రాకడ తలంపు - సందేహ సం హరము

(19 - 5 - 1959వ సం || లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము)

దా. కీర్తనలు. 139:17; మత్తయి. 21:21; ఫిలిప్పీ. 4:4 - 7
" ఎవని మన్స్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు" యెషయా 26: 3.
కీర్తన: యేసూ! నీతలపె నాకు - ఎంతో హాయి - ప్రభు యేసు నిను
తలంపగానే - హృదయ మానందముతో నిండున్ - నీ సముఖమున ముఖము జూచుచు - వాసము చేసి నపుడెట్లుండెనో | | యేసూ| |

పాతనిబంధనలో క్రీస్తుప్రభువు వస్తున్నాడు అనే బొబ్బలు ( కేకలు ) వినబడినవి. ఆలాగుననే క్రొత్త నిబంధనలోకూడ వినబడినవి. ఆలాగే సఘ చరిత్రలోనూ వినబడినవి. వాటిని మూడు మాటలలో వివరించుదును.

  • 1. మూడు బొబ్బలు
  • 2. మూడు దెబ్బలు
  • 3. మూడు దిబ్బలు

పాత నిబంధనలో క్రీస్తు ప్రభువు వస్తారని ఎన్ని బొబ్బలు అనగా ఎన్ని కేకలు వేసినా, ప్రజలు జాగ్రత్తగాలేరు. పాత నిభందనలోని ప్రజలు జాగ్రత్తగాలేరు గనుక దెబ్బలు. ఆలాగే క్రొత్త నిభందనలోను దెబ్బలున్నవి. దెబ్బలు లేక పోతే అసలు మాట వినరు. దెబ్బలు అనగా దిగులు,తెగుళ్ళు, శత్రుబాధలు. సఘ చరిత్రలోకూడ అనగా మనకాలములోకూడ దెబ్బలున్నవి అంటే శిక్షలు. పాత నిబంధనలో బొబ్బలున్నా,దెబ్బలున్నా, కొంతమది దిబ్బెక్కినారు. అంటేపరలోకానికి వెళ్ళినారు. ఈ బొబ్బలు,దెబ్బలువలన కొంతమంది అవిశ్వాసులైనారు. మరికొంతమంది పైకివెళ్ళిరి. భూలోకములో ఉన్నప్పటికిని మన అంతస్థు పై అంతస్థుగానే ఉండవలెను. రేపు రాఖడలో భూలోకమునుండి వాయుమండములోనికి వెళతారు. రాకడప్పుడు వాయుమండలములోని దురాత్మలను మిఖాయేలుదూత వెళ్ళగొట్టివేస్తారు. ఎందుకనగా పెండ్లికుమార్తె వస్తుంది గనుక ఇక్కడ అడ్డముండకూడదని వెళ్ళగొట్టివేస్తారు. అదొక దిబ్బ.

ఆ దిబ్బను దాటి మనము మోక్షమునకు వెళ్ళెదము. మనము భూమిమీదనుండి కొంత ఉన్నత స్థితికి వస్తాము. అప్పుడు సైతానును కసాబిసా ( ఇష్టము వచ్చినట్లు ) త్రొక్కుతాము గనుక దానిని దాటి వెళ్ళతాము . ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దాటి గట్టు ఎక్కినట్లు మనమును దాటి గట్టు ఎక్కుదము. ఆ గట్టు ఎక్కడమే దిబ్బ ఎక్కడము. ఇక్కడ పాపజీవితమునుదాటి ఆత్మీయ జీవితము అనే అంతస్థుకు ఎక్కి రాకడప్పుడు వాయు మండలములోని దిబ్బను దాటుదము. సీయోను కొండకు వెళ్ళిపోదుము. అంటే సీయోనుకొండ మహిమ కొండ. మేము ( యం. దేవదాసు అయ్యగారు చదువుకొనే రోజుల్లో ) లూధరు గిరికి వెళ్ళినప్పుడు, విలేజ్ పోస్ట్మాన్ మా ఉత్తరములమీద సీయోను అనేకొండ అని వ్రాసేవాడు. అతనికి తెలియదు అది లూథరుకొండ అని, ఇప్పుడు మీరందరు ఈ రెండునుదాటి నూతన యెరూషలేము వెళ్ళాలి.

  • ( 1 ) భూలోకము,
  • ( 2 ) వాయుమండల లోకము.
అవునా? కాదా? అవును. ఇది భూలోకము. అది వాయుమండలలోకము. భూలోకముమీద దయ్యాలున్నవి. ఆ వాయుమండలములో ఇంకా ఎక్కువ ఉన్నాయి దానిని దాటుట ఏలాగంటే మిఖాయేలు దూత సాతానును ఒక తన్ను తన్నాడు గనుక దానిని సుళువుగా జయించగలము. భూలోకమును జయించుట కష్టము గనుక ఇదే ఎక్కువ గడ్డైనది. రాకడకు సిద్దపడటానికి ఒక సూత్రము చెప్పాను. అది మీరందరు వ్రాసికొన్నారు. గుంటూరువారు వ్రాసికొన్నారు. అదేమంటే ప్రతి నిమిషము యేసుప్రభువును తలంచుకొనుటయే. అట్టి తలంపుతో ఉంటే ఎన్ని కష్టాలున్ననూ ' హాయిగా ఉండటము అనునది వచ్చును.

ఎప్పుడెంత వీలైతే అంత, క్రీస్తు ప్రభువు తలంపు ప్రతి నిమిషము కలిగియుండవలెను. ప్రభువుయొక్క శరీర, రక్తములను ఎప్పుడుబడితే అప్పుడే ప్రభువు వలన పుచ్చుకొనవలయును. అనగా అంతరంగ సస్కారము. ఇంకా అట్టి అనుభవ అంతస్థు లేనివారు అట్టి అంతస్థులోనికి వచ్చుటకు ప్రయతించవలెను.అలాగే ఎప్పుడుబడితే అప్పుడే రాకడ తలంపు కలిగియుండవలెను.

  • 1. ప్రభువు తలంపు,
  • 2. రాకడ తలంపు,
  • 3. ప్రభువుద్వారా ప్రభుభోజనము పుచ్చుకొనుట
అను ఈ సూత్రములు పాటంచునప్పుడు రాకడకు సిద్ధపడగలము. మీకు ఎన్నిచెప్పిననూ సందేహము రాకమానదు అనగా రాకడనుగూర్చిన సదేహము ఉన్నది. ఇసుక రేణువంత సందేహముంటే రాకడకు ఎత్తబడుట సున్నయే. 'సదేహము ' అనునది ఒకసారి వచ్చి మీవల్ల జయింపబడి వెళ్ళిపోతాది, గాని మరల తిరిగి వస్తాది. గనుక మరలా రాకుండానే దానిని గట్టిగా తోలివేయవలెను. ఈ శ్రమలన్నియు ఎందుకు? రక్షింపబడి, మరణమై మోక్షమునకు వెళ్ళితే బాగుగాయుండును. ఇంక చిక్కులేదు గదా! అని అనుకుంటే రాకడకు సిద్ధపడలేము.మీరు ఆలాగు ఓపిక గలిగి యుండక పోతే రాకడ్దకు చెడిపోతారు, రక్షణకుకూడ చెడిపోతారు.ఉదాహరణకు: - కొంతమంది 10వ తరగతి పాస్ అగుట కొరకు పరీక్షజయము కొరకు కోరి ముందు సిద్ధపడక అప్పటికప్పుడు చదువుదురు. అది చాల కష్టము. కష్టము కాదా మరి! పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత పరీక్ష పాస్ కానియెడల విచారపడుదురు. ' పరీక్ష ముందు పాస్ అవుదును అన్నారూ ఇలా జరిగిందేమిటి ? అని అనగా సదేహపడి, విశ్వాసము నుండి చెడిపోతారు. అలాగే రాకడకు సిద్ధపడుట కూడా ఉండును. సందేహము లేకుండగా ఉంటే రాకడకు వెళ్ళవచ్చును. మనిషిని చెడగొట్టేది పాపము కాదు దయ్యము కాదుగాని " సందేహము" . మనలను చెడగొట్టుటకు ఇది ముఖ్యమైయున్నది. అవ్వ ఆ సందేహములోనే పడిపోయినది. సర్పము సందేహము పుట్టించే ప్రశ్నవేసినది. ఆ ప్రశ్న ఏమిటి? ఇది నిజమా? ఈ ప్రశ్నవేయగానే ' ఇది నిజముకాదు కాబోలు ' అనే సంసేహము పుట్టినది. అందుచేత నిషేధింపబడిన పండు అవ్వమ్మ తినెను. దైవభక్తులు ఇంకే పాపములోను పడరుగాని ఈ సందేహమను పాపములోనే సుళువుగా పడుదురు. అయినను రాకడ విశ్వాసులు లేచి వచ్చెదరు గాని సందేహములో పడిపోవుటనుబట్టి బలహీనులు అవుతారు. ' ఒక బలవంతుడు గబగబ పరుగెత్తి బోర్ల పడి పో యినాడు. గనుక
  • 1. పడ్డాడు,
  • 2. పండుకొన్నాడు,
  • 3. పులకరింపు జ్వరము వచ్చినది,
  • 4. పనిమానివేసినాడు.
అలాగే పరమభక్తునికి ఒక సందేహము వస్తే దాని విసుగు ఎంత దూరమైన వచ్చును. గనుక సందేహము రానియ్యకూడదు. పౌలుకు మనవలె సందేహము వచ్చినపుడు, ఆ సందేహములు తీర్చివేసికొనే పనిమీద ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చినాడు. ఒకప్పుడు సాతాను, లూథరు దగ్గరకు వచ్చి - ' లూథరూ! నీలో ఫలాన, ఫలాని పాపములు యున్నవిగదా ' అని పెద్ద కాగితము తీసికొని వచ్చెను. అప్పుడు లూథరుగారు ఏమన్నారంటే సాతానుతో ' ఇంకా ఏమైనా యుంటే జ్ఞాపకము తెచ్చుకొని అవికూడ వ్రాసికొనుము ' అని అన్నాడు. అప్పుడు సైతాను ఏమి చెప్పలేక పోయినాడు. వెంటనే లూథరు ఒకమాట అన్నాడు. ' న్న్ పాపములు అన్నియు యేసుప్రభువు కొట్టివేసినారు. ఇంకా నా పపములుఎక్కడయున్నవి ' అని అన్నాడు. సాతాను దానికి ఏమి జవాబు చెప్పలేకపోయినాడు. అప్పుడు లూథరు తనముందు ఉన్న బాటిలు సిరాతో గోడమీద సిలువగుర్తు పడునట్లుగా దానిని కొట్టెను. కొట్టిన ఆ సిరా డాగు నేటివరకు ఉన్నది. ఈ సిరా డాగు ( మరకను ) చూచుటకు ఈ 400 ఏండ్ల నుండి తీర్ధ యాత్రవలె ప్రజలు అన్ని ప్రాంతములనుండి వస్తున్నారు. కాని వారు ఒక తప్పు చేస్తున్నారు. ఆ ఒక తప్పు ఏమిటంటే ఆ సిరా మరక ఉన్న గోదపై పెచ్చులు మన దగ్గర ఉంటే , మనకు ఏదో ఒక మేలు యుంటుందని వారు తీసికొని వెళ్ళుచున్నారు. అక్కడ భక్తులు తీసికొని పోవుచుండగా , వారు మరల ఆ సిరా మరకను ఆ గోడకు పూయుచున్నారు. లూథరుయొక్క బలహీనత " కోపము". తన మనస్సుకు సరిపడనిది. ఏదైనా ఉంటే, లూథరు తన ఎదుటివాడు ఎంతటివాడు అయిన కోపపడుటయే ఆయన అలవాటు. పోపుమీద కోపము పడగా ఆ కోపము కోపపడుట దేవునికి పనికి వచ్చినది. కోపపడిన లూథరును హింసించుటకు వర్క్స్ అను పట్టణమునకు పిలిపించిరి. ఆయన స్నేహితులు అందరును బ్రతిమాలినను, ఆ పట్టణమునకు లూథరు వెళ్ళుట మానలేదు. " వర్మ్ స్స్ పట్టణములోని ఇండ్లమీద ఉన్న పెంకులన్ని దయ్యములు నాకు అడ్డువచ్చిననూ అనగా పెంకులన్ని దయ్యములుగా మారిననూ వెళ్ళకమానను" అని జవాబిచ్చెను. ' ఒక వేళ నన్ను చంపివేస్తే దేవునియొక్క ఈ పనిని దేవుడే కొనసాగించుకొనెను ' అని చెప్పెను. లూథరుకు కోపమునప్పటికిని దైర్యమును, ప్రాణత్యాగం ఉంటే ఏమియు ఆటంకముండదు.

పేతురు నీళ్ళ మీద చక్కగా నడచి... నడిచి కొంతసేపటికి మునిగిపోవుచున్నాడు.( మత్తయి. 15:29-30).అప్పుడు పేతురు ప్రభువా! అన్నాడు. అప్పుడు నీవు ఎందుకు సదేహపడితివి అని ప్రభువు పేతురును లేవనెత్తినాడు. సందేహము మనకుకూడా వస్తే ప్రభువు లేవదీయును.మనకు దేవుని విషయములపై సైతాను సందేహము పుట్టించును. దాని పని సందేహములు కలిగించడమే. మనయొద్ద సైతాను ఎప్పుడూ పొంచియుండును.

' ప్రక్కనే యున్నాడు పగవాడు - మన చక్కికి జేరెను శనిగాడు ' || మెళుకువగా ||

  • 1. నేను మరలా వస్త్తాను,
  • 2. మిమ్ములను తీసికొని వెళ్ళతాను.
  • 3. నేనుండు స్థలములోనికి తీసికొని వెళ్ళతాను
అని ప్రభువు అన్నా , ప్రజలు ఈ మూడు నమ్మక , సైతాను చెప్పినదే ఎందుకు నమ్మవలెను? ఆదాము , హవ్వలను పండు తినవద్దని దేవుడు చెప్పిననూ , వారు దేవుని మాట వినక, సాతాను మాట వినుటను బట్టి కీడు వచ్చింది. ఎవరికైన అపనమ్మకము ఉంటే , వారు పడకుండా ఉండలేరు. ఎవరైనా పడిననుగాని పేతురు వలె లేవవలెను. సైతాను ఉన్నాడు. గనుక సందేహము పుట్టిస్త్తాడు. కాని మనిషి దేవుని మాటమీదనే యుంటే , సాతాను మనిషిని విడిచి వెళ్ళిపోవును. పేతురు నడచినాడు సం దేహము యున్నాదా? లేదు. సందేహమే యుంటే ఎందుకు నడుస్తున్నాడు! ప్రభువు దగ్గరకు వచ్చిన తరువాత సదేహము పుట్టింది. అదివరకు దూరముగా యున్నప్పుడు తన దృష్టి ప్రభువుమీదయుంచి మనోనిదానము గలిగియున్నాడు. చూపు ప్రభువు వైపు యున్నది. అందుచేత మునగలేదు. దగ్గరకు వచ్చిన పిమ్మట చూపులో లోపము ( సందేహము ) వచ్చినది అనగా ఇరుప్రక్కల కెరటములు చూచి , సందేహము పుట్టింది. వెంటనే మునగసాగెను. బైబిలులో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏలీయా , ఆయనకు మనోనిదానము ఎక్కువ. ఆయనకు అంతా దేవునిపై దృష్టియే. అందుచేత ఆయన ఎన్నడును పడలేదు.

ప్రవక్తయైన యేలీయ అటుఇటు చూడకుండ ప్రభువు మాట మీద ఆనుకొని, మనోనిదానము కలిగియున్నందున ఆకలిలేదు., దప్పికలేదు,అలసటలేదుగాన హోరేబు కొండమీదకు జర్రున వెళ్ళిపోయెను. అక్కడ ఏలీయాకు 40రోజులు మనోనిదానము చెడలేదు. ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తి! అలాగే రాకడమీద మన దృస్టియుంటే పడము. ఏలీయా తూలిపోలేదు, వెళ్ళిపోయినాడు. మనము ఏలీయావలె అంత కష్టపడనక్కరలేదుగాని మనదృష్టి అంతా ప్రభుని రాకడ తలంపు మీదనేయుంటే, సుళువుగా రాకడ మేఘమెక్కగలము.

  • 1. అవిశ్వాసముతో కూడిన సందేహము పనికిరాదు.
  • 2. తెలిసికొన వలయుననే సందేహము పరవాలేదు.
ఖైదులోయున్న స్నానికుడైన యోహాను ఈ ప్రన పంపినాడు. ' రాబోవువాడవు నీవేనా? ఇంకొక వ్వక్తి కొరకైనా కనిపెట్టవలయునా?' ఆ ప్రశ్న తనలో పెట్టుకొనియుంటే, క్రమముగా అవిశ్వాసములోనికి పోవునుగాన సదేహము తీర్చుకొనుటకు ప్రభువు దగ్గరకు శిష్యులను పంపెను. ప్రభువు వారికి జవాబు ఇచ్చెను. మొదటి రాకడ వార్తావాహిని అయిన యోహానును ఏరోదు పుణ్యము గట్టుకొని రెండవ రాకడ వార్తావాహిగా యుండునట్లు చంపివేసెను. హేరోదులో ఆ తలంపులేదు గాని ప్రభువు జరుగనిచ్చుటలో యున్నది. రాకడ విషయములో ప్రభువు ఏమి పని చేయుచున్నాడో, సన్నిధి కూటములో ఎప్పుడైనా మీరు అడిగి తెలుసుకొంటే, పెద్దలిస్టు ప్రబువు మీకు తెలుపుతారు.

" చేయడేమియు ప్రభువు సభకు - చెప్పనిదె యనుచున్నది=ఆయత్తమౌ నాటికి తేది - అందు ననుచు నున్నది - మాయ లేదను చున్నది - హాయి హాయి యను చున్నది" || వధువు ||

యోహాను అక్కడ అనగా పరలోకములో ఊరకనే కూర్చుని యుండలేదు. అక్కడ ఇద్దరు యోహానులున్నారు. స్నానికుడైన యోహాను, సువార్తుకుడైన యోహాను రాకడ నిమిత్తము వారు మహిమలో ఏమేమి చెయుచున్నారో తెలిసికొనుటకై ఒకనాడు వారిని పిలవండి. మీ ఊరిలో సన్నిధి కూటము పెట్టుకొంటే, ఇంకా ఎక్కువ పరలోక మర్మాలు వింటారు. రోజుకు ఒక గంట చొప్పున ఉండుమని నేను (యం. దేవదాసు అయ్యగారు ) చెప్పుచునాను గాని ఎల్లవేళల సన్నిధిలో ఉన్నయెడల ప్రభువు అన్ని సంగతులు మీకు చెప్పును. గుడి దగ్గరనుండి ఇంత దూరము రాలేకపోయినను, రావడము చేతగాకపోయినను సాయంకాలము 7 నుండి 10 గటల వరకు సన్నిధి కూటమును ఇంటిదగ్గర పెట్టుకొనండి. నేను చెప్పినదానికంటే అనేకరెట్లు ప్రభువు మీకు చెప్పును.

రాకడ ట్రైన్ ఎక్స్ ప్రెస్ వేఘముగా వచ్చుచున్నది. ఇంత పాఠము చెప్పిన తరువాత సదేహము ఉన్నదా! ఒక మనిషి ఉన్నాడు. బాగా సిద్ధపడి రాకడ కొరకు నడచుకొంటాడుగాని చనిపోయినాడు. అట్టి వాని గతి ఏమిటి? ' సిద్ధపడి చనిపోయినప్పటికిని, రాకడ వలన ఫలితము అనుభవిస్తాడా? ' అనుమాట ప్రభువును అడుగగా , ప్రభువు అన్నారు- ' పరవా లేదులే! రాకడప్పుడు మేఘములో వచ్చే వారికి ఇచ్చు ఫలితము ఇస్తాను ', ఈ మాట నా మాటగా ప్రభువు చెప్పమన్నారు చెప్పమన్నారు. కాబట్టి తయారయ్యియుండండి. అయితే రాత్రి 7 గంటల నుండి 10 గంటలవరకు సన్నిధిలో ఉంటే సందేహము ఉండదు. రాకడ వరకు ఆలాగున ప్రతి నిమిషమును ఆయన తలంపు కలిగియుండుటకు ఆయన సన్నిధిలో మన సమస్త సమస్త సందేహములు తీర్చుకొని, తయారై, రాకడకు సిద్ధపడియుండే భాగ్యము ప్రభువు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद