నోవహు ఓడ - క్రైస్తవ సంఘము

(1940వ సం| | లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

( ఆదికాండము 6,7,8 అధ్యాములు)
ఆది. 6:18; మత్త. 24:37-39; లూకా. 17:27; 1 పేతు. 5:8
" నీవును నీతోకూడ నీ కుమారులును నీ భర్యయు, నీ కోడడ్రును, ఆ ఓడలో ప్రవేశింపవలెను." ఆది. 6:18.

దేవుడు పపముతో నిండియున్న లోకమంతటిని నాశనము చేయవలెనని యోచించి నీతిమంతుడైన నోవహుతో, ఒక ఓడ తయారు చేసికొమ్మని చెప్పెను. అట్లు తయారు చేసికొన్న మీదట నోవాహును అతని కుటుంబము అనగా ఎనమడుగురు కుటుంబ సభ్యులును సమత జీవులలో మగదియు ఆడుదియును ఓడలో ప్రవేశించిన మీదట, దేవుడు ఆ ఓడ తలుపు బిగించెను. తర్వాత 40 దివారాత్రులు గొప్ప వర్షము కురిసెను. భూమిపైనున్న సమస్తమును నశించెను. ఓడలో నున్నవారును, అందున్న సమత జీవులు మాత్రము బ్రతికెను. 40 దినముల జలప్రళయము గతించి నేల ఆరిన తర్వాత వారు ఓడవిడిచి బయటకు వచ్చి దేవునికి అర్పణ అర్పించిరి.

ఇక్కడ రెండు బొమ్మలు మనస్సులో జ్ఞాపకముంచుకొనవలెను. ఓడ మరియు సంఘము. ఓడలో జరిగినవి అన్నియు సంఘములో ఏదో ఒకరీతిగా జరుగును. నావలో ప్రవేసించిన వారు,లోనికి వెళ్ళిన తర్వాత ఆకాశము నుండి వర్హము భూమిలోనుండి ఊటలు వచ్చెను. రెంటికి మధ్యనున్న ఓడలోని వారు బ్రతికి ఉన్నారు. బూమి, ఆకాశము రెంటికిని సృష్టి అని పేరు. సృష్టి పాపులను నాశనము చేయుటకు పూనుకొనెను.ఇతరులైన వారు ఓడలోనికి రానందున నాశనమైరి. పాపులైనను వారు ఓడలో ప్రవేశించినయెడల బ్రతికి యుండెదివారు. ఆకాశమునకును, భూమికిని మనిషిమీద కోపము. ఎందుకనగా మనిషి దేవుని మాట వినకపోయినందులకు, (ఆది.7: 11 ) ఆకాశపు తూములు తెరవబడి మహగాధ జలముల ఊటలు విప్పబడి, నీరు పైకి ఉబికినపుడు పిల్లలు చనిపోయిరి. ఇంకా పైకి లేవగా పెద్దలును, ఇంకా నీరు పైకి లేవగా అందరు చనిపోయిరి. క్రమముగా వర్షము నీరు హెచ్చిన కొలది ప్రజలు చనిపోయిరి. క్రమముగా వర్షము నీరు హెచ్చిన కొలది ప్రజలు చనిపొయిరి. రెండు పనులు జరుగుచున్నవి. నీరు పైకిలేచుట్త, జనులు చనిపోవుట. పోపులైనవారు చనిపోకుండ ఓడకట్టబడెను గాని,వారు ఓడలోనికి రాలేదు.

మరియొక కథ ఏమనగా నీరు హెచ్చిన కొలది ఓడ పైకి పొవుచుండెను . ఓడలోనికి రాని మనుష్యులు కర్రవలన, కత్తివలన కాదు గాని నీళ్ళు వలన చనిపోయిరి. పాపులను చంపినది ఆ నీరే. నీతిమంతులను బ్రతికించినది ఆ నీరే. ఆ నీటివలన ఓడలోని 8మంది బ్రతికిరి, ఓడకూడ సురక్షితము.

దీనికి సాదేశ్యముగా నేటి లోకములో ఒక ప్రక్క క్రైస్తవ సంఘమున్నది. ఈ సఘమును నావ మనుష్యులను రక్షించ్టకు ఏర్పాటాయెను. మనుష్యులు చావకుండుటకును, నరకమునకు పోకుండుటకును, సంఘము ఏర్పాటాయెను. దేవుని విరోధులు అనగా తిట్టుకొనువారు, కొట్టుకొనువారు, దోచుకొనువారును, అబద్ధము లాడువారు మోక్షమునకు వెళ్ళక నరకమునకు పొవుదురు. ఓడలోనికివెళ్ళిన వారు చావు లేకుండ నుండి యున్నట్టు, పాపులు సంఘములోనికివచ్చిన రక్షింపబడుదురు. చెడ్డవారైనను ఓడ ఎక్కిన యెడల బ్రతికియుందురు. ఆ కాలములోని ప్రజలు నీటిలో మునగక ముందు, పపములో మునిగి యున్నారు. పాపములో మునిగి యునారు. పాపములో మునిగిరి గనుక నీళ్ళలో నాశనమైరి. క్రైస్తవ సం సంఘములోనికి వచ్చిన వారు వాక్యము విని మారిపొవుదురు. పాపాత్ములైనను సంఘములోనికి వెళ్ళువారిని దేవుడు ఆపుచేయడు. అప్పుడు ఓడలోని వారు 8మంది. ఇప్పుడు క్రైస్తవ సంఘములోనివారు 400కోట్లు. అందరు రక్షింపబడరు గాని పాపములు మానివేయుమని బోధింతురు. కావున సఘములోనివారు పాపములు మాని పరిశుద్ధముగా జీవించవలెను.

