక్యములోనున్నది తప్పు అర్ధము చేసికొన్న యెడల పెడ్లి కుమార్తె వరుసకు కావలసిన విశ్వాసము పోవును.
- 2) భాషావరము: భాషను గురించి చాల వివరముగా 1కొరిధి. 12వ అధ్యాములో వ్రాయబడియున్నది.
పెండ్లికుమార్తె గుంపుతో సిద్ధపడి వెళ్ళు కృప ప్రభువు మనకు అనుగ్రహిచునుగాక! ఆమేన్.
ఏడు తరగతులున్నవి నీది- ఏదో తెలిసికొనుము ఇపుడే = కీడు మాని మంచి చేసిన - క్రిది తరగతి దొరుకునేమో | | ఏకాంత | |