1సమూ. 17:40-49; మార్కు. 16: 15 - 18; హెబ్రీ. 11: 32 - 34.
"దావీదు - తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్ళను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పొయెను". 1సమూ. 17:40
- 1. తనకర్ర:- కర్ర ధర్మశాస్త్రమునకు గుర్తు. అనగా దావీదు దివారాత్రము సన్నిధియందు ఆశ కలిగియున్నాడు. పట్టువిడువకుండ, పట్టుపట్టి సన్నిధిలోని శక్తిపొందినాడు.
- 2. యేటి లోయ:- లోయనుండి అనగా దేవుని సన్నిధిలోఉండి, తన అంతరంగమును దేవుని అంతరంగములోనికి తీసుకువెళ్ళి బయటకు తీసినరాళ్ళు ఐదు. అవేవనగా:-
- 1. కొట్టబడిన రాయి నిర్గమ. 17:6 :- హొరేబు కొండ దగ్గర ఇశ్రాఏలీయులు రెఫెదీములో దిగిరి. త్రాగడానికి నీళ్ళులేనందున ఇశ్రాయేలీయులు సణిగిరి., అప్పుడు మోషే లోయలోనికి వెళ్ళి ఎక్కడ నీరు ఉన్నది అని తన అంతరంగముతో చూడగా అనగా మొర్రపెట్టగా, దేవుడు ( నిర్గమ. 17:4 ) మోషేతో ' నీ కర్ర చేతపట్టుకొని వెళ్ళుమనెను.' ఎందుకనగా కర్రలేకపోతే దేవుడు కనబడడు. దేవుడు కనబడకపోతే రాయి అనే బండ కనబడదు. బండ కనబడకపోతే ఇశ్రాయేలీయులు దాహము అనే శత్రువును జయించలేరు. దేవుని మాటనుబట్టి మోషే బండను కొట్టగా, నీరు దాహముతీర్చి జయమిచ్చెను. గనుక దావీదు ఈ రాయి కలిగియుండెను.
- 2. జయమిచ్చిన రాయి నిర్గమ. 17:12 :- అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయెలీయులతో యుద్దము చేయగా, మోషే యెహొషువతో - 'రేపు నేను దేవుని కర్ర చేతపట్టుకొని కొండ శిఖరము మీద నిల్చియుందును ' అని చెప్పెను. యుద్ధము జరుగుచుండగా మోషే చెయ్యి పైకెత్తి నప్పుడు ఇశ్రాయేలీయులకు శత్రువులపైన జయము కలిగినది. చెయ్యి దించివేస్తే అమాలేకీయులకు జయము వచ్చినది. మోషే చేతులు బరువెక్కగా వారు ఒకరాయి తీసికొని వచ్చి మోషే కూర్చుండుటకు వేసిరి. అహరోను, హురులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు మరియొక ప్రక్కను మోషే చేతులు పైకెత్తి పట్టుకొనిరి. ఆ విధముగా యుద్ధమందు శత్రువులను యెహూషువ గెలిచెను. ఈ రాయి శత్రువులపై జయము నిచ్చినరాయి. ఇది దావీదు కలిగియుండెను.
- 3. దీవించె రాయి నిర్గమ. 20:25 :- మోషే గాడాంధకారములోనికి ప్రవేశించిన తరువాత దేవుడు మోషేతో ఈలాగు చెప్పెను. 'నా నామమును జ్ఞాపకార్ధముగానుంచు ప్రతి స్థలములొను నేను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. నాకు రాళ్ళతో బలి పీఠము కట్టవలెను. దానికి నీ పనిముట్టు తగిలిన యెడల అది అపవితమగును గనుక చెక్కని రాళ్ళతో కట్టవలెను. గాని ఇనుప పనిముట్టు తగులకూడదు. ( నిర్గ. 20:24-25). అందుకే కాబోలు సౌలు ఇచ్చిన ఇనుప కవచము అనగా రాజు వేసికొనేవి దావీదు వద్దు అన్నాడు. 1సమూ. 17:38-39. ఈ కట్టబడిన రాయి దీవిచెరాయి అయినది. దావీదు దేవునిచేత దీవించబడి కర్రపట్టుకొని వెళ్ళినాడు. ఈ రాయియొక్క అనుభవమును దావీదు కలిగియుండెను.
- 4. రక్షణ ఇచ్చిన రాయి 1కొరింథి. 10:4-5 :- పాత నిబంధనలో కొట్టబడినది రాయి లేక బండ, అయితే ఇప్పుడు కొట్టబడిన బండ క్రీస్తే. ఈ క్రీస్తు మన రక్షణకై కొట్టబడి, చీల్చబడి, సాతానుపై జయము పొంది మనకు జయము ఇచ్చెను. ఈ రాయి అనుభవము దావీదు కలిగియుండి ఇశ్రాఏలీయులను రక్షించుటకు ఈ రాయి కావలెనమి కోరుకొనెను.1మూ. 17: 26-37. ఈ అనుభవము దావీదుకలిగియుండెను.
-
5. అనుభవము అనేరాయి నిర్గమ. 19:20 :- యెహొవా మాట్లాడినరాయి. ఇది బైబిలుమిషనురాయి. కొండ శిఖరము
పైకి వస్తేనేగాని దేవుడు మాట్లాడడు. ఎందరు ఎన్ని రాళ్ళు కలిగియున్నప్పటికి సీనాయి పర్వతము అనే రాయిపైకి
వస్తేనేగాని దేవుడు దిగివచ్చి మాట్లాడడు. అలాగే బెబిలు మిషనులోనికి వసేనేగాని అనగా దేవుడు మాట్లాడే
అనుభవముకలిగితేనే గాని ఈనాటి మన శత్రువును జయించలేము. అందుచేతనే దావీదు ఈ అనుభవమనే రాయికూడ
తెసికొని శత్రువుపై యుద్ధానికి వెళ్ళినాడు. శత్రువు ఎదురుగా దావీదు నిలుచున్నప్పటికి, శత్రువైన గొల్యాతు కలిగియున్న
యుద్ధ సామానులు దావీదు కలిగిలేడు. గాని ఏమి కలిగియున్నాడు? కర్ర, సంచి పట్టుకొన్నాడు. ఏ సంచి?
రాళ్ళుండేసంచి. అనగా హృదయమనే సంచి. ఈ సంచిలో 5 రాళ్ళు మాత్రమే ఉన్నవి.
క్రీస్తుప్రభువు సాతానును జయించడానికి 5 గాయములు మాత్రమే కలిగియున్నారు. ప్రభువునకు కలిగిన గాయములలో 5వది ప్రక్క గాయము అనగా హృదయగాయము. గాయపడ్డ హృదయములు కలిగియున్నవారు తమ హృదయము సరిచేసికొనకపోతే, శత్రువుని జయించలేరు. శత్రువు హృదయములోనే ఉండును. ఇదే అంతటికి మెయిన్. ఆలాగు దావీదు తన హృదయమనే సంచిలో నున్నది రాళ్ళు అనగా దేవునితో మాట్లాడే అనుభవములు కలిగియున్నాడు గనుక శత్రువును జయించినాడు.
ఈ చివరిరాయి "బైబిలుమిషను అనే రాయి". ఈ రాయితో దావీదు శత్రువుని చంపి జయించెను, అలాగే
దేవదాసు అయ్యగారిలో ఎన్నో అనుభవములున్నవి. ఎన్ని ఉన్నప్పటికిని దేవుడు మోషేను కొండమీదకు
పిలచి మోషేతో మాట్లాడినట్లు, దేవుడు అయ్యగారితో దైవసన్నిధి స్థాపించుమని చెప్పి, ఈ చివరి కాలములో
పనిచేయుచున్న శత్రువగు సైతానును జయించుటకు సన్నిధి అనే కర్రనిచ్చి సైతాను నెదిరించు సూత్రములను
రాళ్ళను లేక బాణములను ఇచ్చి, ఎన్నో అనుభవములను అయ్యగారి హృదయమునకు అందించి, సైతానును ఓడించగలిగే
శక్తిని ప్రభువు అనుగ్రహించినారు. ఈ శక్తుల్తో సైతానును ఓడించుటకై వానిని ఒక పుస్తక రూపములోనికి ( సైతాను
నెదిరించు సూత్రములు ) తీసికొని రావడానికి ప్రభువు శక్తినిచ్చినాడు.
గనుక ఈనాటి వారమైన మనకు శత్రువగు
సైతాను లోకువైనాడు. అందరి అనుభవములు అనగా ఎవరి అనుభవముములు, వారిలోనే ఉన్నవి. గాని దేవదాసు
అయ్యగారియొక్క సన్నిధి అనుభవము ఇప్పుడు మరియు ఎల్లప్పుడును అనగా క్రీస్తు ప్రభువుతో కలుసుకొనేవరకు
స్థిరముగా బలముగా, జయముగా ఉంటుంది. ఈ రాయిమీదకు వస్తే, ఈ రాయి పట్టుకొంటే, ఈ రాయిని శత్రువుపై
ఉపయోగిస్తేనే మనము జయము పొంది, మహిమ రాయియైన యేసుక్రీస్తు ప్రభువు రాకడ మేఘమెక్కగలము.
ప్రార్ధన:- ఓ యేసుక్రీస్తు ప్రభువా! దావీదు లోయలోనికి వెళ్ళినాడు. ఈనాడు అందరు లోయలోనికి
వెళ్ళుచునారు. గాని దావీదు కర్రపట్టుకొని వెళ్ళినరీతిగా అనేకులు వెళ్ళుటలేదు. గనుక జయము రావటములేదు.
ఓ క్రీస్తుప్రభువా! నీ మహా కృపను బట్టి మాకు "కర్ర" అనే "సన్నిధి", అనే "సుబుద్ధి" హృదయమును అనుగ్రహించి ,
నీ మర్మములు గ్రహించగల జ్ఞానము దయచేయుము. నీకు నా స్తోత్రములు.
దావీదు వద్ద 5రాళ్ళు ఉన్నప్పటికిని,
సంచిలో చివరివేసిన రాయి శత్రువును జయించుటకు కావలసి వచ్చినది. అలాగే లోకములో ఇన్ని మిషనులుండగా
చిట్టచివర వచ్చిన ఈ బైబిలు మిషను అనే రాయి రేపు మేఘమెక్కుటకు అడ్డముగా ఉన్న శత్రువును గెలుచుటకు
అవసరమైయున్నది అని అందరును ఈ ప్రసంగము ద్వారా గ్రహించగలిగే జ్ఞానము దయచేయుమని మహిమ
మేఘములో రానైయున్న యేసుక్రీస్తునుబట్టి వేడుకొనుచున్నాము ఆమేన్.