నోవాహు ఓడ, భూమిని, చెట్లను, గుట్టలను శవములను అన్ని అడ్డులను దాటుకొనిపోయెను. అలాగే క్రైస్తవ సంఘములోనికి వచ్చినవారు అన్నిటిని దాటి మోక్షములోనికిపొవుదురు. మరియు ఓడలోనున్న వారిని దుర్మార్గులు గాని శవములు గాని ఏమియు చేయలేదు. అలాగే క్రైస్తవసంఘములో నున్న వారిని ఏవరు ఏమిచేయలేరు. క్రైస్తవసంఘము అన్ని కీడుల నుండి మనుష్యులను తప్పించుటకు ఏర్పాటాయెను. క్రైస్తవ సంఘమునకు ఎన్ని ఆటంకములు కలిగినను, ఈ రెండు వేల శతాబ్ధముల నుండి ముందుకు సాగిపొవుచునేయున్నది. ఆ కాలములోనివారు చేసిన ఒక గొప్ప పాపమేమనగా నావలోనికి ప్రవేశింపకపోవుటయే; వారు పాపములు మానక పొయినను, ఓడలోనికి పోయిన యెడల బ్రతికి యుండెడివారు. ఓడపైకి లేచెను,నీరు పైకిలేచెను. పాపులు మాత్రము క్రిదికి పోతిరి. ఓడ పైకి వెళ్ళిన తర్వాత దేవుడు గాలి విసురునట్లు చేసెను, గనుక నీరు ఎండిపొయెను. నీటితోపాటు ఓడ క్రిదికి దిగెను, ఓడలోని మనుష్యులు దిగిరి.40 దినముల జలప్రళయములో పాపములోనున్న జనులందరు చనిపొయిరి గనుక భూమీది పాపమంతయు నశించెను. నేల శుభ్రముగా నుండెను. అప్పుడు భూమి క్రొత్త భూమివలె నుండెను. పాత భూమి మారిపోయెను. సంఘము ప్రభువుయొక్క రాకడలో పైకి వెళ్ళిన తర్వాత ఓడ క్రిందికి దిగినట్లు, సంఘమునకూడ మరల భూమిమీదికి వచ్చును. క్రీస్తు ప్రభువు మిగుల త్వరగానేవచ్చి, క్రైస్తవ సంఘమనే ఈ ఓడను మోక్షమునకు తీసికొనివెళ్ళి, మరల భూమి మీదికి వచ్చునప్పటికి భూమి శుభ్రముగా నుండును.

ఆ జల ప్రళయములో ఓడపైకి లేచిన తర్వాత భూమి మీద మనుష్యులకు శ్రమ కలిగెను. ఆలాగే ప్రభువుయొక్క రాకడలో సంఘము పైకెత్తబడగానే, భూమిమీద 7 ఏండ్ల శ్రమలు కలుగును.ఈ ఏడేండ్ల గడిచిన తర్వాత క్రీస్తు ప్రభువు పెండ్లికుమార్తె సంఘముతో వచ్చి, భూమిమీద వెయ్యేండ్లు పరిపాలన చేయును. అప్పుడు 12 మంది శిష్యులు 12 సిం హాసనములపై కూర్చుండి రాజ్య పరిపాలన చేతురు. రాకడలో ఎత్తబడిన సంఘములోనివారు అన్నిచోట్ల సువార్త పని చేయుదురు. అప్పుడు కోటానుకోట్లు జనులు క్రైస్తవ మతములోనికి చేరుదురు. క్రైస్తవ సంఘము రాకపూర్వము 2,400 సం| | లు ముందే జరిగిన ఈ ఓడ కథ క్రైస్తవ సంఘ కాలములోకూడ జరుగును. జలప్రళయములో సృస్టి అను భయంకర సిం హము పాప నరులమీద కోపగించి, ఉరుములనే గర్జన చేయుచు,వర్షమువలె మీద పడుచు రెండు దౌడలమధ్యను ఆ కాలమునాటి పాపపు ప్రజలను నమలకుండ మ్రింగివేసెను. పైదౌడ ఆకాశము, క్రింది దౌడ బూమిగా మనము సరిపోల్చుకొనవచ్చును.

ఆలాగే నేటి క్రైస్తవ సంఘకాలమున దేవుని మాటను సువార్త విశసించి స్థిరులైనవారు; విశ్వసించని అథిరులైనవారు; మొత్తముగా వారినైనా వీరినైనా ఎవరిని మ్రింగుదునా అని అపవాదియైన సాతాను (1పేతురు 5:8-9) గర్జించు సిం హమువలె ఎదురుచూచుచున్నాడు. గనుక క్రీస్తు యేసు రాకడకు సిద్ధపడని వారిని అనగా పాపపు బ్రతుకు విడువని వారికి, నోవాహు కాలపు జలప్రళయ తీర్పు శిక్ష విధింపువంటిదైన, ఏడేండ్ల మహాశ్రమల కాలమునకు మనము ఉండకుండా, ఈ భూమిపై ఉన్నపుడే క్రైస్తవ సంఘమనే ఓడలోచేరి, పెండ్లి కుమార్తెగా సిధపడి ఆయన మేఘముపై వచ్చినప్పుడు, ఆయన చెంతకు చేరుదుముగాక! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद