రాకడ నిరీక్షణ - అప్పీయ సంత పేట

( 15 - 1 - 1949వ సం | |లో దేవదాసు అయ్యగారు చేసిన ప్రసంగము )

యెషయా 35:9; లూకా. 22:32; 1 పేతురు 5: 10 - 11
" యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు" యెషయా 35:9

యోహాను 14:3వ వచనములో ఒక గాలి పదమున్నది (గాలికి సంబంధించిన పదము ).

  • 1 ) ప్రభువు పరలోకమునకు వెళ్ళుటయు, మనకు స్థలము సిద్ధపర్చుటయు.
  • 2 ) తదుపరి మరి ఇక్కడకు వచ్చి,
  • 3) మనలను అక్కడకు తీసికొని వెళ్ళి, అక్కడ మనలను ఉంచుటయు అని అందులో యున్నది. ఆ ప్రత్యేక ఏర్పాటు ఈ వాక్యములో ఉన్నది.
  • 1 ) యేసుప్రభువుయొక్క ఆరోహణము.
  • 2 ) సంఘమును సిద్ధపరచుట
  • 3 ) సంఘారోహణము.
  • 4 ) సంఘ నివాసము.
యోహాను సువార్తలోనే ఈ గాలి పదమున్నది. దీనిలో ఒక విషయమున్నది.

ప్రభువు పరలోకమునకు వెళ్తూ , 'నేను వెళ్ళుచున్నాననెను. అందులో ఒక మాట చెప్పెను. దానిలో నేను 'మరలా వస్తాననేది ' యున్నది. గనుకనే ఆదికాల సంఘస్థులు కనిపెట్టిరి. ముఖ్యముగా థెస్సలోనికైయలోని విశ్వాసులు కనిపెట్టిరి. ప్రస్తుత ప్రయాణికులు 'వెళ్ళి వస్తామంటారు ' గాని వెళ్తామని చెప్పరు. ఒకవేళ చెప్పవలెనంటే 'వెళ్ళివస్తాము ' అంటారు. దానిలో వెళ్ళి, మరలా వస్తాము అనే అర్ధమున్నది. అనగా ఎక్కడనుండి ఎక్కడవరకు వెళ్ళివచ్చుట్త? అప్పియ సంతపేట వరకు వెళ్ళి వస్తామని అది సంఘములో చెప్పబడియున్నది. వెళ్ళిరావడమనే మాటలో నిరీక్షణ యున్నది. వెళ్ళలేనివారు నిరీక్షించితే మాత్రము వెళ్ళగలరా? వెళ్ళలేరు. బంధకాలతో నిరీక్షించే నిరీక్షణ, వ్యర్ధమైన నిరీక్షణ. గనుక బంధకాలను విడగొట్టుకొని నిరీక్షించవలయును. ఈ పర్ణశాలలోనున్న వారిలో నిజమైన నిరీక్షణ, బంధకాలు లేని నిరీక్షణ యుండవలయును. అప్పియ సంతపేటకు ఎప్పుడు వెళ్ళనిదే, ఏలాగు నిరీక్షింతురు? సంతలోనివి ఎప్పుడైన కొనారా? నిరీక్షణలోనివి ఎన్ని భాగములు?

  • 1 ) ప్రభువు వెళ్ళుట,
  • 2 ) స్థలము సిద్ధపర్చుట,
  • 3 ) మరల తిరిగివచ్చుట,
  • 4 ) మనలను తీసికొని వెళ్ళుట.
మీరు జెట్టీలను ఎప్పుడైన చూచినారా? జెట్టీలు నడుమునకు దట్టీ కట్టుకొందురు. పరుగెత్తమంటే పరుగెత్తుటకు,ముందె దట్టీ కట్టుకొని నిలబడి ఉంటారు. అదే నెరీక్షణ అంటేను.

అనుమానముతీర్చే కథను చెప్పెదను. మీకెప్పుడైనా అప్పియ సంతపేట ఉన్నదనే నమ్మకము తోచినదా? ప్రభువు చెప్పిన మాటలలో ఎట్టి అర్ధమున్నదో ఆత్మవల్ల బోధపడుచున్నది. ప్రభువు వస్తారు అది ఒక కథ. ప్రభువు ప్రభువు రాక ముందు చనిపోయిన భక్తులు వెయిటింగు రూములో ( వేచియుండు గదిలో ) కనిపెట్టుదురు. పరదైసులో వారున్నూ ,సజీవులున్నూ , ఈ రెండు తెగలవారు రాకడలో వెళ్తారు. యేసుప్రభువు ఎక్కడ ఉంటారో అక్కడకు మనము వెళ్తాము. ప్రభువు రాక ముందు మరణం వస్తే , దానిద్వారా జీవములోనికి తీసికొనివెళ్తారు. వారు, అక్కడ ఉండిన సజీవులు , మనము ఇక్కడ ఉండిన సజీవులము. వారి ఆయుషాలము అయిపోయింది. ఆయన ఇంకను రాలేదు. ఆయన కాలమే రాలేదు. అంత మాత్రమున ఎదురు చూచే వారు శక్తిహీనులు కారు. ప్రభ్వు వచ్చే వరకు వెయ్యి సార్లు మరణం వచ్చినను చావకుండ మరణమా పొమ్ము! అని ఉగ్గపెట్టుకొనవలెను. అట్టివారు సజీవులుగా ఉంటారు. భూలోకమనే, శరీరమనే సంతపేటలనుండి మనము బైటికి వస్తే, పైకి వెళ్ళగలము. అప్పుడే నెరీక్షణ వస్తుంది. సజీవులయొక్క గుంపులోనికి వెళ్ళవలెనని ఏర్పాటైనవారు మరణములోనికిరారు. రాకడకు మరణద్వారా వెళ్ళుట్త్త ఒకదారి, మరియొకదారి ప్రభువు వచ్చేలోగ ఉగ్గపెట్టుకొని సిద్ధపడుతు ఉండుట. ఆ ఏర్పాటువారు ఈ దారిలోనివారే. ఇందులో ఉండుటకు ప్రయత్నము చేయండి యెహా . 14:3, ఆదికాల క్రైస్తవులు వ్యర్ధముగా కనిపెట్టినారనే నిందను ఈ కాలపువారు వారిపై మోపుచున్నారు. వారు చెప్పుట మాత్రమే కాదు, ప్రభువును ఆలాగు చెప్పిరి గాని రాలేదు. గాని థెస్సలోనికైయవారు సిద్ధపడి ఎదురుచూచిరి.

  • 1 ) నమ్మినందున
  • 2 ) నిరీక్షించినందున
  • 3 ) సిద్ధపడుటవల్ల రాకడలో వెళ్ళగలము



ఈమూడు లక్షణములు కలిగినవారే సజీవుల గుంపులోనివారు
  • ( 1 ) ఆదికాలపు వారు సిద్ధపడిరి.
  • ( 2 ) మనమును సిద్ధపడుచున్నాము.
సిద్ధపడినవారు, సిద్ధపడేవారు ఒకే తరగతి, వారువీరు సజీవుల వరుసకు సిద్ధపడినవారు. గనుక ఎత్తబడిరి.

అప్పియ సంతపేట ఏ దేశములో నున్నది. ఇటలీలో ఉన్నది.ఇచ్చటనుండి బైలుదేరినవారున్నారు. అక్కడ సిద్ధపడిన వారు, ఇక్కడ సిద్ధపడినవారు పెండ్లికుమార్తె వరుసయే. ప్రభువు రాకముందు చనిపోతే మృతుల గుంపులోను , వచ్చేవరకు ఉంటే సిద్ధపడే గుంపులోను ఉండగలము. సిద్ధపడలేనివారు అప్పియ సంతపేటలో ఉండిపోయేవారే. రాకడనుగూర్చి 10, 20, 30 సం| |లకు ముందే బోధించుట ఆరంభించినానుగాన, పూర్వ క్రైస్తవులవలె మీరున్న ఎదురు చూస్తున్నారు అని నా దగ్గర చదివి, నేర్చుకొనిన వారు నన్ను నిందించుచున్నారుగాన ( రాజమండ్రిలో అయ్యగారివద్ద విద్యనభ్యసించిన విధ్యార్ధులు రాకడ వర్తమానములు విని, విని అయ్యగార్ని నిందించారు ) మీరు సిద్ధపడండి. ప్రార్ధించిన, బోధించినా , వాక్యము చదివినా, స్తుతించినా, ప్రయోజనములేదు. ముందు సిద్ధపడండి. అవన్నిచేసినా హృదయములో సిద్ధపడకపోతే, ప్రభువు వచ్చిన యెడల పెండ్లి కుమార్తె వరుసలో చేరనే చేరరు. పెండ్లుకుమార్తెయొక్క భాగము, ఆ రాకడ సంఘములో సిద్ధపడవలెను. అప్పుడు ఆదికాల సంఘముయొక్క గుంపులో చేరి వెళ్ళుదుము. ఆలాగునవెళ్ళుట మీకు ఇష్టమా? సజీవుల గుంపులో చేరి వెళ్ళుదము! దేవుని చిత్తమని చెప్పి, దయ్యాలకు లోబడక యుండవలయును.

మత్తయి 8వ అధ్యాయములో ప్రభువు పర్వతము దిగివస్తుండగా ఒక కుష్ఠరోగి ' ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవూ అనెను. సిద్ధపడిన సజీవులగుంపులోగాని నీవు ఉండిన యెడల ఇంకొకరిని సిద్ధపర్చుము. నీవు శుద్ధుడవు కమ్ము ' ! అని బైబిలులో నున్నది. గనుక ఈ పర్ణశాలలో ఉన్న వారందరు ముందు శుద్ధులై సిద్ధపడితే, ఆయన మిమ్ములను సిద్ధపర్చుము. ఇది కొండపై ప్రభువు ప్రసంగించి క్రిందికి వస్తుండగా, మధ్యలో జరిగిన కథ. ముందు సిద్ధపడుట అది మన పని. సిద్ధపరచుట్త ఆయన పని, తర్వాత, సిద్ధపడిన వారినే సిద్ధపరచడము అనే సంగతి ఉన్నదని ప్రత్తిపాడులో చెప్పితిని ( లూకా. 1:17 ). ఈ వాక్యములో " జకర్యా ఎలీసబెత్తుల" కుమారుడున్నాడు. ఆ వాక్యములో ఆయత్తపడిన వారిని సిద్ధపరచుట ఆయనపని. యేసుప్రభువు జన్మకాలములో, ప్రభువు వస్తారని నమ్మి, సిద్ధపడియున్న వారిని సిద్ధపరచుటకు యోహాను సిద్ధపడివచ్చెను. ప్రభువు ఈ 1949వ సం| | లో కూడా సిద్ధపడని వారిని, ( స్నానికుడైన యోహానువలె ) సిద్ధపడినవారిని రెండవ రాకడకు సిద్ధపర్చుటకు బోధకులను , భక్తులను అనుగ్రహించి సిద్ధపరచుచున్నాడు. ఏది గొప్పపని?

  • 1. సిద్ధముగా నున్నవారిని సిద్ధపరచుటాట గొప్ప సంగతియా?
  • 2. ఎరగనివారిని సిద్ధపరచుట గొప్పసంగతియా?
మిమ్ములను అప్పుడప్పుడు సంధిగ్ధములో దిపుట నాపని .ఊరకే ప్రసంగము చేసియున్నాను అనుకోండి; అప్పుడు రాకడ వస్తుందనే అర్ధము తెలియదు. ఆ ప్రసంగములో " యేసుప్రభువును నమ్మండి " అని చెప్పితే వారికి ఏమి నమ్మండి" అని చెప్పితే వారికి ఏమి ప్రయోజనము! ఒకానొక సభలో ఒక ప్రసంగీకుడు బోధిస్తూ ఉండగా ఆ సమయములో చక్కగా ఉన్న ఒక స్త్రీ నిందించి, ఏమిటిది? ఈ ప్రవచనము వలన ఏమిలాభము ఉన్నదీ అని వెళ్ళిపోయింది. ' రాకడ వస్తాదనీ అన్ని మిషనులవారు చెప్పుచున్నారు. గాని ఏమిలాభము? దాని అర్ధము పూర్తిగా చెప్ప వలయును. అప్పుడు వినువారు సంతోషించి, రాకడ అర్ధము గ్రహించి, రాకడకు సిద్ధపడుదురు. లూకా. 1 : 17వ. యోహాను పని ఏదనగా అయన రాకముందే, ఆయనకు ముందుగా వెళ్ళుట. ఆ అధికారము యోహానుకు ఒక్కనికే ఉన్నది. ఆలాగే బైబిలు మిషనులోని ప్రతి సువార్తికుడు సిద్ధపడినవాడై, క్రీస్తుప్రభువు రాకముందు యోహానువలె బోధించవలెను. పాత నిబంధన, క్రొత్త నిబంధనలోని వాక్యములు, సువార్త, ఉత్తరములలోని వాక్యములు బాగుగా నేర్చుకొనవలయును. సిద్ధపడకుండ బోధిస్తే వినేవారికి లాభములేదు. ఊదా సిద్ధపడకుండనే బోధించినాడు, పంచిపెట్టినాడు గాని ప్రభువు దగ్గరకు వెళ్ళలేక పొయెను. ఆలాగే సిద్ధపడక బోధించిన వారిగతి యుండును. మనము సిద్ధముగా లేకపోతే. స్వరమురాదు. అనగా ప్రభువా! రమ్ము అని చెప్పలేము.

సామెత: "అదుకు బాగా దొరికినది పదును". అప్పీయ సంతపేట ఎవరి కాలములోనిది. క్రొత్త నిబంధనలోనిది.

  • 1. కుష్టిరోగి గూర్చిన కథ,
  • 2. యోహాను కథ,
  • 3. ఊదా కథ,
  • 4. కోరుకొండ కథ,
  • 5. అప్పియ సంతపేట కథ,
  • 6. 12 గంపల కథ,
  • 7. గాలిపఠము కథ.

ఇంకొక కథ విడిచిపెట్టినాను. ప్రభువు వచ్చినప్పుడు ఎవరులేస్తారు? యేసుప్రభువు వచ్చినప్పుడు చివరివారు అనగా రాకడ నిరీక్షణతో మరణించినవారు లేస్తారు.

అప్పియ సతపేట ఇటలీ దేశములోనిది. ఈ దేశములో పౌలు ప్రవేసిచినప్పుడు , విశ్వాసులు తెలుసుకొని ఆయనను తిన్నగా వారున్న స్థలమునకు తీసికొని వెళ్ళుటకు, పౌలును తీసికొని రాకముందు మేము వెళ్ళి పౌలును స్నానకూటమునకు తీసికొని వస్తామని చెప్పి వారు వెళ్ళిరి. వారు అప్పియ సంతపేటలో ఉండిపోవుటకు వెళ్ళలేదుగాని పౌలును తీసికొని రావడానికి వెళ్ళిరి. ఇదియే అప్పియ సంతపేట కథ. అపో ||కార్య ||28:14-15.

ప్రభువు - 'నేను వెళ్ళి స్థలము సిద్ధము చేసి మిమ్ములను తీసికొని వెళ్ళెదను ' అని చెప్పిరి. ప్రభువు వస్తారని చెప్పినా విశ్వాసులు నమ్ముట లేదు. ఎందుకనగా 30 సం|| ల నుండి చెప్పిననూ నెరవేరలేదు గాన నమ్ముటలేదు. అయితే తారీఖు చెప్పలేదు. గాన వచ్చేవరకు నమ్మవలెను.

ప్రభువు రావలసిన సమయము ఎందుకు చెప్పలేదనగా, ఎందుకు సమయము తెలిసిన యెడల అప్పటివరకు సోమరితనముగా యుండి, ఆ సమయములో రాకడకు పరుగులిడుదురని చెప్పలేదు. అపోస్తలులు సిద్ధపడినను , వారికి ఎందుకు రాకడ తేది చెప్పలేదనగా, అందరికి చెప్పివేస్తారనియు, ఇంకా గుర్తులు నెరవేరలేదు గనుక వారికి చెప్పలేదు. ఇప్పటికి 2000 సం ||లైనది. 1థెస్స. 4:1; 1థెస్స. 4:13 - 17. ఈ వాక్యమునుబట్టి 2000 సం|| ల క్రిందట పౌలు చెప్పినది నెరవేరకపోతే, 30 సం | | ల క్రిందట నేను చెప్పినది నెరవేరలేదని ఆక్షేపణ ఎందుకు? అప్పటి వారు నిరీక్షించినప్పుడు, మనము నిరీక్షించుటలో తప్పులేదు కదా! ఆలాగు నిరీక్షించక అవిశ్వాసపడుటే సిద్ధపడలేకపోవడము. సిద్ధపడిన వారిన అనారోగ్యమేమియు చేయలేదు. సిద్ధపడితే వెళ్ళగలము. " నేడే ప్రభువు వచ్చుననుకొనువాడే ధన్యుడు" అనువచన భావము నమ్మి, సిద్ధపడితే మేఘములో వెళ్ళకుండ యుండలేము. సూదంటురాయి చూచినారా? ఆ రాతిని పట్టుకొని బల్లమీద ఉన్న పిన్నుకు పైన గాలిలో పెడితే ఎగిరి అంటుకొనును. ఆలగే ప్రభువు రాకముందు సూదంటు రాయివలె, ప్రభువును అంటుకొని యుండువారే ఎత్తబడుదురు.

ఒక భక్తురాలి కథ:- ఆమె ఎంతో విస్వాసి. శ్రమలద్వారా సిద్ధపడి మృతిపొందెను. ప్రభువు వచ్చినప్పుడు ఆమె రాకడలో రాదా? ఆలాగే మనము తారీఖులు ఏర్పాటు చేయకూడదు. సిద్ధపడుతూ ఎదురుచూచి ఆయనను ఎదుర్కొనవలెను. " వినుట విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులైమనుట" అనునది ప్రాముఖ్యము. " నమ్మువారికి చావేయుండదు నవరూపము కలుగు." పౌలు యెరూషలేము దేవాలయములో మారుమనస్సు పొంది 14 సం || లు అయినది. ప్రార్ధన చెయుచు పరదైసు పొయినాడు. అంతగొప్ప ప్రార్ధన చేసియున్నాడు. పౌలును , యేసుప్రభువును ఇద్ధరే ఆ దేవాలయములోయున్నారు. పరిశుధాత్మ తండ్రి, పౌలు ఆత్మను తీసికొని వెళ్ళిరి. శరీరమును తీసికొనివెళ్ళితే మఋఅణ వస్తుందిగాన శరీరము విడిచిపెట్టి పరలోకములోనివన్ని చూపించెను. ఎందుకంటే పౌలు సూదంటురాయివలె సిద్ధముగా యున్నాడు గనుక వెళ్ళుచున్నాడు. అట్లే ప్రభువు పౌలుతో ఈ సంగతులన్ని వివరించి, వ్రాయుమనెను. శరీరమును విడిచిపెట్టి, ఆత్మను తీసికొని వెళ్ళినాడు. గాన సగము నెరవేరెను. అంతా ఎప్పుడు నెరవేరును? రాకడలో ఎవరు ఇంకను సిద్ధపడుతున్నారో వారిని ప్రభువు తీసికొని వెళ్ళును. అప్పుడు అంతయూ నెరవేరుతుంది. ఒక ఉదా:- అందరు ఆడపిల్లాలుగల ఒక కుటుంబముండెను. ఆ తండ్రికి చాలా విచారము. ఆయన భక్తులచేత ప్రార్ధనలు చేయించిననూ, ఆడపిల్లలే జన్మించారు. అందుకు ఎప్పుడు విచారమే. ఆలాగే ప్రభువు రాకముందు నిద్రలో కలలో కొడుకు పుట్టినట్టు కలకంటాడు. గాని పుట్టలేదు, తరువాత పుడతాడు అప్పుడు ఎంత సంతోషము! ఆలాగు కొడుకు పుట్టితే నాకు వద్దని తండ్రి అంటాడా? ఆలాగే రాక రాక క్రీస్తు రాకలోవస్తే వద్దంటారా? కుమార్తెలకు వివాహము చేస్తే ప్రార్ధించారు. ఆమెకుకూడ ఆడపిల్లే. ఫలానివారి మనుమడు అనిపించుటకు నాకు యోగ్యతలేదు అని బాధపడినాడు. ఆలాగే ప్రభువు రాకడ సువార్త విని లోకులు నవ్వినారు. రాకడయుండునా? గాన నీ పొరబాట్లను సవరించుకొని దిద్దుకొని సిద్ధపడుము. అప్పుడు ఎత్తబడుదువు. సిద్ధపడలేకపోతే బైబిలులోనికి, రక్షణలోనికి రాకడకు వెళ్ళలేడు. అత్మీయజీవములో కొంటెతనము ఉంటే రాకడలో వెళ్ళలేరు. పరలోకములోని ప్రభువునుచూచి సిద్ధపడిన వారిని ఆయన తీసికొని వెళ్ళుదురు. ఈ లోకములో ఉన్నప్పుడు, అనుకొన్న పని నెరవేర్చునట్లు, రాకడకును తమ పొరబాటులు తెలిసికొని సిద్ధపడినవారు ఎత్తబడుదురు.

ప్రార్ధన: - ప్రియప్రభువా! నేనుండు స్థలములో మీరును ఉండులాగున మిమ్మును తీసుకొని వెళ్ళుటకు మరలా వస్తానని వస్తానని దేవా! నీవు ఉన్న ఆ పరమండలమునకు, మేఘములపై రెప్పపాటులో ఎగిరి వెళ్ళగలిగిన స్థితిని, శుద్ధిని, నిరీక్షణను, సిద్ధపాటు చేసికొనుటకు నీవే నీ ఆత్మ సహాయము మాకు అందరకు అందించుమని మహిమ మేఘముపై త్వరలో పెండ్లికుమారుడుగా రానైయున్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ! ఆమేన్.


  Search this website (ఈ వెబ్ సైట్ లో మీకు కావలసిన పదమును వెదకండి)

अनुवाद